broken angel Keerthi

Children Stories Inspirational Children

3  

broken angel Keerthi

Children Stories Inspirational Children

స్వరాల ఫిరంగి

స్వరాల ఫిరంగి

6 mins
271


చిట్టి తల్లి ఏమయిందిరా. ఎందుకలా బుంగమూతి పెట్టుకోనీ కూర్చున్నావు. ఇటు చూడు...అని పదేళ్ల తన కూతురుని తన ఒడిలో కూర్చోపెట్టుకొని తన చీర కొంగుతో కూతురి కన్నీళ్లను తుడుస్తూ అడుగుతుంది పార్వతి.

ఎం లేదు అన్నట్లు గానే నిశబ్ధంగా వుంది కీర్తి కానీ కంటి నుంచి వస్తున్న ఆ ముత్యాల జల్లుకి ఎర్రబడ్డ కళ్ళు తల్లి వైపు చూడటం లేదు. ఆ కంటి నుంచి ఆ జల్లు కురవడం ఆగడం లేదు. ఎం అయింది తల్లి అమ్మతో కూడా చెప్పవా అని అడుగుతున్న పార్వతికి సమాధానం దొరకలేదు. చాలా సేపు బ్రతిమిలాడినా తర్వాత కీర్తి నుంచి అమ్మ అని పిలుపు.

హమ్మయ్య....ఇప్పటికీ అయిన నోరు విప్పింది అని గాలి పీల్చుకొని. చెప్పు తల్లి ఎం అయింది అని కీర్తి వైపు ఆత్రుతగా చూసింది పార్వతి.

మరేమో....ఇంకో అయిదు రోజుల్లో పంద్ర ఆగస్టు కదా అమ్మ. మా బడిలో అందరూ స్వాతంత్య్ర సమరయోధుల్ల తయారు అయ్యి వస్తున్నారు. నాకు వారిలా అవ్వడానికి ఏమి మిగలలేదు. గాంధీ, నెహ్రూ, సుభాష్, అల్లూరి ఇలా అందరూ అయిపోయారు.ఎక్కువగా అబ్బాయిలే కొద్ది మంది అమ్మాయిల కి పాత్ర దొరికింది. అడవారివి వున్న పాత్ర లు అయిపోయాయి. మరి నేను ఎలా పాల్గొనాలి అమ్మా... అంటూ బోరుమంది...

కూతురు అడిగిన ఆ చిన్న ప్రశ్నకి ప్రతి ప్రశ్న కి గలగల పారే యమునా ల సమాధానాలు ఇచ్చే పార్వతి గొంతు మూగబోయింది. స్వాతంత్య్ర సమరయోధుల లో మహిళల పాత్ర ఎందుకు తక్కువగా ఉంది?కొందరు ఎన్నో చేసిన ఎందుకు వారికి అంత గుర్తింపు లేదు?వాటి సమాధానం కీర్తి కి ఎలా చెప్పేది. పదిహేనేళ్ల చిన్నారి తను చెప్పే సమాధానం అర్ధం చేసుకోగలదా. ఆ చిన్ని బుర్ర కి ఆ జవాబు రుచిస్తుందా అని మనసులో అనుకుంటూ.

ఓస్....ఇంతేనా. దినికేనా ఇంతలా ఏడిచేది నీ ప్రశ్న కి నా దగ్గర సమాధానం వుంది కదా!కానీ ఒక షరతు. నువ్వు ఎడవటం అపేసి వెళ్లి మొహం కడుక్కొని వస్తేనే నేను సమాధానం చెప్తాను. సరేనా అని కీర్తి నీ తన ఒడిలో నుంచి లేపింది పార్వతి.

అప్పటి వరకు దిక్కుతోచని తనకి సమాధానం దొరుకుతుంది అని విన్న సమాధానానికి సంతోషం తో సరే అమ్మ అంటూ గబ గబ బాత్రూంలో కి దూరింది. నవ్వుతూ...

