Nadendla EswarKumar

Romance Action Inspirational

3.8  

Nadendla EswarKumar

Romance Action Inspirational

గెలిచిన వాడిమాటే ఈ ప్రపంచం వింటుంది

గెలిచిన వాడిమాటే ఈ ప్రపంచం వింటుంది

1 min
496


చుట్టూ అంతా నిశబ్ధంగావుంది, పచ్చ తివాచిపరిచినట్టు గడ్డి, మధ్యలో అక్కడక్కడా చెట్లకి ఆప్రికాట్స్ వేలాడుతున్నాయి, చివర ప్రహరీగోడకి పది పదిహేను ఆపిల్ చెట్లు, చెట్ల నిండా పండ్లున్నాయి, లాన్ మధ్యలో ఒక పెద్ద పైన్స్ చెట్టు పక్కలో ఇంకో ఆపిల్ చెట్టు, ఆపిల్ చెట్టు కింద రెండు బల్లలు వేసున్నాయి. దానికి ఎదురుగా ఒక చిన్న అవుట్ హౌస్, పక్కనే పెద్ద బంగ్లా, బంగ్లా కి అనుకుని చూడచక్కని ఈతకొలను, రసరమ్యంగా ఉందా చోటు. ఇంతలో గెలిచినవాడి మాటే ఈ ప్రపంచం వింటుంది, గెలిచినవాడి మాటే ఈ ప్రపంచం వింటుంది.........అని యేవో అరుపులు వినిపిస్తున్నాయి ఆ లాన్ కి మధ్యలో వున్నా  ఔట్హౌస్ లో నుంచి. ఔట్హౌస్  అనే మాటే కానీ అది చక్కగా మనవూరిలో ఒక కుటుంబమే హాయిగా బ్రతికేయచ్చు ఆలా వుంది.  ఇంతలో ఔట్హౌస్ డోర్స్ ని ఎవరొతడుతున్నారు సుతిమెత్తగా అర్జున్ అర్జున్ అని పిలుస్తున్నారు అలా పిలుస్తుంటే ఉలిక్కిపడి లేచాడు. అక్కడ అతడ్ని ఎవ్వరు అలా పొద్దున్నే నిద్ర లేపేవారు లేరు కాబట్టి ఆశ్చర్యంతో తలుపులు తెరిచి చూసాడు. అతని మొహం మీద చిన్న చిరునవ్వు ఎదురుగా నీలం రంగు లంగా పింక్ రంగు చిట్టి ఓని వేసుకుని హెలూయిజ్ బొంజుర్ అర్జున్ అనిపలకరిస్తుంది ఫ్రెంచ్ భాషలో, ఆ డ్రెస్ అర్జున్ తాను పోయినసారి సెలవులకి ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చింది. ఈరోజు హెలూయిజ్ పుట్టినరోజు, అర్జున్ ఫ్రాన్సుకి వచ్చిన కొత్తలో హెలూయిజ్ పుట్టింది, ఇది హెలూయిజ్హె కి ఐదవ పుట్టినరోజు. అర్జున్ ఐదేళ్ల క్రితం రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేయడానికి ఫ్రాన్స్ వచ్చాడు. అతను ఒక క్రెయూటీజ్ఫిల్డ్ జాకబ్ డిసీస్ అనే ఒక అరుదైన భయంకరమైన మెదడుకి సంబందించిన వ్యాధికారకాలగురించి పనిచేస్తున్నాడు. హెలూయిజ్ అమ్మ, అర్జున్ ఒకే చోట పనిచేస్తున్నారు, ఎక్కడా అతనికి ఇల్లు దొరకకపోతే వాళ్ళ అవుట్ హౌస్ లోనే అద్దెకి ఉంటున్నాడు. హెలూయిజ్ పుట్టినప్పుడు చాలా బొద్దుగా ముద్దుగా భలే ఆకర్షణీయంగా ఉండేది, అర్జున్ కి కూడా వచ్చిన కొత్తలో స్నేహితులు ఉండేవారు కాదు కాబట్టి హెలూయిజ్ తో బాగా ఆడుకునేవాడు అలా హెలూయిజ్, అర్జున్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. హెలూయిజ్ వాళ్ళ అమ్మ దగ్గరికంటే అర్జున్ దగ్గరే ఎక్కువుండేది. అర్జున్ హెలూయిజ్ ని ఎత్తుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి అవుట్ హౌస్ లాన్ లో కూర్చుని కాసేపు ఆడుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే హెలూయిజ్ కి ఫ్రెంచ్ తప్ప మారె భాష రాదు అర్జున్ కి ఫ్రెంచ్ అర్థంకాదు అయినా వాళ్లిదరు మంచి ఫ్రెండ్స్ రోజు ఆడుకుంటారు, ఎవరో చెప్పినట్టు మనస్సులు అర్థమైతే మనిషికి భాష అవసరం లేదన్నట్టు, వీళ్ళ స్నేహానికి వయస్సు భాష పెద్ద అడ్డంకులు కాలేదు అదో సుందరలోకం జీవితంలో ప్రతిఒక్కరికి అలాంటి స్నేహం దొరికితే భలేబావుందనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. అలా ఆ బల్ల మీద ఇద్దరు కూర్చుని ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆల్బన్, హెలూయిజ్ అమ్మ వచ్చి స్కూల్ కి పంపాలని హెలూయిజ్తీ ని తీసుకెళ్ళిపోతే అర్జున్ వెళ్లి ల్యాబ్ కి బయలుదేరి వెళ్తాడు. 

