Keerthi purnima

Drama Tragedy Inspirational

4  

Keerthi purnima

Drama Tragedy Inspirational

సంపంగి

సంపంగి

7 mins
280



ఎం సంపంగి మీ అక్క బిడ్డని వట్టుకొని పుట్టింటనే ఉంటాంది. ఆత్తవా నాతోని అత్తారింటికి.లోపలనుంచి ఆ మాటలు విని ఎంది మావ దానితో నీ పరాసకాలు. నోట్ల నాలక లేని పిల్ల.అగో... అట్టంటవు ఎందే.నొట్ల నాలుక లేకబోతే ఎందీ. బుర్రల పుట్టెడు బుద్దులు ఉన్నాయి.మొన్న వానచ్చిన నాడు పిల్లలు పడవలు జేసీ నిళ్ళల్ల ఒదిలినగొద్ధి మునిగిపోతా ఉండే సంపంగిధి తప్ప. అట్లెట్ట మునుగుతలేదే అని అడుగుతే.మైనం బూసిన అది నీళ్ళు తాకిన తాకనట్టు అయితది బావ.రంగుపెన్నులు మైనం లాంటివి గూడ బజార్ల దొరుకుతై ఆటితోని ఓ దినం బొమ్మగిసి ఇంటికిపట్టుకచ్చేటప్పుడు ఆన గొట్టి అన్ని పుత్తకాలు ముద్ధముద్ధ అయినయి గానీ బొమ్మదించిన పేపరు మాత్రం అట్టనే ఉండే.అందుకే బుర్రకి యాధిరాంగనే అట్టాజేసిన అని సెప్పింది.దాని తెలివికి అది ఏడనో పుట్టాల్సింది.నిమ్మకాయ మీద పసుపువడితే రత్తం లెక్క కానాత్తది అని దెలవని నీకు సెల్లగ వుట్టింది.


"ఏంది మావో.దాన్ని పోగుడుడు యేవో గానీ నామీద కేకలేత్తాన్నవు."యే ఉండే నీ మీద నేనెందుకు లెత్తన్ననే.నీ సెల్ల నీ పొగడుడ్ గూడా తప్పే అంటావ్.దాని నాలిక మందం లేకుంటే ఇంకా సక్కగా ఉండేది."ఉండయ్య అది యింటే మల్ల బాధ పడతది."

దాన్ని బాధావెట్టాలని గాదె.దాన్ని ఇప్పటికయినా మంచి దవాఖానల చుపెడదాం గదనే...దాన్ని వట్టుకోని తిరగని సోటు ఏడున్నది.మా యమ్మ జేసిన పనికి దాని జీవితం అట్ట పాడయ్యే.అది గాదె కడుపుతోని ఉన్న సమయాన గంజాయి తాగద్ధని తెలవదానే.ఏమోనే మావ నేను మా అయ్యా సెప్తాంటే ఇన్నా..నేను బుట్టినాక పచ్చి బాలింతగ యుండి గూడ మా యమ్మ కలువకి వోయేదట.యింటికాడికి అచ్చినాక మళ్ళ యింటిపనినీ, నన్ను సుసుకొనేదట.పనికి బోయ్యేటప్పుడు నాకు పాలకి బదులు డబ్బాల తాటికల్లు వోసి తాగించి పనికి వోయేదట. ఓనాడు కైకిలికి బోతే ఇంకో నాడు కట్టలు కొట్ట అడవికి బోయేది.ఇంకొనాడు ఇప్పపువ్వు దెంప ఇంకో నాడు ఇస్తారాకులు దేంప పోయ్యేది. సిల్లకుంటా అడవుల్లో పులులు, గుడ్డెనుగులు ఉంటాయని క్రూర మృగాలకు భయపడి నన్ను ఇంట్ల బెట్టి బయటకెళ్ళి తలుపు బేట్టీ పోయేది.నాకాలుకి తాడు కట్టి ఇంట్లపెట్టి పక్కింటి అవ్వకి మద్యల ఓ మారు సుడమని సెప్పి వోయ్యేది.అలసిన పెయ్యితోని అచ్చి పెయ్యినొప్పులకి తట్టుకోలేక అమ్మా గంజాయికి,ఇప్పసారా కి అలవాటు పడ్డది.పొద్దులు పడే వరకు గూడ అమ్మ పనికి పోయింది. సెల్ల పుట్టిన తరువాత బాలింతగా ఉండి గూడ పనికి పోయింది.ఏం అయ్యేనో ఏమో మూడు దినాలు ఏర్రబట్ట ఆగాలేదట.అందరికీ పురుడుపోసే రాజమ్మ చూసి. పిల్లకి గర్భసంచి వదలు అయినట్టు ఉన్నది. పెద్ద దావాఖన కి పట్టుకపొమ్మని సెప్పింధీ.కానీ తెల్లారే సరికి అమ్మ పానాలతోని లేదు.నాకు పద్నాలుగో ఏటాప్పుడు జరిగింది మావా ఇదంతా.అప్పుడు సంపంగికి ఎనిమిది నెలల పసికూన.అందుకే అది పెద్దమనిషి అయినది అని తెలిసిన కాడికెల్లి యిడనే ఉన్న.ఇంకెన్ని దినాలు లే మావ.ఇంకో మూడు దినాలు అయితే పద్కొండు దినాలు అయితే చిన్నగా దాని ముచ్చట తిర్చేసి వచ్చెత్త.


