Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Nadendla EswarKumar

Comedy Romance Others

4.2  

Nadendla EswarKumar

Comedy Romance Others

ఎనిమిదో నెంబర్ బస్సు

ఎనిమిదో నెంబర్ బస్సు

8 mins
258


ఎనిమిదో నెంబర్ బస్సు 

ఒరేయ్ నల్లోడా ఈరోజు ఎండ ఎక్కువగా ఉందికదారా అవునురా ఎర్రోడా నా నల్ల రంగుకి తెలియట్లేదు కానీ నువ్వుమాత్రం కమిలిపోయినా కమలా పండులాగా అయిపోయినావురా ఎర్రోడా... అంటూ నడుచుకుంటూ ఇద్దరు డెబ్బయ్యో పడిలో ఉన్న ముసలోళ్ళు కింద పంచెకట్టు పైన టవల్ మాత్రమే వుంది హిందీ సినిమాల్లో ఇప్పటి హీరోలు లాగా షర్ట్ లేకుండా దర్జాగా గతుకులు పడిన తారు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు..... ఇంతలో అటుపక్కగా కార్ లో వెళ్తున్న ఒక కుర్రాడు వాళ్ళను గుర్తుపట్టి ఓ నల్ల తాత ఎఱ్ఱ తాతా... రండి ఊర్లో మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను అంటున్నాడు తన కార్ ఆపి... ఎవరబ్బా అని ఒకేసారి ఇద్దరు తాతలు ఓరి ఓరి నువ్వు తాటికాయల చిలకమ్మ కొడుకు కదా అబ్బోడా బాగున్నావా... రండి తాత ఊర్లో వదిలేస్తాను అని మళ్లీ అన్నాడు ఆ కుర్రాడు అందుకు నల్ల తాత పర్లేదులే అబ్బోడా మాకు ఈబండ్లు..... కార్లు ఎక్కడం మావల్లకాదులే మా ఎనిమిదో నెంబర్ బస్సు పోయాక మేము ఈకాళ్లతోనే లాగించేస్తున్నాం ఎక్కడి కి పోవాలన్నా అంటూ వెళ్లిపోయారు....

ఎనిమిదో నెంబర్ బస్సు ఇంకా గుర్తుందా వీళ్ళకి నా చిన్నప్పుడు ఎప్పుడో నిలిచిపోయిన ప్రైవేట్ బస్సు అది అనుకుంటూ ఎదో ఆలోచిస్తూ ఆలా వూర్లోకొచ్చేసాడు. కార్ ఇంట్లో పెట్టి, కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేసి పక్కనే వున్నా పాత భజన గుడిదగ్గరకొచ్చి కూర్చున్నాడు ఎండాకాలం  అయితే అక్కడ అందరూ పెద్దోళ్ళు... చిన్నోళ్లు అందరూ అక్కడ కూర్చుని దాయాలు ఆడటం, పిచ్చాపాటి మాట్లాడుకోవడం చేస్తుంటారు. ఈ కుర్రాడికి ఆ ఎనిమిదో నెంబర్ బస్సు మనస్సులో అలాగే నిలిచిపోయింది ఎందుకనో అతని చిన్ననాటి జ్ఞాపకం కావచ్చు అలా అక్కడున్న వాళ్ళతో కాలక్షేపానికి నల్ల తాత ఎర్రతాత మాటలని వాళ్ళతో చెప్పుకుని అందరూ నవ్వు కుంటున్నారు. అయినా.... ఎందుకు అన్నా ఆ బస్సు అర్దాంతరంగా నిలిచిపోయింది అని ఒకడడిగాడు, ఇంకోఆయన ఆ బస్సు లో ప్రయాణం భలే వుండెదిరా తమాషాగా, హాయిగా అంత ఒక కుటుంభంగా ఉండేది. ఇంకొకతను ఎదో రహస్యం వుంది రా ఎదో జరిగింది అందుకే అలా అర్దాంతరంగా ఆపేశారు ఆ బస్సు ని అన్నాడు. ఇంకొకడు అప్పట్లో చంద్రబాబు నాయుడు కి లంచం ఇవ్వలేదంటారా ఈ బస్సు ఓనర్ అందుకే ఆపించేసాడంట, అందులో ఈ బస్సు పక్క వూరు వరకే రావాలంట మన వూరు వరకు పర్మిట్ లేదంట అందుకే ఆపేశారంట అని ఇంకోడు..... ఇలా ఎవడికి అనిపించింది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంతలో పక్కలో పడుకుని వున్నా ఒక పెద్దయన ఆపండ్రా మీయదవ గోల ముండమోపి నయల్లారా అని మనూరి బస్సు ఎనిమిదో నెంబర్ బస్సు అంటేనే ఒక అనుభవం రా ఎన్నో చూసాం ఆ బస్సు లో. ఇంతలో ఇంకొకాయన కొంచెం బాగాచదువున్నోడిలా వున్నాడు లేదురా మన బస్సు కండక్టర్ సాయిబుని బస్సు లోనే చంపేశారురా రాత్రి పదిగంటల షిఫ్ట్ లో ఆ కేసు వల్ల మల్ల మన బస్సు మనవూరి కి రాలేదన్నారు, అందరూ అలాగా అని నోరెళ్ళబెట్టి చూస్తూ ఆశర్యంగా  అలా ఆరోజు అందరూ ఎనిమిదో నెంబర్ బస్సు గురించి మాట్లాడుకుని వారి వారి ఇండ్లకు వెళ్లిపోయారు.

