Aakash kumar

Comedy

4.5  

Aakash kumar

Comedy

పరమానందయ్య శిష్యుల కథలు-2

పరమానందయ్య శిష్యుల కథలు-2

2 mins
472


కార్తీకమాసం లో చేసే వనభోజనం మంచి ఫలితాన్నీ ఇస్తుంది అని పరమానందయ్య గారు అనడం తో,శిష్యులు అందరూ కలిసి,వనానికి వెళ్లి,వనభోజనం కి కావాల్సిన ఏర్పాట్లు చేయసాగారు.

వారిలో ఒక శిష్యుడు అన్నం వండే బాధ్యత స్వీకరించాడు.అతనికి కొంచం సంగీతం కూడా వచ్చు.

మిగిలిన వాళ్ళు,కూరగాయలు,పిండి వంటల బాధ్యతలు స్వీకరించారు.అన్నం వండుతున్న శిష్యుడు,బియ్యం పెట్టి,రాగం అందుకున్నాడు.ఇంతలో అన్నం "కుత కుత" శబ్దం చేస్తూ ఉడకసాగింది.అప్పుడు ఆ శిష్యుడు" ఈ రాగానికి సరైన తాళం ఈ అన్నానికే కుదిరింది " అని ఇంకా మంచి రాగాలు తీయసాగాడు.

ఇంతలో అన్నం ఉడుకుతున్న శబ్దం పల్చ బడి తాళం తగ్గేసరికి,ఆ శిష్యుడు కోపం తో పొయ్య లో పెట్టడానికి ఉంచిన కట్టె తో అన్నం ఉన్న కుండని కొట్టాడు.అంతే! ఆ కుండ పగిలిపోయి,కాస్సేపట్లో తయారు కాబోతున్న,అన్నం నేలపాలు అయిపోయింది.

కూరగాయలు తరుగుతున్న శిష్యులు," వంకాయలు తింటే వాతం,బంగాళదుంపలు తింటే ముడుకుల సలుపులు,దొండ కాయ తింటే మంద బుద్ధి" అని కూరగాయలు అన్నింటినీ,దూరం గా విసిరేశారు!!!.

ఇంతలో ఇంకొకడు,"ఒరేయ్ సన్నసుల్లార!!! ఈ కూరల వల్ల ఏదో ఒక బాధ తప్పదు,ఒక పని చెయ్యండి అన్ని రోగాల తిక్క కుదిర్చేది ఒకటి ఉంది.అదే కరక్కాయ!!! దాన్ని తెచ్చి కూర వండుదాం.." అని అన్నాడు.

మూర్ఖులైన ఆ శిష్యులు అందరూ అదే మేలని కరక్కాయ ల వేట లో పడ్డారు.

మధ్యాహ్నం సమయం కి పరమానందయ్య,గురుపత్ని శిష్యులు వండిన పదార్థాలు తిందామని వచ్చే సరికి ఏమి లేదు అక్కడ...కేవలం నేల పాలైన ఉడకని అన్నం తప్ప.

శిష్యుల కోసం వెతికితే అందరూ కరక్కాయ ల వేట లో ఉన్నారు.ఇదేంటి అని అడిగితే " కరక్కాయ ఒంటికి మంచిది అండి!!ఇప్పటికీ సగం పోగు చేశాం,మిగిలిన సగం కూడా సేకరించి,చటుక్కున కూర చేసి,మీకు వడ్డన చేస్తాం." అని అన్నారు.

ఆ మాటలకు మండిపడిన గురుపత్ని శిష్యులకు చీవాట్లు వేసి, అప్పటికప్పుడు వంట చేస్తే అందరూ తృప్తి గా భోజనం చేశారు.

పరమానందయ్య గారు, అన్ని గ్రామాలకు తిరుగుతూ,తనకూ, తన శిష్య బృందానికి కావాల్సిన సంభారాలు సమకూరుస్తున్నారు.

ఒక రోజు ఒక ఊరికి వెళ్లి కార్యక్రమం జరిపించి,వారు ఇచ్చిన సంభావన తీసుకొని శిష్య సమేతంగా తిరిగి వస్తుండగా,అతనికి కాళ్లలో ముళ్ళు దిగింది.ఒక పక్క చీకటి పడి పోతోంది అని ఇంకొక పక్క ముళ్ళు గుచ్చుకున్న బాధతో అతను తెగ బాధపడి పోయారు.

శిష్యులు అంతా ఆ ముళ్ళు నేను తీస్తాను అంతే నేను తీస్తాను అని వాడులాడుకోసాగేరు...అప్పుడు పరమానందయ్య కసురుకొని,ఐకమత్యం గా అందరూ ఏ పని చేసినా కలిసి చెయ్యాలని చెప్పాను కదా అయిన మళ్ళీ ఎందుకు ఇలా తగాదాలు పడతారు అని అనేసరికి,వారు క్షమించమని పరమానందయ్య ని అడిగి,ముళ్ళు తీయడానికి సూది కోసం కోమటి దగ్గరకు వెళ్ళారు.తిరిగి సూది తీసుకువచ్చేటప్పుడు గురువుగారు ఏ పనైనా ఐకమత్యం గా చెయ్యమన్నారు కదా కాబట్టి అందరం కలిసే సూదిని తీసుకుని పోదాం అని అనుకొని,ఒక తాటి దూలానికి ఆ సూదిని గుచ్చి తీసుకు వచ్చారు.

గురు పత్ని మాత్రం నీళ్ళు కాచుకోవటానికి,కావాల్సిన వంట చెరుకు తాటి దూలం రూపం లో తెచ్చినందుకు,శిష్యులను మెచ్చుకుంది.

ఇక పరమానందయ్య కాళ్లో గుచ్చుకున్న ముల్లుని "ఆ ముళ్ళు నేను తీస్తాను అంతే నేను తీస్తాను" అని వాడులాడుకోసాగేరు... ఆఖరికి ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని మల్లుని పొడవ సాగేరు.ఇలా జరుగుతుండగా...ముళ్ళు ఎప్పుడు జారిపోయిందో కానీ,జారిపోయింది.అయిన శిష్యులు చూసుకోకుండా,అదే పనిగా కెలకడం తో అక్కడ అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది.ఆ నొప్పికి తట్టు కొలేని,పరమానందయ్య,కసురుకోని శిష్యులను వారించారు.అప్పటికి ఆఖరి ఇద్దరి శిష్యులకు పరమానందయ్య కాళ్ళను పొడిచే అవకాశం రాలేదు.దాంతో వాళ్ళు,"ఇంకొకసారి,గురువుగారి కి ముళ్ళు గుచ్చక పొదా? అప్పుడు మేమే మొదట దాని భరతం పడతాం " అని భీష్మ ప్రతిజ్ఞ చేసి అక్కడ నుండి వెళ్ళారు.

పరమానందయ్య అంతో ఇంతో వైద్యం తెలిసిన వాడు కాబట్టి కాలు కుల్లిపోకుండా జాగ్రత్తపడ్డారు.కానీ కాలు చీము పట్టి 3వ నాటికి,బాగా లావుగా వాచిపోయింది...

*********త్వరలోనే 3వ భాగం రాస్తాను.ఈ ధారావాహిక ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చెయ్యగలరు.*********


Rate this content
Log in

Similar telugu story from Comedy