ఆరోజు సాయంత్రం అర్జున్ కి ఒక ఫోన్ వచ్చింది అరె అర్జున్ చాల బోరుగా ఒంటరిగా ఉన్నట్టు మనస్సు అదోలా ఉందిరా ఈపరాయి దేశం లో ఒంటరితనాన్ని భరించలేకున్నా...ఈరోజు నీ రూమ్ కి రానా రేపు వీకెండ్ కదా కాసేపు సరదాగా కూర్చుందాం అంటున్నాడు కృష్ణా... అర్జున్ మిత్రుడు. సరే రా నేనుకూడా ఇంట్లోనే వుంటున్నగా అని ఫోన్ కట్టేస్తాడు. ఆదేశంలో ఎవరి భాధ వాళ్ళది పక్కవాడిని పట్టించుకోవాల్సిన అవసరం ఆప్యాయత వాళ్ళకి ఉండదు. మనదేశపు అనురాగానికి, ఆప్యాతలకి అలవాటైన కృష్ణ వుండలేకపోతున్నాడు అక్కడ చచ్చిపోవాలనిపిస్తుంటుంది అతనికి అందుకే అప్పుడప్పుడు అర్జున్ ని కలిసి మనకు ఒక ఆత్మ భందువున్నాడని సేదతీరి వెళ్తుంటాడు. కాలింగ్ బెల్ మ్రోగింది ఇంతలో అర్జున్ వచ్చి రా రా అంటూ లోపలి తీసుకెళ్లాడు, ఇల్లు చక్కగా అమర్చివుంది ఒకపక్క ఆపిల్ కంప్యూటర్ దాని పక్కలో యేవో రీసెర్చ్ ఆర్టికల్స్ వాటి మీద పచ్చ ఇంకు తో హైలైట్ చేసిన వరసలు కనిపిస్తున్నాయి. అలా తల కొంచెం పైకెత్తిచూస్తే ఎర్రటి రంగుతో హైలైట్ చేసి గెలిచినవాడి మాటే ఈ ప్రపంచం వింటుంది అని తెలుగు లో రాసుంది. ఇంకొంచెం పక్కలో సర్వకాల సర్వావస్థల్లోనూ నీ మనస్సును ఒకేలా ఉంచుకో అని రాసుంది. అబ్బో అన్నట్టు కృష్ణ గాడి కనుబొమ్మలు పైకి లేచుకున్నాయి ఏంటిరోయ్ ల్యాబ్ లోనే కాదు ఇంట్లో కూడా చాల చక్కగా వుంచుకున్నావ్ రా, అవునురా అర్జున్ ఏంటి ఇది గెలిచినా వాడి మాటే ఈ ప్రపంచం వింటుందని రాసావ్ అని అడుగుతుండగా, ఇదిగో ఆరంజ్ రసం తీస్కో అని ఇస్తాడు అర్జున్. ఇంతలో అర్జున్ కి ఇండియా నుంచి కాల్ వస్తుంది వాళ్ళ నాన్న, అమ్మ చాల సేపు మాట్లాడారు అర్జున్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినంతసేపు కృష్ణ అర్జున్ ని అలా గమనిస్తున్నాడు ఎన్నో రకాల బావ వ్యక్తీకణలు కనిపిస్తున్నాయి అతని మోహంలో. అర్జున్ ఫోన్ పెట్టగానే ఏమయిందిరా ఏంటి అమ్మ నాన్న ఏమంటున్నారు అని అడిగాడు, ఏముంది నా పెళ్లిగురించిరా ఇంకా ఎన్నిరోజులని అడుగుతున్నారు. మరేం హాయిగా చేసుకోవచ్చుగా అంటుంటే ఆ టాపిక్ వదిలేయ్ రా ఇంకేదైనా మాట్లాడదాం అంటుంటే ఇంక వీడు చెప్పేలా లేడని సరే రా నేను మంచి బోర్దు వైన్ తీసుకొచ్చాను అలాగే నీకిష్టమైన సాల్మన్ ఫిష్ తీసుకొచ్చాను కానివ్వు వేపుడు చేస్కుని వైన్ సిప్ చేదాం అని అంటే సరే అని వంట కానిస్తారు  ఇద్దరు. అప్పటికే సాయంత్రమయ్యింది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇద్దరూ లాన్ లో ఆపిల్ చెట్టుకింద కూర్చున్నారు ఒక ప్లేట్ లో ఎర్రగా కాలిన సాల్మన్ ఫిష్ మరొక గాజు గలాస్ లో ఎర్రటి రంగులో వైన్ ఇద్దరూ చిన్నగా సిప్ చేస్తూ యేవో రీసెర్చ్ విశేషాలు మాట్లాడుకుంటున్నారు అలా కొంచెం సగం వైన్ బాటిల్ అయ్యాక కృష్ణ ఏందిరా అర్జున్ మధ్యాహ్నం పెళ్లిగురించి మాట్లాడితే ఆ టాపిక్ తీసుకురావద్దన్నవ్ ఏమైంది మైండ్ దొబ్బిందా నీకు అన్నాడు. అర్జున్ మొహం రక రకాలుగా భావాలని వ్యక్తీకరిస్తుంది కళ్ళు చెమ్మగిల్లాయి. ఎప్పుడు హుందాగా స్థితప్రజ్ఞుడిగా కనిపించే అర్జున్ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కృష్ణ తట్టుకోలేకపోయాడు ఏమైంది ఏమైంది రా అని అడుగుతుంటే ........