ఆ పెద్దయన అన్నట్టు మా ఎనిమిదో నెంబర్ బస్సు ఒక జ్ఞాపకం, ఒకజీవితం, ఎంతమంది, ఎన్ని ఊసులు, ఎన్ని తమాషాలు, ఎన్ని ఉత్కంఠ సమయాలు ఎన్నో ....... మావూరి బస్సు గురించి చెప్పుకోవాలంటే....... ఆరోజు తెల్లవారు జాము ఎప్పటిలాగే అయిదు గంటలయింది మా ఎనిమిదో నెంబర్ బస్సు హార్న్ మోత వినిపించింది.... బస్సు కండక్టర్ సాయిబు అందరూ ఆయన్ని అలాగే పిలుస్తారు....  రేయ్ చింపాంజీ బస్సు కడిగినావ టైం అయ్యింది రా ..... అని బస్సు క్లీనర్ ని అరుస్తున్నాడు, కడగతండా అన్నా అయిపొయింది అంటున్నాడు చింపాంజీ వీణ్ణి అందరూ అలాగే పిలుస్తారు. ఇంకోసారి రేయ్ చిన్నబ్బా వాడు కడిగింది అయ్యిందంటే ఆ పటాలకి పూజ చెయ్యి..... నేను ఇక్కడ కడుకుంటున్నా ఈరోజు నువ్వు చేసేయ్... తు దరిద్రం అనుకుంటూ మన సాయిబు పూజ చేసి ఇంకో సారి బలంగా హార్న్ కొట్టి బస్సు లో లైట్స్ అన్ని వేసాడు. ఇంతలో ఒక ఆవిడ టమాటో ల బుట్ట తీసుకొచ్చి యోవ్ సాయిబు ఆ తట్ట పట్టు పైన పెడదాం అంటుంది ఆ ... వచ్చేసిందిరా పెద్దక్క మోవ్ మొన్నటిలాగా తప్పించోలేవు ఈరోజు రెండురూపాయలు బుట్టకి లుగ్గజీ ఇవ్వాల్సిందే అన్నాడు, పొనీలేయ ఆడకూతురు ఇంత కష్టపడుతుందని వదిలేయకూడదు... అవునా రేపట్నుంచి నీమొగుడ్ని పంపించు వాడినడిగి తీస్కుంటా అంటుంటే నీ .... సాయిబు నా బట్టా అని ఆమె దుగ్గు సంచిలోంచి రెండు రూపాయలు ఇచ్చేసింది. అయిదు ముప్పై నిమిషాలకు వూర్లో చిత్తూర్ కి వెళ్లాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు ఈ బస్సు మా ఊరి నుంచి చిత్తూర్ వెళ్ళడానికి పదహైదు కిలోమీటర్లు మాత్రమే కానీ ఒకటిన్నర గంట పడుతుంది చిత్తూర్ లోకి వెళ్ళడానికి ఉన్న ప్రతి వూర్లో అపి వాళ్ళని ఎక్కించుకుని వెళ్తుంది. ఆలా తట్టలు బుట్టలు, ముసలి ముతకలతో మార్కెట్ కు వెళ్లాల్సిన సామాన్లతో  ఐదుగంటల బండి ప్రయాణం సాగిపోయింది. మా ఎనిమిదో నెంబర్ బస్సు కె ప్రత్యకమైన ప్రయాణమంటే పొద్దున ఎనిమిదిగంటలకి మరియు సాయంత్రం ఆరుగంటలకే కల కల లాడిపోతుంటుంది బుస్సు మొత్తం. ఐదుగంటల బండికి తట్ట బుట్ట ముసలి ముతక వస్తే ఎనిమిదిగంటల బండికి పడుచు బామలు వయసు