Women's Diary

Classics Inspirational Children

3  

Women's Diary

Classics Inspirational Children

తను అమ్మలా రావాలని ఆశిద్దాం..

తను అమ్మలా రావాలని ఆశిద్దాం..

5 mins
578*గమనిక:- ఈ కథ కల్పితం, నా ఉహాలు మాత్రేమే ఇది ఎక్కడ జరగలేదు... ఎవరిని ఉద్దేశించి కాదు...

ఇది నా మొదటి రచన..

కావ్య ఎలా ఉన్నావే... ఎప్పుడు వచ్చావు లండన్ నుండి....విశాల్ ఎలా ఉన్నాడు...

నేను బానే ఉన్నాను గాని పిన్ని నువ్వేంటి ఇలా చిక్కిపోయావు..

ఊరుకోవే నేను చిక్కానా అంటు కాఫీ కప్ ఇస్తూ బన్నీ నీ స్కూల్లో జాయిన్ చేసావా లేదా ఇక్కడికి వచ్చాక వేస్తారా..

మేము అదే ఆలోచిస్తున్నాము పిన్ని ఇప్పుడు వాడిని ఇక్కడే అమ్మ దగ్గర వదిలి వెళ్ళాలని అన్నారు ఆయన...


పొనీలే మంచి ఆలోచన అక్క వాడికి స్కూలుకి వెళ్ళడం నేర్పుతుందిలే.. ఇంకా ఏంటి లండన్ విశేషాలు..


మావి సరేగాని మళ్ళీ మొదలుపెట్టాడంటా బాబాయ్..


అసలు ఆపితే కాదా కావ్య...


అంటే సంపాదన మొత్తం దానం చేస్తాడా రేపు మీరు మీ పిల్లలు ఎలా బతకడం.


మాకు పిల్లలు అంటు నిట్టురుస్తుంది..


అదేమిటి పిన్ని నీకు అమ్మని అవ్వాలని లేదా కొంచం కోపం నిండిన స్వరంతో అన్నది కావ్య..


అదేమీ లేదు కావ్య అమ్మని కాకపోయినా అమ్ముమని అయ్యనుగా అది చాల్లే...


అవేమీ మాటలు నువ్వు నా కన్నా ఐదారేళ్లే  పెద్ద ఆ మాత్రాన అలా మాట్లాడకు కావలంటే బన్నికి చెపుతా వాడిని అలా పిలవద్దు అని...


ఊరుకోవే వాడికి యాంగ్ గ్రానీ ఉంది సంబరపడుతున్నడు అని నవ్వేస్తుంది..


అయినా నేను ఇప్పుడు వచ్చిందీ మీ ఆడపడుచు కూతురి పెళ్ళికి కాదు లండన్ లో  ఫేమస్ డాక్టర్ ఉంది తనకి నీగురించి అన్ని చేప్పాను తను నిన్న బాబయ్ నీ తిసుకు రమ్మనది అందుకే విశాల్ అన్ని ఏర్పాట్లు చేశాడు బాబాయ్ కుడా దీనికి సరే అన్నాడు బన్నీని ఇక్కడే ఉంచటానికి అది ఒక కారణం అని టకాటకా చెప్పింది కావ్య..


ఆ మాటలకి రాధ కళ్ళు వస్తున్న కన్నిటిని ఆపలేకపోయాయి..


ఛీ.. ఊరుకో పిన్ని అంతా మంచే జరుగుతుంది...


అయినా అన్ని రోజులు ఉంటే మీకు ఇబ్బంది కావ్య, అయినా ఇక్కడ లేని డాక్టర్లా అంటుంది కళ్ళ ఒత్తుకుంటు..


పిన్ని ఇంకేమి మాట్లాడకు ఈ పెళ్ళి అయిపోగానే మనం వెళుతున్నాం అంతే ముందు టిఫిన్ పెట్టు బాగా ఆకలి పిన్ని అంటూ డైనింగ్ రూం వైపు వెళ్ళింది..

 తల్లివైనా నీకు అల్లరి తగ్గలేదే కావ్య అంటూ దోశలు వేస్తుంది రాధ..


పెళ్ళి హడావిడి మొదలయింది పెళ్ళి కూతురిని చేసే ముహుర్తము దగ్గర పడింది అంటూ పెద్దవాళ్ళు అరుస్తున్నారు ఏంటి ఆలస్యం అని...


అసలే కంగారుగా ఉన్నారు తోడి పెళ్ళి కూతురు బొమ్మ కావాలీ అని అలిగింది దాన్ని సముదాయించే సరికి అందరి ప్రాణాలు అలసిపోయాయి.. ఎలాగో ముహుర్తానికే పీటల మీద కూర్చున్నారు...


ఒకరి తరువాత ఒకరు నలుగు పెడుతుంటే లక్కీ బుగ్గలు ఎరుపెక్కాయి...


