Bharathi Murthy

Drama Romance

4.3  

Bharathi Murthy

Drama Romance

ప్రేమంటే..ఇదే

ప్రేమంటే..ఇదే

2 mins
4.3K


ఏదో...ఆలోచనల్లో వున్న శరత్ గారు..వాళ్ళావిడ వీల్ చైర్ నుండి వచ్చిన బెల్ శబ్దం తో ఉలిక్కిపడి వెంటనే పడక గది నుండి వరండాలోకి పరుగు లాంటి నడక తో వచ్చారు..ఆవిడ ఆకలి వేస్తోంది అంది..వెంటనే ఫ్రిజ్ లో వున్న పిండి తీసి అట్లు వేసి ఇచ్చారు..30 సం..క్రితం వెన్నుపూస విరిగిపోవడం వల్ల అప్పటి నుండి ఆమె ఆ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు..

ఆవిడ పడుకుంటాను అంటే వెంటనే మంచం మీదకి జాగ్రత్తగా పడుకోబెట్టి..ఆమె నిద్ర పోయె వరకూ అక్కడే వుండి ఆయన ఆమెనే చూస్తూ... గతం అంతా గుర్తు చేసుకున్నారు..

శరత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు..ముగ్గురు అన్నదమ్ములు.తండ్రి రిటైర్డ్ govt ఉద్యోగి..అనుకోకుండా తల్లి అనారోగ్యంతో మరణించింది..శరత్ తండ్రి నీవు పెళ్లి చేసుకో..ఇంటికో ఆడ దిక్కు వుంటుంది..అని అంటే..అందరూ కలిసి పున్నమి జాబిలి లా అందమైన చందన నీ చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్ళారు..శరత్ స్వతహాగా నెమ్మదస్తుడు..సిగ్గూ జాస్తి..వాళ్ళ నాన్న అమ్మాయి నీ చూడు అంటె గానీ తల పైకి ఎత్తి చూడలేదు..ఒక్కసారి చుసాడో లేదో వెన్నెల్లో ఆడపిల్ల అని ఎక్కడో చదివాడు...కాదు..ఆ పండు వెన్నెలే.. ఈ డ పిల్ల అనుకొన్నాడు..ఆమెని తొలి చూపు లోనే చాలా ఘాడంగా ప్రేమించాడు..

ఇద్దరి ఇష్టాయిష్టాలు కనుక్కొని పెళ్లి తేదీ నిశ్చయించుకొన్నారు.అప్పట్లో ఫోన్ లు లేవేమో..ఎన్ని వుత్త రాలు,కవితలు రాశాడో లెక్కలేదు..ఆమె అంటే అంత ప్రేమ అతనికి.ఘనంగా పెళ్లి చేసుకొని ఆమె వాల్లింట అడుగుపెట్టింది..ఇక ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది..ఆమె అణకువ,ప్రేమ ,అభిమానంతో అందరి మనసుల్ని గెలుచుకుంది.తన భార్య కు అందమైన రూపమే కాదు..ఇంకా అందమైన గుణం కూడా ఉన్నందుకు సంతోషించాడు.

అలా సం..లు గడుస్తున్నాయి..మరుదులు పెళ్లిళ్లు,వీళ్ళకి పాప,బాబు పుట్టి..కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు..ఆమె కూడా స్కూల్ లో టీచర్ గా చేరింది.పిల్లల పుట్టిన రోజు లకు పుణ్య క్షేత్రం దర్శించుకోవడం,సెలవల్లో ట్రిప్ లతో హాయిగా గడుస్తోంది..ఇద్దరి మధ్యా ప్రేమ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బలపడుతూ వుంది.

సంతోషాలు చూస్తే విధికి కూడా అసూయే కాబోలు..ఆమె స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి వెన్నుపూస విరిగిపోయింది.. ఆపరేషన్ చేసిన కాళ్ళు,నడుము నుండి క్రింది భాగం స్వాధీనం కోల్పోయాయి.శరత్.. ఈ సంఘటన తో ఎంత కృంగిపోయాడో..వెక్కి వెక్కి ఏడ్చాడు..

చివరకు తానే సంభలించు కోని..నేనే ధైర్యం కోల్పోతే..ఆమె ఇంక ఏమైపోతుందో..అని అనుకొంటూ. నేను ఆమెని భార్యగా ఎంతో ప్రేమించాను..ఇప్పటి నుండి..ఇంకా ఎక్కువ ప్రేమ..ఒక తండ్రి లా ప్రేమించాలి.. ఈ పరిస్తితి నీ నేను ముందు స్వీకరించి,ఆమె స్వికరించేలా.. సన్నద్ధం చేయాలి..ఆమె జీవితంలో ఒక్కసారి కూడా ఏమిటీ దేవుడా ఈ జీవితం అని విరక్తి కలగకుండా కంటికి రెప్పలా చూసుకోవాలి..అని నిర్ణయం తీసుకొన్నాడు.

అతను ఆమెను తొలి చూపు లోనే ప్రేమించాడు..పరిస్థితులు తారుమారు అయితే వీగిపోయే ప్రేమ కాదు అది..ఆ ప్రేమ స్ఫూర్తి తోనే.ఆమెను అతను జీవితాంతం కూతురిలా కాపాడుకున్నాడు.

ఇంట్లో వంట ఇంటి పనికి మనిషి నీ పెట్టుకొని ఆమె పనులన్నీ అతనే చూసుకున్నాడు..అలాగే ఆమెకి ఒక లాప్ టాప్ ఇచ్చి చాల బ్లాగ్స్ రాయడం, motivational పుస్తకాలు చదివించడం..ఇలా ఆమె జీవన గమనాన్ని ఆమె స్వీకరించి,ప్రేమించే లా మార్చేశాడు.

ఇలా ఏళ్లు గడచాయి..పిల్లలు పెళ్లిళ్లు అయ్యి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు..వాళ్ళతో వుండమన్న..వాళ్ళకి భారం కాకూడదని వాళ్లింట్లోనే వుండి,వాళ్ళు ప్రేమించే పుస్తకాలు,ప్రేమించే తోట పని,ప్రేమించే సత్సంగం,ప్రేమించే సేవా కార్యక్రమాలు...వీటి తోనే వాళ్ళ ప్రేమ సామ్రాజ్యం అందరికీ ఆదర్శం అయ్యింది.

వంట ఆమె రాకతో గతంలో నుండి బయటకు వచ్చిన ఆయన నిద్ర పోతున్న ఆమె తలను సవరిస్తూ..నుదుటి మీద ముద్దు పెట్టుకొన్నారు..

అదే ప్రేమతో...ఆనాడు పెళ్లి లో అందరి ముందూ..పెట్టుకొన్న ప్రేమ తో కూడిన అదే..ముద్దు..జీవితాంతం నేను నీకు ఇదే ప్రేమ అందిస్తా అనుకొంటూ...నిద్ర పోతున్న ఆమె కళ్ళ నుండి నీళ్లు... ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకొంటూ..

అసలు ప్రేమ అంటే..ఇదే..వూహాలలో కాదు వూహించని పరిస్థితులు ఎదురైనా.. భాగస్వామి నీ ,ప్రేమని గెలిపించడం..స్ఫూర్తి నీ ఇవ్వడం..నిజమైన ప్రేమకు అర్థం..అదే ప్రేమ..


Rate this content
Log in

Similar telugu story from Drama