రేయ్ కృష్ణ నేను ఇంతవరుకు ఎవ్వరితో చెప్పనిది చెప్పకూడదనుకున్నది చెప్తా విను, మాది చిత్తూర్ దగ్గర్లో చిన్న పల్లెటూరు, మీరంతా అనుకునేట్టు మా రాయలసీమలో రాళ్ళూ మాత్రమే ఉండవని నువ్వు మావూరొస్తే అర్థమౌతుంది రా నీకు. చక్కటి పొలాల మధ్యలో చిట్టి వూరు రా మాది వూరు మొత్తం యాభై గడపలు ప్రతి ఇంటికి ఒక చిక్కుడు చెట్టు, కొబ్బరి చెట్టు, ఒక జామ చెట్టు, పెరట్లో మల్లి చెట్టు తప్పని సరిగా ఉంటాయి అది మావూరి ఆచారం. ఊరి కి పైన వినాయకుని గుడి పక్కలో పిల్లలాడుకోడానికి ఆటస్థలం. వూరికి కింది భాగంలో ఒక పాత రామాలయం వుంది అందులో ఇప్పుడు ఎవరు పూజలు చెయ్యరు కానీ పొద్దున సాయంత్రాలు మాత్రం పెద్దలు చిన్నలు కూర్చుని యేవో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఆ పాత రామాలయం పక్కనే నా సీత ఉండేది రా అలా అంటున్నప్పుడు అర్జున్ కళ్ళలో మెరుపు అంతలోనే నీరసం కనిపించాయి. సీతంటే నాకు ప్రాణం రా దానికి అంతే అనుకో నేనంటే పిచ్చి, అది నీలం రంగు లంగా పింక్ రంగు ఓని వేసుకొస్తుంటే, ఆ ముఖం ఆచం సీతాదేవిలా మెరిసిపోతుండేది. మేమిద్దరం పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం కానీ దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచారం అనిచెప్పి పైచదువులకి పంపించలేదు. అది రాలేదని నేను కూడా పైచదువులకి వెళ్లడం ఇష్టం లేదని ఆ సంవతసరం మొత్తం మా గేదెలు కాసుకోడానికి వెళ్ళేవాడిని అలాగైతే సీత నేను ఇద్దరం మళ్ళా గేదెల్ని కాచే నెపంతో కలవచ్చని. ఒకరోజు ...... మా పాత రాములోరిగుడి దగ్గర కూర్చుని దినపత్రిక చదువుతున్నా ఆకుపక్కనే ఇంటికి పాలుపోసుకుని వెళ్తున్న నా సీత కన్నుగీటి అలా కళ్ళతోటే ఈరోజు మేము ఎక్కడకలుసుకోబోతున్నాం చెప్పేసింది. మా ఊరి పైన గుట్టవుంది దాన్ని బోధగుట్ట అంటారు బోధగుట్ట పైన రెండు పెద్ద పెద్ద  గుండ్లు ఉంటాయి ఆ గుండ్లకి మధ్యలో కింద బాగాన ఇద్దరూ మనుషులు మాత్రమే పట్టే స్థలం ఉంటుంది అది ఎవ్వరికి తెలియదు నాకు నా సీతకి తప్పా. అలా పొలాలపైనా గేదెలని వొదిలి నేను మా రహస్య స్థలాన్ని చేరుకుని నా నా సీతకోసం వేచి చూస్తున్నా అతృతతో ఎందుకు ఇక్కడికి రమ్మందో ఏమిటో అని. ఇంతలో ఎదో అలికిడి కచ్చితంగా అది నా సీతనే వచ్చిరాగానే బావ నాకొక మాటిస్తావా అంటుంటే ఏమైంది నీకు