broken angel Keerthi

Inspirational

3.8  

broken angel Keerthi

Inspirational

మైథిలి ❤️ శారా

మైథిలి ❤️ శారా

13 mins
417


నేను మైథిలి నీ చూసింది అదే మొదటి సారి

అందరూ ఒరేయ్ నికు పెద్ద పోస్ట్ వచ్చింది రా..నికు చెల్లెలు పుట్టింది....అంటూ అందరూ నాకు స్వీట్ లు తినిపించారు....ఆ వయసులో అన్ని విషయాలు గుర్తు లేవు కానీ ఆ క్షణం మొదటి సారి తన నీ చూసింది మాత్రం స్పష్టం గా గుర్తు వుంది....

తను చాల అల్లరి పిల్ల...నాకంటే ఎక్కువ ధైర్యం గా వుండేది...నేను సైకిల్ నేర్పిస్తాను పదా అంటే...నికు ఒక విషయం చెప్తా అమ్మకు చెప్పకు అని చెప్పింది..

సరే అనే సరికి....తన ఫోన్ లో క్యలుకులేటే రే ల కనిపించే ఒక ఫొటోస్ దాచే అప్ లో తను అపాచీ బైక్ పై స్తంట్లు చేసే ఫోటో లు వీడియో లు చూసే వరకు దాని ధైర్యం నాకు తెలియదు..స్కూల్ లో ఎవరయినన ఎం అయిన అంటే రౌడీ పిల్ల లా అందరినీ బెదిరించే ది...అంతే కాదు తన తోటి వారికి కష్టం వస్తె అస్సలు ఊరుకునేది కాదు..

చదువులో కూడా ముందు వుండేది...అలాంటిది సర్డన్ గా ఒక రోజు బైక్ ఏక్సిడెంట్ లో మాకు దూరం అయ్యింది....

కానీ పోలీసుల ఎంక్వయిరీ లో...తనది ఏక్సిడెంట్ కాదు సూసైడ్ అని అనుమానం పడుతున్నారు...ఎందుకు అంటే తనకు ఎది వచ్చి గుద్దుకొలేదు...ఆ సమయంలో తన ఆరోగ్యం కూడా బాగానే వుంది...అంతే కాదు టీనేజ్ అమ్మాయి కాబట్టి ఏదయినా ప్రేమ వ్యవహారం అనే కోణం లో కూడా చూసారు...అందరూ తను చాలా మంచిది అందరితో ఒక ఫ్రెండ్ ల మాత్రమే వుండేది ఎవరితో ప్రేమ లేదు అని అన్నారు..ఎంత ల ఆలోచించిన తన మరణం వెనుక గల రహస్యం తెలియలేదు..

మేము ఈ బాధ లో వుంటే బంధువులు చుట్టూ పక్కల జనాలు పిల్ల ఎవడి తోనో తిరిగి మోసపోయి వుండవచ్చు అందుకే సూసైడ్ చేసుకుంది కావచ్చు అని మాటలు... అవన్నీ విని అమ్మ తట్టుకోలేక ఇప్పుడు ఇలా...అని అంటూ సుధా కన్నిలు పెట్టుకున్నాడు ..

అయ్యో అన్నయ ఎందుకు ఏడుస్తున్నారు...మీరు ఎడవడాం లో తప్పు లేదు కానీ ...అసలు మైథిలి ఎలా చనిపోయింది ముందు తెలుసు కోవాలి...

పోలీసు లు అటువంటిది తెలుసు కొలేక పోయారు...మనం ఎలా తెలుసు కొగలం...

అది అంత నేను చెప్తా...ముందు పారూ దగ్గరికి వెళ్దాం పద....

థాంక్స్ సిరి పదా...అని హాస్పిటల్ కి వెళ్ళారు...

సిరి నీ చూడగానే మైథిలి వాళ్ళ అమ్మ..బంగారం వచ్చేసవా...ఎం అయింది రా చిక్కిపోయవు...బాగా చదువుకో బంగారం అని...ఇన్ని రోజులూ సైలెంట్ గా వున్న అమ్మ నీ అల చూడగానే సుధ కంట్లో నిల్లు తిరుగుతాయి...అద్దాలు తీసి కన్నీళ్లు తుడుచుకొని మైథిలి వంక చూస్తాడు సుధా థాంక్స్ అని చెప్పే చూపులతో...మనకు థాంక్స్ లు అవసరమా అనే చూపుతో సిరి చూసి నవ్వుతుంది...


బయటకి వచ్చాక బెకేరి లో కూర్చున్నారు ముగ్గురు...కూల్ డ్రింక్స్ తాగుతూ...

సిరి సైలెంట్ గా కూర్చొని వుంది....తనని చూసి ఎం అయింది సిరి ఎందుకు అంత సైలెంట్ గా వున్నావు నువ్వు ...మీ అమ్మ గుర్తు వచ్చిందా...

అయ్యో అల ఎం లేదు రామ్...

నిజం చెప్పు...

ఎం లేదు అని అంటున్న గా..

సరే సరే విసుగు కొకు..

అవును సుధా అన్నా...మైథిలి కి క్లోజ్ ఫ్రెండ్స్ లేరా...

తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే...ఒక్కతే ఉంది..తనకు రీసెంట్ గా పెళ్లి అయ్యింది...కానీ ఎం అయిందో తెలియదు..ఆ అబ్బాయి నీ వదిలేసి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది...అందరూ తనను నాన రకాలుగా అన్నారు...

