Varun Ravalakollu

Action Crime Thriller

4.6  

Varun Ravalakollu

Action Crime Thriller

డిటెక్టివ్-4

డిటెక్టివ్-4

3 mins
718


“ష్యూర్ ష్యూర్ ముందు మనం మేటర్ కు వద్దాం "అంది యాంకర్ "ముందు చల్లని వాటర్ తెప్పించండి..మినరల్ వాటర్..."చెప్పాడు సిద్దార్థ లైవ్ లో ఇదంతా టీవీల ముందు కూచున్న జనం చూస్తున్నారు.స్టూడియో లో వున్న టీవీలో సుగాత్రి,జేమ్స్ చూస్తున్నారు...వీళ్ళతో పాటు మరో వ్యక్తి..చూస్తున్నాడు. అతనే...మిస్టర్ " & ".. నేర ప్రపంచంలో చీకటిరాజు.. మాఫియాసామ్రాజ్యంలో " & "అంటే 'డి ఫర్ డెత్..: దయాళ్ కు ఎదురువెళ్తే చావు తప్పదు...


పోలీస్ రికార్డ్స్ లో డి అంటే డెవిల్...డి అంటే దయాళ్... దయ అనే పదానికి అర్థం తెలియని అండర్ వరల్డ్ డాన్...డ్రగ్స్ ను ఆయుధంగా మార్చి దేశాన్నే కాదు ప్రపంచదేశాల్లో యువతను చిన్నారులను సైతం డ్రగ్స్ కు బానిసలుగా చేసే అతి ప్రమాదకరమైన


వ్యక్తి....


***


"మీరు హైద్రాబాద్ కు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా ?అడిగింది యాంకర్ “ష్యూర్...హైద్రాబాద్ లో పానీపూరి అంటే చాలా ఇష్టం...ఐ లవ్ పానీపూరి "అన్నాడు సిద్దార్థ. "పానీపూరి గురించి ఢిల్లీ నుంచి వచ్చారా? ఆశ్చర్యంగా అనుమానంగా అడిగింది యాంకర్ "మన హైద్రాబాద్ బిర్యాని కోసం విదేశాల నుంచి ఇండియా వచ్చి హైద్రాబాద్ కు వచ్చి బిర్యానీ తినేసి వెళ్తారు. అంతెందుకు మన రాహుల్ గాంధీకి కూడా హైద్రాబాద్ బిర్యానీ అంటే ఇష్టం" చెప్పాడు సిద్దార్థ. "మరి మీ మీద ఎటాక్ ఎందుకు జరిగింది? అంటూ ఎటాక్ జరిగిన విజువల్స్ ను ప్లే చేసింది టీవీ ఛానెల్.


"అదే నాకర్ధం కావడం లేదు..."అమాయకంగా మొహం పెట్టి అన్నాడు సిద్దార్థ ఈలోగా యాంకర్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది.అది చదివి సిద్ధార్థతో చెప్పింది యాంకర్."మిమల్ని అరెస్ట్ చేయబోతున్నారట...మాకు అందిన విశ్వసనీయ సమాచారం " "పానీపూరి తింటే అరెస్ట్ చేస్తారా? మరింత అమాయకంగా అడిగాడు సిద్దార్థ, "మీరు సంవత్సర కాలంగా ఈ వృత్తికి దూరంగా వున్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా? అడిగింది యాంకర్ "ప్రతీక్షణం టెన్షన్ .. అవసరమా? పైగా సినిమాల్లో యాక్ట్ చేయాలనిపించింది.


ఒక్క సినిమా హిట్టయితే కోట్లలో రెమ్యూనరేషన్ ..చూడ్డానికి ఇంచుమించు మహేష్ బాబు లా వుంటాను కదా..."అన్నాడు. "హైద్రాబాద్ లో జరిగిన బాంబుదాడి కేసును ఎంతో ధైర్యంగా సాల్వ్ చేసిన మీరు అజ్ఞాతంలోకి వెళ్లారు ...మీ గురించి జాతీయస్థాయిలో వార్తలు వచ్చాయి.సడెన్ గా అదృశ్యమయ్యారు "యాంకర్ అంది.


"చెప్పానుగా సినిమాల్లో వేషాల కోసం ట్రై చేస్తున్నా ..వర్మను కూడా అడిగా మొన్నటిదాకా జీఎస్టీ బిజీలో వున్నాడు..తర్వాత నాగ్ తో ఆఫీసర్ సినిమా బిజీ..."చాలా తాపీగా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ జరుగుతోన్న సమయంలోనే టీవీ స్టూడియోను కొందరు ఆగంతకులు చుట్టుముట్టారు.


అరగంట నుంచి మిస్టర్ అనే దయాళ్ టీవీలో వచ్చే ఇంటర్వ్యూ చూస్తున్నాడు. ఎన్నో క్రిమినల్ ఆలోచనలతో నిండి వున్న దయాళ్ బుర్ర ఒక్కక్షణం పనిచేయడం మానేసిన ఫీలింగ్ కలిగింది. డిటెక్టివ్ సిద్ధార్థ ఏంచెబుతున్నాడో అర్థం కావడం లేదు. అతను సిద్ధార్థను తక్కువగా అంచనా వేయడం లేదు. ఎందుకంటే సిద్దార్థ గురించి అతనికి బాగా తెలుసు.గతంలో సిద్ధార్థ చేతిలో చావుదెబ్బ తిన్నాడు. అతడిని తక్కువగా అంచనా వేసుకున్నందుకు నలుగురు అనుచరులను కోల్పోయాడు.


