katyayini boorle

Classics

5.0  

katyayini boorle

Classics

జ్ఞాపకాలు

జ్ఞాపకాలు

1 min
578


గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి,ఎదలోతులో ఏ మూలనో మరుగైన జ్ఞాపకాలు .....పాట వింటూనే నా మనసు గతంలో జారుకుంది.

వేసవి కాలం ఆరు బయట మంచంపై పడుకొని నేను లెక్క బెట్టిన నక్షత్రాలు, పున్నమి చంద్రుడు, తెల్లని మబ్బులు వీటిని చూసి ఎప్పుడు నిద్ర లోకి జారుకునేదాన్నో౹వేసవి కాలంలోమేనత్త ఇంట్లో కాసిన దొంతర మల్లెల సువాసన, అరుగు మీద ఆడుకున్న అష్టాచమ్మ ఆటలు నాకెంత గుర్తో.

      తొలకరి జల్లు కురిసిన రోజు దిండు, దుప్పటి చంకలో పెట్టుకుని ఆరు బయట నుంచి ఇంట్లోకి గబగబా పరుగులు తీసిన రోజులు, వాన నీటిలో నేను చేసి వేసిన కాగితం పడవలు నా కళ్ళ ముందు ఇంకా తేలుతూనే వున్నాయి. దీపపు బుడ్డి వెలుగులో వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసి నాకు, తమ్ముడు కి మా అమ్మ ముద్దలు తినిపించిన రోజులు తలుచుకుంటే ,మళ్లీ బాల్యంలో కి వెళ్ళి పోతే బాగుండేది

    మా పెరట్లో కాసిన రకరకాల పూవులు వాటి మధ్యలో తూనీగలా తిరుగుతూ మురిసిపోయిన క్షణాలు ఎంతో మధురం.

    సంక్రాంతికి వేసిన ముగ్గుల మధ్యలో నేను పూజ చేసి పెట్టిన గొబ్బెమ్మలు‌‌‌ ,మా యింట్లోని బొమ్మల కొలువు నాకు చాలా యిష్టం"సీతమ్మ కు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా‌,ఆ పతకము......"అని పాడుతూ ఎవరైనా భిక్ష వేయగానే"క్రృష్ణార్పణం"అంటూ వచ్చే హరిదాసు పాటకు   పొలాలకు వెళ్ళే ఎద్దుల మెడలో 

కట్టిన గంటల సవ్వడి తాళం వేస్తున్న ట్టుగా అనిపించేది.

      మా నాయనమ్మ కొనిపెట్టిన చిరుతిండి‌‌,తనతోపాటు చూసిన సినిమా, నాకెంతో యిష్టమయిన జ్ఞాపకం. నా పూల జడ,జడ గంటలు , పరికిణీ ,ఓణీ ఇలా ఎన్నో

ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు మారుతున్న కాలంతో పాటు

మరుగున పడినవి మళ్ళీ గుర్తొచ్చాయి.



Rate this content
Log in

Similar telugu story from Classics