బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Classics Inspirational

4.5  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Classics Inspirational

అసాధారణ వ్యక్తి

అసాధారణ వ్యక్తి

7 mins
68


 తెల్లటి గడ్డం, తలపై పాగ, వంటిమీద కుర్తా ఇవి చూడగానే గుర్తు వచ్చే రూపం మోదీగారు. నిరాడంబరంగా ఉంటూనే యూత్ లో కొత్త ట్రెండ్ ని సృష్టించారు మోదీ గారు. అవసరం లేని పాతపోకడలని పెట్టెలో వేసి తాళం పెట్టి నూతన, అత్యున్నత ఆలోచనలకి నాంది పలికారు. అంతే కాదు ఆ ఆలోచనలకి రూపం కూడా ఇచ్చిన మహా యోగి మోదీ.

కేవలం దేశ ప్రజలతోనే కాక ప్రపంచ దేశాల అగ్రులతో కూడా మన్ననలు పొందిన ఏకైక నాయకుడు.


ఆయన అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.‌ సెప్టెంబర్ 17, 1950 లో ఆయన వాద్నగర్, మెహ్సానాజిల్లా, గుజరాత్ లో, అమ్మ హిరబెన్, నాన్న దామోదర్ కి జన్మించారు. చిన్న నాటి నుండే అందరిలా కాకుండా విభిన్నమయిన వ్యక్తిత్వం ఆయనది. కష్టపడే తత్వం ఆయనది. అందుకే ఈ రోజు ఆయన అత్యున్నత స్థాయిలో వున్నారు అని చెప్పగలం. మదిలో ఎంత బారం ఉన్నా, మొహంలో చెరగని చిరునవ్వు ఆయన సొంతం. బాల్యంలో ఆయన వయసు వాళ్ళు అంతా పొద్దు ఎక్కినా లేవకపోయే వాళ్ళు, కానీ ఆయన మాత్రం సూర్యోదయం కాకముందే లేచి తల్లికి అన్ని పనుల్లో సాయం చేసే వాడు. తల్లి చుట్టు పక్కల మహిళలకి ఆయుర్వేద మొక్కల నుంచి మందులను తయారు చేసి అందించేది. ఆ మందులని తయారు చేయడంలో సాయం చేయడానికి ఉదయం నాలుగు గంటలకే లేచి ఆయన అమ్మకి చెయ్యి అందించేవాడు. మోదీకి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయడం అలవాటు. తను ఏదయినా పని మొదలు పెట్టాడు అంటే ముందు దాని గురించి తెలుసుకోవాల్సిందే. అంతే కాదు, తెలుసుకున్నది గుర్తు ఉంచుకొనే వాడు. తల్లికి సహాయం చేయడం అయిపోయాక రైల్వే స్టేషన్లో వున్న తన తండ్రి కి టీ కొట్టులో సహాయం చేసే వాడు. తన స్కూల్ బెల్ మోగే వరకు నాన్నకి పనిలో అన్నీ అందించడం తన రోజూ కార్యక్రమం. తనకి చిన్న నాటి నుండే వన్య ప్రాణులు అంటే ఎంతో ప్రేమ. ఆ భగవంతుడు అంటే కూడా. భక్తి అనేది మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తుంది అని అంటారు ఆయన. పైవాడు మనల్ని గమనిస్తున్నాడు అనే ఆలోచనతో మనం చెడు చెయ్యడానికి బయపడతాం, అంటే ఆధ్యాత్మిక భావం అనేది మనల్ని చెడు చేయనీయకుండా ఆపుతుంది కదా అని అంటారు. కానీ నిజమయిన భక్తి అనేది బయం నుంచి కాదు మన మనసు నుంచి రావాలనేది ఆయన మాట. చదువులో కూడా ఆయన ముందు వుండేవారు. ఎంత పెద్ద వాళ్ళు అయినా తప్పుచేస్తే శిక్ష పడవల్సిందే అనే తత్వం ఆయనది. తన తప్పు లేకున్నా హిందీ మాస్టర్ కొట్టారు అని ప్రిన్సిపల్ కి వెళ్లి చెప్పారు. హిందీ మాస్టారు మీద కోపంతో కాదు, అన్యాయం సహించను అని చెప్పడమే అక్కడ ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయన చిన్ననాటినుండే చాలా పట్టుదల గల మనిషి. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా చేసే కవాతు సరిగ్గా చేయడం లేదు అని పిల్లలందరినీ కర్ర తో కొట్టిన మాస్టారుకి ఎదురు తిరిగి మీరు వారంలో ఒక్క రోజు నేర్పించి రావడం లేదు అంటే ఎలా? మీరే సరిగ్గా నేర్పించడం లేదు అని ప్రశ్నించారు. అయితే నువ్వే చేసి చూపించు అని డ్రిల్ మాస్టర్ విసిరిన సవాలుని స్వీకరించి కవాతుని విజయవంతంగా పూర్తి చేసారు. చిన్న నాటి నుండే ఆయన చాలా పట్టుదల మనిషి. దేశాన్ని కాపాడే సైనికులకు ఉచితంగా చాయ్ ఇచ్చే వారు. సాధువులకీ పేదవారికీ సహాయం చేయడం ఆయనకి చిన్న నాటి నుండే అలవాటు. 


