Varun Ravalakollu

Action Crime Thriller

4.5  

Varun Ravalakollu

Action Crime Thriller

డిటెక్టివ్-2

డిటెక్టివ్-2

4 mins
721


"బేవకూఫ్..నీకళ్ళకు మేమెలా కనిపిస్తున్నాం?కోపంగా అన్నాడా వ్యక్తి "బేవకూఫ్స్ లానే కనిపిస్తున్నారా "అనాలనుకుని అంటే మళ్ళీ చెంప చెళ్లుమనిపిస్తారని డౌటొచ్చి ఆ ప్రయత్నమే విరమించుకుని "చెంప రుద్దుకుంటూ"పానీపూరి గురించి అతడడిగితే నన్నెందుకు కొడతారు? వెళ్లి ఆయన్ని కొట్టండీ..."ఉక్రోషంగా అన్నాడు.


"నిన్ను కొట్టిందికి అందుక్కాదు"ఆ నలుగురు ఒకేసారి అన్నారు. "మరి టైం పాస్ కోసం కొట్టారా?కోపంగా అడిగాడు జేమ్స్ "నేను చెబుతాను భయ్యా"అని వినిపించింది.ఆ నలుగురితో పాటు జేమ్స్ కూడా ఆ మాటలు వినిపించిన వైపు చూసారు.


ఒక్కసారిగా ఎవరో ఆ గోడౌన్ షట్టర్ పైకెత్తినట్టు బయట నుంచి వెలుతురు లోనికి వచ్చింది..ఆ వెలుతురులో ఓ మనిషి నీడ కనిపిస్తుంది. తర్వాత షట్టర్ వేసిన చప్పుడు. "ఎవరూ ....కౌన్ హై ? ఆ నలుగురు అగంతకుల్లో ఒకడడిగాడు 'తెలుగులో చెప్పాలా?హిందీలో చెప్పాలా?"అంటూ ఆ వెలుతురులో నుంచి ఆ అపరిచిత వ్యక్తి ముందుకు వచ్చాడు... "సర్ మీరా ?ఆశ్చర్యంగా అన్నాడు జేమ్స్ చేతిలో ఒక పేపర్ కప్..అందులో పానీపూరి ..ఒక పానీపూరి నోట్లో వేసుకుని "ఏమాటకామాటే చెప్పుకోవాలి..హైద్రాబాద్ బిర్యానీకి ఎంత పేమసో పానీపూరీకీ అంతే ఫేమస్."అన్నాడు. ఆ నలుగురు ఆగంతకులు విస్తుపోయి చూసారు.