కుర్రాళ్లతో హుషారెత్తిపోతుంటుంది, అందరూ కాలేజీ కి వెళ్లే టైం అది, మా వూర్లో బస్సు స్టార్ట్ చేసాడు బస్సు డ్రైవర్ చిన్నబ్బ, మన కండక్టర్ సాయిబు రేయ్ చింపాంజీ అందరూ ఎక్కేసారు పోదామా అంటుంటే వుండుయ  యోవ్ మా బ్రిటీషోడు రాలేదు లేదంటే మల్ల నన్ను సంపతాడు, అదిగదిగో వచేస్తావుండాడు వుండు....రాయ సామి బ్రిటిష్ అయన అంటూ చెయ్యి పట్టుకుని ఎక్కించుకున్నాడు. మా బస్సు లో అందరికి ఒక ఇష్టమైన సీట్ ఉంటుంది అందరూ అదే సీట్ లో రోజు కూర్చోడానికి ఇష్టపడతారు, అలాగే మన బ్రిటీషోడు కూర్చున్నాడు అదేంటి బ్రిటీషోడు అంటున్నారు అనుకుంటున్నారా మావాడు కాస్త అందరికంటే తెల్లగుంటాడు అందుకని మా చింపాంజీ అలా ముందుగా పిలుచుకుంటాడు. బస్సు ఓ..... పడుచు బంగారమా పలకవే సరిగమా, చిలిపి శృంగారమా చిలకవే మధురిమా అంటూ చిరంజీవి పాటలాగా ఒక పడుచు కళని సంతరించుకుంది. ఇంతలో పక్కవూరొచ్చిన్ది అంతవరకు నాక్కూడా తెలియదు బస్సుకి కూడా ఒక మనసుంటుందని దానికి నొప్పుంటుందని జగదీశ్ చంద్రబోస్ చెప్పినట్టు మొక్కలకి ప్రాణం వుందన్నట్టు మా బస్సు సీట్ కి కూడా ప్రాణముందేమో అనిపించింది నాకు ఆ ఘోరాన్ని చూసాక, మా పక్కూరిలో మా డ్రైవర్ చిన్నబ్బ బస్సు ఆపాడు ఘీంకరిస్తూ టైలర్ చిన్నబ్బ చెట్టి కొడుకు నల్లగా తుమ్మ మొద్దులాగా చిన్న పాటి ఏనుగు పిల్లలాగా వున్నాడు కాలేజీ బాగ్ తగిలించుకుని పరిగెడుతూ వస్తున్నాడు వచ్చేస్తున్నా ఆగరా చింపాంజీ అని, దున్నపోతు కాలికి బిళ్ళలు కట్టినట్టు వాడి కాళ్ళకి తెల్లటి బూట్లు ప్రేత్యేకంగా కనిపిస్తున్నాయి. వాడు అలానడచి వస్తుంటే తెల్ల బూట్లు రేయ్ రేయ్ మెల్లగా రా, మెల్లగా రా నువ్వు మాములుగా నడిస్తేనే మోయలేక చచ్చిపోతున్నాం ఇందులో పరుగు లంగించుకున్నావా అబ్బా అబ్బా నడుము విరిగినట్టుందే అంటూ తన జత తో అంటుంటే అయ్యో అయ్యో నాకు ముక్కు పచ్చడై రక్తం కారినట్టుందే, హ హ హ అయ్యో నాజూకు ముక్కు, పొడుగాటి ముక్కని నీలాగతా వున్నావ్ కదా అయ్యింది బాగా....