పుట్టింట్లో వున్నట్లు అత్తారింట్లో వుంటే ఎలా సర్ధుకోవలి....ఆ మాత్రం ఓపిక లేకుంటే ఎలా...అయిన తనను కాదులే పెంచిన అమ్మ నాన్న నీ అనాలీ..అసలు ఏమీ నేర్పలేదు...కనగనే సరిపొద్ధ...అని...

అబ్బాయి వెస్ట్ కావచ్చు ...మంచివాడు కాదు కావచ్చు అని మరి కొందరు...

పెళ్లి కి ముందు ఎవరితో నో తిరిగిన విషయం తెలిసి తరిమేశారు అనీ రకరకాలుగా అనుకుంటున్నారు...

మాతో పాటు పెరిగిన అమ్మాయి కాబట్టి తెలుసు...తన చాలా మంచిది...పైవి నిజం అని నాకు అనిపించలేదు..

అసలు నిజం ఏమిటో మీరు అడగడానికి ప్రయత్నం చేయలేదా ..

లేదు ....చెల్లి చనిపోయిన 3 వ రోజు తన పెళ్లి ్...తను చనిపోయాక కూడా తను రాలేదు...అందుకే నాకు తనతో ఎందుకో మాట్లడా లనీ అనిపించలేదు...

అయినా మైథిలి గురించి తెలుసు కుంట అని వల్ల ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు ఎందుకు...

అమ్మ నాన్న అక్క చెల్లి అన్నా తమ్ముడూ ...విల్లకు చెప్పని విషయాలు కూడా మనం ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాం...అంటే మైథిలి కూడా తన ఫ్రెండ్ తో చెప్పుకొని వుంటుంది....తనను కలవడం ఎలా...

మా ఇంటి దగ్గరే...వుండు కాల్ చేసి..ఇంట్లో వుండ మని చెపుతా...తను పెయింటింగ్ నేర్పిస్తుంది చిన్న చిన్న ఇన్స్టిట్యూట్ ల లో...స్కూల్స్ లో...

పరవాలేదు మనం వెళ్ళక కలుద్దాం ..మీరు ఫోన్ చేయకండి...

ఎందుకు సిరి....

వెయిట్ అండ్ సీ రామ్....

సిరి...ఇంత రాత్రిపూట ఎక్కడ కి వెళ్లవు...అయిన మా ఊరిలో ఎవరు నికు తెలియదు గా...

ఊరికే..చల్ల గాలికి బయటకు వెళ్ళ...మీ ఊరు చాలా బాగుంది సుధా...

థాంక్స్ రా...అదిగో మైథిలి గదీ..నువ్వు అందులో పడుకో..మేము ఇక్కడ హల్ లో పడుకుంటాం...ఎం అయిన కావాలి అంటే పిలువు...అవును నిన్ను ఎవరు అయితే చూడలేగా...

లేదు ఎందుకు సుధా...

ఎం లేదు రా..అందరికీ నువ్వు ఎవరూ అని తెలియదు గా...ఇంత రాత్రి బయటకు వెళ్లవు..నువ్వు మైథిలి అనుకొని ఎవరయినా తెంక్షన్ పడతారు అని..

ఎందుకు తేంక్షన్..

ఎం వుంది నువ్వు దయ్యం అని అనుకుంటారు అని....అని రామ్ వెటకారం గా అంటాడు...

ఓయ్....అని చిరుకోపం గా అంటుంది సిరి..

అయిన నువ్వు నిజం గా దయ్యనివే ఆ విషయం నాకు తెలుసు...

సిరి షాక్ గా చూస్తోంది...సుధా కూడా ఎం అర్థం కాలేదు అని అనట్లు చూస్తాడు...రామ్ వంక...

ఎందుకు అల చూస్తున్నారు...అవును మరి నాకు పిచ్చి ఆకలి వేస్తుంది...మీకు ఆకలి కాకపోతే ఇంకా ఎవరికి కాదా...

తనను చూసి సుధ సిరి ఇద్దరు నవ్వుతారు...

మీకు ఎగతాళిగా వుందా...నన్ను ఆకలితో అలమటించే ల చేసిన నిన్ను వదల బొమ్మాళి వదల...

సరే లే.....వుండు 2 మినిట్స్ లొ వంట చేస్తా...

2 మినిట్స్ అంటే మ్యాగి చేసి పెడతావా ఎంటి...ఎలుకలు పరిగెడుతూ వుంటే అది సరిపోతుంది కావచ్చు...ఏనుగులకు సరిపోదు మరి...

ఒకే....5 మినిట్స్ ...అని నవ్వుతూ కిచెన్ లోకి వెళుతుంది....

బయట డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని...అవును సిరి ఈషా ఎం అయింది...తనకు అసలు కాల్ చేశావా....

లేదు రామ్..చాలా డేస్ అయ్యింది...రేపు చేస్తా...

వంట...వచ్చా...ఎం అయిన హెల్ప్ చెయ్యల...

పర్లేదు కొంచం కొంచం వచ్చు...

కొంచం అంటున్నావు అంటే...అవును రా సుధా...యిప్పుడు మెడికల్ షాప్ లు ఓపెన్ వుంటాయా...

ఎందుకు రామ్...

ఎం లేదు వంట తిని వాంతులో మోషన్స్ ఓ అయితే ..ముందు జాగ్రత్త కు అడిగా...

