Divya Pandeti

Comedy

4.4  

Divya Pandeti

Comedy

బామ్మ....థి గ్రేట్

బామ్మ....థి గ్రేట్

5 mins
4.9K


ఆ రోజు సెలవు కావడంతో ఆలస్యంగా నిద్రలేచాడు అప్పారావు.

లేస్తూనే ఎదురుగా గోడ మీద ఉన్న దేవుని పటానికి దణ్ణం పెట్టుకుని.....మంచం దిగి...హాల్ లోకి వెళ్ళాడు.

వీధి తలుపు మూసి ఉంది.....వంట గది నుండి వస్తున్న శబ్దాలు విని అటు వెళ్ళాడు పిల్లిలా.

ఉదయం అల్పాహారం తయారు చేస్తున్న భార్య కల్పవల్లిని చూస్తూ.....అడుగులో అడుగేసుకుంటు.....'నా బంగారు బందరు లడ్డు' అనుకుంటూ.....వెనుక నుండి అమాంతం కౌగిలించుకున్నాడు.

ఏమరుపాటులో ఉన్న వల్లి......బిత్తరపోయి.....కంగారులో....చేతిలో ఉన్న అట్లాకాటతో....అప్పిగాడి డిప్ప పగలగొట్టింది.

అసలే బొద్దు గుమ్మ.... మాములుగా కోడితేనే తట్టుకోలేం.....అలాంటిది అట్లకాటతో కొట్టేసారికి.....తల పట్టుకుని...కెవ్వు మని కేక పెట్టాడు.

అతని కేకకి ముందు దడుచుకుని.....అనాకా తాను చేసిన తప్పిదం అర్థమై......భర్తను చెయ్ చేసుకున్నానే అనే పశ్చాత్తాపంతో కుమిలి......కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లను...బొటబొటా కారుస్తూ....నిలుచుంది.

"నీయమ్మ కడుపు మాడా.ఎంత గట్టిగా కొట్టావే. అసలెందుకు కొట్టావే."గయ్మన్నాడు భార్య మీదా....డిప్ప రుద్దుకుంటూ.

అంతసేపు బాధపడిన వల్లి...అప్పి అదిలింపుతో ఉక్రోషం పొడుచుకొచ్చి...

"నేనేమైనా కలగన్నానా......సెలవురోజు బారెడుపొద్దు పొద్దెక్కి......సూర్యుడు నడి నెత్తిన తైతక్కలాడున్నా కళ్ళు తెరవని మొగుడు.....ఇంత త్వరగా లేచి....పరధ్యానంగా పని చేసుకుంటున్న పెళ్ళాన్ని.....ఆటపట్టిస్తాడని.ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది.కాఫీ తాగుతారా.. టీ పెట్టనా?"

అని అతని సమాధానం కోసం చూడకుండా....కాఫీ కలుపుతోంది.

"ఈమాత్రం దానికి నన్నెందుకు అడిగావ్?"చురచుర చూస్తూ....వంటింటి గట్టు మీద కూర్చున్నాడు అప్పి.

"ఎప్పుడు పాడే పాటేగా....నీ ఇష్టం అని.అదీకాక నేనేం ఇచ్చినా కిక్కురుమనకుండా తాగుతారనే ధీమా ఉంది కాబట్టి."

అంటూ వాలుజాడను...సత్యభామల వెనక్కి నెట్టి..... కప్పు అతనికి ఇచ్చి.....పని చేసుకుంటోంది.

"వల్లి...."గోముగా పిలుస్తూ తన వెనుక చేరిన భర్తను....పక్కకు తప్పించి మరీ పనిలో మునిగింది ఆమె.

"అబ్బా ఆపవే...పని.ఈరోజు అలా బైటికెళదామా....సరదాగా."

"అయ్బాబోయ్ మీరేనా.ఇది మీరేనా.మీరూ....నన్ను.... బైటికి తీసుకెళ్తారా?సునామీ వచ్చేయ్యగలదు.నాకు లేనిపోని ఆశలు కలిపించక పోయి పని చూసుకోండి."అంది వెటకారం ఎక్కువగా...నిస్టురం ఇంకొంచెం ఎక్కువగా.

"అబ్బా నిజంగా వెళదామె.నీమిదోట్టు.ప్లాన్ కూడా వేసా."

తన తలపై చెయ్ వేసి మరి....నిజాయితీగా చెప్తున్నా భర్త మాటలు ఈసారికి నమ్మలనిపించింది వల్లికి.నమ్మేసింది కూడా.....కానీ పైకి మాత్రం.

