Ramya Talluri

Classics

4.3  

Ramya Talluri

Classics

రాధా కృష్ణ

రాధా కృష్ణ

9 mins
681


'అమ్మా.. అమ్మా...' అని ఎప్పటికంటే కాస్త గట్టిగానే పిలిచింది సుమతి ని తన కూతురు సారిక. 'ఏంటి' అని అడిగింది సుమతి. 'ఏం లేదు అమ్మా.. కాలేజి మ్యగజైన్ కోసం ఒక కొత్త డిఫరెంటైన ప్రేమ కధ కావాలమ్మ' అని అడిగింది. 'సరే ఉండు, వంట పూర్తి అయ్యాక వచ్చి చెప్తా' అని చెప్పి తన పనిలో మునిగి పోయింది సుమతి. ఆ లోపు ఫోన్ చూద్దాం అని ఫోన్ తీసుకుని సారిక తన కాంటాక్ట్స్ చూస్తుంటే తనకు గుర్తు వచ్చిన పేరు.. రాధమ్మ మరియు కృష్ణయ్య.. ఒక సారి ఫోన్ చేసి వాళ్ల ప్రేమ కథ ని అడుగుదాం అని కాల్ చేసేలోపు సుమతి రానే వచ్చింది. 'సరే.. చెప్తాను విను. నీకు నచ్చిన విధంగా మార్చి రాసుకో' అని చెప్పింది సుమతి. 'సరేలే నచ్చకపోతే రాధమ్మ ను అడుగుదాం' అని అనుకుంది సారిక మనసులో.

'సిరిపురం అనే ఊరూలో రాఘవయ్యది పెద్ద కుటుంబం. ఆ కుటుంబ పెద్ద రాఘవయ్య గారే. ఆయనకి ముగ్గురు తమ్ముళ్ళు, కానీ అక్క చెల్లెళ్లు మేనత్త లు ఎవరు లేరు. రాఘవయ్య మరియు తన తమ్ముల్లందరికి పెళ్లిళ్లు అయ్యాయి, రాఘవయ్య భార్య గర్భవతి. అందరూ అమ్మాయి పుడితే బాగుంటుంది అనే ఆశ తో హాస్పిటల్ బయట ఎదురు చూస్తున్నారు. ఆ లోపు ఆపరేషన్ రూం నుంచి ఏడుపు వినిపించింది. అందరూ ఆసక్తిగా డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ రానే వచ్చారు, వచ్చి నవ్వుతూ మీరంతా కోరుకున్నట్లుగానే మీకు అమ్మాయి పుట్టింది, సంతోషమే కదా.. తల్లీ బిడ్డా ఇద్దరు ఆరోగ్యం గానే ఉన్నారు.. కంగ్రాట్స్ అందరికి. కొంచం సేపు అయ్యాక పిలుస్తారు వెళ్లి చూడండి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. సంతోషం పట్టలేకపోయారు అందరూ. ఎప్పుడెప్పుడు చూద్దమా అని ఎదురు చూస్తూ వుండగానే నర్స్ వచ్చి రూం షిఫ్ట్ చేశాం వెళ్లి చూడండి అని గది వైపు చూపించింది. అందరూ చాలా సంతోషం గా వెళ్లి చూసారు. అమ్మాయి పుట్టిన వేళా విశేషం ఎంటో తెలీదు కానీ బాగా కలిసివచ్చింది. అందుకే అమ్మాయి కి సిరిలక్ష్మి అని పేరు పెట్టారు. చాలా గారాబంగా పెంచారు ఇంట్లో అందరూ. ఆ తర్వాత అందర్కి పిల్లలు పుట్టారు కానీ అమ్మాయిలు ఎవరికి కలుగలేదు. ఇంట్లో ఎవరికి ఏం కావాలి అన్న సిరి తో రాఘవయ్య ను అడిగించేవారు. ఇంట్లో పెద్ద అందులోను కలుగక కలుగక అమ్మాయి కలిగే సరికి ఏం కావాలన్నా కాదు అనకుండా ఇచ్చేవారు. పేరుకి తగ్గట్లు గానే రూపవతి గుణవతి.చాలా సహాయం చేసే అమ్మాయి. ఆ కాలం వాల్లైన అమ్మాయి ని బాగా చదివించాలని అనుకొని ఊర్లో ఎవరు ఎన్ని అన్న పట్టించుకోకుండా బాగా చదివించారు. అదే విధంగా సిరి కూడా బాగా చదువుకునేది. అమ్మాయిలు బాగా చదువుకోవాలి అని సిరి లక్ష్మి కూడా ఊర్లో చిన్న వయసు లో ఉన్న అమ్మాయిలకి చదువు చెప్పేది. ఇంట్లో వాళ్ళ గౌరవానికి భంగం రానివ్వకుండా చాలా మర్యాదగా నడుచుకునేది.' 

