t. s.

Classics

4.0  

t. s.

Classics

మధురా వైన్స్

మధురా వైన్స్

2 mins
585


ఏమయ్యా పంతులు నిన్ను నమ్మినందుకు ఇలాంటి సంబంధం తెస్తావా అని ఆగకుండా మాటలు అంటున్న చౌదరిగారిని ఆశ్చర్యంగా చూశాడు పెళ్లిల్ల పేరయ్య శాస్ర్తీ.

అయ్యా ఏమయింది ఇప్పుడు ఈ ఫోటోలో

పెళ్లి కొడుకు మంచివాడు, మంచి సంపాదన, పెద్దలు అంటే గౌరవం, చూడ్డానికి అందంగా ఉన్నాడు అని చెపుతున్నంతలోనే

ఆపు ఆపవయ్యా ఒక తాగుబోతుని చూపించి మంచివాడు అని చెపుతున్నావ అన్నారు చౌదరిగారు.

శాస్ర్తీ ఆశ్చర్యంగా ఏంటి తాగుబోతా అలా ఏం లేదండి

ఆ అబ్బాయి చాలా బుధ్ధిమంతుడు ఇప్పటికీ అమ్మ నాన్నల మాట జవదాటడు.

చాలు చాలు అసలు నీతో ఇంకా మాట్లాడటం నాదే తప్పు నేను స్వయంగా ఆ అబ్బాయిని చాలా సార్లు

"మధురా వైన్స్" లోనుంచి బయటికి వస్తుంటే చూశాను.

అన్నారు చౌదరి గారు కోపంగా.

అయ్యా ఆ అబ్బాయి గురించి నాకు పూర్తిగా తెల్సండి

మీరు ఎవరిని చూశారో

అయినా మీకు అబద్ధం చెప్పేంత ధైర్యం నాకు లేదు.

కావాలంటే ఇప్పుడే ఆ అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కుంటా మీ తృప్తి కోసం నాకు తెలుసు ఆ అబ్బాయి చాలా మంచివాడు అన్నాడు శాస్ర్తీ.

అంటూనే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.

పెళ్లి కొడుకు రమేష్ ఫోన్ ఎత్తుతూనే హలో అంకుల్ పెళ్లి సంబంధాల కోసం మా అమ్మా నాన్న లతో మాట్లాడండి వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అంటున్న రమేష్ మాటలకు అడ్డు తగిలి ఆగవయ్యా ఆత్రం పెళ్లి కొడుకా ముందు నేను ఒకటి అడుగుతా అబద్ధం చెప్పకుండా నిజం మాత్రం చెప్పు అన్నాడు శాస్ర్తీ.

నువ్వు మందు తాగుతావా అని అడిగాడు.

చ చ నాకు అలాంటి అలవాట్లు లేవు అంకుల్, తాగేవాళ్ళు అంటే నాకు అసహ్యం అన్నాడు రమేష్.

నేను ఒకటి అడుగుతాను నీకు మధురా వైన్స్ దగ్గర ఏం పని అని అడిగాడు శాస్ర్తీ.

రమేష్ ఆశ్చర్యంగా ఏంటి అంకుల్ మీరు ఏం అడగాలని అనుకుంటున్నారు సూటిగా అడగండి అన్నాడు రమేష్.

అదేనయ్యా నేను నిన్ను చాలా సార్లు మధురా వైన్స్ లోనుంచి వస్తుంటే చూశాను, అలానే పెళ్లి కూతురు వాళ్ళ తరపున ఎవరైనా చూసి ఇలాంటి సంబంధం తెచ్చారు అని నన్ను తిడతారు అందుకే నీలాంటి వాడికి నేను సంబంధం చూడను అన్నాడు శాస్ర్తీ.

దానికి రమేష్

అయ్యో అంకుల్ మీకు తెలీదా నేను మధురా వైన్స్ వెనక ఉన్న రెస్టారెంట్ లో మేనేజర్ ని.

రెస్టారెంట్, మధురా వైన్స్ ఇంచుమించు కలిసినట్టు ఉంటాయి.

ఇంటికి వచ్చేటప్పుడు తొందరగా రావచ్చని మధురా వైన్స్ లోనుంచి వస్తాను షార్ట్ కట్ లో అంతే గాని నేను తాగను అన్నాడు రమేష్.

చౌదరి గారి వైపు చూస్తూ నిజంగా నిజమేనా అని అడిగాడు శాస్ర్తీ.

నిజం అంకుల్ నేను పని చేసే రెస్టారెంట్ వెనక

మధురా వైన్స్ ఉంది తొందరగా వెళ్ళిపోవచ్చని అందులో నుంచి బయటికి వస్తాను అన్నాడు రమేష్.

సరే నువ్వు తాగకపోయినా అందులో నుండి వస్తే తాగుబోతు వనుకుంటారు చూసేవాళ్ళు తాడి చెట్టు కింద కూర్చుని కళ్ళు తాగలేదంటే నమ్మని విధంగా, అందుకని లేటయినా సరే

సరి అయిన దారిలో రా బాబు అని ఫోన్ పెట్టేసాడు శాస్ర్తీ.


Rate this content
Log in

Similar telugu story from Classics