"సరేలేండి ముందు వెళ్లి స్నానం చేసి రండి.తిందురుగాని.ఆ తరువాత మీ ప్లాన్లు వేయచ్చు."

ఆర్భాటంగా ఆరు నెలల క్రితమే అప్పారావు,కల్పవల్లిలా వివాహం జరిగింది.

పెళ్లయిన కొత్తలో......ప్రతిరోజు భార్యని షికారుకి తిప్పిన అప్పి.....తరువాత మారిపోయాడు.

గత మూడు నెలలుగా....పట్టుమని పది సార్లు కూడా భార్యని బైటికి తీసుకెళ్లలేదు అప్పి.ప్రమోషన్ కోసం ఓవర్ టైం చేసి.....రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం.....సెలవురోజుల్లో బద్ధకంగా నిద్రలేవడంతో....కొత్తపెళ్ళాన్ని పంజరంలో చిలకల......ఇంట్లోనే దాచేశాడు భద్రంగా.

ఎప్పుడైనా వల్లి గోముగా అడిగితే.....సరే అనడం....మాట నిలబెట్టుకోలేక...భార్య చేతిలో చివాట్లు తినడం మాములైపోయింది అప్పికి.

ఇప్పుడు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో.....వల్లిని కాస్త ఆనందపరుద్దాం అని.....ప్లాన్ వేసాడు.

@@@@@@

బీరువాలో చీరలన్ని కట్టి.....విడిచి.....కట్టి......విడిచి.....ఎలాగో ఒకటి సెలెక్ట్ చేసి,కట్టుకుని.....అందంగా తయారైంది వల్లి.

ఇంట్లో ఉంటే నైటీలతో తిరిగే ఆడవాళ్లు.....బైటికెళ్ళాలంటే మాత్రం.....నీటుగా రెడి అవుతారు.వీళ్ళ తాపత్రయం...భర్తకి అందంగా కనిపించాలనా....బైటివారు తమ అందాన్ని పొగడాలనా.

వల్లిని అలా చూడగానే బైటికెళ్లే ప్రోగ్రాం వాయిదావేసి...ఇంకో ప్రోగ్రాం కి రెడి అవుదామని ఉన్నా......ఇంత ఊరించి ఇప్పుడు కాదంటే...మీద పడి రక్కుతుందేమో అని భయపడి....బైటికి నడిచాడు.

భర్త ఎత్తుకి సరిపడ....కాళ్ళకి ఎత్తుమడమల చెప్పులు తగిలిస్తున్న వల్లి......తలుపుకు తాళం కప్ప తగిలిస్తున్న అప్పి.....ఇంటి ముందు ఆగిన ఆటో వంక అయోమయంగా చూస్తున్నారు.....'ఎవరొచ్చారా?' అని.

మనిషికన్నా ముందు వచ్చిన "నారాయణా".....అన్న మాటకి ఇద్దరు మొహాలు చూసుకున్నారు.అప్పి భయంగా వల్లి వంక చూస్తుంటే.....వల్లి కోపంగా చూస్తోంది.

అనుకోకుండా వచ్చిన ఆకాలవర్షంలా.....ఊడిపడిన బామ్మని చూస్తూ.....ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తూ...ఇప్పుడేం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్న అప్పిని చూసి...

"ఒరేయ్ పిచ్చిసన్నాసి.పెద్దముండాదాన్ని ఇంత పెద్ద ట్రాంక్కు పెట్టె మోయలేక చస్తుంటే....అలా బెల్లం కొట్టిన రాయిలా నిలుచున్నావ్ ఎరా శుంఠా.రా."అంటూ గదామాయిస్తున్న బామ్మ దగ్గరికి అప్రయత్నంగా వెళ్ళిపోయాడు అప్పి.

పెట్టె అందుకుని లోపలికి రాబోతుంటే....."సాబ్ పైసల్."అన్న ఆటోవాలా పిలుపుతో ఆగి...జేబులో చెయ్ పెట్టాడు.

"నువ్వుండరా బడుదాయ్.హ.....ఎంతెంట్రా అబ్బి,కిరాయి."అంది కళ్ళజోడు ఎగదోసుకుంటు బామ్మ.

"రెండొందల్."అన్నాడు వాడు.

"ఎంటెంటి....పది నిమిషాల దూరం కూడా లేదు...నీకు రెండు నూర్లు ఇవ్వాలా.మరి అంత అత్యాశ పనికిరాదురా అబ్బాయ్.ఇందా ఈ పదుంచు."అంటూ చిరిగిన పది నోటు అతని చేతిలో పెట్టింది.

