ష్...తుమ్మకూ... దగ్గకూ

ష్...తుమ్మకూ... దగ్గకూ

2 mins
1.6K             ష్...... తుమ్మకూ...దగ్గకూ ( కథ)


తుమ్ముల సుబ్బారావు ఇంటి బయటకు వస్తే ఇంతకు ముందు అందరూ సరదా నవ్వుకునేవారు,

ఇప్పుడు భయంతో పారిపోతున్నారు,దగ్గుల వెంకటరావుదీ అదే పరిస్థితి,తుమ్ముల సుబ్బారావు, దగ్గుల వెంకటరావు పక్క పక్క ఇళ్ళల్లనే వుంటున్నారు. మాటమాటకీ తుమ్ముల సుబ్బారావుకి తుమ్మడం అలవాటు,గడియ గడియకీ దగ్గుల వెంకటరావుకి దగ్గడం అలవాటు,ఈ అలవాటు ఇప్పటిది కాదు సుబ్బారావు, వెంకటరావులకు ఊహ తెలిసినప్పుటినుండి ఉంది.చాలా సార్లు ఇద్దరూ డాక్టర్లు దగ్గరకు వెళ్లి రకరకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు.అయినా డాక్టర్లు,ఇవేమీ పెద్ద జబ్బులు కావు,ఏమాత్రమూ ప్రమాదకరమైన రోగాలు కావు,కాకపోతే అవి పెద్దల నుండి వారసత్వంగా, శరీరతత్వంగా వచ్చి ఉంటాయి అని చెప్పి,తుమ్మినా దగ్గినా చేతి రుమాళ్ళు అడ్డు పెట్టుకోవడం,అవసరమైతే నోటికి,ముక్కుకు మాస్కులు వేసుకోవడం,ఆహారంలో అతి చల్లని పదార్ధాలు,శీతల పానీయాలు లేకుండా చూసుకోవడం,మిరియాలు,అల్లం,లవంగీలు,వెల్లుల్లి వంటి పదార్ధాలు నిత్యం మితంగానైనా వాడుతూ ఉండటం చెయ్యండి అని సూచనలు చేశారు,సుబ్బారావు, వెంకటరావులు అలాగే చేస్తుంటారు,వాళ్ళ ఇంట్లోవాళ్ళు,వీధిలో వాళ్ళు,ఇరుగుపొరుగు వాళ్ళు, బంధువుమిత్రులు కూడా తుమ్మల సుబ్బారావు తుమ్ముల్ని,దగ్గుల వెంకట రావు దగ్గుల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు,కానీ కొంతమంది మాత్రం సరదాగా ఆటపట్టించడానికి వీళ్ల మీద జోక్స్,సెటైర్లు వేస్తూ నవ్వులు పూయించేవారు.ఇలా కథ సాఫీగా నడుస్తుండగా.....


         మాయదారి కరోనావైరస్ ప్రచారం మొదలై తుమ్ముల సుబ్బారావు,దగ్గుల వెంకటరావుల పాలిట శత్రువయ్యింది,శాపమైంది.ఈ మధ్య ఒకసారి తుమ్ముల సుబ్బారావు బ్యాంకుకి వెళితే,అతడు నిలబడిన వరసలో నిలబడిన వారు ఒక్కక్కరూ పక్కకు తప్పుకొని దూరంగా వెళ్లిపోయారు,పెద్దవాడినన్న గౌరవంతో అందరూ తనకు గౌరవం ఇస్తున్నారు అనుకున్నాడు సుబ్బారావు కానీ కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి అసలు విషయం తెలిసింది, కౌంటర్ లో ఉన్న మేడం సుబ్బారావు తుమ్మల విన్న వెంటనే ముఖానికి మాస్క్ తగిలించుకుంది,బ్యాంకు మొత్తం ఎలెర్ట్ అయిపోయి స్టాఫ్ మొత్తం మాస్కులు పెట్టుకున్నారు,బ్యాంక్ కస్టమర్లు మాస్కులు,చేతి రుమాళ్లు,మూతులకు అడ్డు పెట్టుకున్నారు,సుబ్బారావు చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు,మీకు జలుబు,దగ్గు, వున్నప్పుడు ఇంట్లో ఉండాలి కానీ వీధిలోకి ఎందుకు వచ్చారు,ఇకపై కొద్ది రోజులు బ్యాంకుకి రాకండి అని బ్యాంక్ వాచ్ మన్ అనేసరికి సుబ్బారావు మనసు చివుక్కుమంది,బ్యాంక్ పని అయిన వెంటనే బజారు పనులు,ఊర్లో మరికొన్ని పనులు వున్నా వాటి జోలికి వెళ్లకుండా,రిక్షా ఎక్కి ఇంటికి చేరాడు,చివరికి రిక్షావాడు కూడా సుబ్బారావు తుమ్మితే అనుమానంగా ముఖం చిట్లించాడు.