ఏమైంది అని అడిగాను ఆందోళనతో నాకో మాటిస్తావా లేదా అని అడిగితే నా ప్రాణాలే ఇచ్చేస్తానే ఈ మాటో లెక్క ఇచ్చాను పో అన్నాను. ఇంతలో గుండెపగిపోయే మాటొకటి చెప్పింది నా చెల్లెల్ని పెళ్ళిచేస్కోబావ మాటివ్వు అని నాచెయ్యి తీస్కుని దాని చెయ్యిలో పెట్టి అడుగుతుంది. నాకు మంట నషాళానికెక్కింది అదేమో నవ్వుతుంది. ఏంటే పిచ్చిదానా తిక్కల తిక్కల గా మాట్లాడుతున్నావ్ అంటుంటే అది మీద మీదకొచ్చి నన్ను కవ్విస్తుంది తిక్క నాశనం  అని కోప్పడబోతే నవ్వి నన్ను దగ్గరికి తీసుకుని బావ నిన్న రాత్రి టీవీ లో మహాభారతం ధారావాహికం చూస్తున్నా అందులో భీష్ముడు అంపశయ్యమీద పడుకున్నాడు అప్పుడు కృష్ణుడు వచ్చి నీకేంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు భీష్ముడు నాకొక కూతురుంది దాన్ని పెళ్లిచేసుకో కృష్ణ అని అడుగుతాడు, కంగుతిన్న కృష్ణుడు మీరు ఆజన్మ బ్రహ్మచారి కదా మీకు కూతురెక్కడిది అని అడుగుతాడు అప్పుడు గట్టిగా నవ్విన భీష్ముడు ఓ.. జగన్నాటక సూత్రధారి గందరగోళంలో నిన్ను నువ్వు దేవుడివని మర్చిపోయావు, సరేనయ్య చెబుతాను విను నా మనస్సే నా కూతురు నామనస్సుని నువ్వు పెళ్లిచేసుకో అలా చేస్తేనే నేను నా శరీరాన్ని వదులుతాను లేకుంటే వదలనంటాడు. చిరునవ్వు నవ్వి అలాగే అని మాటిచ్చాక భీష్ముడు శరీరాన్ని వదలిపోతాడు, ఆత్మ కృష్ణుడిలోకి కలిసిపోతుంది. ఇవన్నీ చూస్తున్న అర్జునుడు ఏమిజరుగుతుందో అర్థంకాక బావ ఏమిటిది అని అడగగా కృష్ణుడు ఆ సంఘటనని ఇలా వివరించాడు. అర్జునా భీష్మఆచారి ఆత్మని నేను నాలో ఐక్యం చేసుకుంటే అతను ఎల్లప్పుడూ నాలోనే ఉండి పోతాడు అతనికి వేరే లోకమే ఉండదు నన్నేతన జీవితం అనుకున్నాడు కాబట్టి నాలో ఐక్యమైపోవాలనుకున్నాడు ఇక ఎప్పటికి నన్ను ఆయన్ని ఎవరు వేరు చెయ్యలేరు అని అంటున్నప్పుడు నాకు ఇలా అనిపించింది బావ. నువ్వు నా చెల్లెలైన నా ఆత్మని పెళ్లిచేసుకో నేను ఎన్ని జన్మలకైనా నిన్ను వదలి ఉండలేను అలా అని మాటివ్వు అంటుంటే నన్ను ఇంతగా ఆరాధించే నా సీతని చూసి అలా నా కళ్ళు చమారిస్తూనే వున్నాయి. ఇంతలోనే తేరుకుని మీరు ఇలాంటి టీవీ సీరియల్స్ కూడా చూస్తారేంటీ అని కిత కితలు పెడుతుంటే, అప్పుడే ఎదో చప్పుడయినట్టైతే ఇద్దరం బయటకొచ్చాము ఇంతలో ఎవరైతే చూడకూడదో వాడే మా పక్కింటి దానకర్ణుడు చూసేసాడు. 

