STORYMIRROR

KANAKA ✍️

Classics Fantasy Inspirational

3.8  

KANAKA ✍️

Classics Fantasy Inspirational

కలం పట్టిన మరో బ్రహ్మ

కలం పట్టిన మరో బ్రహ్మ

1 min
13

కలం పట్టిన మరో బ్రహ్మ 

ఊహ ప్రపంచాన్ని సృష్టించే మరో విధాత 

చిన్న ఇంటినే ప్రపంచంగా చూపగల సృష్టికర్త కలంతో అక్షర వర్షం కురిపించే కల్పిత ప్రాణధాత..


ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేందుకు 

ఎంత వేదన పడుతుందో .

భూమి ఒక గింజను మొలిపించేందుకు 

ఎంత వేదన పడుతుందో.

వేదన అనుభవించే 

వాడే రచయిత...


తన జీవిత కలంలో 

ఎన్ని పాత్రలనయితే సృష్టించగలడో.

అవన్నీ కేవలం పాత్రలు మాత్రమే కాదు తనకు తానే తల్లి,తండ్రీ, భార్య ,బిడ్డ ప్రేయసి అయ్యి ఇచ్చుకునే మరుజన్మలు,

అవే పునర్జన్మలు.


తను కదలందే ఏ గమ్యం కదలిరాదు. 

అలాగే తను పాటించందే

ఏధర్మంపలుకబోడు.

దేవుని సృష్టిని తన కలంతో 

మార్చి రాసే నారాయణుడు.

లేని ఊహ ప్రపంచాన్ని ఉన్నట్లుగా 

మన కళ్ళ ముందు భ్రమింపజేసే

చేసే వాత్సాయనుడు..


తన కలం నుండి జాలువారే ఎన్నో పాత్రలకు

జీవం పోసి, సజీవ శిల్పాలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిపే సత్తా ఉన్నొడు 

రచయిత మాత్రమే  

కలం పట్టిన అమాద్మీ 

నిజం నిగ్గు తేల్చే జీవాగ్ని..

****************

రచన 

కనక


Rate this content
Log in

Similar telugu story from Classics