Varun Ravalakollu

Drama Romance

4.8  

Varun Ravalakollu

Drama Romance

డేంజరస్ లైఫ్-7

డేంజరస్ లైఫ్-7

3 mins
566


" నేను ఇది వదిలి రాలేను విన్నీ " చెప్పేసాను ఆరోజు తనకి ఫోన్లో.

అంతే మా మధ్య మళ్ళీ అగాథం. నేను భాను అని, బావ అని, తను మర్చిపోయింది.

ఒక జర్నలిస్ట్ గా నా గురించి, మా గ్యాంగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి చాలా విషయాలు, ప్రూఫ్స్ సేకరించింది. అవి వాళ్ళ పేపర్ లో ప్రింట్ అయ్యేవి. విన్నీ చాలా గట్టిది. మా గ్యాంగ్ తో ఆపలేదు. మాకు హెల్ప్ చేసిన పొలిటిషన్స్ ని, వాళ్లకు సపోర్ట్ చేసిన మినిస్టర్స్ ని అందరి గురించి నిజాలు బయటకు లాగి పబ్లిష్ చేసేది. తనో తలనొప్పిగా మారింది మా వాళ్ళకి..

ఇంకెవరైనా అయితే రివెంజ్ ప్లాన్ చూసుంటాం. బట్ అది విన్నీ కనుక నేను తనపై ఈగ కూడా వాలనివ్వలేదు. ఒక ఆడ పిల్ల అయ్యుండి ఒక మాఫియా గుట్టు బయట పెట్టినందుకు తనకు ఎన్నో అవార్డ్స్, ప్రశంసలు వచ్చాయి.

నిజాన్ని ఎంతో కాలం దాచలేం. ఈ న్యూస్ వల్ల నేను క్రిమినల్ అన్న సంగతి మా ఫ్యామిలీలో కూడా తెలిసిపోయింది. మా మామయ్య మేటర్ మాత్రం తెలియదు. మామయ్య పోయాక అప్పులతో ఆర్థికంగా కుంగిపోయిన విన్నీ ఫ్యామిలీకి మా పేరెంట్స్ ఏ హెల్ప్ చేసారు. విన్నీకి వేరే దారిలేక తీసుకుంది. అది మా పేరెంట్స్ రిటైర్మెంట్ మనీ కాబట్టి.. నా డబ్బు అయితే అసలు ముట్టుకుని ఉండదు.. ఆ కృతజ్ఞతతో నేను క్రిమినల్ అని తెలిసినా.., మా అత్త విన్నీని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకుంది. పెళ్లి అయ్యాక మారతా అనే నమ్మకంతో. పిచ్చి అత్తయ్య !!

విన్నీకి మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్లో.. నా నేరాలు అన్ని ఇంకా బాగా తెలిసాయి. డైరెక్ట్ గా మేమ్ చేయకపోయినా, ఎన్నో దారుణమైన ఇన్సిడెంట్స్ లో ఇండైరెక్ట్ గా మా హస్తం ఉంది అని తెలిసింది. దాంతో నన్ను ఇంకా అసహ్యించుకోవడం స్టార్ట్ చేసింది.. అందులో ఈ పెళ్లి ఫిక్స్ అవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లైనది.

మా పెళ్లి ఫిక్స్ అయినా రోజే చెప్పింది విన్నీ.. " ఈ ప్రాబ్లెమ్కి సొల్యూషన్ నీ చావే బావ. నిన్ను చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నేను. మన పెళ్లి అయినా కూడా. సొసైటీని నాశనం చేసే నీ లాంటి వాడికి భార్యగా ఉండడం కన్నా widow గా ఉండడమే బెటర్. ఎలాగో నేను వేరే వాడ్ని పెళ్లి చేసుకోలేను. నా మనసు ఒప్పుకోదు. సో ఇదే బెటర్ " అని.

ఏదో కోపంలో అంటుంది విన్నీ. పెళ్లి అయితే అన్ని సర్దుకుంటాయి అనుకున్న. కానీ అప్పటి నుండి విన్నీ నిజంగా నన్ను చంపడానికి ప్రయత్నించేది. నేను చావను అని విన్నీకి తెలుసు. కానీ దేవుడి రాతనే ఎదిరించి పోరాడుతుంది తను.

నన్నేం చెయ్యలేక అప్పోజిట్ గ్యాంగ్ వాళ్ళు విన్నీని kidnap చేసారు. ఊరికి దూరంగా ఒక చోట కట్టేసి బెదిరిస్తూ నాకు ఫోన్ చేసారు. తనని కాపాడుకోడానికి వెళ్ళాను నేను. ఆ హడావిడిలో మా గ్యాంగ్ కి ఫోన్ చెయ్యకుండా ఒంటరి గా వెళ్ళా. అక్కడ గొడవ, షూటింగ్ ఇదంతా నాకు మాములే.

విన్నీని కట్ల నుండి విడిపించ. ఈసారి ఆ గ్యాంగ్ వాళ్ళు బాగా ప్రిపేరేడ్ గా వచినట్లున్నారు. నాకు ఎదుర్కోవడం కష్టం అయ్యింది. స్లోగా ఒకడు నన్ను పట్టుకుని కట్టేసాడు. కానీ ఉన్నటుండి పోలీస్ వస్తారనే ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు నన్ను అలానే వదిలేసి వెళ్లిపోయారు.

అప్పుడు అక్కడ పడిపోయి ఉన్న గన్ తీసుకుంది విన్నీ... నా బాడీలోకి 5 బుల్లెట్స్ కాల్చింది.

కట్ చేస్తే ఇలా హాస్పిటల్లో ఉన్న.

నా లైఫ్ అంత ఈజీ కాదు. నాకు చావు రాదు అంతే. నొప్పి తెలుస్తుంది. బాధ ఉంటుంది. ఎన్నో సార్లు బులెట్ గాయాలు తిని హాస్పిటల్లో చేరి డాక్టర్స్ నా బాడీని గుచ్చి గుచ్చి పెడుతూ ఉంటె ఆ నొప్పి వర్ణనాతీతం.. నాతో కలిసి అంతకు ముందే టీ తాగినవాడు నా కళ్ళ ముందే శవం పడితే ఆ బాధ చెప్పలేనిది.

కానీ అన్ని బులెట్ గాయాలు కలిగించని బాధ విన్నీ " చచ్చిపో " బావ అన్నప్పుడు కలిగింది. ఒక్కప్పుడు నాకు చిన్న జ్వరం వస్తేనే విలవిలలాడిపోయేది. ఇప్పుడు ఇలా...

ఇన్ని రోజులు చంపాలని ట్రై చేసేది. కానీ ఇవాళ నోరు తెరిచి చచ్చిపో బావ అందంటే..తను నిజంగా నా చావు కోరుకుంటుంది.

కన్న తల్లే తన కాబోయే కోడలికి నేను మంచోడ్ని కాను అని చెప్తుంది..

కన్న తల్లే నన్ను తన కర్మగా భావిస్తోంది..

పది రోజుల్లో కాబోయే భార్య, నా చావు కోరుకుంటుంది.

ఇన్నేళ్లుగా ప్రేమించిన విన్నీ ఇప్పుడు నన్ను ద్వేషిస్తోంది.

ఆ క్షణంలో నాకు అనిపించింది, నేను చచ్చిపోతే బాగుండు అని..

**THE END**



Rate this content
Log in

Similar telugu story from Drama