ఇద్దరం భయపడిపోయాం అనుకున్నట్టుగానే సాయంత్రం ఇంటికిపోగానే అమ్మ చీపురుతో రెడీగా ఉంది నాన్న లేడు, అమ్మదగ్గర చివాట్లు తిన్నాక భోజనం చెయ్యకుండా అలాగే పడుకున్నా ఎప్పుడో నాన్న వచ్చినట్టున్నాడు అమ్మ నాన్న గుస గుస ఎదో మాటాడుకుంటున్నారు. మరుసటిరోజు నాన్న నన్ను చావా బాదుతాడనుకున్న ఏమనలేదు దగ్గరకొచ్చి ఈసంవత్సరం నుంచి నువ్వు కాలేజీ కి వెళ్తున్నావ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నాన్నకి అర్థమైపోయింది నేను ఇన్నిరోజులు ఎందుకు కాలేజీ కి వెళ్ళలేదు అని. భయం తోనో భాధతోనో బిక్కు బిక్కుమంటూ తెల్లవారి పాత రాములోరి గుడి దగ్గరికి వెళ్ళాను నా సీత ఇంట్లో కూడా తెలిసిపోయిందో ఏమో అని అంత సాధారణంగానే ఉంది దానకర్ణుడు నా సీత ఇంట్లో చెప్పినట్టులేడు హమ్మయ్య అనుకుని ఇంటికెళ్లిపోయాను. మానాన్న బాగా పైచదువులు చదువుకోలేదు కానీ రామాయణ, మహాభారత భగ్వద్గీత లు బాగా చదువుకున్నాడు ఎప్పుడూ ఒక్కటి చెబుతుండే వాడు సర్వ కాల సర్వావస్థలయందును ఒక్కలాగే ఉండగలిగే వాడే జీవితంలో పైకొస్తాడని, దాన్ని అలాగే పాటించేవాడు మా నాన్న. ఆమరుసటి సంవత్సరం నుంచి నేను కళాశాల చేరిపోయాను చెలియని, చదువుని రెండింటిని సమపాలలో చదుతున్నాను. ఊరంటే చాలారోజులు ఏవిషయం గోప్యంగా ఉండడం చాల కష్టం అలా ఒకానొక రోజున మా ప్రేమ విషయం నా సీత ఇంట్లో తెలిసిపోయింది. 

