t. s.

Classics

4  

t. s.

Classics

ఎక్కడ న్యాయం

ఎక్కడ న్యాయం

3 mins
533


అన్న అన్న ఇక్కడ "అన్నపూర్ణమ్మ గారి మనవడు" ధర్మ ఎక్కడ ఉంటారు అని అడిగింది జానకి.

నేనే ఆ ధర్మ మీరు ఎవరు ఏం కావాలి అడిగాడు ధర్మ.

నా పేరు జానకి ఈ ఊరుకి ఈ మధ్యనే వచ్చాం.

అలాగ మీకు ఏ సహాయం కావాలన్న నన్ను అడగచ్చు ఏం కావాలమ్మా అని అడిగాడు ధర్మ.

అన్న ఈ ఊరికి మీ బామ్మగారు అన్నపూర్ణమ్మ గారు పెద్ద దిక్కుగా ఉంటారని, ఏం కష్టం వచ్చినా మీరు సహాయం చేస్తారని వచ్చిన అంది జానకి.

ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పమ్మా అడిగాడు ధర్మ.

అన్న ఈ ఊరు పేరుకి మండలం అయినా 

ఇక్కడ బ్యాంకులో ఉద్యోగులు సరిగ్గా లేరన్న వాళ్ళ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలీక మీ గురించి తెలిసి వచ్చా.

ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఆవేశంగా అంది జానకి.

ధర్మ ఆవేశంగా మాట్లాడుతున్న జానకిని ఆశ్చర్యంగా చూసి అసలు ఏమయిందో చెప్పమ్మా అన్నాడు.

అన్న నిన్న మా పెద్దమ్మ నేను బ్యాంకుకు వెళ్ళాం.

ఆమె ఎప్పుడూ ఏటీఎం నుంచి తీసుకునేది డబ్బులు.

కానీ మొన్న ఏటీఎం మిషన్ పని చేయట్లేదు. అర్జంటుగా డబ్బులు అవసరమని బ్యాంకులో తీసుకుందామని నన్ను తోడు తీసుకెళ్ళింది.

మా పెద్దమ్మ ఎక్కువ సేపు నిల్చోలేదు.

బ్యాంకుకి వెళ్ళాక డబ్బులు ఇచ్చే కౌంటర్ దగ్గర పెద్ద లైను ఉంది సరే కదా అని మా పెద్దమ్మ బదులు నేను నిల్చున్న.

తీరా కౌంటర్ దగ్గరకు వెళ్ళాక అక్కడ డబ్బులు ఇవ్వరని ప్రక్క కౌంటర్ లో ఇస్తారని చెప్పారు.

బోర్డు చూస్తే రెండు చోట్ల క్యాష్ కౌంటర్ అని రాసి ఉంది. అప్పటికి నేను అక్కడ లైనులో ఉన్నవాళ్ళని వివరంగా ఏ కౌంటర్ లో డబ్బులు విత్ డ్రా చేస్తారో తెలుసుకుని లైనులో నిల్చున్నా.

అప్పటికే అరగంట నిల్చున్నా లైనులో.

సరే అని ప్రక్క లైనులో నిల్చున్నా. అక్కడా పెద్ద లైను ఉంది.

అసలే కరోనా అంటే అందరూ ఒకరి మీద ఒకరు పడుతున్నట్టు అతుక్కుని నిల్చున్నారు.

ఎవరు రూల్స్ పాటించట్లేదు.

లైనులో నా ముందు వాళ్ళు అయిపోయి నా దగ్గరకు వచ్చేసరికి గంట పట్టింది.

కరెక్ట్ గా నా వంతు వచ్చేసరికి డోర్ మూసేశాడు ఏంటి అంటే ఒకటి అయింది లంచ్ టైం మూడింటి దాక ఇవ్వము అన్నారు.

పోనీ ప్రక్కకి వద్దామంటే చాలా మంది అలాగే లైనులో ఉన్నారు. అది చూస్తే పెద్ద లైను.

అని మూడింటి దాక అలానే లైనులో నిల్చున్నా.

మూడింటికి అతను వచ్చాక మా పెద్దమ్మ కూడా నిలబడింది లైనులో. అతను ఆ ఎకౌంటు పుస్తకం చూసి సార్ దగ్గరకు వెళ్ళమన్నాడు. 

ఏ సార్ దగ్గరకు అంటే ప్రక్కకి అన్నాడు.

ఇటు చూస్తే ఎవరూ లేరు.

అప్పుడే నేను ముందు నిల్చున్న క్యాష్ కౌంటర్ దగ్గరకు ఏమో అని అక్కడికి వెళితే ఎందుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చావని గట్టిగా కసురుకున్నాడు.

