Laxmichamarthi 2000

Comedy

4.3  

Laxmichamarthi 2000

Comedy

ఇంటింటి కథ

ఇంటింటి కథ

2 mins
599


 ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూనే ఉంది రాత్రంతా. ఏ పది సార్లో లేచి టైం చూసుకుని ఉంటుంది. ఎప్పుడూ లేనిది నాలుగు గంటలకే లేచి పని చేయడం మొదలు పెట్టింది. అంతా గమనిస్తూనే ఉన్నాడు ఆమె భర్త. రోజు కంటే ఎక్కువ సేపు దేవుడికి పూజ చేసింది. కాఫీ కలిపి తీసుకొని వచ్చి ఆమె భర్తకు ఇచ్చింది. ఏమిటో ఇవాళ రోజు కంటే ఎక్కువ సేపు దేవుని ప్రార్థించినట్టు ఉన్నావ్.? అడిగాడు భర్త. ఈరోజు దీప కేసు తీర్పు అండి. సన్నని నీటి పొర ఆమె కన్నుల్లో. దీప కి న్యాయం జరగాలి అండి. ఆమెకు అంతకుమించి మాటలు రావడం లేదు. సుదీర్ఘ నిట్టూర్పు విడిచి ఆఫీస్ కి బయలుదేరడానికి వెళ్లాడు అతను. పిల్లలని నిద్ర లేపడానికి వెళ్ళింది ఆమె. లేవండి నాన్న మీరు కూడా ఆ సత్య, సంపద లాగా మొండిగా తయారవుతున్నారు మరి బద్ధకంగా. అని వాళ్ళిద్దరినీ లేపింది. అమ్మ ఇంకేం తిట్లు తిడుతు, ఎవరితో పోలుస్తుందో అని లేచి వాళ్లిద్దరూ మౌనంగా హాల్ లోకి వెళ్లారు. అందరికీ టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. నువ్వు కూడా మాతో కలిసి తిన ఓయ్ అన్నాడు ఆమె భర్త. ఈరోజు నేను ఉపవాసం అండి. తీర్పు తెలిసేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. అంటూ మౌనంగా వడ్డించింది. అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. పని చేసుకుంటూనే పదేపదే టైం చూస్తోంది. మధ్యాహ్నం రెండయ్యింది. ఇంకొక్క అర గంట వెయిట్ చేస్తే తీర్పు తెలిసిపోతుంది. నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది. అయింది 2:30 అయింది. ఆతృతగా టీవీ ఆన్ చేసింది. పదేపదే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. టీవీలో దీప కాపురం సీరియల్ టైటిల్ సాంగ్ వస్తోంది. ఒకప్పుడు ఆమె ఎంతో బాగుంది అనుకున్న పాట విసుగ్గా అనిపిస్తోంది ఆమెకు. పొద్దున్నుంచి ఆ దీప కోసమే ఆమె దేవుని ప్రార్థించేది. టైటిల్ సాంగ్ అయిపోయింది. దీపని, ఆమె భర్తని, కోర్టు ప్రాంగణాన్ని పదేపదే మార్చి చూపిస్తున్నారు. దీప మొహం దీనంగా, ఆమె భర్త మొహం క్రూరంగా, కోపంగా, అక్కడున్న వాళ్ల మొహాలు జాలిగా, కోర్టు ప్రాంగణం అంతా గంభీరంగా ఉంది. జడ్జి గారు వచ్చి కూర్చున్నారు. సరిగ్గా జడ్జిగారు మాట్లాడే సమయానికి కరెంటు పోయింది. ఆమె ఏడుపు కి అంతే లేదు. ఇది నీకు న్యాయమా అంటూ దేవుని ప్రశ్నించింది. ఇంతలో పవర్ వచ్చింది. కానీ టీవీ లో యాడ్స్ వస్తున్నాయి. కాసేపటి తర్వాత సీరియల్ మొదలైంది. జడ్జిగారు తీర్పు చదవడానికి మొదలుపెట్టారు. మరోమారు దీప మొహాన్ని జడ్జిగారు మొహాన్ని ఆమె భర్త మొహం ని మార్చి మార్చి చూపిస్తున్నారు. దీప మొహం మీద క్లోజ్ అప్ లోకి తీసుకు వెళ్లి సీరియల్ అయిపోయింది. మళ్లీ సోమవారం కానీ రాదు అది. ఓ సుదీర్ఘ నిట్టూర్పు విడిచి ఆకలిగా ఉండడంతో భోజనం కానిచ్చింది. మందార పువ్వు సీరియల్ లో అయినా అమ్మ కూతుళ్ళు కలవాలని దేవుని ప్రార్థిస్తూ టీవీ ముందు కూర్చుంది. ఆ ఉద్యమం 10:00 వరకు సాగుతూనే ఉంది. 10:30 కి వచ్చిన భర్త నీ తలుపు తీస్తూనే, నాకు తెలుసు అండి ఆ కార్తీక్ లాగా మీరు నాకు అన్యాయం చేస్తున్నారు అంటూ ముక్కుచీదడం మొదలుపెట్టింది. లేదోయ్! ఇవాళ మా ఆఫీస్ లో పనిచేసే అటెండర్ రవి తెలుసు కదా! వాడు వాళ్ళ ఆవిడని కత్తితో పొడిచేశాడు.ఆమెని ఆస్పత్రిలో చేర్చి, వాడికి బెయిలు ఇప్పించి వచ్చేసరికి లేటైంది. అన్నాడు. అవునా !వాడికేం పొయ్యేకాలం? ఆ మొండిమొగుడు సీరియల్ లోలా విడికిదేంబుద్ధి అంది. ఆ ఏం లేదు ఆమె సీరియల్స్ చూసి వీడ్ని తెగ విసిగిస్తోందని, తెగ అనుమానిస్తోంది. వీడికి విసుగొచ్చి కూరలు తరిగే కత్తి కనిపిస్తే పొడిచాడట పాపం. ఎవరుమాత్రం ఎంతకాలం భరిస్తారు అంటూ ఓరకంట ఆమెని చూసాడు. ఇంతకీ ఏదో సీరియల్ అన్నవిందాక ఏంటది? అనిఅడిగాడు. ఏం సిరియాల్సో మాయదారి సీరియల్స్. నేనీరోజునుంచి చూడను బాబు. సాగదీసి చావగొడుతున్నారు. స్నానం చేసిరండి భోజనం చేద్దురుగాని అంటూ లోపలికెళుతున్న భార్యకేసి రిలీఫ్ గా చూసాడు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు. దీప కేసెమైందో అడగలనుకుని ఇప్పుడే మార్పొస్తున్న ఆమెని ఎందుకులే మళ్ళీ కెలకడం అని మిన్నకున్నాడు. 


Rate this content
Log in

Similar telugu story from Comedy