        అదే రోజు దగ్గుల వెంకటరావు పొరుగూరు వెళ్ళడానికి బస్ ఎక్కాడు.అతనికున్న అలవాటు ప్రకారం దగ్గుల దగ్గితే,వెంకటరావుతో పాటు కూర్చున్న ఒకతను సీట్లోంచి నిలబడిపోయి దూరంగా వెళ్ళిపోయాడు,చివరికి వెంకటరావు బస్ దిగేవరకూ అతని పక్కన ఎవరూ కోర్చోలేదు,కండక్టర్,డ్రైవర్ వెంకటరావు వంక అదోలా చూస్తున్నారు.తోటి ప్రయాణికులు ముఖాలకి గుడ్డలు అడ్డం పెట్టుకొని వాళ్లలో వాళ్ళు గుసగుసలాడుకోవడం వెంకటరావు గమనించాడు.వెంకటరావు మనసు బాధ పడింది,అందుకే పొరుగూరు వెళ్లకుండా మధ్యలోనే బస్ దిగిపోయాడు,పొరుగూరు వెళ్లి అక్కడ వారి ఈటెల లాంటి మాటలు అనుమానస్పద చూపులు భరించే కంటే సొంత ఇంటికి పోవడమే మేలని ఇంటికి కాలినడకనే తిరిగి చేరుకున్నాడు.


        సుబ్బారావు,వెంకటరావు మిత్రులు,ఇరుగుపొరుగు వారు కావడం వల్ల తరుచూ కలిసిమెలిసి వుండేవారు, అయితే వెంకటరావుకి కొన్నాళ్ళు దూరంగా ఉండండని సుబ్బారావు ఇంట్లో వాళ్ళు,సుబ్బారావుతో అంత చనువు దేనికని వెంకటరావు ఇంట్లో వాళ్ళు హెచ్చిరకలు చేస్తుండటం ఆ ఇద్దరు మిత్రులకూ ఆశ్చర్యాన్ని కలిగించింది,అందుకే ఆ ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి వారి వారి కుటుంబాలతో చెప్పి మా ఇద్దర్నీ కొన్నాళ్ళు పాటు ఒకే గదిలో ఉంచేసి బయట గడియలు పెట్టేయండి, వీలైతే భోజనాలు పెట్టండి లేకుంటే లేదు ఉంటే ఇద్దరమూ ఉంటాం,పోతే ఇద్దరమూ పోతాం,మేము పోతే మీకు ఇబ్బందులు ఉండవు కదా అని వారి వారి కుటుంబాలతో చెప్పేసారు.ఆ రెండు కుటుంబాలూ చాలా బాధ పడ్డాయి, సుబ్బారావు,వెంకటరావులకు అవి సహజంగా సాధారణంగా చిన్నప్పటి నుండి వస్తున్న తుమ్ములు, దగ్గులు,వాటికీ ఈ కరోనా వైరస్ కి ఎటువంటి సంబంధం లేదుగాక లేదు అని రూడీగా తెలిసినా మనమే వాళ్ళను అనుమానంగా చూస్తే ఇక లోకం ఎంత దారుణంగా చూస్తుందో కదా అనుకొని,రెండు కుటుంబాలు ఒక మాట అనుకొని,వీధిలో వాళ్ళకు,ఊర్లో వాళ్లకు సమాధానం చెప్పనవసరం లేకుండా,వెంకటరావుకి,సుబ్బారావుకి వీధుల్లోకి వెళ్లవద్దు అని చెప్పి,ఎటువంటి ఆంక్షలు పెట్టుకోకుండా ఇళ్లల్లో సరదా అందరితో కలిసిమెలిసి రెండు ఇళ్ళల్లోనే వుండాలని వారిద్దరినీఒప్పించారు. సుబ్బారావు,వెంకటరావు సరే నలుగురితో నారాయణ,కుటుంబంతో గోవింద అంటూ మేమూ మారాలి మీ మాట వినాలి,కోవిడ్-19 నిరోధక సూత్రాలు పాటించాలి అన్నారు ముసి ముసి నవ్వులతో.....


           

From :మీగడ.వీరభద్రస్వామి
Rate this content
Log in

Similar telugu story from Comedy