మల్లి సెప్పేదంత ఇంటాంటే ఎప్పుడు దెప్పిపొడిసే మల్లిఅమ్మ గురించి తప్పుగా అనుకున్నానని మనసులో అనుకున్నాడు మల్లేశం.సంపంగి తో ఎదో ఉత్తిగనే అన్ననే పని పూర్తయినాకె అద్దువుగాని తియ్.నాకు మత్తం ఎవలున్నరే.అది నాకు బిడ్డ లెక్కనే.అచ్చిన పని యాదే మర్సిన మన యింటేనక గద్ధకాడ ఉన్న చెట్టుకి తెనేతిట్ట ఉండెగద.అది దుల్పిచ్చిన సంపంగి కి ఇయ్యి అంటూ. కాలి కల్లుసీసా నిండుగా ఉన్న తేనెని మల్లికి ఇచ్చి.తన బుజంమీద ఉన్న తన ఏడాది సిట్టి తల్లికి నుదుటి మీద ముద్దుపెట్టి చిక్కిరి బిక్కిరిగా ఉన్న జుట్టుని చేతి వేళ్ళతో సరి సేసి.తొందరగా రాయే సిట్టీ తల్లి మనింటికి నీ అల్లరి లేక ఇల్లంతా బోసిబోయింది అంటూ. మల్లి తోని సరెనే నేను బోతా ఇప్పటికే అడ్డకాడ అందరూ బోయి సానా సెపయింది. మల్ల పని దొరకకపోతే సంపంగికి కొత్తరైక కొనుడు కట్టం అయితది.సరే అయ్యా పదిలం పొద్దుబోయినాక ఇయెల ఇటే రా మావ. అయ్యా కొడికూర అండుమన్నడు.మామ గారి ఇల్లు దగ్గరుందని 

పొద్ధుకోమారు వత్తే ఎట్టుంటాధి సెప్పు...లోకం రెండు తలల పాము ముందే ఇంట్ల పెద్ద మనిషి ఐన పిల్లఉన్నదాయో..అద్దు లేేవే..పదిలం.నేను పొయ్యత్తా.



******* కొన్ని రోజుల తరువాత*******



సంపంగి ....సంపంగి...


ఏంది మావ....అది ఇస్కూల్ బోయింది. పొద్దువోయ్యినాక అస్తాధి.మన ఊర్ల పిల్లగాల్లను సుసే ఓ పెద్ద డాక్టర్ సారు అచ్చిండ్రు. సినన్నా దుకాణం పక్క సందిఎనకపొంటి కాళీ జాగ ఉండే గదా ఆడ క్యంపుకు అచ్చిండ్రు అంట మన సంపంగినీ ఆడికి వట్టుక పోదామే....సరే మావ.



****** *******


నమస్కారం సారు



"నమస్కారం చెప్పండి"


ఏమయినా పైసలు కట్టాల సారు మా బిడ్డని సుపియ్యాడానికి?


"చిరుమందహాసం గా నవ్వి... హా ఇవ్వాలిగా"


నాకాడ రెండువేలు ఉన్నాయి సారు. సళ్తదా మరి.


" మీరెప్పుడైనా కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళారా"


ఆ ఏళ్ళినం సారు.మీకెందుకు అట్ట అనిపించింది సారు.మమ్మల్ని ఎడనన్న సుసిర్ర?


" అలా ఏం లేదు కాని...మీకు హాస్పిటల్ అనగానే డబ్బుల భయం పట్టుకునే సరికి అడగాలి అనిపించింది."