రామ్...నువ్వు అని నవ్వుతూ....సిరి హాట్ పట్ తెచ్చి ముందు పెడుతుంది..

రామ్ వెంటనే ఓపెన్ చేసి ....అబ్బా ....ఉప్మా నా...

ఎం వద్దా...

లేదు కానీ...ఆకలిగా వుంటే...సమస్తము అమృతమే...ఎం చేస్తాం...అని ప్లేట్స్ లో

వేస్తాడు...

సిరి వాటర్ బాటిల్స్ తెస్తుంది...

సుధా కొంచం తిని...చాలా బాగుంది రా అని అంటాడు ..రామ్ కూడా చేతి తో బాగుంది అని సైగ చేస్తూ గబ గబ తింటున్నాడు...

అవును సిరి నికు మా ఉప్మా చేయడం ఎలా తెలుసు...

ఇదిగో అని ఫోన్ చూపిస్తూ... అంతా గూగుల్ మమ్మీ మేజిక్..5 మిన్ లో అయ్యే వంట అంటే చూపించింది...సెల్ఫ్ లో అదే ప్యాకెట్ కనపడే సరికి చేసేసా...

అయ్యో...సిరి...అది ఉప్మా కాదు ఇడ్లీ రవ్వ...

సిరి రామ్ ఒక్కసారిగా ఆగిపోయారు...ఏ పర్లేదు ఎం కాదు అని మళ్లీ రామ్ తినడం స్టార్ట్ చేస్తాడు...

సుధా సిరి నవ్వుకొని ఇక వాళ్ళు కూడా తినేస్తారు...

ఒకే బాయ్ గుడ్ నైట్..అని రామ్ కి చెబుతుంది...సిరి...

అంతే నా మీ అమెరికా వాళ్ళు గుడ్ నైట్ ఇలా నే చెబుతారా...

ఎ...ఇండియా లో వేరే ల చెబుతారా...

ఇంగ్లీష్ మూవీలలో హాయ్...చెప్పిన...బాయ్ చెప్పిన...ఒక హుగో లేక కిసో ఇస్తారు గా...

షాటుప్ ఒకే.. బాయ్...అన్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఏ...అని డోర్ దగ్గరికి వేస్తుంది...

ఒరేయ్ చాలు లే రారా...అని దుప్పట్లు సర్దుతూ అంటాడు సుధా..

రామ్ డల్ గా వచ్చి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు...


గుడ్ మార్నింగ్ రామ్... ఇదిగో కాఫీ...

హ్మ్మ్..థాంక్స్ సిరి....అని కాఫీ కప్పు తీసుకుని తాగుతూ....నోట్ బ్యాడ్...

హ్.,సరే అని లేచి వెళ్ళ బోతుంది...రామ్ సిరి చెయ్యి పట్టుకుని...కాసేపు వుండవచ్చు గా...

హ్మ్మ్...అని పక్కన కూర్చుని రామ్ వంక చూస్తుంది..

రామ్ సిరి కల్ల వైపు చూస్తూ ఎంటి రాత్రి పడుకొలేదా...కనులు ఎర్రగా ఉన్నాయి....

సిరి కొంచం తెంక్సన్ పడుతుంది...

అది చూసి...రామ్..ఎందుకు సిరి బయ పడుతున్నావు ....కొత్త ప్లేస్ కథ అలానే వుంటుంది...అవును సుధా గాడు లేడు...

ఏమో...పొద్దునే ఫోన్ వస్తె వెళ్ళిపోయాడు...

డోర్ సౌండ్ కి ఇద్దరు బయటకి చూస్తారు...

ఎం అయింది రా సుధా అల వున్నావు....

ఎం అయింది అన్నయ అని చైర్ లో కూర్చుంటున్నా సుధా కి కాఫీ కప్పు అందిస్తుంది...సిరి...

అది తీసుకొని ...ఎం చెప్పను సిరి....మైథిలి బెస్ట్ ఫ్రెండ్ వుంది అని చెప్పా కదా తను నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయింది....ఇంట్లో ఫ్యాన్ కి...

వాట్ .....శారా...ఎందుకు ఇలా చేసావు....నువ్వు ఇలా చేస్తావు అని తెలిస్తే నేను నిన్ను అసలు కలిసే దాన్నే కాదు....ఇది అంతా నావల్లే....నా వల్లే నువ్వు చనిపోయావు....

సిరి నికు ఎం అయిన పిచ్చి పట్టిందా....ఎం అయింది...అసలు శారా ఎవరు....

నువ్వు వుండు రామ్....మైథిలి ......

సిరి వెనక్కి తిరిగి చూస్తుంది...

డోర్స్ క్లోజ్ అయ్యాయి...రామ్ కి సుధా కి ఈ ఎం అర్థం కాలేదు....

భయపడకండి...నేను మైథిలి నీ రా....సుధా అని సుధా వంక చూస్తూ అంటుంది....

పొట్టి నువ్వా....అని అమాంతం వచ్చి హగ్ చేసుకొని అసలు ఎం అయిందే....నితో మళ్లీ నితో మాట్లాడే అవకాశం ఉంది అని అనుకోలేదు రా...

చిన్నగా నవ్వి....అది చెప్పడానికే వచ్చాను...