రాధ నలుగు పెట్టటానికి ఆడపడుచు అడ్డుపడింది నువ్వు వద్దులే అంటు పక్కకి తీసుకేల్లింది కంట నీరు రెప్పల్ని దాటనివ్వ లేదు తనకి పిల్లలు లేరు అని అందరు పైకి వినబడి వినబడనట్టు అంటున్న,తన ఆడబడుచు అనే సరికి తట్టుకోలేక వెళ్ళిపోతున్న రాధ నీ ఆపుతూ పెద్దమ్మా నాకు పిల్లలు ఉన్నారు నేనూ నలుగు పెట్టి అక్షింతలు వేయచ్చా అంటుంది కావ్య..

 అవేమీ మాటలే అంటూ అక్షింతలు కావ్య చేతికి ఇస్తుంది కాంతం.అందరిని దాటుకుని పెళ్ళి కుతురి దగ్గరికి వెళ్ళి జివీతాంతం బాద పడుతూ జీవించు అని అక్షింతలు వేస్తుంది.. కావ్య మాటలకి భుమి కంపించినట్టు అనిపించింది అందరికి..


అదేమీ ఆశీర్వాదమే నీకేమైనా మతిపోయిందా కావ్య నీ  అరుస్తుంది వాళ్ళ అమ్మ, పెద్దమ్మ కాంతానికైతే నోటమాట రాలేదు.. తలా ఒకవైపు అరుస్తున్నారు కోపంగా..

ఆపండి అందరు నేను ఏంచేసాను అలా అరుస్తున్నారు అని అయోమయంగా చూస్తుంది కావ్య..

 అక్షింతలు వేసి నీ నోటికి వచ్చిందీ వాగుతావా నీకు బుద్ది ఉందా..

అదేంటి పెద్దమ్మ అక్షింతలు వేయటానికి పిల్లలు ఉంటే చాలు కదా నేనూ ఎమన్నా ఏమి కాదులే మీకు కావలసింది పిల్లలేగా అంటుంది కావ్య ఏమి తెలియనట్టు..


పిచ్చి దానిలా మాట్లాడకు పిల్లలకి ఆశీర్వాదానికి సంబంధం ఏంటి..? ఆశీర్వదించటానికి మంచి మనసు ఉండాలి..


మంచి మనసు లేదనా రాధ పిన్నినీ అవమానించారు..?


పెళ్ళై ఇన్నాళ్లు అయిన పిల్లలు లేరు అలంటి వాళ్లు ఆశీర్వదిస్తే నా కుతురి జీవితం బాగుపడదు.


మరి వాళ్ల డబ్బులుతో బాగుపడుతుందా..


కావ్య మాటలు జాగ్రత్త ఎక్కువ చేస్తున్నావు అంటు కాంతం మండిపడింది. వద్దు కావ్య అని రాధ ఆపిన ఆగటం లేదు..


చూడమ్మా పెద్దదాన్ని చెప్తున్నా ఇంకా గొడవ అపండి..


గొడవ అది మొదలు పెట్టిందీ చెల్లి అని కూడా లేకుండా ఎలా అన్నదో చూసారా అత్తయ్య అని కాంతం కోపాన్ని చూపిస్తుంది..


చూడు కాంతం అది చిన్న పిల్ల తెలిసి తెలియక అంటే పట్టించుకోరాదు మనం, నాకు కాదు దానికీ చెప్పండి అత్తయ్య అంటు చీర కొంగుతో కళ్లు తుడుచుకుంటు పక్కకి జరుగుతుంది కాంతం....


కావ్య నువ్వైనా అలా అని ఉండకూడదు ఎదో ఆ దేవుని దయకి నోచుకోలేదు మన రాధ... కళ్లు చెమ్మగిల్లాయి నారాయణమ్మకి...


సారి నానమ్మ బాధపడకు... నా సంగతి సరే వెళ్ళి మీ పెద్దమ్మని అడుగు మన్నించమని.... ఇష్టం లేకపోయినా కావ్య సారి చెప్తుంది...


ఎం పాపాలు చేసారో ఎమో దేవుని దయకి నోచుకోలేదు అని నసుగుతున్న కాంతం మాటల్లో అహంకారం ప్రతిధ్వనిస్తుంది..

 కాంతం నీ నోరు ఉరుకోదా నారాయణమ్మ అరుస్తుంది.. నేనేమి అన్నాను ఉన్నమాటే కదా కాంతం అని మౌనంగా చూస్తుంది..


చూడు పెద్దమ్మ దేవుడి దయ ఉన్న వారినే పిలవాల్సింది అయిన పిన్నికి దేవుడి దయలేక కాదు చెప్పినా వినకుండా ఈ రోజులల్లో కూడా ముందే పెళ్ళి చేసారు...


ఇది వంక పెట్టి అందరి నోళ్ళు ముయిస్తున్నారు..