"అవును సారు మా సెళ్లని తిప్పని ధావకాన లేదు...ఎక్కని గట్టులేదు.దానికి తెలివి సక్కగా ఉన్నది కానీ దాని రూపమే దానికి పెద్ద సమస్య".అంటూ కొంగు వెనుక దాగిఉన్న సంపంగినీ డాక్టర్ ముందు ఉన్న కుర్చీలో కుసోపెట్టింది మల్లి.


సంపంగి రూపాన్ని చూసి ఒక క్షణం డాక్టర్ సుదర్శనం చలనం లేకుండా ఆగిపోయాడు.పెద్దగా కనిపిస్తున్న కనులు చిన్నగా ఉన్న తల.లావుగా ఉన్న కనుబొమ్మలు.నాలుక లావుగా ఉండటం వలన నోటి బాగం పెద్దగా ఉండి.సన్నగా ఉన్న శరీరం.


సారు సారు....అని పిలిచినా పిలుపుకి ఉలిక్కి పడి.

చిరుమందహాసం తో తన పక్కనే ఉన్న చాక్లెట్ డబ్బా నుంచి ఒక చాక్లెట్ ఇస్తూ " నీ పేరేంటి తల్లి అని అడిగాడు సుదర్శనం"


ఆ చాక్లెట్ చూసి ముందుకు చేయి చాపినా మళ్ళీ అక్క తిడుతుంది అని భయంతో అనుమతి కోసం అక్క వైపు చూసింది సంపంగి.


డాక్టర్ వైపు చూస్తూ"ఇందాక పోయిన డాక్టరు సారు.సొల్లు బాగా కరుస్తాంది అని సేపితే.సక్లెట్లు,పిప్పరమెట్లు తినద్ధు అని సెప్పిండు సారు. పాలల్ల కూడా సెక్కర గాదు ఉప్పు ఏయ్యమని సెప్పిండు."


"సుదర్శనం చిన్నగా నవ్వి... ఈ వయసులో వాళ్ళు చాక్లెట్లు తినకపోతే మరెప్పుడూ తింటారు అమ్మ...రోజుకో చాక్లెట్ తిన్నంత మాత్రాన ఏం జరగదు నేనే చెప్తున్న కదా..సంపంగి నువ్వు బయట ఒక అక్క ఉంది ఆ అక్క తో ఆడుకో.ఒక్క నిమిషం, అక్కని పిలుస్తా "అని తన ముందు ఉన్న బెల్ కొట్టాగానే ఒక నర్సువచ్చి ఆ పాపని తీసుకొని వెళ్ళింది.



ఇప్పుడు చెప్పండి అసలు పాప ఎందుకు ఇలా ఉంది?


ఎందంటే! మాకు ఎట్టా తెలుస్తది సారు.కానీ మా అమ్మకి సారా తాగే అలవాటు ఉండేది.మా సంపంగి కడుపుల ఉన్నప్పుడు కూడా తాగేది.దాని వలనే ఇట్ట అయ్యింది అని మంత్రసాని సేప్పింది.అయినా గూడ మా అమ్మ బాలింతగా ఉండి గూడ తాగేది.చాన సార్లు తాగద్దు అని అనుకునేది అంట కానీ మానలేక పోయేది అంట మా అయ్య అనేటోడు.పాపం సంపంగి...తనకి ఒక్క దోస్తూ లేదు.పోని ఆడుకుందాం అన్న అన్ని ఆటలు అందరి పిల్లల్లా ఆడలేదు..ఒక్కో సారి ఒక్కతే ములకి నక్కి కుసోని ఎడుస్త ఉంటాది.దాన్ని ఏమని ఒదర్సాలో మాకు ఒక్కో మారు అర్థమే కాదు...


హ్మ్మ్....అని పెద్ద శ్వాస తీసుకొని.నాకు అర్ధం అయింది తల్లి.కడుపుతో ఉన్న తల్లులు మద్యపానం చేయడం వలన ఇలాంటి ఇబ్బందులే ఏర్పడుతాయి.అంతేకాదు....'


"తల్లి రక్తంలోని ఆల్కహాల్ బొడ్డు తాడు ద్వారా శిశువుకు వెళుతుంది. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ వాడకం గర్భస్రావం, మృత జన్మ మరియు జీవితకాల శారీరక, ప్రవర్తనా మరియు మేధో వైకల్యాలకు కారణమవుతుంది. ఈ వైకల్యాలను ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (FASDs) అంటారు. FASDలు ఉన్న పిల్లలు క్రింది లక్షణాలు మరియు ప్రవర్తనలను కలిగి ఉండవచ్చు:" చెప్తూ చెప్తూ వాళ్ళనే చూడగానే వాళ్ళకి ఏం అర్థం అవడం లేదు అని గ్రహించిన డాక్టరు..కుర్చీలో కూర్చొని "అమ్మా కడుపుతో ఉన్నప్పుడు తాగడం వలన బొడ్డుపెగు ద్వారా అది బిడ్డకి కూడా పోయి రోగలబారిన పడతారు."కేవలం సంపంగి ఒక్కతే కాదు చాలా మంది పిల్లలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు.