"సర్ నన్ను వీళ్ళు ఎత్తుకొచ్చారు...ఎందుకెత్తుకొచ్చారో చెప్పమంటే మెంటల్ ప్రశ్నలు అడుగుతున్నారు"జేమ్స్ అన్నాడు...ఏడుపు గొంతుతో . అతను జేమ్స్ దగ్గరికి వచ్చి కుర్చీకి కట్టిన కట్లు విప్పబోతుంటే నలుగురు ముందుకు వచ్చారు... అతను వాళ్ళవైపు చూసి"అసలు మీ ప్రాబ్లెమ్ ఏమిట్రా? నేనేం మాట్లాడానో తెలుసుకుండమనేగా..నేను చెబుతాను..పాపం ఈ డ్రైవర్ భయ్యాను ఎందుకు కట్టేసారు ?అని కట్లు విప్పేసి అదే కుర్చీలో కూచోని పానీపూరి తింటూ ఆ కప్పు ముందుకు పెట్టి ఇంకా రెండున్నాయి..కావాలంటే మీ ఇద్దరిలో ఎవరో ఇద్దరు తినండి .."అన్నాడు కామ్ గా . ఆ ఆగంతకులకు మొదటిసారి పిచ్చెక్కిన ఫీలింగ్ కలిగింది. ఎంత కూల్ గా తమ ప్లేస్ కు వచ్చి పానీపూరి తింటూ... జేమ్స్ అతని వంకే చూస్తూ"సర్ నాకు బాండ్ సినిమా తెలుగులో చూస్తున్నట్టు వుంది... అసలు ఇదంతా ఏంటి సర్? ఆశ్చర్యం అనుమానం రెండూ మిక్సయ్యాయి అతని గొంతులో . "నీకు మూడుముక్కల్లో చెబితే అర్ధమయ్యే మేటర్ కాదు జేమ్స్...ముందు మనం బయటకు వెళాం పద..మరో పది గప్ చుప్ తింటే కానీ ఆకలి చల్లారదు ..అంటూ జేమ్స్ ను తీసుకుని బయటకు నడవబోతుంటే నలుగురూ రౌండప్ చేసారు. నలుగురి చేతుల్లో నూ రాడ్స్ వున్నాయి. వాళ్ళ వైపు చూసి తిరిగి జేమ్స్ వైపు చూసి తన చేతిలోని పానీపూరి పేపర్ కప్ జేమ్స్ కు ఇచ్చి.."నువ్వు ఈ రెండింటినీ లాగించు.నేనో రెండు నిమిషాలు వీళ్ళతో మాట్లాడి వస్తాను.." అన్నాడు. జేమ్స్ కన్ఫ్యూషన్ లోనే వున్నాడు..బయటకు నడుస్తుంటే షట్టర్ వేయి, వీళ్లతో మాట్లాడొచ్చి నేను ఓపెన్ చేస్తాను..."అన్నాడు. జేమ్స్ బయటకు వెళ్లి షట్టర్ వేసాడు.. సరిగా రెండునిమిషాల తర్వాత లోపలి నుంచి షట్టర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు అతను.... జేమ్స్ పానీ పూరి కప్ అలాగే పట్టుకుని వున్నాడు.."ఏంటి రెండు నిమిషాలంటే రెండే నిమిషాల్లో వచ్చారు...వాళ్లకు ఏంచెప్పారు? అడిగాడు జేమ్స్ నవ్వి చెప్పాడు అతను "నిజం చెప్పాను" నీకు ట్రబుల్ ఇచ్చాను...సారీ భయ్యా ...అన్నాడు అతను... "పర్లేదు సర్ ఇప్పుడు నేను నా క్యాబ్ దగ్గరికి వెళ్ళాలి..ఈపాటికి ట్రాఫికోళ్ళు తీస్కెళ్ళిపోయుంటారు... అన్నాడు బాధగా... అటుచూడు భయ్యా...అన్నాడతను అటుచూసి షాకయ్యాడు జేమ్స్.. తన క్యాబ్.. "నేనే అక్కడెందుకని నీ క్యాప్ తీసుకొచ్చా" అలానే చూస్తూ వుండిపోయాడు. అయినా కార్ కీస్ తన దగ్గరున్నాయి.. అదే విషయం అడిగాడు..నవ్వి భుజం తట్టి "జేబులోని పర్స్ తీసి రెండువేల రూపాయల నోట్లు ఐదు ఇచ్చి "ఇవి నాకోసం వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నందుకు" అంటూ ముందుకు నడిచాడు. అప్పుడే అతని పక్కన ఓ కార్ వచ్చి ఆగింది. అందులో ఎక్కాడు అతను..


*****


భోజనం చేసి అర్ధరాత్రి టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసి షాకయ్యాడు డ్రైవర్ జేమ్స్. "ఊరి చివర వున్న పాడుబడిన గోడౌన్ లో నలుగురు పేరుమోసిన గ్యాంగ్ స్టర్స్ తీవ్రమైన గాయాలతో చావుబ్రతుకుల్లో వున్నారు... ఈ నలుగురి మీద రౌడీ షీట్ కూడా వుంది...పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు... ఆ నలుగురి ముఖాలు ... ఆ గోడౌన్ చూపించారు. తనను బంధించిన గోడౌన్.. తనను పట్టుకెళ్లిన ఆగంతకులు... చావుబ్రతుకుల్లో తీవ్రమైన గాయాలతో...


