ఇది కథ కాదు జీవితం
ఇది కథ కాదు జీవితం
మీనాక్షి గోదారి ఒడ్డు వైపు చూస్తూ గుండెల్లో నుండి ప్రవేశిస్తున్న గోదావరికి అడ్డుకట్ట వేయలేక,కన్నీరు పైకి ప్రవహించలేక గుండెలోనే మౌనరాగం తీస్తుంది...
చివరి నుంచి బస్సు హారాన్ కొట్టుకుంటూ వచ్చింది..
అమ్మ నీ బస్సు వచ్చింది చూడు అన్నది అనురాధ..
మీనాక్షికి బస్సు వైపు చూడాలని లేదు ఎందుకంటే ఈ ఆరు నెలల నుండి తనకోసం ఎదురుచూసి చూసి అలసిపోయింది...
బస్సు మీనాక్షికి 10 అడుగుల దూరంలో ఆగింది ఎందుకో మీనాక్షి గుండె వేగం పెరిగింది ..
తనమనిషి, తనకోసం వచ్చినటువంటి ఫీలింగ్ కలుగుతుంది..
కళ్ళు మూసుకొని చేతిలో రెండు గుండెలకు హత్తుకుని దేవుణ్ణి ప్రార్థిస్తుంది.ఆమె చేతిలో ఉన్న మాధవుడి బొమ్మ ఆమె కన్నీటితో తడుస్తుంది
బస్సులో నుండి కృష్ణదేవరాయలు దిగి ఎదురుగా ఉన్న మీనాక్షిని చూసి ఆశ్చర్యంగా కన్నమ్మ ఇక్కడ ఉన్నావేంటి అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు...
కన్నమ్మ అన్న పిలుపుకి గుండె జల్లు మని గోదారిలా ఉప్పొంగిన మనసు లోనీ ఆనందాన్ని అదుపు చేసుకుంటూ...
పిలుపు వచ్చిన వైపు తిరిగి చిన్నగా కళ్ళు తెరిచింది..
ఎదురుగా కృష్ణదేవరాయలను చూసి మాట రాలేదు ఆశ్చర్యంగా ఆనందంగా అలా బొమ్మలా నిలబడిపోయింది...
వెనకనుండి కృష్ణ, ఏంటి నన్ను వదిలేశావు బ్యాగ్ నేను మోసుకొని రాలేకపోతున్నాను ..
రా అంటూ పిలిచింది ...
ఆ వస్తున్న ,అని బస్సు దగ్గరికి వెళ్లి ,బ్యాగ్ బ్యాగుతో పాటు ఆమెను కూడా చేపట్టుకొని కిందకు దించాడు...
మీనాక్షి వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంది..
కృష్ణదేవరాయలు మీనాక్షి దగ్గరికి వచ్చి కన్నమ్మ ఈమె నా భార్య అపరాజిత .
నిన్ను పెళ్లికి పిలవాలని, నీతో చెప్పాలని ఎంతో అనుకున్నాను కానీ నా ఫోన్ పాడయి, నీ నెంబర్ నా దగ్గర లేక, చెప్పలేకపోయాను... ఏమీ అనుకోవద్దు...
అపరాజిత నీకు చెప్పానే నన్ను పోటీలకు పంపించింది, నాకు ధైర్యం చెప్పింది, అని ఈమె మీనాక్షి గారు అని మీనాక్షిని పరిచయం చేశాడు...
నిజంగా మీనాక్షి గారు లేకపోతే నాకు అంత గొప్ప విజయం దక్కేది కాదు చాలా థాంక్స్ మీనాక్షి గారు అన్నాడు మీనాక్షి వైపు చూసి.
మీరిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది అంటూ అపరాజిత వెళ్దామా అన్నాడు.
వెళ్దాం ఒక్క నిమిషం అని అపరాజిత మీనాక్షి దగ్గరికి వచ్చి చాలా థాంక్స్ అండి మా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది.
తను మీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు అన్నది ..
మీనాక్షికి జరుగుతున్నది ఏమిటి అర్థం కాలేదు..
అపరాజిత మాటలకి తేరుకొని
" దేవుడికి తెలుసు ,
ఎవరికి ఎంతవరకు ఏమి ఇవ్వాలో,ఎవ్వరినీ ఇవ్వాలో "...
మా ఇద్దరికీ అంత సమయం వరకే దేవుడు రాసి పెట్టాడు..
మీరు చాలా అదృష్టవంతులు సంతోషంగా ఉండండి అని ,
మీనాక్షి చేతిలో ఉన్న మాధవుడి బొమ్మను అపరాధిత చేతిలో పెట్టింది ...
"ఇప్పుడు వరకు కన్నయ్య నా చేతిలో భద్రంగా ఉన్నాడు అనుకున్నాను కానీ, నేను భ్రమలో ఉన్నానని తెలియలేదు" అన్నది మీనాక్షి ...
కృష్ణదేవరాయల వైపు చూసి ,"అందరితో ఉన్నట్లే, నాతోనూ ఉంటావు అనే ఆలోచన కలగలేదు "..
అందుకే అందరూ పిచ్చిదాన్ని అంటున్నారు.
మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి ..
అప్పుడు నువు నాతో లేవు ,
ఇప్పుడు నువు నాతో లేవు ...
అప్పుడు నీ ఊహలతోనే బ్రతికాను ,
ఇప్పుడు నీ ఊహలతోనే బ్రతుకుతాను...
అంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ...
నడుచుకుంటూ వెళ్లిపోతున్న మీనాక్షిని చూస్తూ ,
అపరాజిత భుజం మీద చేయి వేసి, ఆమెను దగ్గరికి తీసుకున్నాడు...
శుభం
"వెన్ను దన్నుగా మారిపోయి ,ఆత్మ బంధువులా తోడు ఉండే బంధం ప్రతి మనిషికి అవసరం.అలాంటి బంధం దూరం చేసుకుంటే అది శాశ్వతంగా దూరమైపోతుంది"..
"ప్రతి కథ జీవితం కాదు ,
ప్రతి జీవితం కథ కాదు"
