STORYMIRROR

M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

చిలక్కి చెప్పినట్లు చెప్పినా....!

చిలక్కి చెప్పినట్లు చెప్పినా....!

1 min
358


చిలక్కి...చెప్పినట్లు చెప్పినా (కథ)


 ఒక మామిడి తోటలో చాలా చిలుకలు ఉండేవి.


చిలుకలు తినగా మిగిలిన మామిడిపండ్లను తన బంధుమిత్రులకు ఇవ్వాలని అనుకునేవాడు తోటమాలి.


 తోటనిండా మామిడి పంట ఉండటంతో చిలుకలు ఏ చీకూ చింతా లేకుండా ఆ పండ్లను తింటుండేవి.


ఒకరోజు తోటమాలి వచ్చి"తోటలోని మామిడిపండ్లు మొత్తం మీరే కొట్టి తినేస్తుంటే ఎలా! మాకూ కొన్ని పండ్లు తాజాగా వుండనివ్వండి"అని చిలుకల్ని బ్రతిమిలాడాడు.


తోటమాలి మాటల్ని చిలుకలు చెవులకెక్కించుకోలేదు, పైగా అతను బ్రతిమిలాడిన తరువాతే తోటలోని పండ్లనన్నింటినీ కొంచెం కొంచెం కొరికి పడేస్తుండేవవి.


 చిల

ుకల చిల్లరపనులు చూసి ఒక కాకి వాటిని మందలించి"తోటమాలి మాట వినకుండా అతన్ని విసిగిస్తే మీ ఉనికికే ప్రమాదం రావచ్చు జాగ్రత్ర" అని హెచ్చిరించింది.


కాకి మాటలకు చిలుకలు నవ్వి"తోటలో ఆకులు కన్నా మేమే ఎక్కువగా వున్నాం మమ్మల్ని ఎదిరించి తోటమాలి ఏమిచెయ్యలేడు"అని నిర్లక్ష్యంగా మాట్లాడాయి.


  తోటమాలి చిలుకలు తీరుకి విసిగిపోయి, డప్పులుతో చప్పుడు చేయించి చిలుకల్ని బెదిరించాడు.


 తోటనుండి చిలుకలు పరిపోగా తోటమాలి మామిడి పండ్లనన్నింటినీ సంతోషంగా సేకరించుకున్నాడు.


 చిలుకలు బెంబేలెత్తిపోవడం చూసి కాకి నవ్వుకుంది.


 ......ఎం.వి.స్వామి 7893434721



Rate this content
Log in