ప్రభాత చాణక్య
ప్రభాత చాణక్య


ముందు మాట
ప్రేమంటే .....
అది తొలి చూపులోనే పుట్టే భావన లేక తొలి స్పర్స చేసే అల్లరా ....?
ప్రేమంటే....
మనసుల కలయిక లేక తనువుల తపన .....?
ప్రేమంటే ......
ఆత్మల అనుసంధానమా లేక గత జన్మ బంధమా .....?
ప్రేమంటే......
అలౌకిక భావనా .....?
ప్రేమంటే............ఎన్నో రకాల సమాధానాలు
మరెన్నో రకాల అభిప్రాయాలు .
కానీ , మనకు సాధారణంగా వినబడే సమాధానం ....
ప్రేమంటే ....ఒక "పవిత్రమైన భావన ".
ప్రేమ లేకపోతే ప్రపంచం లేదు.
ఎన్నో రకాల ప్రేమలు.
మనుషుల మధ్య అంతర్లీనంగా ఒక అంతర్వాహినిలా ప్రవహించే అద్భుత భావన ..
మనుషులను కట్టి ఉంచే ఒక అదృశ్య బంధం.
బంధాలు ...అనుభంధాలు ....అన్నింటినీ కట్టి ఉంచే ఒక అదృశ్య దారం పేరే ప్రేమ...
అటువంటి ప్రేమ రెండు భిన్న ధ్రువాల మధ్య ఏర్పడితే .....
భిన్న ధ్రువాలు!?.....
అవును...భిన్న ధ్రువాలు...
ఒక ధృవం....
చట్టానికి ప్రతి రూపం.....నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం......ధైర్యం, సాహసం ...వృత్తి పట్ల నిబద్ధత....అంతకు మించి చలాకితనం , చురుకుతనం....ఎవ్వరికీ తలవంచని తత్వం .....
ఎదుటివాడు ఎంతటి వాడైనా ఎదురు నిలవడానికి కూడా వెనుకాడని మనస్తత్వం
అబద్దాన్ని సహించని బుద్ధి...
నిజాన్ని మాత్రమే చూసే దృష్టి .....
అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని వృత్తి ......
మరొక ధృవం .....
ప్రేమకు నిలువెత్తు రూపం....ఆపన్నులను ఆదుకునే హస్తం....నమ్మిన దానికోసం , మంచి కోసం ఎంతకైనా తెగించే సాహసం...ఎవ్వరిని నొప్పించని తత్వం.....అన్యాయాన్ని సహించని మనస్తత్వం ...
దేవకన్య రూపం....సమ్మోహనపరిచే దరహాసం....మృదు స్వభావం ....
అబద్దం చెప్పైనా ప్రాణాలు కాపాడమనే బుద్ధి ......
ఎటువoటివాడినైనా మొదట మనిషిగా చూసే దృష్టి...
నేరస్తుడికైనా ప్రాణాలు పోసే వృత్తి .....
ఈ రెండు భిన్న ధ్రువాలు కలుస్తాయా?.....
కలిస్తే.......అది ప్రణయమా ? లేక ప్రళయమా ?
అది తెలిపే అపూర్వ ప్రేమ కథ .....అనుబంధాలను అపురూపంగా చూపించే అద్భుత మకరంద సుధ....
ఈ
ప్రభాత చాణక్య