గంటపలారం బండి
గంటపలారం బండి
అందులో సన్న కారాలు, బుడ్డ కారాలు, బొరుగుల మిక్చరు, వేయించి ఉప్పు కారం బాగా కలిసిన పెసరబేడలు, జిలేబీ ఇంకా కొన్ని స్వీట్లు ఇవన్నీ ఉండేవి. అదే గంటపలారం బండి.
అయినా అదేం పేరు అని అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు.
ఏ పనిలో ఉన్నా మా తాతయ్య సాయంత్రం గంటపలారం బండి వచ్చే సమయానికి ఇంటి బయటే నిలబడి ఉంటాడు.
ఏరా బుడుగూ! ఇవాళ ఏం తింటావ్ చెప్పావు కాదు అని కేక వేస్తాడు.
నా పేరు బుడుగు కాదు. కానీ తాతయ్య అలా పిలుస్తాడు. అయినా బుడుగంటే నాకూ ఇష్టమే. నేనేమో పరుగెత్తుకుంటూ బయటికి వెళ్ళి నాకు కావాల్సినవి చెప్తాను. తాతయ్య ఖద్దరు చొక్కా జేబులో నుంచి డబ్బు తీసి గంటపలారం బండి అతనికి ఇచ్చేస్తాడు. నేనూ తా
తయ్యా ఇద్దరం ఎంచక్కా బోల్డు మిక్చరు తింటాం.
ఇలా గడిచిపోయిన సాయంత్రాలు గుర్తు చేసుకుంటే భలే ఆనందంగా ఉంటుంది నాకు.
ఇప్పుడు నా మనవడికి గంటపలారం బండి చూపించి మా తాతయ్య నాకు కొనిచ్చినట్లే వాడికీ కొనివ్వాలని అనుకుంటాను. వాడికేమో ఈ తిళ్లు నచ్చుతాయో లేదో.
ఓ రోజు సాయంత్రం బండి ఇంటి ముందుకు రానే వచ్చింది.
అయినా దీన్ని గంటపలారం బండి అని ఎందుకు అంటారు తాతయ్యా అని అడిగాడు నా మనవడు.
అందులో గంట ఉంటుంది. ఆ గంట కొడుతూ పలారాలు అమ్మడానికి వస్తాడు కాబట్టి దాన్ని గంట పలారం బండి అంటాం అని చెప్పాను.
ఇద్దరం రెండు రకాల మిక్చర్ పొట్లంలో కట్టించుకున్నాం.