గడప దాటి కాలు బయటకి పెట్టడానికి కూడా లక్ష ఆంక్షలు వున్న కాలంలోనే అన్యాయాన్ని ఎదురించి నీచుల గుండెల్లో స్వప్న సింహం ల మీదికి దుకిన వీరవనితలు వారి ఉద్యమ విశేషాలు వివరాలు ఎందుకు ప్రాచుర్యం లోకి రాలేదు అంటే మనసుకి తెలిసిన సమాధానం పెదవులు దాటి రాలేదు.

ఆలోచనలకి కళ్లెం వేస్తూ అమ్మ నేను వచ్చేసా అని కూతురి స్వరం....

నవ్వుతూ వచ్చిన కూతురి నీ ఒడిలో కూర్చో బెట్టుకొని. సరే లక్ష్మీబాయి, రుద్రమా, హజ్రత్ మహల్,సరోజినీ నాయుడు, అనిబిసెంట్ ఇలా బోలెడు మంది ఉన్నారు. తెలుసా?

అయ్యో పిచ్చి మమ్మీ. వాళ్ళు అందరూ అయిపోయరు అందుకే గా నేను ఏడిచింది. అని మూతి కి అడ్డుగా చెయ్యి పెట్టుకొని ఒక చేయి కడుపు మీద వేసుకొని నవ్వింది కీర్తి.

కీర్తి నవ్వు చూసి పార్వతి చిన్న నవ్వు నవ్వి. అయ్యో ఈ పిచ్చి అమ్మకి ఎం తెలియదు. నా కీర్తి కీ అన్ని తెలుసు నా బంగారం అని అంటూ వంట గదిలోకి వెళ్ళి గిన్నెలో పప్పు అన్నం కలుపుకుంటూ వచ్చింది. ఆ గిన్నె నీ చూడగానే వద్దు మమ్మీ అంటూ బుంగమూతి పెట్టింది కీర్తి. బయటకి పారిపోతున్న కూతురు చెయ్యి పట్టుకొని కూర్చో బెట్టి నేను చెప్పినట్టు నువ్వు అన్నం మొత్తం తింటే నీకు ఎవరికి తెలియని గొప్ప స్వాతంత్య్ర యోధుల గురించి చెప్తాను.

ఆనందం తో కూడిన ఆరాటం తో నిజమా అమ్మ...! అని అంటూ అమ్మ ఎం చెప్తుంది అని తనవైపే చూస్తూ...

నిజమే తల్లి అంటూ తన నోటిలో ముద్ద పెడుతూ...

నీకు తెలుసా ఒక వైపు బ్రిటీషు వాళ్ళ వేధింపులు తాళలేక దేశం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న కాలంలో మన రాష్ట్రంలో నిజాం పాలన సాగేది. అప్పటికి స్వాతంత్రం కోసం పోరాటాలు,ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. బ్రిటీషు వారి తో చేతులు కలిపి సామాన్య ప్రజలనీ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు.

చిత్రహింసలు అంటే ఎం చేసే వాళ్ళు అమ్మా....

వాళ్ళకి ఏదయినా నచ్చింది అంటే అది వారికి కావాల్సిందే. అది ఇవ్వడం వారికి ఇష్టం లేకపోయినా తప్పదు. వాళ్ళు ఇవ్వమని అంటే ఇవ్వవల్సిందే. నేను ఇవ్వను అని ఎదురు తిరిగితే వాళ్ళని రాళ్లతో కొట్టి,కత్తులతో పొడిచి చంపి వాళ్ళ కుటుంబాన్ని,స్నేహితులని కూడా అవమానించి,కష్టపెట్టే వాళ్ళు ఆనందించేవారు. వారు పెట్టే కష్టలాకి బయపడి ఎవరు వారికి ఎదురు తిరిగే వారు కాదు. వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోవలి. వారి ముందు తల వంచుకునే వుండాలి. అల చాల ఆంక్షలు వుండేవి తల్లి.

మరి ఎవరు వాళ్ళని ఎం అనకపోయే వారా?