ప్రక్క అతను మీ దగ్గరకు వెళ్ళమన్నాడు అంటే ప్రక్క అతనితో ఏంటి నా దగ్గరకు పంపించావ్ అని ఇద్దరూ ఎగతాళిగా నవ్వారు.

అతను ఇటు కాదు అటు అని చెపితే మళ్ళీ అటు ప్రక్క కౌంటర్ కి వెళ్ళాము.

అతను లంచ్ కి వెళ్ళాడట.అరగంట తర్వాత వచ్చాడు.

అక్కడ ఒక అరగంట నిల్చున్నా లైనులో. అప్పుడు నిల్చోలేని మా పెద్దమ్మ కూడా నాతో పాటు అరగంట నిలబడింది.

అరగంట అయ్యాక అతను చూసి డబ్బులు ఇప్పుడు తీసుకోండి కానీ ఈ ఎకౌంటు పుస్తకం పని చేయదు కొత్తది తీసుకోండి అని చెప్పాడు. 

పుస్తకం ఎందుకు పని చెయదు అని అడిగితే సమాధానం లేదు.

మళ్ళీ క్యాష్ కౌంటర్ దగ్గరకి వచ్చి డబ్బులు తీసుకున్నాం.

తర్వాత కొత్త పుస్తకం ఎక్కడ ఇస్తారని అడిగితే నేను ముందు నిల్చున్న లైనులో అని చెప్పారు.

మళ్ళీ అక్కడ మా పెద్దమ్మ, నేను అరగంట నిల్చున్నాం.

అతను అది చూసి ఫోటో తెచ్చావ అన్నాడు.

బయటికి వచ్చి ఫోటో తీసుకుని మళ్ళీ లైనులో నిలుచున్నాం.

ఆ ఉద్యోగులు ఇద్దరిలో ఒకరు అంటున్నారు మనకి ఫస్ట్ తారీఖు , మంత్ ఎండిగ్ అని స్పెషల్ రోజులు లేవా అని ఏంటి ఈ పని అని విసుకున్నాడు.

ఇంకోక కౌంటర్ లో అతను ఒడిశా నుంచి వచ్చాడట.

తెలుగు రావట్లేదు అతనికి.

సిస్టమ్ లో ఇంగ్లీషు అర్థం కావట్లేదట. 

అందరూ అనుకుంటున్నారు.


నాతో పాటు ఒక ముసలమ్మ కూడా అక్కడికి ఇక్కడికి నాలుగు సార్లు తిరిగింది.

డబ్బుల కోసం. ఆమెకి ఇవ్వకుండా ఇక్కడ కాదు అక్కడ అని అక్కడ కాదు ఇక్కడ అని తిప్పారు. అసలు ఆమెకి ఏం అవసరమో డబ్బులు ఇవ్వడానికి క్లారిటీగా చెప్పట్లేదు.

నేను గమనించా. 

డబ్బులు ఇవ్వడానికి, తీసుకోవడానికి చాలా అశ్రద్ధగా చేస్తున్నారు పని.

ఈ ప్రాసెస్ లో ఐదు గంటలు నిల్చున్నా లైనులో.

అదే మా పెద్దమ్మ మూడు గంటలు నిల్చుంది. 

వాళ్ళకి ఎలా అయినా మీరే బుద్ధి వచ్చేట్టు చేయాలన్న అంది జానకి.

అసలు నాకు ఎంత కోపం వస్తుంది అంటే కాదు కాదు కోపం కాదు బాధ అన్ని గంటలు నిలుచునేసరికి నాకు కళ్ళు తిరిగాయి.

బ్యాంకు ఎంప్లాయిస్ అని వాళ్ళకి గర్వం ఎవరూ ఏం చేయలేరని వాళ్ళని.

ఎవరిని పట్టించుకోకుండా మనుషులను మనుషులుగా చూడట్లేదు.

అసలు నాకు కుదిరితే పేపర్లో వీళ్ళ పనితీరు గురించి పెద్ద ఆర్టికల్ రాయాలని ఉంది.

ఈ సమస్య నా ఒక్కదానిది కాదు బ్యాంకుకు వచ్చే అందరిదీ. 

మీరే ఎలాగయినా ఈ సమస్యని పరిష్కరించాలి అన్న

అని తన ఆవేశాన్ని ఆపేసింది జానకి.


బ్యాంకు లో డబ్బులు వేసుకునే వాళ్ళు, తీసుకునే వాళ్ళు లేకపోతే,

ఏ లోనులు, పథకాలు ఉపయోగించే వారు లేకపోతే 

బ్యాంకు అనేది ఎలా నడుస్తుంది.

బ్యాంకు ఉద్యోగుల ఉద్యోగాలు ఉంటాయ అని...




Rate this content
Log in

Similar telugu story from Classics