సారిక మద్యలో ఆపి ' ఏంటమ్మా.. ప్రేమ కథ చెప్పమంటే ఏదో చెప్తున్నవు' అని వారించింది. 'వినవే ముందు' అని చెప్పింది సుమతి.'సరే చెప్పు' అని చెప్పగానే సుమతి ఇలా కొనసాగించింది.

' సిరి తన పై చదువుల కోసం పట్టణానికి పంపించాలి అని రాఘవయ్య నిర్ణయించుకున్నారు. ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం ఇంట్లో ఎవరూ చెయ్యలేరు. చేయగలిగింది ఒక్కరు మాత్రమే.. అది ఎవరంటే సిరిలక్ష్మి. తనకు కూడా ఇంట్లో వాళ్ళని విడిచి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. అందుకే రాఘవయ్య తో చెప్పాలి అని నిర్ణయించుకుని చెప్పేసింది. రాఘవయ్య ఆమెను బుజ్జగించి ఎలాగోలా ఒప్పించేసాడు. ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న అందరి ముందర తల ఎత్తుకొని ఉండాలి అనే ఉద్దేశం తో ఒప్పుకుంది సిరి. రాఘవయ్య సిరి నీ తీసుకొని పట్టణానికి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచి, కాలేజ్.. ఇంటి నుంచి కాలేజ్ కి దారి అలా అన్ని చూపించి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. సిరి కాలేజ్ కి వెళ్ళిన కొద్ది రోజులకే అందర్తో బాగా సన్నిహితంగా ఉంటూ బాగా చదువుకుని కాలేజ్ లో మంచి పేరు తెచ్చుకుంది. అలా ఆనందం గా చూస్తూ వుండగానే మొదటి సంవత్సరం పూర్తి అయ్యి రెండో సంవత్సరం లోకి వచ్చేసింది.'

'చూస్తూ వుండగానే కాలేజ్ కూడా అయిపోతుంది. ఇంకెప్పుడు ప్రేమ మొదలయ్యేది' అని విసుకుగా అన్నది సారిక. ' నువ్వు పూర్తిగా వినకుండా ఇలా మద్యలో ఆపితే నేను చెప్పాను' అనగానే ' సరే చెప్పు' అని సైలెంట్ గా ఉంది సారిక.