ఓరి నీ కుళ్ళు మీద కాకి రెట్టేయ్య నీకేం పొయ్యేకాలం రా అంటూ కొట్టుకుంటున్నాయి. ఇంతలో ముక్కునుజ్జయినా చెప్పు అంటుంది ఒరేయ్ జతగా మనకే ఇలావుంటే బస్సులో ఆ మూడో నెంబర్ సీట్ పరిస్థితి ఏంటి రా అయ్యో పాపం, ఒరేయ్ చూడు రా ఆ మూడో నెంబర్ సీట్ అతలా కుతలం అయిపోయి నట్టు తుఫాను గాలికి కొబ్బరిచెట్టు ఊగిపోతున్నట్టు పైకి కిందకి ఊగిపోతున్నాడు పాపం రా జతగా అంటుంటే ... జతగాడు మూడో నెంబర్ సీట్ ని చూస్తున్నాడు పాపం ఎందుకులే వాడి బాధా అనుకుండగానే. బస్సు ఎక్కి మన నల్ల మొద్దు  మూడో నెంబర్ సీట్ దగ్గరకి వచేసాడు పాపం మూడో నెంబర్ సీట్ రేయ్ రేయ్ ఈరోజు వేరే సీట్ చుస్కో రా పాపం రా నేను దయ చేసి వేరే సీట్ చుస్కో రా ఈరోజుకి అంటుంటే తెల్ల బూట్లు పగలబడి నవ్వుకుంటున్నాయి. కూర్చోబోతున్నాడు కుర్చునేసాడు మూడో నెంబర్ సీట్ అయ్యో అబ్బా అమ్మ..... ఏసయ్యయా...... అంటూ అరుస్తున్నాడు..... శ్రీ కృష్ణుడయితే వచ్చేవాడేమో, యేసయ్య రాలేదు ఏమో మరి మన పుస్తకాల్లో అలాగే రాసుంది మరి అనుకుంటున్నాడు. తెల్ల బూట్లు అంటున్నాయి ఒరేయ్ మూడో నెంబర్ సీట్ గా అందుకే కృష్ణా అని అరవరా అని నిన్ననే చెప్పాను మరిచావా ఇప్పుడు చూడు వీడు కనికరియ్యట్లేదు. మా నల్ల మొద్దు హిందువు రా  యేసయ్య మాట పనిచేయదు, రేపైనా కృష్ణా అని అరువు అని అంటూ జతగాడికేసి కన్ను గీటుతున్నాడు. మూడో నెంబర్ సీట్ గాడు రేయ్ చచ్చినా నా ఏసయ్యని తప్ప వేరే వాళ్ళను పిలవనంటే, నీ చావు నువ్వు చావు కాసేపాగి తెలస్తది నీకు, తెల్ల వారితోనే బాగా పప్పన్నం లాగించాడు మావాడు వాయు పదార్థం నిన్ను కబళించి వేస్తుంది అంటున్నాడు. మూడో నెంబర్ సీట్ భయంతో గజ గజ లాడుతూ వీడన్నట్టు కృష్ణా అనిపిలిచేద్ద్దునా అమ్మా వద్దు మాయమ్మ ఏమంటుందో అనుకుంటుండగానే డుర్ర్ర్ .......... అని ఎదో శబ్దం బస్ మొత్తంపాకింది మూడో నెంబర్ సీట్ కి నల్ల మొద్దు పిరుదులకి మధ్యలో కొంత అలాగే స్తంభించిపోయింది బస్సు మొత్తం ముక్కు మూసుకున్నారు మూడో నెంబర్ సీట్ ఏమ్ముసుకోవాలో అర్థకావట్లేదు ఎందుకంటే మూసుకుంటే ఆగిపోయే అంత దూరంలో లేదు కాబట్టి పాపం ఏవొ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి తెల్ల బూట్లకి .... పాపం అనుకుంటున్నాయి మన బూట్లు.