నిజమే నేను సూసైడ్ చేసుకున్న.....క్షణిక అవేశం అని అంటారు కదా నిజమే నేను చేసిన చిన్న పొరపాటు వలన నా జీవితం నీ నేను కోల్పోయాను...జీవితం ఒక్క సారి పోయింది అని అంటే అది మళ్లీ తిరిగి రాదు ...చనిపోయాక నేను మళ్ళీ బ్రతకాలని ఎంత ఆశ పడిన వ్యర్థమే అని నాకు జీవం లేని నా శరీరం అగ్నికి ఆహుతి అవుతూ వుంటే గాని అర్థం కాలేదు....

సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి రా...అందరూ పిరికి వారు అంటారు కానీ...

నేను చనిపోవడానికి ముఖ్య కారణం నేనే....శారా చనిపోవడానికి కూడా....

ఎంటే...నువ్వు అనేది...

అవును రా నేను....నేను .......అని ఆగి...నేను లేస్బియన్ ని రా....అవును నేను ఒక లెస్బియన్ నీ...

.శారా అంటే ఎందుకు అంటే తెలియదు కాని...నాకు చిన్నప్పటి నుంచీ పిచ్చి దానికి కూడా ....నేను అంటే చాలా ఇష్టం రా....నేను అన్నం తినే వరకు అది తినేది కాదు...ఇద్దరం ఒకరికి ఒకరం తినిపించుకొనే వాళ్ళం...కలిసి చదువుకొనే వాళ్ళం... ఆడుకొనే వాళ్ళం...ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళం...దాన్ని చూడక పోతే నాకు అసలు ఎం తోచక పోయేది....దానికి దెబ్బ తగిలితే నాకుదెబ్బ తగిలినంత గా అనిపించేది..మేము వయసుకు వచ్చే వరకు దానిని స్నేహం అనే అనుకున్నాం...అంతెందుకు మొన్నటి వరకూ అలానే అనుకున్నాం...కానీ దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసాక...దాన్ని వదిలి నేను ఉండగలనా అని అనిపించింది....అది నాతో కాకుండా మరొకరితో వుండటం నేను అసలు ఊహించుకొలేక పోయా...అందరి అమ్మాయిల ల నాకు ఫేవరేట్ హీరో లు లేక పోవడం ...నాకు ఇంట్రెస్ట్ లేక అనుకున్న కానీ తరువాత నన్ను నేను అందరితో పోల్చి చూసుకున్నాక కానీ అర్ధం కాలేదు నేను ఒక లెస్బియన్ అని....

లోకం లో అబ్బాయిలు అమ్మాయిలు కొందరు అందం చూసి ఆస్తిని చూసి మరికొందరు వాళ్ళతో శారీరికంగా ఇష్ట పడి....చాలా కొద్ది మంది మనసుని చూసి ఇష్టపడతారు...వాళ్ళ ప్రేమ అందరి కంటే గొప్పది....

నేను శారా నీ ఎటువంటి శారీరిక జీవితం గురించి ప్రేమించలేదు తనని తాను గ ప్రేమించాను....తన మనసుని ప్రేమించాను.... తాను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది...కానీ మమ్మల్ని ఈ లోకం అర్థం చేసుకోలేదు ....వాళ్ళ అమ్మ కు మా విషయం చెప్పాం....మీకు కనిపించకుండా దూరం గా వెళ్లి బ్రతుకుతం...మీకు కావలసింది శారా బాగుండాలి అంతే గా....నన్ను నమ్మండి... మీకు తెలుసు కదా తనను నేను ఎంత బాగా చూసుకుంటా నో...నన్ను నమ్మండి అంటి అని....

అసలు మీరు ఎం చేద్దాం అనుకుంటున్న రు....కనీసం ఎం అయిన అర్థం అవుతుందా మీకు...మీరు అనుకున్నంత ఈజీ కాదు ....జీవితం లో మీకు ఇంకా ఎం తెలుసు....సమాజం నీ ఎదుర్కొని మీరు బ్రతక గలరా....తమ్ముడు తో బైక్ పై వెళితే నే తిరుగుబోతు అనుకొనే యి లోకం లో మీరు అందరినీ ఎదిరించి బ్రతకగలరా...మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతారు...ఎగతాళి చేస్తారు...భయపడతారు...మీతో మాట్లాడటానికి యిష్ట పడరు...మీ వెనక వుండే అవహేళన లు అధిగమించి ఎదుర్కొనే శక్తి ధైర్యం మీకు వుందా...

నేను యిష్టం లేదు అని చెప్పిన మీరు పారిపోయి బతుకుతారు ...కానీ తరువాత మళ్ళీ మా దగ్గరికి రాలేక...మీ బాధ నీ ఎవరితో పంచుకొలేక నలిగి పోతూ మీరు జీవం లేని బొమ్మల వుండవలసి వస్తుంది ...కాలం ఒక్క సారి చేజరక మళ్లీ తిరిగి రాదు...మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సాయం చేస్తా....ఎందుకు అంటే మీరు అంటే నాకు ఇష్టం మీరు నా పిల్లలు....

అని ఆంటీ చెప్పక ...మేము ఆలోచనలో పడ్డం...మా లాగే పెళ్ళీలు చేసుకున్న వారి గురించి న్యూస్ లో చుసం ...అటువంటి వారిని ఫేస్ బుక్..ట్విట్టర్ ల ద్వారా కలిసి...వాళ్ళ వివాహ బంధం ఎలా వుంది...వాళ్ళ మధ్య ప్రేమ ముందు లానే వుందా మారిపోతుందా అని గమనించాం...