ముక్కు మరియు పై పెదవి మధ్య మృదువైన శిఖరం వంటి అసాధారణ ముఖ లక్షణాలు (ఈ శిఖరాన్ని ఫిల్ట్రమ్ అంటారు),చిన్న తల పరిమాణం,సగటు కంటే తక్కువ ఎత్తు,తక్కువ శరీర బరువు,బలహీనమైన సమన్వయం,హైపర్యాక్టివ్ ప్రవర్తన,శ్రద్ధపెట్టలేక పోవడం

పేలవమైన జ్ఞాపకశక్తి,పాఠశాలలో కష్టం (ముఖ్యంగా గణితంతో),అభ్యాస వైకల్యాలు,ప్రసంగం మరియు భాష ఆలస్యం అంటే సరిగ్గా మాట్లాడలేక పోవడం,మేధో వైకల్యం లేదా తక్కువ IQ

పేలవమైన తార్కికం మరియు తీర్పు నైపుణ్యాలు

శిశువుగా నిద్ర మరియు చప్పరించే సమస్యలు

దృష్టి లేదా వినికిడి సమస్యలు అంటే చెవులు సరిగ్గా వినపడక పోవటం,గుండె, మూత్రపిండాలు లేదా ఎముకలతో సమస్యలు ఇలా చాలా సమస్యలు వస్తు ఉంటాయి.మీ పాపకి మాత్రమే ఇలా ఉంది అని అనుకోవడం మీ పొరపాటు. అలా అనుకోవడం ముందుగా మానేయ్యండి.అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు.


సారు మరి మా సంపంగి మంచిగా అయితాద...


రూపం విషయంలో కచ్చితంగా చెప్పలేము కానీ మానసికంగా మాత్రం తనలో మంచి మార్పులని తేగలం.


సారు మా సంపంగి సుడనికి అట్ట ఉంటదే గానీ..దాని తెలివి ముందు ఎవ్వరూ పనికే రారు.


డాక్టరు సుదర్శనం అర్థం కానట్టు మొహం పెట్టాడు.'


అయ్యో సారు' అని పడవకి మైనం పూసిన సంగతి చెప్పాడు మల్లేశం..


 అది విన్న డాక్టర్.. సంపంగి పువ్వు తన సువాసనను వెదజల్లి నట్టు,మీ సంపంగి కూడా భవిష్యత్తులో తన జ్ఞానాన్ని పది మందికి పంచే స్థాయికి వెళ్తుంది.మీరు తన రూపం మీద కాకుండా తన తెలివి మీద మాత్రమే దృష్టి పెట్టండి.కావాలంటే తన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను.అని మాటిచ్చాడు డాక్టరు.



అది విన్న మల్లేశానికి ఏం అర్థం కాలేదు.ఒకరి మొహం ఒకరు చూసుకోవడం చూసి...


బయ పడకండి.పాప మీ దగ్గరే ఉంటుంది.తనకి కావలసిన చదువూ సంధ్యా నేను చూసుకుంటా అంటున్న.అంతే....!



అయినా వారి మొహాల్లో ఆనందం బదులు అనుమానం తాండవించడం చూసి...మీ అనుమానం అర్థం అయింది.ఎటువంటి సంబంధం లేకుండా ఎందుకు ఇలా సహాయం చెయ్యాలి అనుకుంటున్నాడు అనేగా .


