అతి జాగ్రత్త
అతి జాగ్రత్త


"ఏమండీ, మొహం కడిగారా! కాఫీ ఇస్తాను." రమణి కేకేసింది భర్త రామారావుని.
"ఉండవే, వస్తున్నాను. ఇదుగో ఇప్పుడే బ్రష్ కడగడమైంది. నా మొహం కడుక్కుని వస్తాను." బదులిచ్చాడు రామారావు.
'రామచంద్రా, కరోనా వచ్చినప్పటినుండీ చచ్చి పోతున్నాను. కడిగినదే కడిగి, తుడిచినదే తుడిచి చంపేస్తున్నారు.' అని విసుక్కుంది మనసులో.
"కాఫీ గ్లాసులో పోయనా" అడిగింది వచ్చిన భర్తను.
"ఆగు." మళ్ళీ ఆ గ్లాసు మంచినీళ్ళతో కడిగి ఇచ్చాడు రామారావు.
'దేవుడా. అడక్కుండా పోస్తే ఆ కాఫీ కూడా ఒంపేసే రకం.' అనుకుంది మనసులోనే రమణి.
ఆరోజు కూరగాయల షాపు దగ్గర చిన్ననాటి స్నేహితురాలు జయ కనిపించింది. కుశల ప్రశ్
నలు అయ్యాక తన భర్త చాదస్తం గురించి వివరించింది రమణి.
"అవునా! సరే. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గరకు తీసుకెళ్ళు. తప్పకుండా నయమౌతుంది." భరోసా ఇచ్చి అడ్రస్ ఇచ్చింది జయ.
మర్రోజు సాయంత్రం బైటికి వెళ్దామని చెప్పి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది రమణి. ఆయన దగ్గర తన గోడు వెళ్ళ బోసుకుంటూ "ఏం చెప్ప మంటారు డాక్టర్ గారూ, పళ్ళు తోమే ముందు బ్రష్ ని రుద్ది రుద్ది తోముతారు. స్నానానికి సబ్బు వాడేముందు ఇంకో సబ్బు తో కడిగి మరీ వాడుతారు." అని చెప్పింది రమణి బాధపడుతూ.
డాక్టర్ రామరావు ని టెస్టు చేయబోతుంటే "డాక్టర్, చేతులు శుభ్రంగా కడుక్కోండి ముందు." అన్న రామారావు మాటలకు రమణి తో పాటు డాక్టర్ కూడా అవాక్కయ్యాడు.