Keerthi purnima

Children Stories Tragedy Inspirational

4  

Keerthi purnima

Children Stories Tragedy Inspirational

పల్లెలో యశోద

పల్లెలో యశోద

4 mins
478


అమ్మ నాకు రెండు రూపాలు ఇవ్వవా నేను పాల ఐసు కొనుకుంట్టా . అంటూ సుమిత్రా కొంగు పట్టుకుని వంట చేస్తున్న తన వెంటే తిరుగుతున్నాడు ఎక్కడికి వెళితే అక్కడికి .


నా దగ్గర లేవంటే వినవేమి రా...అంటూ మెల్లిగా మందలిస్తున్న అమ్మ వంక నవ్వుతూ చూస్తూ..అన్ని అబద్ధాలు నిన్న పాత సామాన్ల వాడికి నా పాత పుస్తకాలు అమ్మేసి వచ్చిన డబ్బు పోపుల డబ్బాలో పెట్టావు నేను చూసాను….


ఓరి బడుద్ధాయి …ఇదా సంగతి అందుకే లేవని ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ వచ్చి అడుగుతున్నావు..


హా..హా..తెలిసింది గా అమ్మ ఇకనైనా యివ్వు ఐసు బండి వాడు పక్క వీధికి కూడా వెళ్ళిపోయాడు..నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే పక్క ఊరికి కూడా వెళ్ళిపోతాడు అమ్మ అంటు సుమిత్ర కొంగు వెనుకే తిరుగుతూ గోల పెడుతున్నాడు బంటి..


ఏమిటే వాడి గోల అంటూ జప మాలా పట్టుకొని వరండాలో నుంచి కేకేసింది అత్తగారు..ఏమి లేదు అత్తమ్మా అంటూనే బంటి ముందు మోకాళ్లపై కూర్చొని

సరే నేను ఇస్తాను కానీ నేను చెప్పిన మాట వింట అంటేనే .,.


హా...సరే సరే..అని ఆత్రంగా ఎక్కడ బండి వాడు వెళ్ళిపోతాడు అని ఆలోచిస్తూ వున్న చోటే కాళ్ళు ఆగడం లేదు బంటికి..కొనుక్కొని వచ్చాక వింటాను అమ్మ అంటూ తొందర పెడుతున్నాడు…


బంటి రెండు చేతులని పట్టుకొని...నువ్వు అందరితో అడుకుంట అని వెళ్లి వాళ్ళని కొట్టి వస్తున్నావు.అందరూ వచ్చి నాతో చెప్తున్నారు..అల చెయ్యవచ్చా బంటిగాడు చెడ్డొడు అంటున్నారు అంతా...నువ్వు చెడ్డవాడివ?


కాదు అన్నట్లు బంటి తల ఊపడూ...కాదు కదా అయితే నా మాట విని ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని మాట ఇవ్వు..తన చెయ్యి చాచింది సుమిత్ర..సరే అంటూ చెయ్యి వేశాడు బంటి చిరునవ్వు తో తన చేతిని పైకి మార్చి తన చేతిలో రెండు రూపాలు పెట్టింది ..


బంటి ఆ బిళ్ళ చూసి అయ్...అంటూ పరుగు తీసాడు..జాగ్రత్త అని పిలిచే మాట వినకుండా..


వీడు మారడు అని మనసులో అనుకుంటూ సుమిత్ర మళ్ళీ వంట లో మునిగి పోయింది…


నాగమ్మ సీరియల్ వస్తోంది కదే ఎక్కడ ఉన్నా నా...గమ్మ అనే ఆ గొంతు వినగానే పరుగెత్తుకు వచ్చే వాడు ఇంకా రావడం లేదు..అంటూ టీవీ చూస్తూ జొన్న రొట్టెలు తింటున్న అత్తగారు అంటుంటే ఇంకా గుబులు మొదలయింది సుమిత్ర కి వాడికి ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం భయపడుతూ నే చేతులు రెండు కళ్ళ ముందు పెట్టుకొని వెళ్ళ సందుల్లోంచి చూస్తూ నన్ను గట్టిగా వాటేసుకొని మరి చూస్తాడు ..ఇంత సేపయిన రావడం లేదు ఎక్కడ ఏ ఇసుక దిబ్బల్లో ఆడుతున్న డో

..అత్తయ్య నేను కాస్త విధి వరకు వెళ్ళి చూస్త ఎక్కడ ఉన్నాడో…


సరే అమ్మ చూసి రా...ఎం అయిన తక్కోవా అయితే నేను వడ్డించు కుంటలే…


సరే అత్తయ్య అంటూ విధి వరకు వెళ్ళి చూసింది ఎవరు లేరు విధి చివర పిల్లలతో నే వాడు ఎప్పుడు అడేది ...వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగి చూస్త అంటూ వెళ్ళింది .మేము ఆట అపేసి గంటకు పైగా అయ్యింది పెద్దమ్మ అని వాళ్ళ సమాధానం విని సుమిత్ర కి బయం వేసింది…


ఇంత సేపు అయ్యింది అంటే ఎం అయ్యింది కావచ్చు..అంటూ ఇంటి వైపు అడుగులు గబ గబ వేసింది బర్త తో చెప్పాలి అని...తన పరుగు లాంటి నడక చూసి సైకిల్ మీద వెళ్తున్న బాబాయ్...ఎం అయింది అమ్మ అని అడిగాడు…