అయితే వినండి...! నేను చదువుకునే రోజుల్లో నాకు రాహుల్ అనే ప్రాణ స్నేహితుడు ఉండే వాడు.వాడు మా లాగే చదివే మరో డాక్టరుని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మయికి తాగడం చాలా అలవాటు.సిటీలో పెరిగిన పిల్ల అంతే కాక ఒంటరిగా హాస్టల్లో ఉండేది.దాంతో తాగడం చాలా అలవాటు అయిపోయింది.తను తల్లి కాబోతున్న విషయం తెలిసి తను పడిన ఆనందం అంతా ఇంతా కాదు ఆకాశం నేల ఒక్కటి చేసేది...కానీ అది ఎక్కో రోజులు నిలవలేదు.తాను తాగకుండా ఉండలేక పోయేది.డాక్టరుగా అది ఎంత ప్రమాదమని తెలిసిన ఏం చేయలేని పరిస్థితి.ఎప్పుడు తాగడం మాన లేక పోతున్న అని బాధపడుతూనే గడిపేది.మా ఫ్రెండ్ ఎన్నో సార్లు తను బాధ పడకుండా చూసుకోవాలి అని ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.ఆఖరికి తను బిడ్డ పుట్టే సమయానికి కూడా మత్తులోనే ఉండే సరికి నార్మల్ డెలివరీ కావలసిన తనకి పెద్ధప్రేషన్ చెయ్యవలసి వచ్చింది. పుట్టిన తరువాత ఈ పాప రూపం చూసి నా బిడ్డ కాదు అని గోల.కానీ పాప ఎడవగానే ఎత్తుకొని పాలు ఇచ్చేది.మానసికంగా చాలా పాడయిపోయింది.ఒక రోజు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మా ఫ్రెండ్ కి ఏడుస్తూ త్వరగా ఇంటికి రమ్మని తన భార్య నుంచి.హాస్పిటల్ లో ఒక అర్జెంట్ కేస్ ఉండటం వలన ఆగిపోయాడు.ఇంటికి వెళ్ళి చూసే సరికి రక్తపు మడుగులో తన నాలుగు నెలల పాప.ఉరి వేసుకొని తన బార్య.చేతిలో ఒక ఉత్తరం..

"నేను చేసిన పాపానికి నా బిడ్డ రూపం వికృతిగా మారిపోయింది. ఆ రూపంతో అది ఈ లోకంలో బతకలేదు. అందరూ అనే మాటలకి అది సమాజంలో కలవలేదు .అందుకే దాన్ని నా చేతులతో చంపేసా.దానికి ఈ దుస్థితి తెచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బతకలేను అందుకే నేను కూడా చనిపోతున్న...నన్ను క్షమించు" అని అందులో ఉంది.

చదువు ఉంది,డబ్బు ఉంది కానీ ధైర్యం లేదు...కానీ మిమ్మలని పాపని ,పాప తెలివి గురించి విన్న తరువాత మీకు తోడుగా ఉండాలి అనిపించింది.సంపంగి ఎంతో మంది తల్లులకి,పిల్లలకి ఆదర్శం కావాలి అందుకే తన బాధ్యత నేను తీసుకుంటాను..


అక్కా సూడు అంటూ పరుగెత్తుతు వచ్చిన సంపంగి తను గీసిన సీతాకోకచిలుకనీ చూపిస్తూ ఉంటే అందరి చూపు మాత్రం సంపంగి వైపే ఉన్నాయి కంటి నిండుగా ఉన్న కనుపాపలతో....


తన మిత్రుడి కథ అని చెప్పిన తన కథ తన కనులముందు ఒక పోగల సాగిపోతుంది.సంపంగిలో తన బిడ్డ రూపాన్ని చూసుకున్నాడు సుదర్శనం..



*****శుభం*****



సమాజం ఎప్పుడు ఒక విభిన్న కోణాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది.పల్లెటూర్లలో తల్లులు పనికి పోతే పిల్లలకి చెట్టు కల్లు తాగించి ఉయ్యాలలో వేసి జారి కింద పడిన దెబ్బ తాకకుండా ఉండేందుకు.ఉయ్యాల కింద నులక మంచం వేసి ఇంటి దగ్గర ఉండే పెద్ద వాళ్ళకి చెప్పి తలుపేసి వెళ్తారు.కాస్త పెద్ద వాళ్ళు అయితే వాళ్ళ కాళ్ళకి తాడు కట్టి తినడానికి కావలసినవి అందుబాటులో పెట్టీ పనికి వెళ్లి పోతారు.వాళ్ళు లేచి ఏడ్చిన,ఒకటి రెండు పనులుకాస్త పైంటులోనే కానించిన తల్లి ఇంటికి వచ్చే వరకు ఉండాల్సిన దుస్థితి ఉన్న పిల్లలు కూడా ఉంటారు.రెక్కాడితే గానీ డోక్కనిండని నిరుపేద కుటుంబాలు కూడా ప్రస్తుత ఆధునిక సాంకేతికత సమాజంలో ఉన్నాయి.... ఆ విషయం మీకు తెలుసా?అభివృద్ధి అయినట్టుగా మన మన సమాజాన్ని అనుకుంటున్నాం.కానీ ఎన్నో చీకటి కోణాలు సమాజంలో దాగి ఉన్నాయి....



Rate this content
Log in

Similar telugu story from Drama