Phanikiran AK

Drama


4  

Phanikiran AK

Drama


ప్రభాత చాణక్య - 2

ప్రభాత చాణక్య - 2

3 mins 3 3 mins 3

నేషనల్ హైవే ....

తూర్పు నుంచి ప్రభాత కిరణాలు ప్రసరించడం మొదలైన వేళ ...రెండు కార్లు వేగంగా వచ్చి ...ఒక పక్కగా వున్న టీ బoకు ముందు ఆగాయి..

కార్లు ఆగిన శబ్దానికి టీ కాస్తున్న చాచా తల పైకెత్తి చూసాడు ....

కార్లోంచి దిగుతున్న 9 మంది యువతీ యువకులను చూడగానే చాచా పెదవులపై ఉదయించే సూర్యుని కాంతితో పోటీపడే చిరు దరహాసం ఉదయిoచింది ....

చాచాను చూడగానే ....

“ఎలా వున్నావు చాచా “....పాల నురుగు లాంటి తెల్లని చుడిదార్ లో దేవకన్యలా వున్న యువతి ఎంతో ఆప్యాయముగా అడిగింది....

“నీ దయ వల్ల ఎంతో సంతోషం గా వున్నాం బేటా ...” అంటూ వారి కోసం స్పెషల్ చాయ్ ని తయారు చేయడానికి పాల గిన్నెను స్టవ్ పైకి ఎక్కించాడు .

“చాచా ..నీ కెన్ని సార్లు చెప్పాను ....ఇలా మాట్లాడవద్దని ...ఇది నా దయ కాదు... ఆ పైన వున్న వాడి దయ “...చిరుకోపంతో అన్న ఆ యువతిని చూసి చిన్నగా నవ్వి ...

“నిజమే కావచ్చు బేటా....కానీ ఆ పైన వున్నవాడు నాకు నీ రూపంలో కనబడుతున్నాడు..” అన్న చాచాని ఇంకేమి అనలేక ..

“నీ ఇష్టం చాచా...నీతో వాదించలేను.” అంటూ అక్కడే వున్న బెంచి పై కూర్చుంది.

“నిజమే ...నిజాలు మాట్లేడే వాళ్ళతో వాదించటం చాలా కష్టం కదా చాచా “...అన్నాడు వారిలోని ఒక యువకుడు...

అందరూ సమాధాన0గా నవ్వేశారు చాచా తో సహా .

చాచాకి వారితో పరిచయం చాలా పాతది...ఒకే స్కూల్లో చదివారు ఆ 9 మంది . స్కూల్లో వారి స్నేహాన్ని , వారి ప్రవర్తన , పరిస్థితులను ఆకళింపు చేసుకునే వారి పెద్దరికాన్ని , వారి అల్లరి, ఆటలు పాటలు అన్నిటిని దగ్గరుండి చూసినవాడు చాచా..వారిని రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకెళ్ళడం , తీసుకు రావడం అతని డ్యూటీ ....తనే వారికి నవ రత్నాలు అని పేరు పెట్టాడు....ఎక్కడ ఈ నవ రత్నాలు కలుషితమౌతాయో అని వేరేవర్ని దింపడానికి కూడా ఒప్పుకోలేదు.

స్కూల్ నుoచి ఇంటర్ కాలేజ్ కు వచ్చేవరకు అతనే వారి డ్రైవర్. వారెప్పుడూ అతనిని డ్రైవర్ లా చూడలేదు...పిల్లలు, పెద్దలు కూడా తమ కుటుంబ సభ్యునిలాగే చూశారు. కాలేజ్ లో చేరాక కూడా వారు అతనితో స్నేహాన్ని మానలేదు. రెండేళ్ళ తరువాత పిల్లల్ని ఇళ్ళ దగ్గర దింపి తన ఇంటికి వెళుతున్న సమయంలో ఆక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలైతే ఈ పిల్లలే అతనిని దగ్గరుండి చూసుకున్నారు..అతని భార్యకు ధైర్యం చెప్పారు...

ఇకపై డ్రైవింగ్ చేయడం మంచిది కాదని డాక్టర్ చెప్తే , ఈ పిల్లలే అతని చేత వాళ్ళు చదివే కాలేజ్ వద్ద టీ కొట్టు పెట్టించారు.

ఎవరి అభిరుచిని బట్టి వారు చదువులను పూర్తి చేసి ఉద్యోగాలలో స్థిరపడ్డా చాచాని , చాచా టీని మర్చిపోలేదు.

నేషనల్ హైవేకు ఆనుకునుండే గ్రామం చాచా వూరు...సిటీ లిమిట్స్ లో ఉంటుంది. అక్కడికి వెళ్తాను అంటే అక్కడ అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేసి హైవే పై టీ స్టాల్ ఓపెన్ చేసి ఇచ్చారు.

నెలలో ఎవరి వీలును బట్టి వాళ్ళు వచ్చి చాచా యోగ క్షేమాలు కనుక్కోవడం వారి అలవాటు.

నెలకొక సారి ఏదో ఒక ప్రాంతానికి ఒక రెండు రోజుల టూర్కి వెళ్ళడం వారి అలవాటు.

ఈ రోజు కూడా అలాగే బయలుదేరారు. అది రెండు నెలల తరువాత ...కారణం ఆ 9 మందిలో ఇద్దరు డాక్టర్లు కావడం, రెండు నెలలుగా బిజీగా వుండడం....

చాచా పెట్టి ఇచ్చిన టీని తాగుతూ ఊరికే జలపాతాల్లా వున్న వారికి తెలీని విషయం ....కొంచెం దూరంలో , మరో బెంచిపై స్కార్ఫ్ స్వెటర్ వేసుకుని టీ తాగుతున్న ఒక వ్యక్తి వారు వచ్చిన దగ్గర్నుంచి వారినే నిశితంగా గమనిస్తున్నాడని....

వారు టీ తాగడం పూర్తి చేసి చాచాకు బై చెప్పి బయలుదేరారు...

వారినే గమనిస్తున్న వ్యక్తి లేచి చాచాకు డబ్బులిచ్చి , 

“చూస్తుంటే నీకు ఆప్తుల్లా వున్నారు” ...అన్నాడు..

చాచా నవ్వి వారి గురించి ఎంతో గర్వంగా చెప్పాడు...ఆ తొమ్మిది మంది గురించి ఎవరైనా అడిగితే చాచాను ఆపడం ఎవరితరం కాదు....అందులోను అడిగిన వ్యక్తి కొద్ది రోజులుగా అక్కడకు తరచు వస్తున్న వ్యక్తి కావడం, అతనితో కొంత పరిచయం అవ్వడంతో అతను అడగం తరువాయి చాచా వారి గురించి చెప్పాడు ..

కానీ ఆ క్షణం చాచాకు తెలీదు ...ఆ వ్యక్తి కారణంగా ఆ 9 మంది జీవితాలు ఎంతటి ప్రభావానికి గురి కాబోతున్నాయో ....తెలిసుంటే బహుశ చాచా వారి గురించి చెప్పేవాడు కాదు.Rate this content
Log in

More telugu story from Phanikiran AK

Similar telugu story from Drama