t. s.

Classics Inspirational

4  

t. s.

Classics Inspirational

తొందరపాటు తగదు

తొందరపాటు తగదు

2 mins
499


తల పైకెత్తి చూశాడు రాజు. 

"ఇన్ నిషా అపార్ట్మెంట్స్" అని బోర్డు కనిపించింది. 

తాను ఈ అపార్ట్మెంట్స్ లో గడిపే చివరి రోజు అనుకుంటూ తన అపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టాడు.

వంటగదిలోకి వెళ్లి మంచినీళ్ల బాటిల్ తెచ్చుకున్నాడు.

తన గదిలోకి వచ్చి జేబులోంచి నిద్ర మాత్రల సీసా తీసాడు.

మంచం మీద కూర్చుని సీసాలోని మాత్రలు గుప్పెడు చేతిలో వేసుకున్నాడు.

ఒక్కసారిగా మాత్రలు మింగేసాడు.

అలా దాదాపు ఒక రెండు గుప్పెడులు నిద్ర మాత్రలు మింగేసాడు.

కళ్ళు మత్తుగా మూసుకుపోతున్నాయి. తనకి అంతిమ గడియలు సమీపించాయని అనిపిస్తుంది.


చిన్నగా కళ్ళు తెరిచాడు రాజు.

అంతా నిశ్శబ్దంగా ఉంది. తను చనిపోయి ఎన్ని గంటలు అయిందని అనుకుని అప్రయత్నంగా గడియారం వంక చూశాడు.

అదేంటి తను చనిపోలేదా!

అని గబుక్కున లేచి కూర్చుని చుట్టూ చూసాడు.

ఆశ్చర్యం!

తను తన గదిలోనే ఉన్నాడు.

చావడానికి అన్ని నిద్ర మాత్రలు మింగినా చావలేదు ఎందుకు అని ఆలోచిస్తూ సీసాలో మిగిలి ఉన్న మాత్రలను చూసాడు.

అందులో ఒక నాలుగు మాత్రమే ఉన్నాయి.

అంటే తాను నలభైఆరు నిద్ర మాత్రలు మింగిన చనిపోలేదంటే ఏంటి విచిత్రం అనుకుని ఒక మాత్ర తీసుకుని చూసాడు అది తీయని వాసన వస్తుంది.

నోట్లో వేసుకుని చప్పరించాడు. అప్పుడు అర్థం అయింది తాను మోసపోయాడని.

మందుల షాపు వాడు నిద్ర మాత్రలు అని చప్పరించే పిప్పరమెంట్లు ఇచ్చాడని.

తాను చావాలన్న తొందరలో అది గమనించకుండా అన్ని మింగేసాడు అని.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

రాజు నీరసంగా తలుపు తెరిచాడు.

ఎదురుగా తన ప్రేమికురాలు ఉష కనిపించింది.

సంతోషంగా రాజుని హత్తుకుని మా అమ్మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకున్నారు రాజు అని ఆనందంగా చెపుతున్న ఉషని చూసి ,

ఓ దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని మనసులో అనుకుని జరిగింది గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఎంత ప్రయత్నం చేసినా 

ఉష వాళ్ళ అమ్మా వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదని 

ఉష తాము పెళ్లి చేసుకోలేమని తనని మర్చిపోమంటే మరిచిపోలేక ఉషని వదిలి ఉండలేక ఆత్మహత్య చేసుకుందామని నిద్ర మాత్రలు తెచ్చుకోవడం.

అప్పుడు అనిపించింది ఎప్పుడూ తొందర పడకూడదు.

అదే అవి నిజమైన నిద్ర మాత్రలు అయితే ఈ పాటికి తను చచ్చిపోయేవాడు.

ఆ మందుల షాపు అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనుకుని ఉష వైపు చూసాడు.

ఉష చెపుతుంది తాను రాజుని వదిలి ఉండలేనని తన తల్లి తండ్రిని ఎంత కష్టపడి ఒప్పించిందో చెపుతుంటే 

ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు.



Rate this content
Log in

Similar telugu story from Classics