శ్రీలత "హృదయ స్పందన "

Romance Classics


4  

శ్రీలత "హృదయ స్పందన "

Romance Classics


ప్రియతమా నీకోసం!

ప్రియతమా నీకోసం!

2 mins 294 2 mins 294


ప్రియమైన కన్నయ్యకు,


నా మనసుపూతోటలో నిత్యపరిమళాలు వెదజల్లే

నీ జ్ఞాపకాల కసుమాలను అక్షరాలుగా పేర్చి రాస్తూ..

నీ హృదయానికి నివేదిస్తున్న....నా ప్రేమ కానుక..


ప్రశాంతమైన నా మానస సరోవరంలోకి

నీ ప్రేమ కలువలు వచ్చి చేరాయి..

నా హృదయం నీ ప్రేమతో నిండిపోయింది.

నీ మాటల మధురిమలు.... ఒక్కొక్కటి నా మనసును మీటుతుంటే ..

కాలం కదలటం లేదు..

నీ రూపాన్ని కనుపాపల్లో ప్రతీ క్షణం చూస్తున్నా...

మనసు మాత్రం ఇంకా నిన్ను భౌతికంగా చూడాలని ఆరాటపడుతూనే ఉంది..

నీ పరిచయం తొలి నాటి నుండి నేటివరకు ప్రతీ అనుభూతి నా మనసులోతుల్లో నిక్షిప్తం చేసుకున్నాను.


ప్రతీ రోజు నిన్ను చేరాలని నా ప్రేమాక్షరాల

చిరుజల్లు నీ హృదయ క్షేత్రం మీద చిలకరిస్తున్న..

అవి ప్రేమకుసుమాలై విరిసి ప్రతీ నిత్యం నీ తనువుకు సుగంధ పరిమళాలు అద్దాలని ..


నీ మీద నాకున్న ఈ భావాలను కేవలం "ప్రేమ" అనే రెండు అక్షరాలతో పోల్చలేను. అంతకన్నా ఎక్కువ అది బాషకు అందనిది, అద్వితీయము, అద్భుతమైన భావన.

నిన్ను చూడకుండా ఇంకా నేను జీవిస్తున్నాను అంటే నా ఊపిరికి ప్రాణం పొసే శ్వాసే నువ్వు ...


ఏనాటికి అయిన నిన్ను చూడగలను అనే నమ్మకంతో ఇలా నీ ఊహల్లో ఊపిరిపోసుకుంటూ.... నీకై నీ నేనుగా జీవిస్తున్న...


వెన్నెల చల్లదనాన్ని నింపుకున్న నీ చూపుల్లో ప్రతిరోజు నా తనువు తడిసి మురిసిపోతుంది. నిన్ను నా మనసుతో చూస్తూ నా హృదయం స్పందిస్తుంది. ఇకముందు కూడా ఏ ఒక్క క్షణం అయిన నా మనసు భౌతిక వాంఛలకు తల వంచి నీపై నాకున్న ప్రేమను మలినం చేయకూడదు.


ప్రతీ చోట.. ప్రతి పనిలో నాతో నువ్వు నా తోడుగా ఉంటావు.. నాలో నేనే నవ్వుకుంటాను.. మాట్లాడుకుంటాను. కళ్ళుమూసుకొని ఓ అందమైన.. అద్భుతమైన అనుభూతిని పొందుతాను.చూసేవాళ్లకు అర్థం కాదు నేను ఒంటరిగా ఇవన్నీ అనుభవిస్తున్నాను అనుకుంటారు. నాతో నువ్వు ఉన్నావని.. ఆ అనుభూతి.. అంతా నీ వల్లే అని నా మనసుకు తప్ప ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది.


 కన్నయ్య ఏ ఒక్కసారి అయిన నీ ఊహల్లో నేనున్నానా.. వీచే చల్లని గాలిలో నా శ్వాస వెచ్చగా నిన్ను తాకినట్టు.. కురిసే వానచినుకల్లో నా కన్నీళ్లు నీ పాదాలను అభిషేకిస్తున్నట్టు.. పండు వెన్నెల్లో నేను నీ పక్కన ఉన్నట్టు..నా రూపం కనిపిస్తున్నట్టు.. హ..హ.. చాలా ఎక్కువగా ఊహించుకున్నానా.. ఏమో మరి నాకెలా తెలుస్తుంది..

నీ మనసుకు తెలియాలి...


ఇక ఉండనా కన్నయ్య.. నీ ఆలోచనల ప్రవాహంలో పడితే నాకు గమ్యం గుర్తుకు రాదు.. నీ జ్ఞాపకాల సహవాసంలో ఆకలి ఊసే ఉండదు..ఇట్లు,

నా కన్నయ్య మనసులో రాధను కాలేని..

ఓ రాధని..

నీలో నన్ను చూసుకోవాలని నిరంతరం

కలలు కనే... ఓ స్వాప్నికురాలిని..Rate this content
Log in

More telugu story from శ్రీలత "హృదయ స్పందన "

Similar telugu story from Romance