మా ఇంట్లో నాన్న లేకపోవడం వల్ల నో ఏమో ఏ వివాహ బంధం అయిన చిన్న చిన్న మనస్పర్థలు...అలకలు వుంటాయి అని అర్థం కాలేదు...

మాలగే పెళ్లి చేసుకున్న వారిలో....సఫలం అయిన వారు విఫలం అయిన వారు వున్నారు..మనసు మంచి కంటే ముందు చెడు నే గుర్తు ఉంచుకుంటుంది ...అందుకే కాబోలు నాకు అవే గుర్తు వున్నాయి వాళ్ళ లానే నా జీవితం అయిపోతే  నేను తట్టుకోలేను అని అనిపించింది....కానీ బయట పడలేదు...తను నాతో లేకుంటే నేను ఉండలేను అని అనిపించింది....తనతో జీవించాలి అనే నా కోరిక నీ ఎంత మానుకోవాలని చూసిన నా వల్ల కాలేదు...నన్ను నేను ఎంత గా అనుచుకున్న నా వల్ల కాలేదు...

కానీ మనసులో ఎదో ములా ఒక బయం...తనకు ఒక వేళ ఎవరయినా అబ్బాయి నచ్చితే తను నా కోసం తన కోరికలను వదులు కుంటుంద...ఆ ఆలోచన మనసులో పతుకపోయుంది.

అనుమానం పెనుభూతం ....తనతో కలిసి కొన్ని రోజుల వరకు బాగానే వున్నాము....ఒక రోజు ఆఫీస్ లో టూర్ వుంది అని వెళ్ళింది...వచ్చాక తనలో మార్పు.... ఎవరో అబ్బాయి తో చాలా సేపు చాటింగ్....ఒక్కో సారి బయటే డిన్నర్...

తనలో ఆ మార్పు నీ నేను తట్టుకోలేక పోయాను...ఒక రోజు నిలదిశను...

నీ పద్ధతి ఎం బాలేదు....

ఎం అయింది మైథిలి....

అసలు నీ మనసులో ఎం వుంది చెప్పు....నా తో వుండాలని లేకపోతే పో...అంతే కాని ఇలా చేసి నన్ను విసిగించకు...

అసలు ఎం అయింది నికు అని అప్పటి వరకు బట్టలు సర్ధుతున్న శారా బీరువా తలుపు పెట్టీ మైథిలి ముందు కు వచ్చింది....

మైథిలి నన్ను చూడు...నా కళ్ళలోకి చూడు....

ఏదయినా కలిసి మాట్లాడుకుందాం....ఎం అయింది చెప్పు...

ఎం కాలేదు.... నాతో నికు రిలేషన్ షిప్ ఇష్టం లేదు కదా....

అల ఎందుకు అంటున్నావు....నువ్వు నా బెస్ట్ పార్టనర్ రా....

లేదు...నికు ఒక అబ్బాయి అంటే ఇష్టం కదా...నువ్వు చాటింగ్ లు చెయ్యడం....డిన్నర్ కి వెళ్ళడం చూస్తూ నే వున్న....నా కోసం నువ్వు నీ కోరికలను ఆశలను చంపు కోవలసిన అవసరం లేదు...మూవ్ అన్....అని చేతిలో ఉన్న రిమోట్ నీ విసిరి కొట్టింది....అది జారుతూ డోర్ వరకు వెళ్ళింది...

శార తనకు వస్తున్న బాధ నీ ఆపుకోలేక ఏడుస్తూ వెళ్లి రూం కి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది..

గొడవ జరిగి 4 గంటలకు పైనే అయ్యింది ....ఇంకా తను బయటకు రాలేదు...ఎం అయిన చేసుకుంటుందా ఎంటి....అని డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆగిపోతుంది....

కానీ తను ఎం చేస్తుంది అని బయం...మరో వైపు అనవసరం గా అన్నాను అనే పశ్చాతాపం...మరో వైపు తన ఈగో....ముందుకు వద్దు అని ఆపుతుంది...

బయట కిటికీ నుంచి చూస్తే కనపడుతుంది అని వెళ్లి చూస్తుంది...

శారా పడుకొని వుంది...హమ్మయ అని ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళబోతూ వుండగా....

తన ఫోన్ రింగ్ అవుతుంది...

శారా నిద్ర నుంచి బారం గా లేస్తూ...ఫోన్ పక్కన పెడుతుంది...

కట్ అయ్యి మళ్లీ రింగ్ అవుతుంది ...

మాట్లాడాలని లేదు కాబోలు విసుగ్గా ఫోన్ తీస్తుంది...

హెల్లొ.....భార్గవ్...

యస్..... నౌ అయం ఫ్రీ .. బట్...

ఒకే....ఐయాం కమ్మింగ్...జస్ట్ 10 మినిట్స్...

అని లేచి రెడీ అవుతుంది...

తను ఫోన్ కట్ చెయ్యగానే మైథిలి మళ్లీ హల్ లోకి వెళ్ళి కూర్చుంటుంది......

శారా లేచి రెడీ అయ్యి....సోఫా లో కూర్చుని వున్న మైథిలి వంక చూస్తుంది...తను ఇంకా కోపం గా నే వుండటం చూసి డోర్ దగ్గరకు వేసి వెళ్ళిపోతుంది....

రాత్రి.....11:30

ఎవరో కార్ లో డ్రాప్ చేశారు....తనకు బాయ్ చెప్తూ ...నవ్వుతూ మాట్లాడుతుంది...లోనికి రావడం గమనించి...మైథిలి మళ్లీ హల్ లో కి వెళ్ళి టీవీ చూస్తున్నట్లు కూర్చుంటుంది...రిమోట్ లో అన్ని చానల్స్ మారుస్తూ....