***


రెండునిమిషాల్లో అతనేం చేసాడో అర్ధమైంది.కానీ అదెలా సాధ్యమైందో అర్థం కాలేదు. కేవలం సినిమాల్లోనే చూసాడు.అతను చెప్పిన నిజం ఏమిటి?ఇంతకూ అతనెవరు? ఆలోచనలతో జేమ్స్ బుర్ర వేడెక్కిపోయింది. అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇంకా పూర్తిగా తెల్లవారాక ముందే.... ఉదయం నుంచి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి.పొద్దునే తన భార్య తనని హడావుడిగా నిద్రలేపడం గుర్తుంది.తను నిద్రమొహంలోనే అడిగాడు"విషయం ఏమిటని? "డేవిడ్ అన్నయ్య మీకోసం బయట నిలబడ్డాడని చెప్పింది..."తను దిగ్గున లేచాడు. నిద్రమత్తు ఎగిరిపోయింది. ఎందుకంటే..."డేవిడ్ రెండురోజుల క్రితమే కారు ఆక్సిడెంట్ లో చనిపోయాడు..పుట్టింటి నుంచి రాత్రే వచ్చిన భార్యకు ఆ సంగతి చెప్పలేదు..." " వెళ్ళండి ... ఇంత పొద్దున్నే డేవిడ్ అన్నయ్య మనింటికి వస్తే "పనీపాటా లేదా అన్నయ్యా..మా ఆయన్ని చెడగొట్టడానికి ..అని నేను తిడతానని బయటే వున్నాడు....రాత్రి జీసస్ కనిపించి ఎవ్వర్నీ నిందించవద్దు.. నొప్పించవద్దు"అని చెప్పారు...లోపలి రమ్మనండి..కాఫీ తాగి వెళ్తాడు "అంది ఒక్కక్షణం జేమ్స్ మనసు చివుక్కుమంది. "డేవిడ్ ఈ మాటలు వింటే చాలా సంతోషించేవాడు...ఒక్క తాగడం తప్ప మరే దురలవాటు లేదు..అ.అందుకే తన భార్య లోపలికి రానివ్వదు.. అయినా రెండ్రోజుల క్రితమే తను తాగుడు మానేస్తున్నట్టు చెప్పాడు..అంతలోనే ఆక్సిడెంట్...చిన్నచిన్న తప్పులను క్షమించినా...ఓర్పును వహించినా ద్వేషాన్ని విడిచి ప్రేమను పంచినా ప్రపంచ పచ్చదనపు మానవత్వంతో పచ్చగా ఉంటుంది. అనుకున్నాడు. విచిత్రమేమిటంటే డేవిడ్ మందు మానేసాడు...మానేసిన రెండో రోజే ఆక్సిడెంట్ లో చనిపోయాడు. భార్య లోపలికి వెళ్ళింది..జేమ్స్ మెదడు పనిచేయడం మానేసింది....కొద్దిక్షణాలు. డేవిడ్ భార్యకు కనిపించడం ఏమిటి? జేమ్స్ కు కొన్ని నమ్మకాలున్నాయి. కొన్నింటికి లాజిక్కులు ఉండకపోవచ్చు. మరికొన్ని లాజిక్కులు దొరికేవరకు నిలబడకపోవచ్చు...ఒక రచయిత రాసిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు...


"మనల్ని భయపెట్టే వాటిని లాజిక్కు వున్నా వదిలేయండి.. నమ్మకం కన్నా నిజం కన్నా ..మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. మనల్ని భయానికి లోనుచేసే ..అభద్రతాభావాన్ని కలిగించే విషయాలను వదిలేయండి..." నిజమే కానీ ఇప్పుడు రెండు విషయాలు అతడిని ఆలోచింపజేస్తున్నాయి... చనిపోయిన డేవిడ్ భార్యకు కనిపించడం... ఒక మామూలువ్యక్తి కోసం పేరుమోసిన రౌడీలు రంగంలోకి దిగడం రెండే నిమిషాల్లో వాళ్ళను ఘోరంగా గాయపరచడం.... అతని ప్రశ్నకు సమాధానం దొరకడానికి ఆలోచనల చీకటితెరలు తొలిగిపోవాలి చీకటితెరలు తొలగక ముందే...పడగ్గది కిటికీ తలుపు వేయబోతూ ఉలిక్కిపాటుతో వణికిపోయాడు.. కిటికీ అవతల..తన ఇంటి ముందు...తనవైపే చూస్తూ డే...వి...డ్ భయం అనుమానం రెండూ ఏకకాలంలో కలిగాయి జేమ్స్ లో... తాను చూస్తున్నది డేవిడ్ నేకదా ? డేవిడ్ డెవిల్ లా మారాడా? చచ తన ఆలోచన తనకే ఏదోలా అనిపించింది ఇలాంటి విచిత్రమైన సంఘటనలు తనకే ఎదురవుతున్నాయా? బుర్ర హీటెక్కిన ఫీలింగ్ .. వెంటనే అక్కడి నుంచి కదిలాడు....


(ఇంకా వుంది)



Rate this content
Log in

Similar telugu story from Action