విద్యార్థి దశలోనే తన ఆలోచనలకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు తోడు అయ్యింది. అందులో నాయకుడిగా వ్యవహరించారు. 1970లో విశ్వహిందూ పరిషత్ లో చేరారు. లక్షణ రావు అనే వ్యక్తి విష్ణుపురిలో ఒక దేవాలయ ప్రాంగణంలో పిల్లలకి క్రమశిక్షణ, సమయపాలన లాంటివి అర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నేర్పించేవారు. అందులో మోదీ భాగస్వామ్యం అయ్యారు. మోదీ చురుకుగా పాల్గొనడం చూసి ఆయనకు మిగితా విద్యార్థులకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆయనకి నాయకత్వ లక్షణాలు బాల్యం నుంచే వుండటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఆయనకి చిన్న నాటి నుండే దేశభక్తి ఎక్కువ. ఆ ఇష్టంతోనే ఆయన సైనిక్ స్కూల్లో చదువుకోవాలి అని ఆశపడ్డారు. కానీ వారి తండ్రి ఒప్పుకోకపోవడంతో తన ఇష్టం మార్చుకున్నారు. 


ఆయనకి ఆధ్యాత్మిక భావం ఎక్కువ ఉండేది. ఏదో సాధించాలి అని ఆశ, కానీ తను ఏం సాధించాలి, ఏం చేయాలి, అని ఆలోచిస్తూ కొన్ని రోజులు ఒంటరిగా కుటుంబానికీ సమాజానికీ దూరంగా ఆధ్యాత్మిక మఠంలో జీవించారు. కానీ సమాజానికి దూరంగా జీవిస్తూ ఏం సాధించలేరు అని అర్థం చేసుకొని తిరిగి ఇంటికి బయల్దేరాడు. తన మేనమామ ఆర్టీసీ బస్టాండ్ లో టీ కొట్టు నడిపే వారు. ఆయనకి తోడుగా మోది అక్కడ చేరారు. ఆయనకి సహాయం చేస్తూ కాలీ సమయాల్లో రకరకాల పుస్తకాలు చదువుతూ ఉండే వారు. అర్ టీ సీ వాళ్ళు ధరలు పెంచడం వల్ల వాళ్ళు సమ్మె చేశారు. అక్కడే టీ పెడుతున్న మోదీ, వాళ్ళ నినాదాలు, ఉపన్యాసాలు, విని అందులో నిజం ఉంది అని గ్రహించారు. వాళ్ళకి సహాయంగా మోదీ తన హస్తం అందించి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని, విజయవంతం చేశారు. ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడంతో మొదలు అయిన ఆయన జీవితం అనేక మలుపులు తిరిగింది.


ప్రాంత రీత్యా వివాహ బంధం అనేది మోదికి చిన్న వయసులోనే అయిపోయింది. ఊహ కూడా తెలియని వయసులోనే వివాహం అయిపోయింది. మోదీ గారికి వివాహం జరిగిన అప్పటికి కూడా అమ్మాయికి కాస్త వయసు వచ్చిన తరువాతనే అత్తారింటికి పంపేవారు. అప్పటి వరకు అమ్మవాల్ల దగ్గరే వుండేవాళ్ళు. మోదీ గారికి కూడా అలానే జరిగింది. ఆయన బార్య పేరు జసోదా బేన్.

కానీ మోదికి చిన్న వయస్సు నుండే వివాహం, కుటుంబ వ్యవస్థ మీద అయిష్టం ఏర్పడింది.