దానకర్ణుడు నేను నా సీత కలిసి చదువుకున్నవాళ్ళమే వాడు పరుగున వచ్చి రేయ్ అర్జున్ మీరు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లి పెళ్లిచేసుకొండ్ర లేదంటే మిమ్మల్ని బ్రతకనివ్వరు అని వెళ్ళిపోయాడు, అవును నిజమే వాళ్ళు పరువుకోసం ప్రాణాలుతీసే రకాలు వాళ్ళు వాళ్ళ జాతి ఏమిచేయాలో పాలుపోవడంలేదు. ఎలాగోలా మా పక్కింటి పిన్నికి చెప్పి నా సీతని నరేష్గాడి చెరకుతోట దగ్గరకి రమ్మని చెప్పమన్నాను, నేను మా పక్కింటి పిన్ని మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆమెకి మావిషయం ముందే తెలుసు. ఎలాగో నా సీత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నుగప్పి వచ్చేసింది చెరకు తోట దగ్గరకి, మా ఇద్దర్ని అర్థం చేసుకోగల సంస్కారం, విజ్ఞేత వాళ్ళ వాళ్ళకి లేదు. ఇద్దర్లో ఎవరికి ఏమైనా ఇంకొకరు చచ్చిపోతాం ఇది నిజం. నేను నా సీత చేరుకుతోట మధ్యలో కి వెళ్లి ఏమిచేయాలో మాట్లాడుకుంటున్నాం ఇద్దరి కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది నా సీతయితే బోరున ఏడుస్తుంది నేను తనని ఓదారుస్తున్నా. రేయ్ కృష్ణ నేనొకటి చెప్పనా ఈ ప్రపంచంలో నిన్ను నిన్నుగా ఆరాదించేవాళ్ళు దొరకడం చాల కష్టం రా నేను ఏది చేసినా నా సీతకి పిచ్చే అది ఎలావున్నా నాకు ఆరాధనే మమ్మల్ని ఎవరూ  వేరు చెయ్యలేనంత ఆప్యాత అనుబంధం మాలో పెనవేసుకుపోయాయి రా. అలా మాట్లాడుకుంటుంటే హఠాత్తుగా ఎదో గొడ్డలి నా సీతమీద పడింది హడలిపోయాను సీత మేనమామ మమ్మల్ని కనిపెట్టేసాడు చంపడానికి చూస్తున్నాడు. సీతని విసెక్షనా రహితంగా గొడ్డలితో నరికేశాడు నాపైన దాడి చేసాడు నేను సీతను నా గుండెలకు హత్తుకుని వాళ్ళనుంచి తప్పించుకుని ఎంత దూరం పరిగెత్తానో నాకే తెలియదు, వాళ్ళు నన్ను పట్టుకోలేకపోయారు. నేను అలా పరిగెత్తి పరిగెత్తి వేరే వూరు చేరుకున్నా. ఇంతలో మమ్మల్ని ఎవరో అంబులెన్సు లో హాస్పిటల్లో చెరిపించారు. కొన్ని నెలలకి నేను కోలుకున్నా మా అమ్మ నాన్న తర్వాత వచ్చి చూసుకున్నారు ఆరోగ్యం కుదురుకున్నాక చాల కాలం నేను నేనుగా లేను ఇవన్నీ గమనిస్తున్న మా నాన్న నన్ను పిలిచి ఇలా మొదలెట్టాడు "మాత్ర స్పర్శస్తు కఔన్తేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యస్ తమ్ తితిక్షవ భారత" అంటూ అపి రేయ్ నాన్న అర్జున్ నిన్ను చూస్తుంటే ఏమైపోతావో అనిపిస్తుంది అయితే నేను ఇప్పుడు చెప్పిన శ్లోకం అర్థమేమిటో తెలుసా నీకు అంటుంటే తెలియదని తలూపాను. కష్ట సుఖాలనేవి ఎండాకాలం వానాకాలం లాంటివి వస్తూ పోతుంటాయి అయితే అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ మనం ఒకేలాగా ఉండాలి అప్పుడే నిన్ను స్థితప్రగుణుడంటారు అలంటి వారే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరు అంటూ... ఈ ప్రపంచెం గెలిచినవాడి మాటలని మాత్రమే వింటుంది నువ్వు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఎవరూ వినరు ఎవరూ ఖాతరు చెయ్యరు వెళ్లి సాధించు సాధించి చూపించు అప్పుడు అందరూ వింటారు. అలా నాన్న అంటుంటే బోరున ఏడుస్తూ నాన్నని గట్టిగా హత్తుకుని అక్కడినుంచి బయలుదేరిన నేను అలా చదువుకుంటూ ఇక్కడివరకొచ్చాను అంటుంటే కృష్ణ కంట్లో నీళ్లు, నీ.... సీత ఏమైంది రా అంటుంటే అర్జున్ ఫోన్ లో ఎదో మెయిల్ వచ్చి చూస్తాడు వాళ్ళ గైడ్…. సారాంశం ఏమంటే అర్జున్ చేసిన రీసెర్చ్ ప్రపంచంలోనే గొప్ప పబ్లికేషన్ లో పబ్లిష్ అయ్యింది రేపు మీడియా వస్తుంది ల్యాబ్ కి తొందరగా వచ్చే అనుంది. అర్జున్ ఆనందానికి అవధుల్లేవు ఎందుకంటే వాళ్ళు క్రెయూటీజ్ఫిల్డ్ జాకబ్ డిసీస్ కి దాదాపు మందు కనిపెట్టినట్టే. సరేరా పడుకుందాం అని ఇద్దరూ వెళ్లి పడుకుంటారు. మరుసటిరోజు అర్జున్ ల్యాబ్ కి వెళ్ళిపోతాడు అర్జున్ మీడియా సమావేశాల్లో బాగా బిజీ అయిపోతాడు. అయితే కృష్ణకి మాత్రం సీత ఏమైంది అనే ఆలోచన పట్టుకుంది గొడ్డలితో విసెక్షనా రహితంగా నరికేశారన్నాడు ఒకవేళ చనిపోయుంటుందా, ఏమైంటుందా చనిపోయుంటే వీడేందుకు పెళ్లిచేసుకొననుకుంటున్నాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడా ఇలా ఆలోచిస్తూ తనకలాడిపోతున్నాడు అర్జున్కి ఫోన్ చేదాం అంటే బిజీగావుంటాడని చెయ్యలేకపోయాడు. ఇంతలో అర్జున్ వాళ్ళ డ్రగ్ కి క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయ్యింది అర్జున్ ఆ విషయం కృష్ణకి చెప్పి అమితానందం చెందుతాడు. అర్జున్ ఈ సక్సెస్ తో ఇండియా కి వెళ్లాలని బయలుదేరుతాడు, అర్జున్ నేరుగా అపోలో హాస్పిటల్ లోకి వెళ్లి డాక్టర్స్ తో ఎదో మాట్లాడి సంతోషంగా బయటకి వస్తాడు. కొన్నిరోజులు అర్జున్ ఇంటిదగ్గరే ఉండి తాను కనిపెట్టిన డ్రగ్ గురించి అప్పొల్లో హాస్పిటల్ లో ఏవో చేస్తున్నాడు చివరగా చాలా సంతోషంగా మల్లా ఫ్రాన్సుకి తిరిగివస్తాడు. వచ్చి కృష్ణ ని కలుస్తాడు రేయ్ నువ్వేమనుకపోతే  ఒక్కటడగనా నీ సీత ఏమైంది రా అంటుంటే ఎప్పుడూ సీత పేరెత్తితే ముభావంగా మాట్లాడే అర్జున్ ఈసారి సంతోషంగా కనిపించాడు. ఆరే కృష్ణా... తన పేరు శిరీష బేగం రా తాను ఒక ముస్లిం నేను చిన్నపట్నుంచి ముద్దుగా సీత అనిపిలుచుకునేవాడిని అలాగే అలవాటైపోయింది. మా మతాలు