ఇంతలో పక్కూరు గుర్రాల మిట్ట వచ్చింది పచ్చటి లంగా,  పింక్ రంగు ఓని వేసుకుని కాలేజీ బాగ్ తగిలించుకునుని అక్కడ వున్నా అందరిలో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది ఆ అమ్మాయి, బస్ ఆగి ఆగి ఆగగానే యోవ్ బ్రిటిషు అని చింపాంజీ అరుస్తున్నాడు బ్రిటిష్ ఏమో పచ్చ లంగా వంక అలా చూస్తున్నాడు పచ్చ లంగా అమ్మాయి బస్సు ఎక్కి బ్రిటిష్ కి ఎదురుగా డ్రైవర్ సీట్ కి పక్కన సీట్ మాములుగా కూర్చునే సీట్లో కూర్చుంది. మన బ్రిటిష్, పచ్చ లంగా అమ్మాయిని అలా చూస్తూనే వున్నాడు ఆ అమ్మాయి చూస్తూనే వుంది కన్నుల్లో నీరూపమే అంటూ నాగార్జునా పాటపాడుకుంటున్నారు కళ్ళతోనే. ఇంతలో మన సాయిబు ఇద్దరి మధ్యలో వొంగి తన సోడా బుడ్డి అద్దాల తల పెట్టి అయ్యిందా పాపా టికెట్ తీస్కొమా అంటుంటే ఉలిక్కి పడి లేచి తడుముకుంటూ ఆలా చూపులు పక్కకి పెట్టి మాములు లోకం లోకి వచ్చారు. బస్సు ఊర్లన్నీ దాటుకుంటూ దార్లో వున్నోల్ని ఎక్కించుకుంటూ వెళ్తుంది, ఇంతలో హఠాత్తుగా ఎవరో పక్కన ఊరోళ్లు హహకారాలతో బస్సు ని ఆపుతున్నారు రేయ్ చిన్నబ్బా బస్సు అపరా అని సాయిబంటున్నాడు చింపాంజీ పెద్దగా ఈలా వేస్తే డ్రైవర్ చిన్నబ్బ బస్సు ఆపాడు ఏమైంది ఏమైంది అని సాయిబు అడుగుతున్నాడు, ఒక పెద్దయన అయ్యా నా కూతురు నెప్పులు పడతావుంది హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని ఏడ్చేస్తున్నాడు అందరూ బస్సు నుంచి దిగిపోయారు తల ఒక చెయ్యి వేసి ఆ నిండు మనిషిని బస్సు లో ఒక సీట్ మీద పడుకోబెట్టారు. డ్రైవర్ చిన్నబ్బ బస్సు ని వేగంగా తోలుతున్నాడు ఆ నిండుమనిషి బలంగా అరుస్తుంది, బస్సు లో వున్న కొందరు ముసలోళ్ళు ఆవిడకి దైర్యం చెబుతున్నారు ఒకావిడ కాళ్లు నొక్కుతుంది, బస్సు లో అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. ఒక పెద్దావిడ ఆ నొప్పులొస్తున్న ఆవిడని గట్టిగా పట్టుకుంది ఆమెకి ప్రసవానికి సమయం అయిందనుకుంటా బిగ్గరగా కేక వినిపించింది, అంతలోనే నెమ్మదిగా కెవ్వుమని ఇంకో ఆడకూతురి కేక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో బస్సు గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చేసింది. ఆ తల్లి బిడ్డని వాళ్ళ బంధువులని వదిలి పెట్టి బస్సు బస్సు స్టాండ్ కి వచ్చేసింది, హమ్మయ్య అని ఎవరెవరి పనులకి వాళ్ళు వెళ్లిపోయారు. 