శారా డైరెక్ట్ గా వచ్చి మైథిలి ముందు కూర్చొని ...బంగారం...నేను చాలా హ్యాపీ గా ఉన్న....నా డ్రీమ్ ఇంత త్వరగా అవుతుంది అని నేను అనుకోలేదు....రియల్లీ అయం వెరీ హ్యాపీ...అని హగ్ చేసుకుంటుంది....

శారా ఫోన్ రింగ్ అవుతుంది....

ఫోన్ కట్ చేస్తూ...

నా కల ఇంత త్వరగా నెరవేరుతుంది అని అస్సలు అనుకోలేదు... ఇది అంతా భార్గవ్ హెల్ప్ వల్లే...

మళ్లీ ఫోన్ మోగుతుంది....

తను ఎందుకు సంతోషం గ వుంది తెలియదు కానీ భార్గవ్ ను మెచ్చుకోవడం మాత్రం తట్టుకోలేక టీవీ సౌండ్ ఇంకా పెంచింది..

మైథిలి ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా టీవీ చూస్తూ వుంటావు ఎంటి...టీవీ ఆఫ్ చెయ్యి...అని రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేస్తుంది....

నీ గోల ఎంటి....నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు చెప్పు...లీవ్ మీ ఎలోనే...

అప్పటి వరకు సంతోషం తో కేకలు వేసిన శారా ఒక్క సారి గా సైలెంట్ అయిపోతుంది....

వాట్.....సే ఎగైన్....నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నానా....

అవును...ఎం అన్నాడు నీ భార్గవ్..నీ లవ్ ఆక్సెప్టు చేసాడా....లేకపోతే డేటింగ్ కి తిసుకెళ్త అన్నడ....లేదంటే రాత్రికి ఇంటికి రా ఎంజాయ్ చేద్దాం అన్నాడా....

షట్ ఆఫ్..వాట్ ఆర్ యు సే....హౌ కేన్ యు సే దట్.....

మరి ఎంటే.....

ఏడుస్తున్న స్వరం తో...ఒకే ... యస్...నువ్వు చెప్పేదే నిజం.....భార్గవ్ నేను డేటింగ్ లో వున్నాం...ఒకే నా....గుడ్ బై.... ఐ హేట్ యూ....అని తన రూమ్ కి వెళ్లి గబ గబ తన బట్టలు సర్దుకుంది....వెళ్లి పోవడానికి సిద్ధ పడింది....డోర్ వరకు వెళ్ళి వెనక్కు తిరిగి చూసి...

మైథిలి నికు నన్ను ఆపాలని అనిపించలేదు కదా....అని తన వంక చూస్తూ అంటుంది...అయిన అసలు ఎం చప్పుడు చేయదు మైథిలి....

ఒక 10 నిమిషాలు తరువాత....

డోర్ చప్పుడు వస్తూ వుంటే...విసుగ్గా లేచి డోర్ తీస్తుంది మైథిలి....వచ్చింది శారా అనుకొని...

కానీ ఎవరో అబ్బాయిల వున్నాడు....

ఎవరు మీరు....ఎవరు కావాలి...

మీరు మైథిలి నే కదా...

యస్ మీరు....

నేను ఎవరో తరువాత చెప్తా.....పిల్లలు ముందు లోపలికి పదండి అని పిలవగానే 15 మంది వుంటారు కావచ్చు కొంచం టిన్ ఏజ్ పిల్లలు అందరూ లోపలికి వచ్చారు....ఆగండి అని అంటూ వుండగానే వచ్చేశారు ... ఏవో బెలూన్లు కవర్లు పట్టుకొని...మొత్తం డెకరేట్ చేస్తున్నారు....ఎంత అపిన వినడం లేదు....

స్టాప్ ఇట్ ..అని కోపం గా అరిచింది మైథిలి

.పిల్లలను ఆగండి అని అన్నట్లు చూసాడు...భార్గవ్....అందరూ ఆగిపోయారు..

మీరు మైథిలి నే కదా....శారా ఎక్కడ వుంది..నేను భార్గవ్ ను..

ఓ...నువ్వే నా మహానుభావా...నీ కోసం నీ డార్లింగ్ ఆల్రెడీ బయలు దేరింది...నువ్వేంటి ఇటు వచ్చావు...

భార్గవ్ పిల్లల వంక చూస్తూ...పిల్లలు లేట్ అయ్యింది కదా...మీరు హాల్లో పడుకోండి...మార్నింగ్   లేచాక వెల్దాం...

పిల్లలు అందరూ సరే అని అన్నట్లు తల ఉపుతరు...

నువ్వు నాతో పదా అని భార్గవ్ మైథిలి చెయ్యి పట్టుకుని బాల్కనీ లోకి తీసుకెళ్ళాడు...

ముందు నా చెయ్యి వదులు....

నీ చెయ్యి పట్టుకుని నేను చేసేది ఏమీ లేదు....నికు ఎం అయిన పిచ్చి పట్టిందా....శారా నీ నా డార్లింగ్ అంటవు ఎంటి....తను నాకు సిస్టర్ లాంటిది...

హా... చాలు లే చాలా విన్న...ఇప్పుడు సిస్ అని రేపు మిస్సెస్ అని. ...ఎంత మంది నీ చూడలేదు...