' రెండో సంవత్సరం మొదటి రోజున మొదటి సారిగా విష్ణునీ చూసింది సిరిలక్ష్మీ.. కాలేజ్ స్టూడెంట్స్ మద్య ఏదో గొడవ అవుతుంటే విష్ణు అందరితో మాట్లాడి ఒప్పించాలి అని చూస్తున్నాడు. ఒక లీడర లా అందర్నీ సముదాయిస్తున్నాడు. చాలా అందం గా మంచి ఖంటం తో తెలివిగా మాట్లాడుతు ఒక సందర్భాన్ని బాగా గ్రహించి అందర్నీ ఒప్పిస్తు బాగా ఆలోచిస్తూ కనిపించాడు విష్ణు మొదటి సారిగా సిరికి. చూడగానే నచ్చేసాడు. కానీ ఇప్పడు మీరు మాట్లాడుతున్నట్లు అప్పట్లో వాళ్ళు మగవాళ్ళను చూసే సాహసం కూడా చెయ్యరు.. అలాంటిది ఒకర్ని చూసి మాట్లాడడం అనేది గగనమే. సిరి విష్ణూ నీ చూసి ఆరదించడమే కానీ మాట్లాడే సాహసం చెయ్యలేకపొంది. ఆ అబ్బాయి సిరికి సీనియర్ అనే విషయం తెల్సుకోడానికే సగం సంవత్సరం అయిపోయింది సిరిలక్ష్మి కి. ఇంకో ఆరు నెలల్లో విష్ణూ కాలేజ్ అయిపోయి వెళ్ళిపోతాడు కూడా. కొంచం కొంచం ధైర్యం తెచ్చుకొని మెల్లగా మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నించింది కానీ మాట మాత్రం పెదవులు దాటి బయటికి రాలేదు. పిలువలేకపోయేది కూడా. చూస్తూ చూస్తూ సంవత్సరం కూడా అయిపోయింది. విష్ణు తన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవడానికి కాలేజ్ కి వచ్చాడు. తీసుకొని వెళ్తూ ఉండగా తను ఎక్కడ దూరమైపోతాడు అనే బాధ భయం తో విష్ణు అని పిలిచింది. విష్ణు తల పైకి ఎత్తి ఆశ్చర్యంగా చూశాడు. సిరి విష్ణు దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. వెళ్లిపోయే సమయంలో తన పుస్తకం నుంచి ఒక లెటర్ పడిపోయింది. అది సిరి ఎప్పటికైనా విష్ణుకి ఇవ్వాలి అని తను విష్ణునీ చూసిన మొదటి రోజు రాస్కుంది. కానీ ఇచ్చే ధైర్యం చేయ్యలేకపోయింది. అందులో తాను అన్ని వివరంగా రాసింది. విష్ణు కి సిరి తనని ఎంత గా ప్రేమించిందో అని అర్థమయ్యింది. అందులో చివరన నీకు నేను అంటే ఇష్టం లేకుంటే దయచేసి నాకు ఆ విషయం తెలియనివ్వకండి ఎందుకంటే అది తెల్సుకుని నేను తట్టుకోలేను భరించలేను అని రాసి వుంది. ఆ ఉత్తరం విష్ణుకి అందింది అని సిరికి తెలియదు. తన మనసులో మాట చెప్పేశాను కానీ విష్ణు తన మనసులో ఏం అనుకుంటున్నది తెలీదు సిరికి. చాలా రోజులు విష్ణు వస్తాడేమో అని ఎదురు చూసింది. కానీ ఆ రోజు తర్వాత సిరికి విష్ణు ఎప్పుడూ కనిపించలేదు. అదే బాధతో చివరి సంవత్సరం కూడా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసింది. సిరి పరాకు గా ఉండడం అందరూ గమనించారు ఎంత అడిగినా ఏం చెప్పకుండా మాట దాటేసేది. సిరికి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ సిరి అలా ఉండేసరికి ఎవరు ఆ టాపిక్ ఎత్తడం లేదు. అలా కొన్ని రోజులు గడిచాక ఇంట్లో వాళ్ళ ఆప్యాయత వల్ల మామూలు అయిపోయింది. మెల్లిగా మొత్తం మర్చిపోసాగింది. ఒక రోజు సిరికి ఉద్యోగం వచ్చినట్లు ఉత్తరం వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చెయ్యడం నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు చెయ్యకు అని చెప్పారు. ఆ లోపు ఒక మంచి సంబంధం వచ్చింది సిరికి. ఆ అబ్బాయి కూడా ఉద్యోగమే చేస్తున్నాడు. మంచి కుటుంబం.. సిరి నీ బాగా చుస్కుంటడు అనే నమ్మకం ఉంది రాఘవయ్య. ఆ సంబంధం గురించి సిరి కి చెప్పాడు. ఆలోచించుకుని చెప్పమన్నాడు. ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు రాఘవయ్య. సిరి కి విష్ణు గుర్తుకు వచ్చాడు. తన కోసం ఇంకెన్ని రోజులు ఆగిన ఫలితం ఏం ఉండదు.. ఇన్నాళ్లు రాని వాడు ఇప్పుడు ఇక రాడు కదా అని అనుకుంది. తనని గుర్తుపెట్టుకొని ఇలా బాధపడితే ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అని అనుకొని సరే అని తన నిర్ణయాన్ని చెప్పింది. ఇంకా చేక చెక పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. కళ్ళ నిండా నీళ్లతో పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకుంది సిరి లక్ష్మీ..'