అనేవాళ్ళు తల్లి. వాళ్ళని ఎదురించి చాలా మంది వచ్చేవాళ్ళు. రెండు నెలల క్రితం మనం తాతయ్య వాళ్ళతో కలిసి జోడేగట్ కి వెళ్ళాం గుర్తు వుందా. ఆ ఊరిలో నువ్వు ఎం గమనించావూ?

అందరూ ఇంకా కట్టల పోయి మీద వంటలు చేస్తున్నారు. వాళ్ళ బట్టలు మనల చుడీదార్,జీన్స్ కాకుండా వేరేలా వుంది. అక్కడ వాళ్ళు వాడే ఆయుధాలు,వేట కోసం వాడే కత్తులు వున్నాయి.

హ్మ్మ్...అలానే వారు మన కోసం చేసిన త్యాగానికి గుర్తులు కూడా వున్నాయి. మన కోసం వాళ్ళు అక్కడ ప్రాణాలు అర్పించారు. మన్యం వీరుడు గా పిలిచే కొమరం భీమ్,అగ్గిపిడుగు అల్లూరి లాంటి ఇంకా ఎంతో మంది మన కోసం అక్కడ ప్రాణాలు అర్పించారు తల్లి. వారి జీవితాల గురించి చరిత్ర కారులు రాయడం వలన మనకి వారి గురించి తెలిసింది. ఒక వేళ ఎవరు రాసి వుండక పోయివుంటే. మనకి తెలియక పోయేది. అలానే ఇంకా ఎంతో మంది మన కోసం ఆ చోట ప్రాణాలు అర్పించారు తల్లి.

మరి వారి గురించి ఎందుకు ఎక్కడా లేదు కదా అమ్మ?

మన ప్రాంతం మొత్తం అడవులతో నిండి వుంది. అక్షరాస్యత చాలా తక్కువ అలాంటి సమయం లో స్వాతంత్రం కోసం పోరాడిన వారి గురించి రాసేది ఎవరు?అందుకే చాలా మంది గురించి ఎవరికి తెలియదు చిట్టి తల్లి.

కానీ మా నానమ్మ నాకు అన్నం తినిపిస్తూ తను విన్న ఒక యోధురాలు గురించి చెప్తూ వుండేది.

ఎవరు అమ్మ అవిడా...

ఆమె పేరు కొండవీటి ఇందిరమ్మ. అందరూ ఆమెని ఇందమ్మ అని పిలుస్తూ వుండేవారు. నల్గొండ జిల్లా, తాళ్ళవెల్లి లో 1917 లో ఆమె జన్మించారు. ఆ కాలంలో చిన్న వయసులోనే వివాహం జరిగిపోయేది. ఇందిరమ్మ ది కూడా అలానే చిన్న వయసులోనే బుచ్చి రెడ్డి తో జరిగింది. బుచ్చిరెడ్డి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. ఆయన ముందు అన్యాయం కనిపిస్తే చూస్తూ వుండే మనస్తత్వం కాదు తనది. రాముడి వెంట వనవాసానికి వెళ్ళిన సీత ల..బుచ్చి రెడ్డి చేసే సమాజ సేవ లో తను కూడా బాగస్వమురాలు అయ్యింది. భర్త క్వీట్ ఇండియా ఉద్యమం లో బాగంగా నల్గొండ మరియు చుట్టూ పక్కల ప్రాంతాల లో ప్రజలని చైతన్య పరిచే వాడు. అదే సమయంలో ఇందిరమ్మ కూడా బతుకమ్మ పాట ల రూపంలో నిజాం పాలన లో వారు పడుతున్న కష్టాలని,కన్నీళ్లను,వాటి పరిష్కారాలు అన్ని కలిపి పాడేది. ఆవిడ బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటే. ప్రజల్లో ఎంతో ఉత్సాహం వచ్చేది సంగీతానికి రాళ్ళని సైతం కరిగించే శక్తి వుంది అని అంటూ వుంటారు. నాకు ఎందుకు లే అనుకునే వ్యక్తులను సైతం ఉద్యమ పోరులో పరుగులు పెట్టించే శక్తి తన స్వరానికి వుండేది .నీతి శాస్త్రం,భారతం,రామాయణ గాథలను ఉదాహరణలు గా చెప్తూ ప్రజలని చైతన్య పరిచి దేశానికి సేవ చేసే దిశగా అడుగులు వేయించింది.