"ఏందిది.రెండొందల్ ఇమ్మంటే....పది ఇస్తావ్.చల్......పైసల్ తీయ్ ముందు."ఆవిడ వాటం వాడికి సూతరాము నచ్చినట్టులేదు.

అప్పి నచ్చజెప్పబోయినా.....బామ్మ ఆగడంలేదు...ఆటోవాడు తగ్గడం లేదు...ఆ రభసకి ఇళ్లలో జనం....వీధిలోకి వచ్చి.....చోద్యం చూస్తున్నారు.

విసుగొచ్చిన అప్పి...బామ్మకి తెలియకుండా ఆటోవాలతో ఐదు వందలకు క్షవరం చేయించుకుని....జనాలకు ఒక వెర్రినవ్వు విసిరి....బామ్మని ఇంట్లోకి లాక్కుపోయాడు.

@@@@@

బైటికి వెళ్లే ప్రోగ్రాం బామ్మ రాకతో ఆటకెక్కడంతో....మూతి ముడుచుకుంది వల్లి.

తనని శాంతిపజేసేసరికి.....అప్పి గాడి తలప్రాణం తోకదాటి ఏటో పోయింది.

ఇక బామ్మతో విసిగిపోతోంది వల్లి.ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేపేస్తోంది...వాకిలి చిమ్మిచ్చి...ముగ్గులేయిస్తోంది.మడి కట్టించి...వంట చేయిస్తుంది.పూజలు పురస్కారాలు....షరా మాములే.

ఖాళీ సమయంలో కుట్లుఅల్లికలు...కొత్త వంటలు....పద్యాలు,వాటి తాత్పర్యాలు.కనీసం అప్పీతో సరదాగా నవ్వుతూ మాట్లాడినా తప్పే.....ఆడపిల్లల నవ్వు పెదవి దాటకూడదు అంటుంది.

ఆకలికి ఆగలేని...వల్లిని అప్పి తిన్న తరువాతే తినమని ఆర్డర్ పాస్ చేసింది.మధ్యాహ్నం నిద్ర శని అంటుంది.సాయంత్రం పూట కాలక్షేపానికి టీవీ చూసినా తప్పే....అలా చల్ల గాలికి బైటికి తీసుకెళ్లేది.

అలా భర్తతో తిరగాల్సిన టైంలో....ఇలా మామ్మతో తిరుగుతుండటం.....ఒక పక్క కోపం,బాధ....చిరాకు కలుగుతున్నాయి వల్లికి.

ఆఖరికి తిధులు,నక్షత్రాలు అంటూ....రాత్రుళ్ళు వల్లిని తనతో పాటు పడుకోమని....భార్యాభర్తల మధ్య దూరం పెడుతోంది.

అలా పదిరోజులపాటు....బామ్మాతో విసిగి,వేసారి....ఇక సహనం నశించి....కోపానంతా అప్పి మీద చూపిస్తూ....తన బాధ చెప్పుకుంది.

"నా వల్ల కాదు.....నేను మా పుట్టింటికి పోతా.ఇలా ఇంట్లోనే పడి ఉండటం నా వల్ల కానే కాదు.పైగా మీ బామ్మా వచ్చిన దగ్గరి నుండి...ఇంట్లో పని ఎక్కువైపోయింది.అప్పడాలు,ఒడియాలు....పచ్చళ్లు అని నా ఒళ్ళు హూనం చేసేసింది.ఉదయం నన్ను బస్ ఎక్కించు....నేను పోతా."

అంటూ ఏడుస్తూ.....ముక్కు తెగ చిదేస్తున్న వల్లిని ఎలా సముదాయించాలో తెలియక తల పట్టుకున్నాడు అప్పి.

దీనికి పరిష్కారం లేదుగాని....తన మూడ్ డైవేర్ట్ చేస్తే మంచిదని....రేపు ఆదివారం కావడంతో...సినిమాకి వెళ్దామని...తనని బుజ్జగించాడు.

@@@@@

హుషారుగా రెడి అయ్యింది వల్లి.ఇంట్లో నుండి...ముఖ్యన్గా బామ్మా నుండి ఈ ఒక్క రోజైనా బైటపడుతున్నందుకు.....ఆనందపడిపోతోంది.

ఇద్దరు నవ్వుతూ తుల్లుతూ....బైటికొచ్చేసరికి....

"ఎంటర్రా.....ఇంత ఆలస్యం.పది గంటలకు వెళదాం అని...ఇప్పుడా వచ్చేది.ఎరా అప్పి ఎలా వేళదాం...? ఆటో పిలవకురా....కాస్త దూరానికి కూడా ఆస్తులు అడిగేలా ఉన్నారు.బండి ఉందిగా...పోదాం ముగ్గురం."