వేరని వాళ్ళ ఇంట్లో చాల గొడవ వాళ్ళ అమ్మా యేమో సరేనని మిగతా వాళ్లంతా ఇద్దర్ని చంపుతామని ఇలా గడుస్తున్నప్పుడు మేమిద్దరం లేచిపోతున్నామని తెలుసుకుని ఇక చంపేయాలని నిర్ణయించుకుని అలా చేసారు. సరీగాని ఇప్పుడు ఆ రోజెమైంది ఇంతకీ సీతావుందా తనకి ఏమైందో చెప్పురా రేయ్, అలా హాస్పిటల్లో చేరాక సీత కోమా లోకి వెళ్ళిపోయింది రా ఒక సంవత్సరం రోజులు. తర్వాత కోమాలోనుంచి బయటకొచ్చాక నేను అమ్మ, నాన్న చాలా సంతోషించాము. వాళ్ళ ఇంట్లో వాళ్లకి మేము ఎక్కడున్నదీ తెలియదు లే, అయితే డాక్టర్ ఒక నిజాన్ని లేటుగా చెప్పాడు నా సీతకి సి జే డి ఉందని చాలా భయంకరమని. అప్పుడే నేను దీనిమీద రెఅస్ర్చ్ చెయ్యడానికి ఫ్రాన్స్ వచ్చాను, ఓరి నీయబ్బరెయ్ సీతకి ఎలావుందో చెప్పారా.... అర్జున్ నవ్వుతూ నాకష్టం ఫలించింది రా ఇప్పుడు సీత మాములు మనిషైపోయింది చాల సంతోషంగా వున్నా. నాకు ఇంకో డౌట్ రా అన్నిరోజులు అమ్మ నాన్నకి తెలిసేవరకు మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు, అప్పటికే ఎలాగో మేము ఎక్కడున్నామో కనుక్కుని మా దానకర్ణుడు మమ్మల్ని హాస్పిటల్లో ఉంచి జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ విషయాన్నీ ఎవరికీ తెలియనివ్వలేదు, వాడికి నేను ఎప్పుడు రుణపడివుండాలిరా. సరే రా కృష్ణా నీకోవిషయం చెప్పాలి ఈ నెల ఇండియా వెళ్లిపోతున్నా అంటుంటే కృష్ణ ఇండియా వెళ్లి ఏమిచెయ్యాలనో... నీ మొహం గాని సీత ని ఇక్కడికే తీసుకొచ్చేరా అంటుంటే ఆపి, లేదు రా నా పని అయిపొయింది ఇక్కడ. నేను మాఊరెళ్తున్నాను అక్కడ ఒక స్కూల్ నడపబోతున్నాను ….. అరే కృష్ణా  నీకు ఒక్కవిషయం చెప్పనా నువ్వు అతిశయోక్తి కాదనుకుంటే మనలాంటి శాస్త్రవేత్తలు ఆకాలంలో ఋషులతోసమానం రా. వాళ్లలాగే ఈరోజు మనం మన సమాజంలో జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నించాలి. ఎక్కడైతే సమాజం పరిపూర్ణంగా విద్యా వంతులని కలిగివుంటుందో అక్కడే మనోభావాల్లో పరిపక్వత ఉంటుంది నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికి రాకూడదంటే నేను ఈప్రయత్నం చెయ్యక తప్పదు. ఇకమీదట నేను నా స్కూల్ నా పిల్లలు, మన తరువాత సమాజాన్ని సక్రమంగా నిర్మించాలంటే నేడు నేను ఈపని చెయ్యాలి రా కృష్ణా, ఇప్పుడు నేను గెలిచాను కదా ఈసమాజంనామాటవింటుంది చూడు అంటూ సెలవు తీసుకుంటాడు.......

                                                                    

ఈశ్వర్ కుమార్ నాదెండ్ల 

   


Rate this content
Log in

Similar telugu story from Romance