అరె నీకు ఎం అయింది....మీ ఇద్దరికీ ఏమయినా గొడవ జరిగిందా....తను నిన్నటి నుంచి చాలా డల్ గా ఉంది...అయిన ఇంత రాత్రి పూట ఎటు వెళ్ళింది...ముందే రోజులు బాలేవు...ఒక అమ్మాయి వొంటరి గా ఇంత రాత్రి పూట...ఎంత ప్రమాదమో నీకు తెలియదా....అని అంటూ శారా కి కాల్ చేస్తాడు....

మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు..దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి...

శిట్...ఫోన్ కూడా కలవడం లేదు...

హ్మ్మ్....అని నిట్టూరుస్తూ...నాకు లేని బాధ నికు ఎందుకు..ఇంత బయ పడుతున్నావు అని అంటే...మీ ఇద్దరి మధ్య ట్రాక్ ఎంత పెద్దదో నేను అర్థం చేసుకోగలను...అని లోపలికి వెళ్ళబోతూ వుంది మైథిలి...

మైథిలి ...ఒక్క నిమిషం ఆగు....

నీతో ఒక విషయం చెప్పాలి...

నువ్వు కూడా అందరి ల ఆలోచిస్తున్నావు ....శారా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా....

నువ్వు అమ్మాయిల పుట్టి అబ్బాయి వి ఎలా నో..

నేను కూడా అబ్బాయిల పుట్టి అమ్మాయి నీ..

విధి అడే వింత నాటకం లో పావు ల కథల్డమే తప్ప ఎం చేయలేని అభగ్యూరాలిని...

వాట్...ఎం అంటున్నావు...నాకు ఎం అర్థం కావడం లేదు...నువ్వు......

యస్....నేను...ఒక గే....

వాట్....

అవును....నేను ఒక గే...నీ...

గే అంటే..సమాజం లో ఒక వింత ఫీలింగ్...ఎందుకు మేము కూడా అందరి లాగానే మనుషులం...కానీ మమ్మల్ని ఒక మనిషిగా చూడరు...కనీసం ఒక జంతువు ల కూడా చూడరు....ఒక వింత ఫీలింగ్ తో చూస్తారు....ఏ....సమాజం లో కొందరు చేసే పనులకు అందరినీ ఒకేలా చూస్తే ఎలా....ఎవరో కొందరు రోడ్లపై చప్పట్లు కొట్టి డబ్బులు సంపాదించారని...వంద రూపాల నోటికి వంగి పోయి పక్క లో చేరారని అందరూ అలానే వుంటారు అని అనుకుంటే ...అందులో ఎంత నిజం వుంది...మాకు అంటూ...కొన్ని ఇష్టాలు...కొన్ని కలలు... ఊహలు...అన్ని వుంటాయి ..కానీ మమ్మల్ని అర్థం చేసుకొని మాట్లాడే వారు ఉండరు...కనీసం మా పక్కన నిలబడ డానికి కూడా ఇష్ట పడరు....ఎందుకు....కన్న తల్లిని చంపే కూతురులా కన్న.... 9 నెలల పిల్ల నీ హత్యాచారం చేసే మానవ మృగం కన్న మేము వంద రెట్లు నయం..కానీ లోకం మమ్మల్ని అల అంగీకరించదు... మాతో మాట్లాడిన వారిని కూడా వెలివేస్తుంది యి పాడు లోకం...

అందుకే...నేను గే అనే నిజం నీ ఎవరితో పంచుకోలేదు....నా నిజమైన వునికిని కాక....నన్ను నేను మోసం చేసుకుంటూ....నాకు నచ్చని జీవితం లో నటిస్తూ...యి సమాజం నోటి కి బయపడి..నా వునికీని కోల్పోయి మిగిలిన...ఒక తోలు బొమ్మా నీ....కానీ ఇలాంటి జీవితం జివించలేక సూసైడ్ చేసుకుందాం అనే సమయం లో..శారా పరిచయం అయ్యింది....మన జీవితం ఎలా నో మనకు నచ్చేలా జివించలేకపోతున్నం..సగం జీవితం గడిచిపోతుంది కూడా...మన లాగే ఎంతో మంది వున్నారు....కనీసం వాళ్లకు సహాయం చేద్దాం...వల్లకుఅంటు ఒక ప్రత్యేక స్థానం వుండేలా చూద్దాం...వాళ్ళలో ఆత్మ విశ్వాసం...పెరిగి...వాళ్ళ కలలను అలలుగా ఎదిగేలా చేద్దాం అని వాళ్ళ కోసం ఒక ఫౌండేషన్ నీ మెదలు పెట్టాలని కల కన్నం....

