ఈర్ష్యా ద్వేషాల ఫలితం (కథ)
ఈర్ష్యా ద్వేషాల ఫలితం (కథ)
ఈర్ష్యా ద్వేషాల ఫలితం (కథ)
…………………………………………………..
అది ఒక చిన్న తోట.ఆ తోటలో ఎక్కువ కాకులు ఉండేవి,ఆ కాకులుతో పాటు కొన్ని కోకిలలు కూడా వుండేవి.ఆ కోకిలల కూతలు వినడానికి ప్రతిరోజూ ఆ తోటలోకి ఇద్దరు పిల్లలు వస్తుండేవారు,కోకిలలు కూతలు వింటూ ఆ తోటలో చక్కని ఆటలాడుకునేవారు,కోకిలలు కూతలు వినగానే ప్రతిస్పందనగా అలాంటి కూతలే కూస్తూ చప్పట్లు కొడుతుండేవారు,కోకిలల మీద ప్రేమతో వాటికి మంచి ఆహార కానుకలుగా తిండిగింజలతో నిండిన పాత్రలను తెచ్చి ఆ తోటలో పెడుతుండేవారు.
మావిచిగురులనే ఎక్కువుగా తింటూ సుకుమారంగా వుండే కోకిలలు ఆ పిల్లలు తెచ్చిన తిండిగింజలను తినకపోయినా పిల్లల్ని వారించకుండా వాళ్ళు తెచ్చిన తిండిగింజల్ని కాకులుకు ఇస్తుండేవి.ఆ తిండిగింజల్ని తింటూ హాయిగా ఉండేవి కాకులు.
కాకుల్లో కొన్ని కాకులకు కోకిలలంటే ఈర్ష్యా ద్వేషాలు కలిగి,"ఆ పిల్లలు కోకిలలు కూతలకు చప్పట్లు కొడుతున్నారు,మనం అరిస్తే చెవులు మూసుకుంటున్నారు,అధిక సంఖ్యలో
కాకులు వున్న ఈ తోటలో కోకిలలకు ప్రాధాన్యత మనకు అవమానకరం" అంటూ తోటి కాకులను రెచ్చగొట్టాయి.
కాకులన్నీ ఒక్కటై పిల్లలు తోటలోకి వచ్చినప్పుడు కోకిలలు కూతలు వినిపించకుండా పెద్దగా అరవడం మొదలుపెట్టాయి,కాకులు అరుపులు భరించలేక పిల్లలు తోటలోకి రావడం మానేశారు.అప్పనంగా వచ్చిన తిండిగింజలు లేక కాకులు బిక్కమొహాలు వేస్తూ పిల్లల రాకకోసం దిక్కులన్నీ చూశాయి.
కాకులు తీరు చోసి కోకిలలు చిన్నగా నవ్వుకున్నాయి.ఆ నవ్వుల అర్ధమేమని కోకిలలను నిలదేశాయి కాకులు."మేము వాళ్ళు తెచ్చిన ఆహారాన్ని తినమని ఆ పిల్లలకు తెలీక వాళ్ళు మాపై అభిమానంతో తెచ్చిన ఆహారాన్ని మేము మీకు ఇచ్చేవారం,ఆ ఆహారాన్ని తింటూ మీరు నిశ్చింతగా వుండేవారు,ఇప్పుడు చూడండి మీరు మా మీద ఈర్ష్యా ద్వేషాలతో చేసిన అనాలోచిత చర్యలు వల్ల మీ నోటి ముందు కూడును మీరే కాలదన్నుకున్నట్లు అయ్యింది"అని అన్నాయి కోకిలలు. కాకులు సిగ్గుతో తల దించుకున్నాయి.
…………………………………………………..
ఎం వి స్వామి 9441571505