STORYMIRROR

KANAKA ✍️

Classics Inspirational

4  

KANAKA ✍️

Classics Inspirational

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

2 mins
265

ఇదే నా మొదటి ప్రేమలేఖ 


నీకోసం 

ఓ ప్రేమ! నేనెప్పుడూ ఉంటా నీ వెనక 

రాసిస్తా నా భవితని నీకు కానుక 


ఆ బ్రహ్మ తన లోకం తనకు విసుగు పుట్టి ఆకాశ విహారానికి వచ్చినప్పుడు ఎప్పుడూ మానవ గర్భంలోనే అతివలు పుడితే ఎలా అన్న సందేహం వచ్చి అక్కడే ఉన్న తెల్లని మేఘాన్ని తీసుకొని మంత్రం వేసి నమూనా రూపం సృష్టించి పాల అభిషేకం చేసి లోపల అవయవాలు అన్నింటికీ ప్రాణం పోసి పక్కనే ఉన్న మరొక కారు మేఘంపై నిలబెట్టి తానే తుమ్మెదగా మారి ప్రపంచం మొత్తాన్ని శోధించీ సాధించీ తేనె తీసుకొచ్చి ఈ రూపానికి ఆ మధువుతో చర్మాన్ని అతికిస్తే వచ్చిన అందమైన రూపం నువ్వు..


ఆకాశంలో విహరించే పక్షుల ఈకల నుండి దారంనేసి నక్షత్రాలు విరిచి మెరుపులు అద్ది అందమైన వస్త్రంగా చుట్టి మేలి ముసుగు నీ తలపై ధరింపజేసి అలా నిన్ను మేఘ విహారం కావించి ఈ భూమిపై నా ముందు నిన్ను వదిలాడు.


నీతో సమస్తాన్ని ఊహించి 

నీ సొగసును చేర, మోహించి

నీ దేహంతో రసరాగం కాంక్షించి 

నీ ముగ్ధ మనోహర రూపం కావించి అలా శిలనైపోయాను.


దీనినే సంయోగంగా భావించి

కదలలేని నా స్థితిని మన్నించి సమస్త జీవరాశికి భూమాతవై పుట్టుకనివ్వుమా...


ఇదే నా మొదటి ప్రేమలేఖ 

రాశాను నీకు చెప్పలేక ...


భావం కవి సమయం


బ్రహ్మకి రాసి రాసి విసుగొచ్చి ఆకాశ విహారానికి వచ్చి అమ్మాయిలు గర్భంలోనే పుట్టాలా నేను అసలు ఏదైనా చేద్దాం అని తెల్లని మేఘం తీసుకుని అంటే దానికి ఒక రూపం ఉండదు కదా ....దానితో అంతర్భాగాలు అన్ని మంత్రంతో చేసి పాలతో అభిషేకిస్తే ప్రాణం వస్తుంది.. అంతర్భాగాలకే..

మరి చర్మం కావాలి కదా...

అందుకే తుమ్మెదగా మారి తానే స్వయంగా తేనె తీసుకొచ్చి చర్మాన్ని చేస్తాడు.

ఆకాశంలో పత్తి దొరకదు కదా అందుకే పక్షి ఈకలు తీసుకుంటాడు.

ఒక నక్షత్రం విరిస్తే కావాల్సిన మెరుపులు ..అవే చమ్కీలు..

చేసి చేయగానే కిందికి పంపితే బాగోదు కదా అందుకే కాస్త విహారం.


తనతో భవిష్యత్తూ ఊహించి 

మొహం కలిగి 

సుఖం కోరుకుని 

ఆ రూపం చూసి కదలలేక నిలబడితే సంభోగం జరగదు కదా...

అందుకే ఆయన చూపునే సంయోగం గా భావించి 

జీవరాశికి భూమి ఎలా అయితే పుట్టుక ఇస్తుందో అలా పుట్టుక ఇవ్వూ .....



Rate this content
Log in

Similar telugu story from Classics