మెరుపులా మెరుస్తాడు..పిడుగులా భయపెడుతాడు...ఎప్పుడే క్షణం ఎలా ఎటాక్ చేస్తాడో తెలియదు. అలాంటి సిద్దార్థ టీవీలో పానీపూరి గురించి సినిమాలో హీరోవేషం గురించి మాట్లాడుతుంటే నమ్మ బుద్ధి కావడం లేదు. డిటెక్టివ్ సిద్దార్ధ ఎందుకు వచ్చాడో దయాళ్ కు తెలుసు...కానీ సిద్దార్థ ఎందుకిలా చేస్తున్నాడో తెలియడంలేదు. అందుకే సిద్ధార్థను ఏంచేయాలో డిసైడ్ అయ్యాడు. అతని అనుచరులు టీవీ స్టూడియో ముందు మోహరించారు.


***


డిటెక్టివ్ సిద్దార్థ ఆవులిస్తూ యాంకర్ వైపు చూసి "నిద్రోస్తుంది ..ఇఫ్ యు డోంట్ మైండ్ ..మీరు లాంగ్ బ్రేకిచ్చినా సరే..షార్ట్ బ్రేక్ ఇచ్చిన సరే..నేను కాస్త పడుకోవాలి" అన్నాడు యాంకర్ షాకైంది. ఆమె ఇలాంటి ఇంటర్వ్యూ ను ఫస్ట్ టైం చూస్తుంది..చేస్తుంది. అందులో నూ లైవ్....ప్రోగ్రామ్ ఇంచార్జ్ కు సీన్ అర్ధమైంది..లైవ్ ముగించేయడమే కరెక్ట్ అనుకున్నాడు.


***


సిద్దార్థ బయటకు రాగానే సుగాత్రి ఎలర్ట్ అయ్యింది.అప్పటికే ఆమెకు సమాచారం వచ్చింది.టీవీ స్టూడియో ముందు రెండు పోలీస్ వెహికల్స్ వచ్చి ఆగాయి. సిద్దార్థ మీద ఎటాక్ చేయడానికి వచ్చిన దయాళ్ మనుష్యులు పోలీసులు రావడంతో ఆగిపోయారు...పోలీసులు టీవీ స్టూడియో దగ్గరికి వస్తారని వాళ్ళు ఊహించలేదు. సుగాత్రి సిద్దార్థ దగ్గరికి వెళ్లి “హలో “అంది “పలకరింపులు ఎందుకు ...అరెస్ట్ చేయడానికేగా..వచ్చింది ...హౌ అర్ యు సుగాత్రి ...కాస్త రంగు తేలారు...మీ ఆల్చిప్పల కళ్ళు బావుంటాయి” నవ్వుతూ అన్నాడు సిద్దార్థ. నవ్వును అతి కష్టంమీద ఆపుకుంది. కోపాన్ని నటిస్తూ “మీరు ఒక సిబిఐ ఆఫీసర్ తో మాట్లాడుతున్నారు.మైండ్ ఇట్ “అంది “ఏ ...సిబిఐ ఆఫీసర్స్ పెళ్లిళ్లు చేసుకోరా..కాపురాలు చేసుకోరా?” నవ్వుతూ అన్నాడు సిద్దార్థ జేమ్స్ అలానే చూస్తుండిపోయాడు. సిద్దార్థ జేమ్స్ వైపు చూసి"వాట్ భయ్యా..నువ్విక్కడికి వచ్చావ్...కొంపదీసి నిన్ను కూడా యు అర్ అండర్ అరెస్ట్”అన్నదా? అడిగాడు. “లేదులేదు “అయోమయంగా కంగారుగా అన్నాడు “ఓకే జేమ్స్ మళ్ళీ కలుద్దాం.మేడం అరెస్ట్ చేసుకోవాలని ముచ్చటపడుతున్నారు..."అంటూ ముందుకు నడిచాడు. సిద్దార్థ పక్కనే సుగాత్రి నడుస్తుంది.జేమ్స్ కు ఆ దృశ్యం సిద్ధార్థను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టు అనిపించలేదు. పెళ్లయ్యాక భర్త పక్కనే నడుస్తున్నట్టు వుంది. సిద్దార్థ నడుస్తూనే వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపించాడు.. “సారీ మిస్టర్ డి ...ఈసారి నిన్ను డిస్సపాయింట్ చేసినట్టున్నాను...అన్నట్టు...మిస్టర్ డి ...పానీపూరి సూపర్.. మాఫియా కింగ్ దయాళ్ కు పంపించిన మెసేజ్ అది. చీమ చిటుక్కుమన్న వినిపించే నిశ్శబ్దం....ఆ కేబిన్ లో సుగాత్రి డిటెక్టివ్ సిద్దార్థ మాత్రమే వున్నారు. ఇద్దరూ ఎదురెదురుగా కూచున్నారు.


(ఇంకావుంది)



Rate this content
Log in

Similar telugu story from Action