Women's Diary

Children Stories Action Inspirational

5.0  

Women's Diary

Children Stories Action Inspirational

భూమి...

భూమి...

3 mins
381జరిగే సమరానికి తెలియదు గెలుపేవరిదో 

కరిగే కాలానికి తెలియదు గెలుపెవరిదో 

ముందున్న ఓటమికి తెలియదు గెలుపెవరిదో

నీ ఎదురున్న ప్రత్యర్థికి తెలియదు గెలుపెవరిదో

కానీ

తొలిదశలో నువ్వేసే అడుగుకి తెలుస్తుంది గెలుపెవరిదో

అలుపెరగని నీ కఠోర శ్రమకి తెలుస్తుంది గెలుపెవరిదో 

నువ్వేంచుకున్న దారి నిర్ణయిస్తుంది గెలుపెవరిదో

తుదివరకు నీ పట్టుదలే 

ఒడి దుడుకుల వల చేదించుతూ

నీ కలల కడలి దాటుస్తు

నీను ఆశయాల పీఠానికి చేరుస్తుంది


ఈ మాటలే అమ్మ చెప్పిన మాటలు తలుచుకుంటూ రాత్రంతా

గడిపేసింది భూమి.. తను పేరుకు తగ్గట్టే సహనాన్ని అలంకారం చేసుకుని అనుకువగా ఉంటుంది కానీ తనకి ఇష్టమైన రన్నింగ్ రేస్ లో మాత్రం సివంగిలా దూసుకెలుతుంది.. 

ప్రస్తుతానికి తనకున్న సమస్య రెపు జరిగే నేషనల్స్ లో పాటిసిపేట్ చెయాలి దానికీ తను సిద్ధంగా ఉంది…. అన్నిటిని దాటుకుంటు ఇక్కడి వరకు రాగలిగినా తనకి గెలవగలనా లెదా అని భయం తనలో ఉంది.. దానికీ కారణం గేమ్స్ అషోషియాన్ చీఫ్ తన దగ్గర మాట్లాడిన మాటలే...


నువ్వు గెలవాలి అనుకుంటున్నవా...

 ఎస్ సర్ గెలవగలను అనే నమ్మకం నాకుంది అంటుంది భూమి.. 

ఇక్కడ నమ్మకం ఉంటే సరిపోదు భూమి అంటు సూటిగా చూస్తున్నడు… 

సర్ మీరేమంటున్నారో నాకూ అర్థం కావడం లేదు..

ఏముంది ఒక పది లక్షలు ఏర్పాటు చేశావనుకో గెలుపు నిన్నే వరిస్తుంది..

సారి సర్ గెలుపుని కొనుక్కునేంత స్థోమత నాకు లేదు కానీ పరుగులు పెట్టడానికి సిద్దంగా ఉన్న నా కాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది అని వెను తిరిగింది భూమి..

నాకు తెలుసు భూమి నువ్వు డబ్బు ఇవ్వలేవని అంటు భుజంపై చెయి వెసి నొక్కాడు ఛీఫ్..

ఆ మరు నిమిషంలో అతని చెంప పగిలిపోయింది… 

ఇదిగో చూడూ భూమి నువ్వు ఎలా గెలుస్తావో నెను చూస్తాను అని ఛీఫ్ కేకలు పెడుతున్న దురుసుగా అక్కడి నుండి వచ్చేసింది భూమి..

ఈ ఆలోచలనాలకి తెర దించి ఫ్రెష్ అయి బయటకి రాగానే హారతి ఇస్తుంది భూమి అమ్మ గారూ అల్ ద బెస్ట్ అంటు..

ఇదిగో కోడలా కూతురిని బానే దివిస్తున్నావు కానీ తప్పకుండా గెలవాలి లేదా నెను అనుకున్నట్టే దానికీ ఈ ఏడు పెళ్లి చేసేయాలి..

అమ్మ అప్పుడె భూమి కి పెళ్ళేంటి అని అక్కడికి వచ్చాడు భూమి తండ్రి..

నువ్వూరుకోరా ఇది ఇలా పరుగులు పెడుతు ఉంటె రేపు దిన్ని చేసుకోవడానికి ఎవరు రారు… పొనీ నువ్వేమన్న లక్షలు సంపాదించవా లేదా సంపాదించే కొడుకుని కన్నావా అని నసుగుతుంది..

భూమి మీ నాన్నమ్మ దెప్పిపొటులు ఎప్పుడూ ఉండేవే కదా నువ్వు ప్రశాంతంగా పాటిసిపేట్ చెయి అని భూమి తల నిమురుతు అన్నారు..

థాంక్యూ నాన్నా అని వెళ్ళిపోతుంది భూమి..


స్టేడియంలోకి అడుగు పెట్టగానే కన్నింగ్ ఫేస్ తో స్మైల్ ఇస్తు అల్ ద బెస్ట్ చెప్పాడు ఛీఫ్..

