శ్రీలత "హృదయ స్పందన"

Classics

5  

శ్రీలత "హృదయ స్పందన"

Classics

ప్రియమైన నీకు!

ప్రియమైన నీకు!

2 mins
402



ప్రియమైన నీకు..,

    ప్రతి ఉదయం నా భావాలతో ఇలా నిన్ను పలకరిస్తూనే ఉన్నాను.. మరి ఈ రోజు ఎందుకో మనసు కలత గా, హృదయం భారంగా.. అనిపిస్తుంది.

నాకు తెలియకుండానే నా పెదవులపై చిరు దరహాసం..

నాకు తెలియకుండానే నా కన్నుల నుండి కన్నీటి బిందువులు...

నాకు తెలియకుండానే నా కలంతో ఎన్నో అనుభూతుల లేఖలు..

నాకు తెలియకుండానే నీ ఆలోచనలతో స్తంభించిన కాలం...

నీ జ్ఞాపకాలు నన్ను నీడలా వెంటాడినప్పుడు ఈ

అనుభవాలు నాలో...

ఎన్నో రోజుల పరిచయం కాదిది.అయినా ఎన్నో జన్మల అనుభంధంలా ఉంది.

నాతో నేనే మాట్లాడుకుంటున్నాను..

నన్ను నేనే ఓదార్చు కుంటున్నాను..

ఈ క్షణం రెక్కలు కట్టుకొని నీ ముందు వాలాలని... మనసు ఆరాటం...

జరగని దానిగురించి ఆలోచించకు అని మనిషి పోరాటం...

ఇలాంటి అనుభవాలు ఎన్నో ప్రతి రేయి నన్ను కలవర పెడుతున్నాయి.. ఎన్నని చెప్పను.. ఎలా చెప్పను..

ఒక్కసారి నా హృదయాన్ని తాకి చూడు నేస్తం

ఎంత భారంగా కొట్టుకుంటుందో....

నీ ఆలోచనల తాకిడికి దాని చలనం ఏ క్షణం ఆగిపోతుందో అన్నంత భారంగా ఉంది.

ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నేస్తం..

వేల భావాలను పలికించే ఆ కళ్లు...

చూపుతోనే శాసించే ఆ కళ్లు...

నిద్రలేని రాత్రులతో... చిన్నబోయి చూస్తున్నాయి..

నిశితంగా పరిశీలించి చూడు..

ఏ క్షణం అవి వర్షించి నా తనువును తడిపేస్తాయో...

చెప్పలేని ఆవేదన ఆ కళ్ళలో...

ఎందుకింత బాధ... ఎన్నడూ లేని ఆవేదన..

నీ వల్లేనా....

ఆనందంగా నవ్వుతూ... నవ్విస్తూ.... ఉండే నన్ను

నీ ప్రేమ పంజరంలో బందీని చేసావు... ఊపిరి ఆడక

ఉక్కిరి బిక్కిరి అవుతుంది నా ప్రాణం...

ఇన్నాళ్లు నాకు ప్రేమ ఓ అద్భుతం....

నా అంతరంగంలోని ఊహ లోకంలో నిర్మించుకున్న అనుభూతుల శ్వేత సౌధం...

మరి ఇప్పుడు నిన్ను ప్రేమించాక...

ప్రేమ ఒక తీయని బాధ..

ఆ బాధను భరించలేని నా మనస్సు నన్నే నిందిస్తుంది..

నాతో యుద్ధం చేస్తుంది...

నా జీవిత కాలం ఈ సంఘర్షణ భరించలేను నేస్తం..

నీ కోసం ఈ ఆరాటం...

నా మనసుతో పోరాటం నేను చేయలేను...

నువ్వు కథే రాస్తావో...

కవితే రాస్తావో...

మాటే చెప్తావో...

పాటే పడతావో...

నా ఆలోచనలకి ఆనకట్ట వేయి..

నా మనసుకు ప్రశాంతతను చేకూర్చు...

ఇదే నా విన్నపం...

ఇట్లు,

నాలో లేని నేను...

శ్రీ....

హృదయ స్పందన..



Rate this content
Log in

Similar telugu story from Classics