అగ్గి లేనిది పొగ రాదు అంటారు కదా! సంసార సాగరంలో చిక్కుక పోతే తను సాధించాలి అని అనుకొనే అద్బుతాలకి రూపం ఇవ్వలేడని భావించిన మోదీకి తనకి తెలియకుండానే అయిష్టం ఏర్పడింది. దానితో తన బార్య అయిన జసోదా బేన్ కి తన అయిష్టంని సున్నితం గా వివరించాడు. ఆమె మోదీకి సమ్మతిని ఇచ్చింది.


ఆయనకి ఒక సోదరి నలుగురు సోదరులు ఉన్నారు. కానీ ఎవరి జీవితాలు వారివి. మామూలుగా మనం చూసినట్టు అయితే రాజకీయంలో ఉన్న చాలా మంది వాళ్ళ సొంత ఆస్తులు, అంతస్తులు, సమకూర్చుకుని వాళ్ళ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు ఆర్థిక బలం లాభం సమకుర్చడం మనం చూస్తూ ఉంటాం. కానీ మోది జీవితం దీనికి పూర్తి విరుద్ధం. వారి కుటుంబం లో ఎవరి జీవితాలు వారివే. ఎటు వంటి లాభాలు ఆశించకుండా వుండటం వారి గొప్పతనం.


ఆయన రాజకీయ ప్రవేశం కొత్త తరానికి ఆశని రేపింది. ఈనాటికీ ఆయన పరిపాలించిన తీరుగా మరెవరూ పరిపాలించలేరు కాబోలు. ఆయన రాజకీయ ప్రస్థానం అంత గొప్పది. కాంకారి అనే వార్డుకి సెక్రటరీగా ఆయన రాజకీయ ప్రవేశం మొదలయింది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి విరుద్ధంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళారు. ఆయన స్వామి వివేకానందకి అనుచరుడి లాంటి వాడు. అహింసాయుత పోరాటం, నిబద్ధత, ఆయన ఆయుధాలుగా ధరించి ఎన్నో సాధించారు. దేశ ప్రజల కొరకు ముక్తవాణి అని ఒక పత్రికలో కబర్ధార్ అనే కలం పేరుతో ఆయన వ్యాసాలు, కథలు, కవితలు రాసి దేశ ప్రజలని దేశం కోసం పోరాడే వీరులలా మార్చారు. ఆయన భహుముక ప్రజ్ఞాశాలి అని మనం గమనించవచ్చు. అంతే కాదు ఆయన చలోక్తులు విసురుతూ ఆయన చెప్పాలి అనుకునే విషయం చెప్పడం లో దిట్ట. ఆయన బుర్ర ఒక పెద్ద బండగరం.


భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-2014 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మోగించి వరుసగా నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. 2019 ఎన్నికలలో మరల గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు.

జన్ ధన్ యోజన్ అనే పథకాన్ని 28 ఆగస్ట్ 2014 లో దేశప్రజలు అందరినీ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడానికి స్థాపించారు.

స్కిల్ ఇండియా మిషన్ అనే పథకాన్ని కూడా అదే రోజున దేశ యువతలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు ఈ పథకం అమలు చేసారు.

మన చుట్టూ ప్రదేశాలు స్వచ్ఛంగా వుంటే దేశం కూడా స్వచ్ఛంగా పరిశుద్ధంగా వుంటుంది అని ఆలోచించి ఆచరించిన మొదటి వ్యక్తి ఆయనే అని చెప్పవచ్చు. దేశ యువతలో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసేందుకు దేశంలోని ప్రముఖులతో, సినీతారలతో కూడా చీపురు పట్టించి మనల్ని మేల్కొలిపి ఇంట్లో చెత్తని కూడా బుట్టలో వేయని లాంటి వాళ్ళతో రోడ్డు మీద చెత్త తీసి బుట్టలో వేసేలా చేసారు. నూతన అధ్యాయానికి తెరలు తెరిచారు.


దేశంలో ఎప్పటినుండో తుప్పు పట్టిన ఆర్థిక వ్యవస్థ దుమ్ము దులిపి నల్ల ధనాన్ని బయటకి లాగే గొప్ప కార్యానికి ఆజ్యం పోసిన మహా యోగి మోదీ.