గేమ్ చూడడానికి వచ్చిన జనంతో స్టేడియం కోలాహలంగా ఉంది.. పాటిసిపేట్ చేసే వారు పొజిషన్ లో ఉన్నారు గన్ ట్రిగ్గర్ నొక్కగానే మెరుపు వేగంతో దూసుకెలుతుంది భూమి తొటి వారినీ దాటుకుంటు..

ఇంతలో తన పక్కనె తనతో సమానంగా పరుగుల పెడుతున్న ఇద్దరు కాలు అడ్డు పెట్టగా ఎగిరి పదడుగుల దూరంలో పడుతుంది.. 

అందరు ఎం జరుగుతుందా అని చూస్తున్నారు క్షణలు కరిగిపోతున్నాయి ఛీఫ్ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది..

రెండు క్షణాలు తర్వాతా మెల్లగా కళ్ళు తెరిచింది భూమి తన కోచ్ చెప్పిన మాటలు తలుచుకుంటుంది గగనంలో మెరుపువై ఝలు విదిలించాలి సింగంలా.. పిడుగులా దూసుకెళ్ళాలి.. దూసుకెళ్ళాలి.. అనుకుంటు లేచింది భూమి.. తనని ఎంక్రేజ్ చెస్తూ జనం చప్పట్ల కొడుతున్న..

మధ్య తరగతి కుటుంభంలో పుట్టిన భూమి పౌష్టికాహార లోపం వలన కొంచం బలహీనంగానే ఉంది పైగా ఇప్పుడు శరీరానికైనా గాయాలు అడుగుల పడనివ్వడం లెదు కానీ మనసు మాత్రం కోరుకుంటుంది గెలవాలని… 

మెల్లగా కాళ్ళకి బలం చేరింది మనసులో ధైర్యం నిండింది ఇక భూమి వేగం అందుకుంది మోకాలికి గాయమై రక్తం ధారలు కడుతున్న తన వేగం ఆగడం లేదు.. అడుగుల్లో శక్తి తగ్గుతున్న పట్టుదల సడలడం లేదు ఇప్పుడు తన మమసులో ఒకే ఆలోచనా కొడుకులే కాదు కూతురు తండ్రి కోరికను కలలను నెరవేర్చగలదు…. 

ఇంతలో కళ్ళు మసకబారుతున్నాయి దారి కనిపించటం లేదు తన వేగం వలన ఉపిరి కష్టమౌతుంది ఇంకొ పది అడుగులే గాయాల బాధలు మర్చిపో ఈ పదడుగులు దాటితే.. అనుకుంటా అడుగులు వేస్తున్నా భూమి అడుగులు ఆగిపోయాయి..

అప్పటి వరకు ఆసక్తిగా చూసినా వారు మౌనం వహించారు..

 గ్రౌండ్ దగ్గరికి చేరిన డాక్టర్ భూమి ముఖం మీద నీళ్ళు చల్లి ఏలా ఉంది అని అడుగుతున్నాడు.. 

మెల్లగా కళ్ళు తెరిచిన భూమి నేమ్స్ బోర్డు వైపు చూసి తండ్రి వైపు చూస్తుంది..

ఆనందంగా రెండు చేతి బొటనవేళ్ళు చూపిస్తూ తన గుండెలకి హత్తుకుంటాడు తను చేయలేనిది తన కూతురు చేసి చుపించింది.. తన ఆశయానికి అడ్డువచ్చిన మధ్య తరగతి తన కూతురి చెతిలో ఓడిపోయింది అని..

చీఫ్ లాంటి వాళ్ళు పుట్టుకొ స్తూనే ఉంటారు వాళ్ళని అపడం ఎవరికి సాధ్యం…?

ఆ గెలుపుకే తెలుస్తుందేమో ఎవరి వాకిటి తపులు తెరవాలో…పేదరికం లేదా మరేదైనా అంతర్గత యుద్ధాల లాంటి సమస్యలతో సతమతమవుతున్న ఆడపిల్లలను చదువుని పూర్తిగా దూరం చేయకండి ఈ రోజుల్లో ఇలా లేరు అనుకోవడం పోరాపాటే..

నాకు తెలిసినా కొన్ని రొజుల క్రితం జరిగిన చిన్న విషయం పదో తరగతి చదివే అబ్బాయి అన్నాడు ఆడపిల్లకి చదువు ఎందుకు అదే మెము అయితే...

అని వాడి మాటలు పూర్తీ అవ్వలేదు నెను క్లాస్ మొదలు పెట్టాను గనుక, మళ్ళీ ఇలాంటి మాటలు రాకుండా క్లాస్ తీసుకున్న అయినా అందులొ వాడి తప్ప ఎంత వరకు ఉందో వాడు పెరిగిన వాతావరణం అలాంటిది..Women’s Diary..
Rate this content
Log in