' ఏంటమ్మా ప్రేమ కథ అన్నాను, నువ్వు ప్రేమ విఫలమైన కథ చెప్తావు.. నాకు అసలు నచ్చలేదు..ఫో..అయిన సిరి అంటే ఇంట్లో అందరికి ప్రేమ కదా, తన ప్రేమ విషయం చెప్పి ఉంటే వాల్లే వెళ్లి ఆ అబ్బాయి ఇంట్లో మాట్లాడేవాళ్ళు కదా..అయిన సిరి ఎందుకు అలా చేసింది. ఆ అబ్బాయి తిరిగి రాలేదు అంటే ఇష్టం ఉండదులే అనుకొని ఇలా చేసిందా. ఏది ఏమైనా కానీ ఎవర్నో చేసుకోడం నాకు అసలు నచ్చలేదమ్మ ' అని సారిక చిరాకుగా సుమతి తో అన్నది.

'దానికి సుమతి నవ్వేసి పిచిదాన.. అలాంటి కథ నేను ఎందుకు చెప్తానే, గెస్ చెయ్యి ' అని అన్నది సుమతి.

' అవునా..! ప్లీజ్ నువ్వు చెప్పకు..' అని సారిక సుమతి వైపు చూసింది. సుమతి ' నవ్వుతూ.. అవును నువ్వు అనుకునేది జరిగింది ' అని చెప్పింది. ' వాట్..అంటే సిరి విష్ణు ఇద్దరు పెళ్లి చేసుకున్నారా..! హౌ??ఎలా..విష్ణూ తర్వాత సిరి నీ చూడడానికి రాలేదు అన్నవ్ కదా, మరి పెళ్లి అవ్వడం ఏంటి.. చెప్పు ' అని ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపించింది సారిక.

' అందుకే చెప్పాను నీకు మొత్తం విను అని ' అని చెప్పసాగింది సుమతి. ' సరే సరే సారీ.. చెప్పు వింటాను' అని చెప్పింది సారిక.