కానీ అది నూరు శాతం ఫలించలేదు అని నా అభిప్రాయం.‌ ఎందుకు అంటే మామూలు ప్రజలు మాత్రమే బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు బారులు తీరారు. అత్యధిక ధనవంతులు అసలు ఏ లావాదేవీలు చేయలేదు.ఆయన ఆలోచనలో తప్పు లేదు కానీ ఆయన అద్భుత పరిపాలనలో ఇది చిన్న మచ్చ. మనకి వెన్నల వెలుగుని ఇచ్చే చందమామకి కూడా మచ్చ వుంటుంది కదా. దీన్ని పెద్దగా పరిశీలనలోకి తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మన రాజకీయ వ్యవస్థలో గుంటనక్కలకి కొదవలేదు. ముందే నల్లధనం సరిహద్దులు దాటిపోయింది అని నా ఉద్దేశం. జి.ఎస్.టి. ని ప్రేవశ పెట్టి ఆర్ధిక రంగాన్ని అభివృద్ధి చేసారు. ఎన్నో ఏళ్ల నుండి అంతుచిక్కని అయోధ్యని సాధించి పెట్టిన ఘనత ఆయనకి సొంతం అది మానవాళి ఉన్నన్ని రోజులు చరిత్రలో నిలిచిపోవడం కాయం. ఒకటేమిటి, చెప్పుకుంటూ పొతే ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెపితే ఆ చిట్టా తో ఆకాశం చుట్టి రావచ్చు.


మోదీ ప్రవేశపెట్టిన పథకాలు భారత నవశఖాన్ని ఆవిష్కరిస్తున్నాయి.


ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ చాలా వరకు మంచి పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాదు మంచి పాలన అందించేందుకు మరెన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. 2014 మరియు 2019 లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనా లేదా ఉజ్వలా స్కీమ్, ఇలా ఏది తీసుకున్నా వాటిని నెరవేరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మోడీ సర్కార్ ఆన్‌లైన్ మీడియాను విరివిగా వినియోగించుకుంది.


భారత ప్రభుత్వం చొరవతో 700 రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సేవలందిస్తోంది. నెలకు 80 లక్షల మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ సంస్థతో కలిసి ఈ కార్యక్రమం చేస్తోంది రైల్వే శాఖ.డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఆర్థికలావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులు మోడీ సర్కార్ తీసుకొచ్చింది. నగదు లావాదేవీలు తగ్గుముఖం పట్టి... డబ్బులు చెల్లింపులకు కొత్త ఆన్‌లైన్ పేమెంట్ విధానాలు వచ్చాయి.


డిజిటల్ పద్ధతిలో జరిగే లావాదేవీల ద్వారా ప్రభుత్వం అన్ని లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేదాన్ని మానిటర్ చేసేందుకు వీలైంది. అదే సమయంలో పన్ను ఎగవేతదారులపై కూడా ఓ కన్నేసి ఉంచొచ్చు. పన్ను ఎగవేత దారులు ఎక్కువయ్యే కొద్ది... ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంది.


మోడీ ప్రభుత్వంలో డిజిటల్ ఇండియాకు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే డిజిటల్ లాకర్‌ను ప్రవేశ పెట్టారు. ఇది వినియోగించి వినియోగదారులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకునే అవకాశముంటుంది. డిజిటల్ లాకర్‌లో భారత పౌరులు వారికి సంబంధించిన ముఖ్య డాక్యుమెంట్లు, అంటే ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్లను 10 ఎంబీ వరకు ఇందులో భద్రపరుచుకోవచ్చు. వీటిని భద్రపరచుకోవడం ద్వారా ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీలకు డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తే డిజిటల్ లాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయొచ్చు.ఉమంగ్(UMANG) లేదా యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రభుత్వ సేవలను ఈ యాప్ ద్వారా పొందొచ్చు. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్, ఆధార్, పంట బీమా, ఈపీఎఫ్, జాతీయ పెన్షన్ పథకాల సేవలను వినియోగించుకోవచ్చు.అవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుత కాలంలో ప్రపంచ ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి దేశప్రజలని కాపాడటానికి ఆయన పడుతున్న శ్రమ వర్ణాతీతమైనది అని చెప్పవచ్చు. ఏనాటికి ఆనాడు శ్రమిస్తూ, ప్రజల శ్రేయస్సు కొరకు ఆరాట పడుతూ, ప్రజల కొరకు జీవిస్తూ వారి కోసమే జీవితం అంకితం చేసి, వ్యక్తిగత జీవితానికి సమయం కూడా కేటాయించంకుండా శ్రమిస్తున్న నిత్య శ్రామికుడు సాధారణంగా కనిపించే ఓ అసాధారణ మానవా నీకు వందనం. నీలాంటి అధిపతిని పొందుకున్న మేము నిజంగా అదృష్టవంతులం.Rate this content
Log in

Similar telugu story from Classics