Venkata Rama Seshu Nandagiri

Romance

5.0  

Venkata Rama Seshu Nandagiri

Romance

మధుర స్మృతి

మధుర స్మృతి

2 mins
1.7K


విజయ్ కారు దిగి లోనికి వచ్చేసరికి భార్య దీప్తి ఎదురొచ్చింది.

"ఏమిటీరోజు త్వరగా వచ్చారు?" అడిగింది నవ్వుతూ.

"తమతో కబుర్లు చెప్దామని." తనూ నవ్వుతూనే జవాబిచ్చాడు.

"ఫ్రెష్ అయి రండి. టీ తెస్తాను. అంటూ వంటగదిలోకి

వెళ్ళింది దీప్తి.

విజయ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి టీ స్నాక్స్ తెచ్చిపెట్టింది దీప్తి.

"దీప్తీ, మనం రేపుదయాన్నే మన ఊరు వెళ్తున్నాం. ఒక నాలుగు రోజుల కోసం బట్టలు సర్దు." అన్నాడు విజయ్, తను రిమోట్ చేతుల్లోకి తీసుకుంటూ.

ఆ మాటతో ముఖం విప్పారింది దీప్తికి. నిజమా అన్నట్లు చూసి ఆనందంగా పడకగదికి దారితీసింది దీప్తి. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నాడు విజయ్.

విజయ్, దీప్తిలది ఒకే ఊరు. ఒకే కాలేజీలో చదువు కున్నారు. ఒకరినొకరు ఇష్టపడి, చదువు పూర్తై విజయ్ ఉద్యోగం సంపాదించాక, పెద్దల ఆమోదంతో వివాహం చేసుకొని ఆనందంగా ఉన్నారు.

అనుకున్నట్లుగానే కారులో ఊరు చేరాక, దీప్తిని పుట్టింట్లో దించి తన ఇంటికి వెళ్ళాడు విజయ్. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ, దీప్తికి ఫోన్ చేసి సాయంత్రం నాలుగు గంటలకు రెడీగా ఉంటే బైటకు వెళ్దామని. అతను కోరినట్లుగానే సిద్ధమైంది దీప్తి.

అన్నట్లుగానే వచ్చి, అత్తమామల్ని పలుకరించి, దీప్తిని బైటికి తీసుకెళ్ళాడు విజయ్. తాము వచ్చిన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయింది దీప్తి. అది తాము చదువుకున్న కాలేజీ. పెద్ద ప్రాంగణం. బోలెడు చెట్లుచేమలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంతలో తామిద్దరికీ ముఖ్యమైన స్నేహితులంతా కోలాహలంగా వచ్చారు. ఆనందంగా అందరినీ పలకరించింది. ఆమ్మాయిలు దీప్తిని ఒక గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెని ఎంకిలాగా తయారుచేశారు.

"ఏంటిదంతా? వద్దు." అంటున్న దీప్తిని వారించి

"ఇదంతా విజయ్ ప్లాన్. పద." అంటూ బైటికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ నాయుడుబావ లాగా విజయ్ నవ్వుతూ ఉన్నాడు.

"ఏంటండీ ఇదీ." అడిగింది దీప్తి.

"సరిగ్గా ఈరోజుకి అయిదు సంవత్సరాలు మనం ఈ ఫాన్సీడ్రెస్ పోటీలో పాల్గొని. అందుకే ఆరోజు జ్ఞాపకంగా ఇలా, ఈరోజు." ఆన్నాడు విజయ్.

స్నేహితులంతా కోలాహలంగా అరుస్తూ వారిని ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ ఇద్దరినీ చెట్టుకింద నిలబెట్టారు.

"విజయ్, దీప్తీ, చక్కటి పోజివ్వండి. కలకాలం గుర్తుండాలి. ఆరోజు ఫొటో తీసుకొనే అవకాశం లేదు. ఇప్పుడు మన స్నేహితుల్లో మీరిద్దరే ఒకటయ్యారు. కాబట్టి ఫొటో తీస్తున్నాం. మీ ప్రేమనంతా ఒలకబోయండి." మిత్రుడు సురేష్ కెమరా సెట్ చేస్తూ అన్నాడు. మిగిలినవారంతా గట్టిగా చప్పట్లు కొడుతూ బలపరిచారు.

సిగ్గుగా విజయ్ ని చూస్తూ నిలుచుంది దీప్తి. కుడిచేత ములుగర్రను, ఎడమచేత ఆమె మోమును పట్టి ముద్దు ఇస్తున్నట్లుగా పోజిచ్చాడు విజయ్. స్నేహితుల హర్షధ్వానాలు మిన్నంటాయి. దీప్తి మోము మరింతగా కందిపోయింది. సురేష్ ఆ సన్నివేశాన్ని కెమరాలో బంధించాడు.

సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపి, మరో రెండు రోజులు ఇద్దరి ఇళ్ళల్లోనూ ఉండి , ఎన్నో

మధురానుభూతులను మూటగట్టుకొని తిరిగి వచ్చారు విజయ్ దీప్తీలు.


Rate this content
Log in

Similar telugu story from Romance