అంటున్న బామ్మని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు ఇద్దరు.

ఆవిడ కూడా తమతో వస్తుంది అనగానే...చీరెత్తుకొచ్చింది వల్లికి.చరచరా లోపలికి వెళ్లిపోయిన భార్య వైపు చూసి...వెనకే వెళ్ళాడు అప్పి.

అప్పిని మింగేసేలా చూస్తూ...."ఎం చెప్పావ్ ఆవిడకి.తయారైపోయింది?"అంది కోపంగా.

"రేపు సినిమాకు 'వెళతాం'.అని చెప్పానే.బామ్మాకి 'వెళదాం' అని వినిపించినట్టుంది కర్మ.వల్లి...నా బంగారు కదు.ఈసారి ఇలా కానిచ్చేద్దాం.బామ్మాకి తెలిస్తే బాధపడుతుంది....బాగోదు.రా."

అని...ఎలాగో పాట్లు పడి...ముగ్గురు బండి మీదే...వెళ్లారు సినిమాకి.

@@@@@@

అంత పెద్ద హాలు ముఖం ఎరగని బామ్మా.....వింతగా చూస్తోంది.తెరమీద బొమ్మ,ఏసీ చల్లదనం.....పక్కన ఉన్న జంట.....వారి బట్టలు...అన్నీ ఇబ్బందే బామ్మకి.

వారిని సినిమా చూడనీకుండా....మధ్యలో మాట్లాడుతూ.....ఏదో ఒకటి అడుగుతూ.....విసిగించేసింది.

బామ్మా పుణ్యమా అని.....సగం సగం అర్థమై కానీ సినిమా చూసి.....ఇంటికెళ్లి వంట చేసే ఒప్పిక లేదని వల్లి అనడంతో....హోటల్ బాట పట్టారు.

అక్కడి వంటకాలను.....వాటి రేట్లను...చూసి బామ్మా కళ్ళు బైర్లుకమ్మాయ్.'ఇంటికి పోయి పెరుగన్నం తింద్దాం.'అని గొడవ చేసి....లాకెళ్లిపోయింది.

కంటి నిండా సినిమా చూడనీలేదు....కడుపు నిండా తిండి తిననివ్వలేదు....ఇది ఇలాగే సాగితే.....తన గతేంటి అని భయం పట్టుకుంది వల్లికి.

ఏదో ఒకటి చేసి....బామ్మని ఇక్కడి నుండి పంపించేయలని...ప్లాన్ల కోసం బుర్రకి పదును పెట్టింది.

@@@@@

తానొకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడని....వల్లి ప్లాన్లేవి బామ్మా ముందు పారలేదు. ఆవిడ ఎడ్డేమంటే తను తెడ్డం అందామనుకుంది.కానీ బామ్మా ఘటికురాలు....ఎవరితోనైనా,'నువ్వే కరెక్టు బామ్మా' అనిపించే రకం.

మరో వారం....వల్లి వొంట్లోని సారమంత పీల్చేసింది బామ్మా.లడ్డులా గుండ్రంగా ఉండే వల్లి....పూతరేకుల తయారైంది.ఇంకో వారానికి జ్వరంతో పడకెక్కింది.

బామ్మా వచ్చిన సరిగ్గా నెలకి నిరసంతో....చీకేసిన మామిడి టెంకల.....వాడిపోయిన గులాబీ మొగ్గల అయిపోయిన ముద్దుల భార్యని చూసి...అప్పికి కూడా కోపం వచ్చేసింది బామ్మా మీద.

కానీ ఏమీ అనలేక...వల్లిని హాస్పిటల్కి తీసుకుపోయాడు.అన్ని టెస్టులు చేసి....కొంచెం నీరసంగా ఉందని.....ఒక్క టానిక్ బాటిల్ ఇచ్చి....చాంతాడంత బిల్ చేతిలో పెట్టారు.

మందులు వాడుతున్నా వల్లిలో ఎలాంటి మార్పు లేదు.....మనిషి నీరసించిపోతోంది.....దానికి తోడు వాంతులు.

ఇక బామ్మా సలహాతో లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళితే......అప్పి కొండెక్కి,కోతిల కేరింతలు కొట్టే న్యూస్ చెప్పింది డాక్టర్.