సాయంత్రం ఆరుగంటల బండికి అందరూ పడుచు అమ్మాయిలు, కుర్రాళ్ళు మళ్ళా కలుసు కున్నారు ఈసారి అందరూ అబ్బాయిలు లాస్ట్ సీట్లలో కూర్చున్నారు, అమ్మాయిలు వాటి ముందు సీట్ల లో కూర్చున్నారు, మా బ్రిటీషోడు చిలుకా క్షేమమా అని పాట లంఘించాడు పచ్చ లంగా ఓని పిల్ల రుస రుస లాడింది, ఇంకోడు రాను రణనంటూనే చిన్నదో అంటున్నాడు అందరూ అల్లరి చేస్తున్నారు సాయిబు, చింపాంజీ అవి చూస్తూ నవ్వుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరో ఇద్దరు పచ్చ లంగా అమ్మాయిని బ్రిటీషోడినే దీక్షగా చూస్తున్నారు వీళ్ళ పనిలో వీళ్ళున్నారు ఎవరిని పట్టించులేదు. మా ఊర్లల్లో ఇవన్నీ మాములే అడా మెగా అంత కలుపుగోలుగా వుంటారు మనస్సులో ఏమి వుండవు, అందరూ అలాగే అనుకుంటున్నారు. 

ఆలా ఇలా మనుషుల మధ్య పాకి పచ్చ లంగా, బ్రిటీషోడి ప్రేమ వాళ్ళ ఇళ్ల లో తెలిసింది, రెండు కుటుంబాలు భగ్గుమన్నాయి కారణం ఇద్దరివీ వేరే వేరే కులాలు కావడమే, పచ్చ లంగా అమ్మాయి వాళ్ళ అన్న పెద్ద రౌడీ నాయాలు మాచుట్టు పక్కల అందరూ వాణ్ని చుస్తే భయపడతారు, మా బ్రిటీషోడు పోయి పోయి దీన్ని తగులుకున్నాడు ఏమౌతుందో ఏమో. పచ్చ రంగు లంగా పాపా బ్రిటీషోడు విషయం తెలుసుకుని హడలిపోతున్నారు ఏమవుతుందో ఏమో అని ఆ రోజు ఇద్దరు కాలేజీ కి వెళ్లారు ఇద్దరి మొహాల్లో వెలుగు లేదు కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది అని కృష్ణా దేవదాస్ సినిమా పాట పాడుకుంటున్నట్టుగా మొహాలలో భావ వ్యక్తీకణాలు కనిపిస్తున్నాయి. ఏమిచేయాలో పాలుపోక ఇద్దరు మన కండక్టర్ సాయిబు దగ్గరికి వెళ్లి చెప్పుకున్నారు, సాయిబు చింపాంజీ, డ్రైవర్ చిన్నబ్బని పిలిచి ఎదో చెబుతున్నాడు. ఇంతలో మన తుమ్మ మొద్దు చిత్తూర్ లో బ్రిటిష్ గాడి కాలేజీ కి హడావిడిగా వచ్చి కలిసాడు ఎదో చెబుతున్నాడు జాగ్రత్తరా అంటూ చెప్పి నేను నీతో వస్తాను రాత్రి పదిగంటల బండికని చెప్పి వాడి కాలేజీ కివెళ్ళిపోయాడు. ఏమవుతుందో ఏమో అని బ్రిటీషోడు, తన అన్న ఏమిచేస్తాడో అని పచ్చ లంగా అమ్మాయి, ఎలా నిలవరించాలో అని సాయిబు, చింపాంజీ, డ్రైవర్ చిన్నబ్బా ఇలా అందరూ వారి వారి ఆలోచనల్లో భయం భయంగా వున్నారు. ఆ పదిగంటల బండి సమయం రానే వచ్చింది పచ్చ రంగు లంగా అమ్మాయి ఆరుగంటల బడికి ఇంటికెళ్ళిపోయింది వాళ్ళ అన్న రమన్నాడని భయం భయంగా, వెళ్తూ వెళ్తూ బ్రిటీషోడి ని కలిసి నువ్వు లేటుగా రా నాతో రాకు ఈరోజు ఏమైనా జరుగుతుందేమో అని భయంగా వుంది అని చెప్పి వెళ్లి పోయింది. పదిగంటల బండి సమయం అయ్యింది రోజు లాగానే రావాల్సిన వాళ్ళందరూ వచ్చి వారి వారి సీట్లలో కూర్చున్నారు ఎందుకో బండి మొత్తం స్తబ్దుగా వుంది ఎప్పుడూ అందర్నీ తిడుతూ తిట్టించుకుంటుండే సాయిబు నిశ్శబ్దంగా వున్నాడు ఆలా అందరూ దిగి వెళ్లి పోతున్నారు బస్సు గుర్రాల మిట్ట దగ్గరి కి వచ్చింది ఎవరో దిగారు మావూరికి గుర్రాల మిట్టకి మధ్యలో బాగా మబ్బుగా ఉంటుంది పొదలు పొదలుగా రోడ్ పక్కన్తా నిండి పోయుంటుంది రోడ్ మీద పక్క మనిషి ఏంచేసినా వూర్లో ఎవరికీ తెలియదు, ఉన్నట్టుండి ఒక గాజు బాటిల్ బస్సు అద్దాల మీద పడింది బస్సులో సాయిబు, చింపాంజీ, డ్రైవర్ చిన్నబ్బా నల్ల మొద్దు మాత్రమే వున్నారు  అందరూ ఉన్నటుంది హడలిపోయారు డ్రైవర్ చిన్నబ్బ బ్రేక్ వేసాడు. బ్రేక్ వేశాడో లేదో పదిమంది బాగా బలమైన మనుషులు బస్సు లోకి దూకారు,ఆ అక్ష్మికం నుంచి కోలుకున్న సాయిబు, చింపాంజీ..... అని గట్టిగా అరిచాడు చింపాంజీ ఒక పెద్ద రాడ్ తీసుకున్నాడు డ్రైవర్ చిన్నబ్బా బ్రిటీషోడిని కాపాడుతున్నాడు, మన నల్ల మొద్దు భయంతో వణికి పోతున్నాడు. అందరూ ఆ పదిమందిని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంతలో పచ్చ లంగా అమ్మాయి అన్న పెద్ద కత్తి తోటి బ్రిటిషువాడిని నరక బోయాడు ఒరేయ్ బ్రిటిషు అని సాయిబు అడ్డు పోయాడు..... బ్రిటీషోడు అమ్మా అని అరిచాడు, ఇటు పక్క నల్ల మొద్దు అయ్యో బ్రిటిషు... అని అరుస్తూ గజ గజ వణికిపోతున్నాడు. ఉన్నట్టుండి అందరూ అలా నిశ్శబ్దంగా ఆగిపోయారు తల తెగి కిందపడింది. ఆ పదిమంది పారిపోయారు బ్రిటీషోడు కళ్ళుతిరిగి పడిపోయాడు, చింపాంజీ.. డ్రైవర్ చిన్నబ్బా ఇద్దరు కంగారు పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు తమ పది సంవత్సరాల స్నేహం, ఎల్లప్పుడూ తమ గుండె చప్పుడు లాగా వుండే సాయిబు రక్తపు మడుగులో కొట్టమిట్టాడుతున్నాడు, ఏమిచేయాలో పాలుపోలే వాళ్లకి స్థంబించిపోయారు. మరుసటి రోజు పోలీసులు వచ్చారు కేసు పెట్టారు, ఆలా మా ఊరి బస్సు రోడ్ మధ్యలో నే ఆగిపోయింది.

   


Rate this content
Log in

More telugu story from Nadendla EswarKumar

Similar telugu story from Comedy