బ్యాంబూలో సోది
బ్యాంబూలో సోది
ఏమిట్రా శంకరం! ఏంటి పెరట్లో ఓ తెగ తిరుగుతున్నావ్.నేను మా పక్కింటి ఫ్రెండ్ ను కేక వేశాను.
ఇలా దగ్గరికి రా నీకో సీక్రెట్ చెబుతాను అని అన్నాడు.
శంకరం బనీను మొత్తం కారం మసాలాలు అంటుకొని ఉన్నాయి.పెరట్లో మసాలా కలిపిన చికెను ముక్కలు వెదురు బొంగులు ఉన్నాయి.
ఒరేయ్! ఏం చేస్తున్నావ్.
ఆదివారం బొంగులో చికెన్ నేర్చుకుంటున్నావా?అని అడిగాను.
అవున్రా.మొన్నామధ్య ట్రంపు గారు ఇండియాకి వచ్చినప్పుడు బొంగులో చికెన్ వడ్డించారట.
మరి ట్రంపు లాంటి గొప్ప వ్యక్తులకి పెట్టారంటే ఈ బొంగులో చికెన్ ఎంత గ్రేటు.
నేను కూడా ఇది బాగా వండడం నేర్చుకొని వీసా ఆఫీసరు గారికి తినిపిస్తాను.ఆయన ఫిదా అయిపోయి నాకు వీసా ఇచ్చేస్తాడు.
ఇంక శంకరం ఆనందమాయెగా బొంగులో చికెనాయగా అని పాట పాడుకున్నాడు.
నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.