చూడు కాంతం ఇకచాలు పని చూడండి అన్నిటికి ఆ భగవంతుడు ఉన్నాడు,...


సరిగ్గా చెప్పావు నానమ్మ అన్నిటికి ఆయనే కారణం ఐనప్పుడు పిన్నికి పిల్లలు లేక పోవడానికి ఆయనే కారణం పిన్ని తప్పేమీ లేదు.


నువ్వు భగవంతుడిని కూడా వదల్లేదా చదువుకున్నావు మీఅంత తెలివి మాకు లేదు..


పెద్దమ్మ నేనేమీ నిందించటం లేదు ఈ సృష్టికి కర్త కర్మ క్రియ ఆయనే అని తేలుసు నేను ఆ మాటలు వింటూ పెరిగాను, భగవంతుని నిర్ణయంని మీరు అవమానిస్తున్నారు..


తెలివిగా మాట్లాడను అని అనుకోకు కావ్య నీ మాటలతో మమ్మల్ని నువ్వే అవమానిస్తూ...


సరే పెద్దమ్మ ఇక్కడ ఉన్న వారు అందరికి పిల్లలు ఉన్నారా లేదా అని అడిగే పిలిచావా.. కావ్య చెంప పగలకొడుతుంది శ్యామల. అమ్మ అంటూ కొపంగా అరిచి లొపలికి వెళుతుంది...అక్క పెళ్ళికి ఉండకుండా వెళ్ళిపోతున్నావంట, సారీ లక్కీ ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండలేను, ఇందాక నీతో అలా అన్నందుకు నేనే నీకు సారి చెప్పాలి అంటూ లక్కీని హాగ్ చేసుకుంటుంది కావ్య....


వాళ్ళు అన్నది తప్పే ఎన్ని సార్లు చెప్పినా వినలేదు రాధ అత్తని అలా అనద్దు అని తను ఎంత మంచిదో తేలుసు, వీళ్ళకి అది అర్ధం కాదు ప్లీజ్ నువ్వు వెళ్ళద్దు.


లక్కీ ఏడుస్తున్న కావ్య బ్యాగ్ ప్యాక్ చేయటం ఆపటం లేదు.


ఏడవకు లక్కీ మీ అక్క ఎక్కడికి వెళ్ళాదు అయినా పెళ్ళికూతురు ఏడవకూడదు అంటూ రాధ లక్కీ కళ్ళు తుడుస్తుంది..


సారీ అత్తా నాకు నీ ఆశీస్సులు కావాలి. పిచ్చి పిల్ల నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి...


కావ్య లగేజి పక్కన పెట్టి పద చాల పనులు ఉన్నాయి...


రాధా మాట కాదనలేక కావ్య బ్యాగ్ సర్దడం ఆపుతుంది....


లక్కీ నువ్వు ఏమి ఆలోచించకు రేపటికి ముఖం పాడైతే అల్లుడు గారు మమ్మల్ని అడుగుతారు నా లక్కీ ఎందుకు అలా ఉంది అని..


సిగ్గుతో లక్కీ తనగదిలోకి వెళుతుంది..


ఎదో ఉన్నాను అనిపించి వేంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయమని విశాల్ కి చెప్తుంది కావ్య.


పిన్ని చివరి సారీ అనోస్మేంట్ చేసారు పదా..


నాకు భయంగా ఉంది కావ్య...


పిన్ని ఏమి ఆలోచించకు అంతా మంచే జరుగుతుంది...

అందరు విదేశాలకు చదువుకోవటానికి, జాబ్ చేయటానికో, లేదా పెళ్ళి చేసుకుని వెళ్తారు కాని రాధ గుండె నిండా భారం, వేదన నింపుకుని వెళుతుంది. పిల్లలు లేక పోవడం రాధ తప్పుకాదు అది కేవలం అది లోపం, ప్రతి ఒక్కరిలో ఎదో ఒక లోపం ఉంటుంది దాన్ని చూసి మేము ఉన్నాము అనే దైర్యం చెప్పక పోయినా కనీసం జాలి అయినా చూపించాలి, ఇప్పుడు కూడా మన చుట్టూ ఇలాంటి రాధలు చాల మంది ఉంటారు కాని కావ్య లాగా దైర్యం చెప్పే వారు ఉండరు. కనీసం ఇప్పటి నుండి అయినా కావ్య లాగా ఆలోచిద్దాం... తను తిరిగి అమ్మగా రావాలని ఆశిద్దాం....


ఇలా ఎక్కడ జరగదు...


ఈ రోజులి ఇలా ఎవరు ఉండరు అని అనుకోవచ్చు...


కానీ ఇలాంటి మాటలు అనిపించుకున్న వారికీ తెలుస్తోంది ఆ బాధ..
Womens Diary..

 

 

 

 


Rate this content
Log in

Similar telugu story from Classics