' అసలు ఏమైంది అంటే సిరి వచ్చిన మొదటి రోజే విష్ణు తనని చూసి ఇష్ట పడ్డాడు. క్రమంగా అలా దూరం నుంచి చూస్తూ ఆమె మంచితనం, నడవడిక, మాట్లాడే విధానం ఇలా అన్ని నచ్చడం చాలా సార్లు మాట్లాడాలి అని ప్రయత్నించిన ధైర్యం సరిపోలేదు. అలా చూస్తూ చూస్తూ తన చదువు కూడా పూర్తి అయిపోయింది. కాలేజ్ చివరి రోజు విష్ణు ఆఫీస్ రూం ముందు సిరి నీ చూడడానికి చాలా సేపు ఎదురు చూసి తను రాకపోయే సరికి రూం లో కి వెళ్ళి సర్టిఫికేట్ మరియు సిరి వివరాలు తెలుసుకున్నారు. సిరి కి తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటాను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. కానీ పెళ్లి నీ చదువు పూర్తి అయ్యకనే చేసుకుందాం. ఇది అంతా నీకు ఇష్టం ఉంటేనే అని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పటికే రెండు సంవత్సరాలు గా ఇవే మాటలు చెప్పాలి అని ఎన్నో సార్లు నెమరు వేసుకుంటూ ఉండేవాడు. అలా ఆ వివరాలు తీస్కొని ఇలా చెప్పాలి అనుకుంటూ బయటికి రాగానే తన ముందు సిరి ఉంది, కాస్త గాబరాగ. అయిన పరవాలేదు ఎలా అయిన చెప్పాలి అని సిరి అని పిలవగానే సిరి తను చెప్పాలి అనుకున్నది భయం గా బాధతో చెప్పేసి వెనక్కి చూడకుండా పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్లిపోయింది. విష్ణు ఆనందం పట్టలేక పోయాడు. వెంటనే ఇంటికి వెళ్లి అందరికి చెప్పేసి సిరి వాళ్ళ ఇంటికి వెళ్లి నేను మాట్లాడి ఒప్పించి వస్తాను. ఆ తర్వాత మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి. ఎలాగో నా ట్రైనింగ్ సిరి చదువు పూర్తి అయ్యేసరికి ఒక సంవత్సరం అవ్తుంది అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి సిరి వాళ్ళ ఊరూ బయలుదేరాడు. అక్కడ రాఘవయ్య ఇంటికి వెళ్లి అంతా వివరం గ చెప్పాడు. సిరి కూడా తనని ఎంత గా ఇష్టపడుతుందొ చెప్పాడు. రాఘవయ్య కుటుంబానికి నమ్మాలి అనిపించలేదు కానీ విష్ణు కళ్ళలో నిజాయితీ సిరి మీద తనకి ఉన్న వల్లమాలిన ప్రేమ కనిపించింది. సిరి విష్ణు కి రాసిన ఉత్తరాన్ని తీసి రాఘవయ్య కు ఇచ్చాడు. ఇది చూస్తే మీకు కాస్త ధైర్యం గా ఉంటుంది.. చూడండి అని ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని ఇంట్లో అందరూ చూసి అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సిరి విష్ణు నీ ఇంతలా ప్రేమించింది అని ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యింది. కూతురు కోసం అని అబ్బాయి కూడా చూడడానికి లక్షణం గా ఉన్నాడు అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. విష్ణు వివరాలు తెలుసుకున్నారు. రాఘవయ్య మరియు ఇంటి సభ్యులు అందరూ.. మీఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలుస్తుంది అందుకే మీ ఇద్దరికీ వెంటనే పెళ్లి చేస్తాం మీ పెద్ద వాళ్ళతో కూడా ఒక మాట అనుకొని అని చెప్పగానే విష్ణూ ఒక సంవత్సరం తరువాత సిరి చదువు కూడా పూర్తి అవుతుంది. అలాగే నేను కూడా ఈలోపు పోలీస్ ట్రైనింగ్ కి వెళ్లి ఉద్యోగం లో చేరిపోతను. ఎల్లుండే నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు. సరే అయితే మేము అందరం ఒక సారీ మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాం అని చెప్పారు. అలా మాట్లాడుతు కొంచం సేపు ఉండి విష్ణు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య తన కుటుంబం కలిసి విష్ణు ఇంటికి వెళ్ళారు. అలా ఇద్దరి ఇళ్ళ మద్య రాకపోకలు బాగానే సాగాయి. ఇంట్లో వాళ్ళందరూ సిరి చెప్పేదాకా విష్ణు వచ్చి మాట్లాడాడు అని చెప్పకూడదు అని నిర్ణయించుకున్నారు. విష్ణు ఏమో తను ట్రైనింగ్ కి వెళ్ళాలి సిరి నీ కలిసే అవకాశం లేదు నాకు ఈ విషయం మీరే చెప్పండి తనకి అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకునే సరికి విష్ణు కుటుంబీకులను రాఘవయ్య తమ్ముడు స్నేహితులు గా సిరికి పరిచయం చేసి అలా వాళ్ళుతో బాగా కలిసిపోయేలా చేశారు. చూస్తూ వుండగానే సంవత్సరం అయిపోయి విష్ణు ట్రైనింగ్ పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరిపోయాడు కూడా. ఇంకా ఆలస్యం చెయ్యడం ఇష్టం లేక రాఘవయ్య కు ఉత్తరం రాశాడు. ఉద్యోగం లో చేరిపోయాను.. సిరి మరియు ఇంట్లో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు. సిరి కి కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక ఉద్యోగం అడిగాను, ఒక రెండు మూడు రోజులలో ఆ ఉత్తరం కూడా మీకు వస్తుంది తనకి ఇష్టముంటే చేరమనండి. ముందు గానే పెళ్లి వివరాలు చెప్తే నేను ఇక్కడ సెలవలు అడగడానికి వీలు అవుతుంది అని రాశాడు. ఆ తర్వాతే సిరి నీ ఇంట్లో వాళ్ళు పెళ్లి కోసం అడగడం, తెలిసిన వాళ్ళు అంటే బాబాయ్ స్నేహితులు అయ్యేసరికి ఇంట్లో అందరికి ఇష్టం ఉండి వాళ్ళని బాధ పెట్టడం తనకు ఇష్టం లేక కొన్ని రోజులు ఆలోచించి ఒప్పేసుకుంది. చకా చకా పెళ్లి పనులు మొదలయ్యాయి పెళ్లి రోజు కూడా రానే వచ్చింది.. అందరూ పెళ్లి కొడుకుని చూడమని చెప్పేసరికి ఇష్టం లేకున్నా ముభావం గానే చూసింది.. చూడగానే సిరిలక్ష్మి కి ఎన్నో రోజుల నుండి ఎక్కడో గుందెలలోతులో అనుచుకున్న బాధ తన్నుకొని కన్నీళ్ళ రూపం లో బయటికి వచ్చేసింది. నీకు సంతోషమే కదా? అని అడుగుతూ జరిగింది అంతా చెప్పుకొచ్చారు సిరి లక్ష్మి పిన్నులు అందరూ. మేమందరం నిన్ను చూసి అప్పుడప్పుడు నవ్వుకున్నా కానీ మీ నాన్న గారు మాత్రం నీకు విషయం చెప్పాలి అని చాలా సార్లు అనుకున్నారు కానీ మేము అందరం ఒకే మాట మీద ఉండేసరికి చెప్పలేకపోయారు.. చాలా సార్లు బాధ పడ్డారు కూడా అనగానే సిరి లక్ష్మి రాఘవయ్య నీ హత్తుకొని ఏడ్చింది. అది చూసి అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అదే ఆనందం తో కళ్ళ నిండా ఆనంద బాష్పలతో పెళ్లి పీటల మీద కూర్చుంది సిరి లక్ష్మీ. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంతోషం గా ఉన్నారు వాళ్ళిద్దరూ..' అని చాలా ఆనందం తో చీర చెంగు తో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సుమతి సారిక తో.

