శ్రీలత "హృదయ స్పందన"

Classics

4.7  

శ్రీలత "హృదయ స్పందన"

Classics

మరుజన్మకు మాటిస్తున్న !

మరుజన్మకు మాటిస్తున్న !

2 mins
551   ప్రియమైన నీకు..,

ఉదయాన్నే కళ్ళు తెరిచినప్పుడు కనిపించే నీ రూపం... గిలిగింతలు పెట్టె నీ ఆలోచనలు ఎలా అదుపు చేయాలో తెలియక.. కళ్ళు మూసుకొని నువు నా చెంత చేరి మురిపిస్తున్న అనుభవాన్ని ఆస్వాదిస్తూ నాలో నేనే మురిసిపోతున్న..

చంద్రుని వెన్నెలకు విచ్చుకునే కలువలా..

తుమ్మెద చేరువైతే వికసించే పుష్పంలా..

మేఘాల రాకను చూసి నాట్యమాడే మయూరిలా..

నీ ప్రేమకు నేను పరవశించి పోతున్నా..

నన్ను నేనే కోల్పోతున్న..

నీ ఊహలు నన్ను. నా అంతరంగాన్ని నిలువనీయక ఊరించే ఆకాశంలా అందనంత ఎత్తులో ఉంటాయి.. నా మనసేమో నిన్ను ఎప్పుడెప్పుడు అందుకోవాలని ఆరాటపడుతున్న అలల్లా ఉవ్వెతున ఎగసిపడుతుంటే.. అంతలోనే మళ్ళీ నిరాశ... ఎప్పుడైనా అలలు ఆకాశాన్ని అందుకున్నాయా అది జరగని పని... అలలు ఎప్పుడు సముద్ర తీరం వరకే పరిమితం... అని..

అలానే. నా ఆశలు.. ప్రేమ.. నా అంతరంగ సాగరానికే పరిమితం అనిపిస్తుంది..

ఎడారిలాంటి నా మనసులో ప్రేమ విత్తనం నాటావు

ఇప్పుడు అది జీవం పోసుకొని పచ్చని మొక్కలా ఎదిగి ప్రేమ పుష్పాన్ని వికసించే సమయంలో తుంచాలని చూస్తున్నావు..

నీ ప్రేమ వాయువు లేక ఇప్పుడు అది కొన ఊపిరితో ఊగిసలాడుతుంది. తిరిగి దానికి ప్రాణం పోస్తావో ఒదిలేస్తావో మరి..

నువ్వే ప్రేమిస్తావు.

నువ్వే ద్వేషిస్తావు

నువ్వే బాధపెడతావు

నువ్వే ఓదారుస్తావు

నువ్వే ఇష్టం అంటావు

నువ్వే కష్టం అంటావు..

నువ్వే దగ్గరికి వస్తావు

నువ్వే దూరం పొమ్మంటావు...

నీ కోపాన్నైనా భరిస్తాను కానీ.. నీ మౌనాన్ని భరించలేను..

నా హృదయంలోని వేదన అంతా నీ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకొని పోతుంది.. ఆ వేదనే కరిగి కన్నీటి ముత్యాలుగా నా దేహాన్ని అలంకరిస్తున్నాయి..

నీ జ్ఞాపకాల సుమగంధాలు నా చివరి శ్వాస వరకు పరిమళిస్తూనే ఉంటాయి...

ఇంకో జన్మ ఉంటే నీకు నచ్చే లా పుడతాను.. ఇప్పుడు కోల్పోయిన నీ ప్రేమ లో నన్ను నేను కొత్తగా నిర్మించుకుంటాను..

ఇదే మరుజన్మకు నీకు నేనిచ్చే మాట...

నా మనసును... అందులో నీ జ్ఞాపకాలను.. కంటిపాపలో ముద్రించుకున్న నీ రూపాన్ని.. నా హృదయపు కోవెలలో సర్దుకుని...

ఇప్పుడు సెలవు తీసుకుంటూ.....

ఇట్లు.,

 ఈ జన్మలో నీకేమౌతానో తెలియని..

మరుజన్మలో నీకోసం ఎదురుచూసే నీ ప్రియ సఖి.

శ్రీ...

హృదయ స్పందన..
Rate this content
Log in

Similar telugu story from Classics