ఎంతో మంది పిల్లలు...టిన్ ఏజ్ లో కి రాగానే వాళ్ళ లో వచ్చే మార్పులకు బయపడి...పడుతున్న మానసిక వేదనను అధిగమించి....చుట్టూ సమాజం ఎగతాళి చేసిన వాటిని ఎదుర్కొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి వారికి మంచి సైకాలజిస్ట్ తో కౌన్సిలింగ్ కావాలి...అందుకే అలాంటి వారి కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి కోసం గత నెలరోజులుగా టైమ్ తో పని లేకుండా అందరినీ కలిసి మాట్లాడి ఫౌండేషన్ కి కావలసిన అన్ని విషయాలు సరి చూసుకున్నాం....తల్లి తండ్రుల ప్రేమ కు దూరం అయ్యి...సమాజము లో హేళన లు  చవి చూసిన వారిని....సూసైడ్ చేసుకోవాలని చూసే వారిని....వ్యభిచార కూపంలోకి వెళ్ళ బోతున్న వారిని వెతికి పట్టుకొని ఒక చోటికి చేర్చి...వాళ్ళ అవసరాలు తీరుస్తూ....వాళ్ళ అభిరుచులు తెలుసుకొని వాటికి అనుగుణంగా వారికి విద్య ఉపాధి అవకాశాలు వుండే ల అన్ని ఏర్పాట్లు చేసం... వాళ్ళే ఆ పిల్లలు అంతా...అని అధమరుచి పడుకున్న పిల్లల వైపు కిటికీ లో నుండి చూపిస్తూ....

రేపు నీ పుట్టిన రోజు సందర్భంగా ఇనగ్రేషన్ పెట్టుకున్నాం....గెస్ట్ లను పిలవడానికి ఇంతక ముందు వచ్చింది నాతో....కానీ నువ్వు తనను అపార్థం చేసుకున్నావు....నాకు తెలిసి తను ఫౌండేషన్ దగ్గరికి వెళ్లి వుంటుంది.... రేపుపొద్దునే కలుద్దాం...వెళ్లి పడుకో....అని అంటూ భార్గవ్ అక్కడి నుండి బయటకు వెళ్తాడు...

ఇనాగ్రేషన్ చాలా మంది వచ్చారు.... మైథిలి శారా తో ఎంత మాట్లాడాలి అని ప్రయత్నం చేసిన శారా మాట్లాడలేదు...అంత అయిపోయాక మాట్లాడదాం అని మైథిలి అనుకొని సాయంత్రం ఫౌండేషన్ దగ్గరికి వెళుతుంది...కానీ అప్పటికే భార్గవ్ కి బాధ్యతలు అప్పచెప్పి ఎదో అర్జెంట్ వర్క్ వుంది అని శారా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది....

తనపై కోపం తో వెళ్లి వుంటుంది.....అని అనుకొని ఆలోచిస్తూ వుండగా...మైథిలి కి ఫోన్ వచ్చింది...

బంగారం నువ్వు ఇంటికి రాలేదు ఎంటి....శారా తో నువ్వు కూడా వస్తావు అనుకున్న...

నాకు కొంచం వర్క్ వుండే అమ్మ...

ఎంత వర్క్ వుంటే...ఫ్రెండ్ ఎంగాజే మెంట్ కంటే ఎక్కువ న కనీసం పెళ్లి కి అయిన వస్తావా లేదా...

ఎంటి అమ్మ నువ్వు అనేది అని కంగారు గా అడుగుతుంది...

నిన్న రాత్రి శారా కి ఎంగేజ్ మెంట్ అయ్యింది...ఎల్లుండి పెళ్లి...నికు తెలియదా...

తడబడుతూ ....తెల్సు అమ్మ....సరే నేను మళ్ళీ చేస్తాను నాకు కాస్త వర్క్ వుంది....

సరే....అమ్మ..జాగ్రత..

హా అమ్మా....

శారా...నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఇంత ఇసి గా తీసుకుంటా వ ....నేను మళ్ళీ నీ లైఫ్ లో కి వచ్చి నిన్నుఇబ్బంది పెట్టను శారా...కానీ ఒక్క సారి నిన్ను చూడాలి ...అని బైక్ ఎక్కి శారా వాళ్ళ ఇంటికి వెళుతుంది....శారా బెడ్ రూం కిటికీ దగ్గరకు వెళ్ళి శారా నీ చూసి మళ్లీ వెలీపోతుంది....తను హ్యాపీ గ వుండాలి అంట్..నేను వుండకూడదు అని

నేను నడుపుతున్న బైక్ నీ ఇంకా స్పీడ్ పెంచి

ి...చేతులు వదిలేసి...హెల్మెట్ తీసేసను...ఫలితం ..నా మరణం...నేను ఆత్మ గా మారి తిరుగుతున్న సమయం లో అమ్మ నీ నిన్ను ఒదర్చడానికి వచ్చి నన్ను చూసినప్పుడు రామ్ ఫేస్ లో వచ్చిన ఆశ్చర్యం నన్ను తనని వెంబడించెల చేశాయి....అప్పుడే సిరి పై రామ్ తాగి ఆటక్ చేయడం తో...తిరిగి వెళ్లాలని చూసిన సిరి వొంటి లో కి వెళ్ళి ఇది అంతా చేసా...తనకు ఇన్ని రోజులు జరిగింది గుర్తు లేదు...మీ గొడవ జరిగిన అంత వరకే గుర్తు వుంది.నేను శారా దగ్గరికి వెళ్ళే టైమ్ అయ్యింది..నేను వెళ్ళిపోతున్న...అమ్మ జాగ్రత అన్నయ...

మైథిలి ....మైథిలి ...అని సుధా అరుపు...

సిరి కళ్ళు తిరిగి పడిపోయింది...

###############

చివరికి రామ్ ,సిరి , సుధా,భార్గవ్ ఫాండేషన్ నీ చూస్తుంటారు......వారిని సమాజంలో వింతగా కాకుండ కాస్త ప్రేమతో చూడండి అధ్బుతమైన విజయాలు సాధించి చూపిస్తారు.....



Rate this content
Log in

Similar telugu story from Inspirational