' నీకు నచ్చిన విధంగా గా కథ నీ మార్చుకో' అని చెప్పింది. ' అంతా బాగుంది కానీ అమ్మ ఇది ఎవరి కథ. బాగా తెలిసినట్లు గా చెప్పావ్ మొత్తం. ఈ పేర్లు కూడా నేను ఎప్పుడూ వినలేదు. నీ స్నేహితులలో ఎవరిదైనా ' అని అడిగింది సారిక. ' అది కథ కాదు నిజం గా జరిగినది.. ఎవరిదో కాదు మా అమ్మ ది అంటే నీకు అమ్మమ్మ.. అదే మేము ఎప్పుడూ రాధమ్మ కృష్ణయ్య అని పిలుస్తాం కదా అందుకే వాళ్ళ ఒరిజినల్ పేర్లు మీకు తెలీదు. వాళ్ళ జీవితం లో జరిగినదే ఇది అంతా.. నాది మీ నాన్న ది ఇంత గొప్పగా ఉండదు అనిపించింది. అందుకే మా అమ్మ ది చెప్పా నీకు ' అని చెప్పింది సుమతి. ' ఓ అవునా..! నేను ఇంకా నువ్వు పేర్లు మార్చి మీ కథ చెప్తున్నవు అంకున్నాను నేను. ఆక్చువల్ నేనే అమ్మమ్మకి కాల్ చేసి వాళ్ళ ప్రేమ కథ అడుగుదాం అనుకున్న కానీ నువ్వే చెప్పావు.. ఐ లవ్ యు అమ్మా ' అని చెప్పి లాప్టాప్ తీసుకుంది సారిక కథ రాయడానికి. అవున్లే వాళ్ళది అంతా గొప్ప ప్రేమ కాబట్టే ఇప్పటికీ దేశ విదేశాలు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎన్ని గొడవలు పడిన అందులో ప్రేమనే కనిపిస్తూ ఉంటుంది అని సారిక తన మనసులో అనుకొని నవ్వుకుంది.


Rate this content
Log in

More telugu story from Ramya Talluri

Similar telugu story from Classics