"కంగ్రాట్స్ అప్పరావుగారు మీరు తండ్రి కాబోతున్నారు.మీ వైఫ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.ఇది వరకు మీ వైఫ్ ఓవర్ వైట్ తో ఉన్నారనుకుంటా కదా....కానీ ఇప్పుడు నార్మల్ అయ్యారు.బేబీ కారియింగ్ కి ఎలాంటి ప్రాబ్లెం లేదు.బైటి ఫుడ్ కాకుండా...ఇంటి భోజనం ప్రిఫర్ చేయండి."

అప్పి ఆనందానికి అవధులేవు.వల్లిని జాగర్తగా చూసుకోవాలని....బామ్మా ఆటలు ఇక సాగానీకూడదని...గట్టిగా అనుకున్నాడు.

వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి....అప్పటికప్పుడు వచ్చేయమన్నాడు.

వల్లి కాలు కిందపెట్టడానికి వీల్లేదని బామ్మకి,తల్లికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు.

రెండు రోజులకు ట్రంకు పెట్టె సర్దుకుని...ప్రయాణమైన బామ్మని బస్ ఎక్కించి...తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు వల్లి,అప్పి.

@@@@@

వల్లికి పండంటి మగ బిడ్డ పుట్టాడు.వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని మురిసిపోయాడు అప్పి.పెద్దఎత్తున బంధువులను పిలిచి....బిడ్డకి నామకరణం చేసాడు.

ఆప్పుడే తల్లి,బామ్మల మాటలు అప్పి చెవిన పడ్డాయ్.

"చాలా థాంక్స్ అత్తయ్య.మీరే పూనుకోకుంటే.....ఈరోజు ఇలా ఉండేది కాదు పరిస్థితి."అంది అప్పి తల్లి.

"అమ్మేం చేసింది వదినా?"అర్ధం కాక అడుగుతున్న ఆడపడుచుని చూసి...

"ఎం చెప్పమంటావ్.అప్పిగాడి పెళ్ళైయాక రెండు నెలలు నేను ఇక్కడే ఉన్నా కదా.వీళ్ళు రోజు బైటికెళ్లడం....బైటే తినేసి రావడం.పెళ్లిలో సన్నజాజి తీగల ఉన్న వల్లి.....చూస్తుండగానే డ్రమ్ముల తయారైంది.బైటి తిండి మంచిది కాదురా అంటే...పర్లేదులెమ్మ అనే వాడు."

"మొన్నామధ్య వీళ్ళు పండక్కి ఇంటికొచ్చినప్పుడు....మన డాక్టర్ చూసి.అమ్మాయి వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు ఉంది...ఇలా అయితే ప్రెగ్నెన్సీ అప్పుడు కష్టమవుతుంది.అంది.అదే మాట అత్తయ్యకి చెప్పా."

"దాంతో ఇక్కడికొచ్చారు.ఎం చేసారో గాని....వల్లి మునుపటిలా మారిపోయింది.అందుకే థాంక్స్ అత్తయ్య గారు."అంటూ హత్తుకుంది అప్పి తల్లి...బామ్మని.

వారి మాటలు విన్న తరువాత అప్పికి ఒక్కొక్కటి అర్ధమైంది.రోజు తాను ఆఫీస్ కి వెళ్లిపోతే....రోజంతా వల్లికి ఇంకేం పని ఉండదు.ఇంట్లో ఖాళీగా తిని కూర్చోడం తప్పా.పైగా ఎప్పుడైనా అలిగి...వంట చేయకపోతే బైటి నుండి ఆర్డర్ చేసేవాడు.

దాంతో శారీరక శ్రమలేక వల్లి.....బరువు పెరిగిపోయింది.అది తగ్గించాడానికే బామ్మా...వల్లిని నాలుగు గంటలకు నిద్రలేపడాలు.తనకి ఎడతెగని పనులు పురమాయించడాలు.తాము బైటికెళ్తాము అంటే.......తానూ వచ్చి,బైటి తిండి తిననివ్వకుండా గొడవ చేయడం.

అది అర్ధమైయ్యాక...తాము బామ్మని ఎంత అపార్ధం చేసుకున్నామో తలుచుకుని బాధపడ్డాడు.లోపలున్న బామ్మని చూస్తూ....

"బామ్మా.....తుసి గ్రేట్ హో."అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్ళాడు.

బాబుకి స్వెటెర్ అల్లుతోంది వల్లి......బామ్మా ఎందుకు అల్లికలు నేర్పిందో అర్ధమైందా?పెద్దలు ఎం చెప్పినా......ఎం చేసినా మన మంచికే.

సమాప్తం.Rate this content
Log in

Similar telugu story from Comedy