Laxmichamarthi 2000

Classics

5.0  

Laxmichamarthi 2000

Classics

జీవితానికో లేఖ

జీవితానికో లేఖ

1 min
452


ప్రియమైన జీవితమా!


 బతకడం నేర్పిన నీ కంటే పెద్ద గురువు ఎవరు అందుకే కృతజ్ఞతగా నీకో లేఖ...


 తొమ్మిది మాసాల చీకటి కుహరాల ప్రయాణాన్ని దాటుకొని లోకానికి వినిపించిన నా తొలి కేక మొదలు ఏడవడం నేర్పించావు. నవ్వడం నేర్పించావు. బంధాలను ఇచ్చావు. బాధ్యతలను ఇచ్చావు.


 అపజయాలిచ్చి విజయపు విలువ తెలియజేశావు. సమస్యలిచ్చి పరిష్కార మార్గాలు వెతకమన్నావు సవాళ్లను ఇచ్చి సామర్ధ్యాన్ని నిరూపించుకోమన్నావు. నువ్వు పెట్టిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించానో లేదో తెలియదు కానీ పరీక్ష ఎదుర్కొన్న ప్రతిసారీ నన్ను నేను మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇచ్చావు.


 స్వార్ధపుమబ్బు కప్పి సంకుచిత వ్యామోహాల వలయంలో విసిరేసావు. లక్ష్యాన్ని ఏర్పరచి పరుగులు పెట్టించి బతుకంతా పాఠాల్ని గుణ పాఠాల్ని నేర్పుతూనే ఉన్నావు.


 పరిగెత్తి పరిగెత్తి అలసిన వార్ధక్యపు సంధ్యలో బతుకంతా మోసిన జ్ఞాపకాలను ఇచ్చావు. చివరికి మిగిలేదేదీ లేదని జీవిత సత్యాన్ని జీవిత చరమాంకంలో నేర్పించి బతుకు పరమార్ధాన్ని తేటతెల్లం చేస్తావు.


గెలిపించినా, ఓడించినా , సంతృప్తి నిచ్చినా, అసంతృప్తి మిగిల్చినా, పోరాడడం నేర్పిన జీవితమా నీకు పాదాభివందనం. 


                 ప్రేమతో, 

               నా జీవితానికి 

                 నేను.              రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి


Rate this content
Log in

Similar telugu story from Classics