STORYMIRROR

T. s.

Tragedy Classics

4  

T. s.

Tragedy Classics

గాయపు గురుతులు

గాయపు గురుతులు

1 min
673

ఈ కాలం ఎంత నిర్దయగా ఉంటుందో!

జాలి లేకుండా ఏ పనైనా చేస్తుంది

వద్దన్నా మనసు గుండె తలుపు తట్టి

గాయపు బాధలో నేనుంటే ఇంకా ఇంకా

నన్ను మరింత గాయపరిచిపోయింది..

మనసు తలుపు నేను తీయకుంటే 

చొచ్చుకొని వచ్చి హృదయ కవాటాల్లోకి వచ్చి

మనసు తలుపు తెరవగానే మనసుకు మరణం ఇచ్చి మరలిపోతుంది. 

ముందే నేను గాయపు బాధలో ఉన్నా...


ఒక బంధం కొత్తగా...

వలపు తలుపులు తెరిచి...

సందేశాల స్వాగతహారాలు పలికి...

స్వప్నాల తేరులో విహారింప జేసి...

తన పాత్ర తను ముగించి గుండెని నెట్టేసి

నా కన్నుల్లో నుంచి వచ్చే సముద్రంలో మునిగిపొమ్మని సెలవడిగింది...

మనసు గాయపు గురుతులు ఏరులై కనుదోయల్లో కాపురమున్న కన్నీరు...

మనసు నిండా విషాదం పూవులు వర్ణాలు పూసుకుని

నన్ను నా నుండి వెలివేస్తున్నాయి.


"ఐతే"....

ఎప్పుడూ ఎలాంటి పరిస్థితిలో కూడా నా మీద జాలి పడని నేను ఈ క్షణాన జాలిపడాల్సి వస్తుంది ఇలా మోసపోవాల్సి వచ్చినందుకు...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Tragedy