ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో
ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో
ఎక్కడ తగ్గాలో!... ఎలా నెగ్గాలో...!(కరోనా నీతి కథ)
పూర్వం విజయసేతు అనే రాజు ఉండేవాడు.అతని రాజ్యం'ప్రశాంతపురి'.తన రాజ్యంలో ప్రజలు ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకునే వాడు విజయసేతు.యుద్ధ విద్యల్లో విశ్వవిఖ్యాతిగాంచిన పరాయిదేశ రాజ కుటుంబ యువకులు పదిమంది ఒకసారి సాయుధులై తన రాజ్యంలోని ఒక చిట్టడవిలోని జింకపిల్లలను వెంటాడి వేటాడి చంపడానికి ప్రయత్నించగా ఆ యువరాజులతో విజయసేతు ఒక్కడే వీరోచితంగా పోరాడి వాళ్ళను ఒంటిచేత్తో ఓడించి తన రాజ్యం నుండి తరిమివేసాడు,అంతటి వీరాధి వీరుడు విజయసేతు.
విజయసేతు ప్రశాంతపురిపై 'విశ్వవినాశకుడు' అన్న అప్రతిష్ట పొందిన 'కఠోరకంటక' అనే రారాజు కన్ను పడింది. నేరుగా యుద్దానికి దిగితే విజయసేతుని ఓడించలేనని రాత్రికి రాత్రి తన మందీమార్భాలాలచే ప్రశాంతపురి రాజ్యాన్ని చుట్టుముట్టించి ఒక విషపూరిత రసాయనిక వాయువుని ప్రయోగించాడు ఆ రారాజు. అనుకోని ఈ విపత్కర పరిస
్థితికి ప్రశాంతపురి పౌరులు ఆందోళన చెంది అశాంతికి గురయ్యారు.
భుజబలానికి పేరు ప్రఖ్యాతులుగాంచిన విజయసేతు ఈ విషపూరిత విపత్తుని తెచ్చిన మూర్ఖ శత్రువులను సాయుధ యుద్ధవిద్యలో ఓడించి రాజ్యానికి విజయం తెస్తాడని అందరూ అనుకున్నారు, రసాయినిక సాయుధులతో యుద్ధం రాజ్యానికి భారీ విధ్వంసాన్ని తెస్తుందని అందరూ భావించారు, కానీ విజయసేతు అలా చెయ్యలేదు. రాజ్యప్రజలకు విజ్ఞప్తి చేస్తూ"కొన్నాళ్ళు అందరూ ఇళ్ళల్లోనే వుండిపొండి,మన సైన్యం మీకు నిత్యావసరవస్తు సేవలు అందిస్తుంది,కొన్నాళ్ళకు సమస్య దానంతట అదే పరిస్కారం అవుతుంది"అన్నాడు.ప్రజలు అతని మాటను తూచాతప్పక పాటించారు.కొన్నాళ్ళకు శత్రుసైన్యం విసిగవేసారి తిరిగి ఇంటిముఖం పట్టింది.ఎక్కడ తగ్గాలో ఎలా నెగ్గాలో తెలిసిన వాడేరా మొనగాడు,భుజబలంలోనూ బుద్ధిబలంలోనూ మన విజయసేతే మొనగాడని ప్రజలు మెచ్చుకున్నారు.
........మీగడ.వీరభద్రస్వామి 7893434721