క్వీట్ ఇండియా ఉద్యమం లో ఎంతో మంది ప్రజల్ని పాల్గొనేలా చేసింది. తన స్వరం తో ప్రజలని చైతన్య పరుస్తూన్న విషయాన్ని తెలుసుకున్న నిజాం ప్రభుత్వం,బ్రిటిష్ ప్రభుత్వం తనని బందించమని హుకుం జారీ చేసింది. ఇందిరమ్మ ప్రకృతి వైద్యం లో ఆరితేరింది. ఉద్యమ పోరులో క్షతగాత్రులు గా మరే వారికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడేది. ఆడ వారిపై జరుగుతున్న అన్యాయాలను తన పాట ల రూపంలో ప్రశ్నించేది . నిజాం ప్రభుత్వం ఇవన్నీ తెలుసుకొని వుండలేక పోయింది. తను ఎక్కడికి వెళ్లినా తనని పట్టుకోవడానికి నిజాం ప్రభుత్వం ప్రయత్నాలు చేసేది. చాలా ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ రోజు రోజు కి తనను పట్టుకోవాలని జరిగే ప్రయత్నాలు మమ్మరం అయ్యి తన కోసం మామూలు ప్రజలకి హింసలు ఎదురు అయ్యాయి. దానితో మూడేళ్ల పాటు అజ్ఞాతంలో కి వెళ్ళిపోయింది. కానీ తన అత్యవసరం అయిన ప్రతి చోట తను ప్రత్యక్షం అయ్యేది. దాని తరువాత 1949 నుంచి 1953 వరకు వారి స్వగ్రామం లో పోస్ట్ ఆఫీస్ కి బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వహించింది. ఆ సమయం లో ఆడపిల్ల బయటకి రావడం అంటేనే చాలా పెద్ద విషయం ఈ కాలంలో తను చేసిన కృషి మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ ఆ సమయంలో అది చాలా పెద్ద విషయం.

అమ్మ ఇందిరమ్మ నిజంగా ఆ సమయంలో చాలా కష్టాలు పడింది అమ్మ.

తను కేవలం ఉదాహరణ తల్లి అలాంటి మహిళ ఉద్యమకారులు కోకొల్లలు. ఎవరు వారి గురించి రాయక ఎవరికి తెలియదు. కనీసం ఆమె ఎలా వుంటుంది అని కూడా ఎవరికి తెలియదు. కానీ మా నానమ్మ చెప్తూ వుండేది. ఆమెను చూస్తే మొహంలో ఎంతో కాంతి కనిపించేది. తనతో మాట్లాడితే గుండెల్లో లేని ధైర్యం పుట్టుక వచ్చేది అని.

అమ్మ ...రూపం తెలియని ఆమె వేషాన్ని నేను వేసుకుంటా అమ్మ తను కట్టే ఖద్దరు చీర చాలు అమ్మ. ఎవరి వేషం అని అడిగినప్పుడు తన కథ నీ అందరికీ చెప్పి వారి గురించి అర్ధం అయ్యేలా చేస్తాను అమ్మ. అంతే కాదు అమ్మ. అలాంటి వారి గురించి నేను తెలుసుకొని సమాజానికి కూడా వారి ఉనికిని పరిచయం చేస్తాను. చరిత్ర నీ తిరగరాసి వారు పడిన కష్టానికి,చేసిన కృషి కి,త్యాగానికి న్యాయం జరిగేలా చేస్తాను అని చెప్తున్న తన చిట్టి తల్లి కళ్ళలో కనిపించిన కాంతికి పార్వతి కనులు చెమ్మగిల్లాయి. కాలీ అయిన అన్నం గిన్నెను పక్కకి పెట్టీ కీర్తి నీ ఆత్మీయంగా గుండెకు హత్తుకుంది.

శుభం.....


Rate this content
Log in