శ్రీ వారికి ప్రేమ లేఖ
శ్రీ వారికి ప్రేమ లేఖ


ప్రియమైన మీకు
శ్రీ వారికి...తీయనైన మన ప్రేమ గుర్తులను మీకు గుర్తు చేసి మళ్లీ మిమ్మల్ని ప్రేమలో పడే యాలని...ఆశ.
ఆమె కాలేజ్ లో చదివే రోజుల్లో ఒక అబ్బాయి తన క్లాస్ రూమ్ దాటుతూ...తనవైపే చూస్తూ...నవ్వుతూ వెళ్ళేవాడు.అతనీ కళ్ళల్లో ఏదో మెరుపు.నవ్వుతుంటే పట్ట పగలే వెన్నెల కురుస్తున్నట్టు....ఆమె మనసులో వేయి వేణువు లు మోగుతున్నట్టు...నవ్వు అచ్చం....నేలపొడుపు రోజు చందమామని చూసినట్టు.. అడగకుండానే...పారిజాత పుష్పాలు రాలినట్టై....
తానే స్వయంగా అతనికి తన ప్రేమ గురించి చెప్పాలని.... ఏం?చెప్పకూడదు అంటే ఎలా?దానికి కూడా పురుషులే ముందా? ఇక ధైర్యం చేసి ఓ కవితలో ప్రేమ అంతా వ్యక్తం చేసింది.
నీ చల్లని చూపు నా కనులకు వెలుగు
నీ తీయని నవ్వు నా పెదవులపై చిరునవ్వు
నీ చక్కని మాట నా గొంతుకు నేర్పిన సప్తస్వరాలు
నీ మధురమైన ప్రేమ నా మదిలో పలికే వేణు గానం.
దానికి కూడా నవ్వే సమాధానం..... మౌనం అర్థ అంగీకారం....మరి నవ్వు పూర్తి అంగీకారం కావచ్చు.
అది ప్రేమించే వయసో ... కాదో ఇద్దరికీ తెలియదు. పిల్లలకు తప్పు సంకేతాలు అందుతాయని ఆమె ఆ..పారిజాత సుగంధ పరమళాలను....తనలోనే దాచుకొని...ఆ ప్రేమ మధుర్యపు పరిమళం లో నుండి తన మనసు ...వయసు తిరిగి రానని.. రాలేనని మారం చేస్తుంటే.. కాలేజ్ లో క్లాస్ రూం లోకి వెళ్ళే దారిలో నేలంతా పసుపు రంగు గడ్డి పూలు తివాచీ లా పరచు కొనేవి... తానే స్వయంగా ఆ తివాచీ పరచినట్టు గా మురిసిపోయే ది.ఏం...అబ్బాయిలే వర్నిన్చాలని....లేదుగా.
కొన్నాళ్ళకు వాళ్ళ పెళ్లి పెద్ద ఆశీస్సులతో ఘనంగా ఆయింది.జీవితం అంటే వర్నించినంత్ సులువేం కాదు..ఏదైనా స్వీకరించే గుణం...పరిస్థితికి తగిన తెలివి ముఖ్యం...వుత్తర దక్షిణ లాంటి ఆలోచనలు... వుత్త లౌక్యం తెలియని మ నిషి.... అతని అర్థం చేసుకొని...ఏం...అతను అతని లనే వుంటారు...నా మాట వింటే కరెక్ట్...లేకుంటే worng అనే... రూల్స్ ఏమి లేదు కదా!
ఏదైనా వాదన వస్తే ప్రో లాంగ్ చేసే ఆమె ప్రవర్తన మార్చుకొని...ఇద్దరి బలహీనతలు, బలా బలాలు ఇద్దరూ ఆక్సెప్ట్ చేసుకొని జీవించడం....ఆ ప్రేమలో నిజమైన విజయం.
ఇప్పటికీ పెళ్లి అయ్యి 2దశాబ్దాల కు దగ్గర పడుతున్నా..ఇప్పటికీ..ఎప్పటికీ వాళ్ళ బంధం శాశ్వతమైన అనురాగబంధం. ఎందుకంటే...అతను అన్నట్టు...ఇది ఏడు జన్మ ల బంధం.
అందుకే ఆమె తన అచంచలమైన ప్రేమ విశ్వాసంతో... అతని మనసు గెలుచుకుంది...అతను అతని అనురాగం భరోసా తో ఆమెనే గెలుచుకున్నాడు.
ఈ లేఖ అంతా చదివి ఏదో కథ చెప్తున్న అనుకునేరు..ఇది మన ప్రేమ కథ...మనల్ని మళ్లీ ఆ ప్రేమ పరిమళ లాల మధుర క్షణాలలో కి తీసుకెళ్లే ప్రేమ పల్లకి.ఆ పల్లకి లో విహరిస్తూ.. ఎప్పుడూ కొత్తగా సరికొత్తగా జీవించాలనే...రాస్తున్న....మీకు ఈ ప్రేమ లేఖ...
ఇట్లు...
మీ ప్రేమ దాసి