బంటిగాడూ ఇంటికి రాక చాలా సేపు అయ్యింది..బాబాయ్ వాడికొసం ఎంత వెతికినా దొరకలేదు నీకేమైనా కనిపించాడ బాబాయ్…


అయ్యో తల్లి ..బంటి కాంతమ్మ పొలం గట్టు దగ్గర పైపు నీళ్ళ దగ్గర మీ చిన్న లేగ దూడ నీ కడుగుతున్నాడు తల్లి..ఇక్కడ ఎం చేస్తున్నావు రా...ఇంట్లో తెలుసా అంటే.. తెలుసు తాత అన్నాడు అందుకే వచ్చేసా…


ఈ సమయం లో అక్కడ ఎం చేస్తున్నాడు బడవా..ఎవ్వరూ ఉండరు చీకటిలో ఏదయినా చూసి భయపడితె ..నేను వెళ్తా బాబాయ్ అంటూ వెళ్లిపోయింది సుమిత్రా…


వెన్నల కాంతికి వాడు లేగ నీ కడుగుతూ కనిపించాడు...దొరికాడు బడవా వీడికి నాలుగు తగిలిస్తే కానీ బుద్ధి రాదు అంటూ వెళ్లి వెళ్ళగానే వాడి బుజం పట్టుకొని లాగి విపులో రెండు దెబ్బలు వేసింది సుమిత్ర...ఎక్కడ పోయావు రా..నికని ఊరంతా వెతుకుతున్న ..నికు ఎం అయ్యిందో అని నేను ఎంత గాబరా పడ్డాను ఎం తెలుసు...పదా ఇంటికి అని లాగబోయ్యింది..


ఏడుస్తున్న బంటి గాడు...ఏడుస్తూనే అగు అమ్మ మన లక్ష్మి అమ్మ...మన లక్ష్మి ఇంట్లోనే వుంది రా దొడ్లో ఇది ఎవరిదో దాని మెడలో గంట లేదు …


లేదు అమ్మ ఇది మనదే తాడు తెంపుకుని పొలాల్లోకి పరుగు తీసింది ఆడుకుంటూ వుండగా దాన్ని చూసి ఇంటికి పట్టుకొని వద్దాం అనుకున్నా కానీ అది తప్పించుకొని వెళ్లి ముల్ల కంచెలో పడింది దాని గంట పోధ కి చిక్కుకుంది అందుకే తీసేసా...అందులో నడవడం రాక అక్కడే బురదలో పడింది అందుకే కడుగుతూన్న మళ్ళీ బామ్మ చూస్తే దాని కాళ్ళ మీది నుంచి తన చేతి కర్ర తో కొడుతుంది అమ్మ...అంటూ దాన్ని అమాంతం వాటేసుకున్నడూ …


చి...విచక్షణ కోల్పోయి వాడిని కొట్టేసా... వాడు అల్లరి వాడు అని ఆలోచించ కానీ వాడిలో ఇంత పరిపక్వత ఇంత దయాగుణం వుంది అని ఊహించ లేక పోయా అని మనసులో బాధ పడుతూ...అవును బంటి మరి ముళ్ళ నుంచి నువ్వు ఎలా బయటకి తిసవూ రా.,

నికు ముళ్ళు కుచ్చుకొలేదా?


నువ్వు కొట్టను అంటే చెప్తా..కొట్టను తండ్రి అంటూ వాడి జుట్టు సరి చేస్తూ అంది సుమిత్ర...తన చిట్టి చేతులు చూపించాడు...చేతులకి ముల్లన్ని చిరుకొని రక్తం కారినట్టు వున్నాయి లేగ ని కడిగే సరికి రక్తం లేదు కానీ ముళ్ళ తాలూకు మరకలు వున్నాయి...అమ్మగ సుమిత్రా హృదయం ఆ చేతులు చూసి తట్టుకోలేక పోయింది..గట్టిగా బంటి నీ హత్తుకుంది…


కడుగుతుంటే చేతులు నొప్పి పుట్టాయి అమ్మ అందుకే ఇంత అలస్యం అయ్యింది అంటూ అమ్మ వైపు చూసాడు ..నేను చేసింది తప్ప అమ్మ…


లేదు నాన్న...నువ్వు ఇప్పుడు చేసింది చాలా మంచి పని...నువ్వు ఇక చెడ్డ వాడివి కాదు...పదా ఇంటికి వెళ్దాం అని దూడని కట్టతో ఇంటి వైపు మళ్లించి...కొడుకు చెయ్యి పట్టుకొని ఇంటికి అడుగులు వేసింది..తన కొడుకు ఇంత సాహసం చెయ్యడం చూసి లోపల ఒక విధమయిన గర్వం వచ్చింది సుమిత్ర కి…

అమ్మ నన్ను ఎత్తోకువు అంటూ చేతులు చాపిన కొడుకు వంక ప్రేమగా చూస్తూ వాడిని ఎత్తుకొని ఇంటికి చేరింది...ఆ వెన్నల రాత్రి లో చిన్ని క్రిష్ణుడు నీ ఎత్తుకున్న యశోదా ల కనిపించింది సుమిత్రా దూరం నుంచి చూస్తూ ఇంకా రావడం లేదని ఎదురువస్తున్న తన భర్త కి….


ఇది మా అమ్మ తమ్ముడు ల కథ...🙏🙏🙏



Rate this content
Log in