Phanikiran AK

Comedy


5  

Phanikiran AK

Comedy


వాయసానికి పాయసం

వాయసానికి పాయసం

1 min 336 1 min 336

"ఏంట్రా, పాయసం ఘుమమఘుమలు వస్తున్నాయి. ఏంటి విశేషం" వస్తున్న వాసనలని ఆస్వాదిస్తూ నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన కాంతారావు ,లోపలకు వస్తూనే అడిగాడు టీవీ చూస్తున్న తన కూతురిని.


"ఆ. వాయసానికి పాయసం " వెటకారంగా అంది కూతురు.


"కాకికి పాయసం ఏంట్రా" అర్ధకాక అడిగాడు.


"హ్మ్. పొద్దున్నే మన బాల్కనీ గోడమీద కూర్చుని అరుస్తున్న కాకిని చూసి అమ్మ మొక్కుకుంది"


"కాకికి మొక్కుకోవటం ఏంటి?"


"అవునండీ. కాకి అరిస్తే చుట్టాలు వస్తారంటారుగా. అసలే కరోనా ఎక్కడ వస్తుందో అని భయపడి చస్తుంటే, ఇప్పుడు ఈకాకి అరిచి, చుట్టాలు వచ్చి, మన ఖర్మకాలి కరోనా వస్తే. అందుకే నీకు పాయసం పెడతాను, ఇకపై ఇక్కడికి వచ్చి అరవకు అని ఇలా అన్నానో లేదో, సరే అంటూ అలా తుర్రుమని ఎగిరిపోయిందండీ బుజ్జిముండ. అందుకే దానికి పెడదామని పాయసం చేశాను."సంబరంగా చెప్పిన భార్యామణిని తెల్లమొఖం వేసుకు చూశాడు.


"అందులో జీడిపప్పు, కిస్మిస్లు వేశావా" అనుమానంగా అడిగాడు.


"అయ్యో, అవెలా మరిచిపోతాను. వాటితోపాటు ఇన్ని బాదాం కూడా వేశాను." చెప్పి వంటింటిలోకి వెళ్లిన భార్యామణిని విస్తుపోయాడు.


తాను అడిగితే ఇక పాయసాలు అవీ ఏమీ లేవు, అసలే లోబడ్జెట్ అని ఖండించిన భార్య, కాకికి పాయసం పెట్టటం ఏంటో అనుకుంటూ,


"కాకినైనా కాకపోతిని పాయసమును త్రాగగా" అని పాడుకుంటూ తమ గదికి దారితీశాడు.


-----------******----------


రచన :

ఫణికిరణ్ @కిరణ్మయిఅనిసింగరాజు


Rate this content
Log in

More telugu story from Phanikiran AK

Similar telugu story from Comedy