స్ఫూర్తి
స్ఫూర్తి
ఇంట్లో హడావిడి చేస్తు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు నారాయణ గారు అసలు విషయం ఏమిటంటే ఈ రోజు ఆయన కూతురి కి పెళ్ళిచూపులు ఆడపిల్ల పెళ్లంటే ప్రతి తండ్రికి కొంచెం టెన్షన్, భయం , కంగారు అన్ని ఉంటాయి కదా నారాయణ గారు కూడా దానికి అతితీలు కాదు కదా అందుకే ఆయన కూడా సగటు మధ్య తరగతి తండ్రి లాగే కూతురి పెళ్లి విషయంలో కంగారు పడుతున్నారు..
కృష్ణ వేణి గారు :(నారాయణ గారి సతీమణి) వంట గదిలో నుండి వస్తూనే అబ్బా.. ఎన్టీ అండి మీ హడావిడి మీరు కంగారు పడిపోతే మాత్రం సాయంత్రం రావలసిన పెళ్లి వాళ్ళు ఇప్పుడే వచేస్తరా.. మీరు ముందు కంగారు పడి బి.పి తెచ్చుకోకండి..
నారాయణ గారు : నా కంగారు నీకేమీ తెలుస్తుంది వేణి నా కంగారు నాది ..
కృష్ణ వేణి గారు : ఎందుకండీ అంతా కంగారు అంతా సవ్యంగానే జరుగుతుంది
నారాయణ గారు : నేను అలా జరగాలనే కోరుకుంటున్నాను వేణి ఇది మన అమ్మాయికి ఆరోవ పెళ్లి చూపులు ప్రతి సారి అమ్మాయి నచ్చింది అనడం తర్వాత రెండు రోజులకి మాకు ఈ సంబంధం నచ్చలేదని ఫోన్ చేసి చెప్పడం షర మామూలు అయిపొయింది..
కృష్ణ వేణి గారు : నిట్టూరుస్తూ ..అవును అండి మన అమ్మాయి జాతకంలో ఏదైనా లోపం ఉందా అంటే అది లేదు అయిన కానీ దానికి ఏ సంబంధం కుదరడం లేదు ఎందుకో అదే అర్థం కావడం లేదు అండి నాకు కూడా.. ఈ సంబంధం అయిన కుదిరితే బాగుణ్ణు అండి..
నారాయణ గారు: అవును వేణి కానీ మన చేతుల్లో ఏం ఉంది చెప్పు.. అంతా ఆ పైవాడి లీల .. అనుకుని నీట్టురుస్తరు
కృష్ణ వేణి గారు: హ్మ్మ్ ..అని సాయంత్రం పెళ్లి వాళ్ళకి కావలసినవి రెఢీ చేయడానికి వెళ్లి పోతారు..
చాటుగా వీళ్ళ మాటలు విన్న స్ఫూర్తి గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది..
నారాయణ గారు ఏభై ఏళ్ళ వయసులో కూడా
మంచి చురుకుగా ఉంటారు .. ఒక ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎగ్జక్యూటివ్ గా పని చేస్తున్నారు.. వేలలో జీతం దేనికి లోటులేని జీవితం .. పిల్లలకి అడక్కూండానే అన్ని సమకూరుస్తారు.. ఒక మంచి తండ్రి అనే చెప్పాలి ఒక రకంగా కానీ చాలా స్ట్రిక్ట్ ఇంట్లో ఆయన చెప్పేదే వేదం ఆయన మాటకి ఎదురు చెప్పితే ఊరుకోరు.. చదువు విషయంలో మాత్రమే పిల్లలకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు మిగిలిన వాటిలో మాత్రం అయిన ఇష్టమే .. ఆడవాళ్లంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలి అనుకునే మనస్తత్వం ఉద్యోగాలు చేసే ఆడవాళ్లంటే చిన్న చూపు..
కృష్ణవేణి గారు ఆయన సతీమణి భర్త మాటే
వేద వాక్కు..ఆయన ఏది చెప్పితే అదే వేదం అనుకుని భర్త జవదాటని మహాసాధ్వి..
వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ,ఒక అబ్బాయి అమ్మాయి పేరు స్ఫూర్తి ,అబ్బాయి పేరు రామ్ ప్రజెంట్ హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్
చేస్తున్నాడు..
స్ఫూర్తి పదహారణాల అచ్ఛ తెలుగు ఆడపిల్ల చదువు అంటే చాలా ఇష్టం బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది తన కోరిక ఒక రకంగా చెప్పాలంటే అది తన జీవిత ధ్యేయం..
అందరి ఆడపిల్లల లాగే కుటుంబం అంటే ప్రాణం కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని అంతా ప్రాణం.. ముఖ్యంగా వాళ్ళ నాన్న గారు అంటే పంచ ప్రాణాలు ఆయన ఏదైనా చేయమంటే కళ్ళు మూసుకుని చేసేటంతా ఇష్టం ..
ఆయన ఏది చెప్పితే అదే వేదం ఆయనకి నచ్చనిది ఏదైనా సరే కలలో కూడా దాని గురించి ఆలోచించదు తనకి ఇష్టమైనది వాళ్ళ నాన్న గారికి ఇష్టం లేదంటే ఇంకా దాని ఆలోచనే తన మైండ్ లోకి రానివ్వదు ..అదే తన జీవితంలో తీరని ఆవేదనని మిగిలించబోతుందని ఊహించలేక పోయింది
ఇంటర్ తర్వాత బి.టెక్ చేద్దామనుకుంటే వాళ్ళ నాన్నగారు ఆడపిల్ల అంతా దూరం వెళ్లి చదవడం మంచిది కాదు వద్దు అని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం లోకల్ కాలేజ్ లో డిగ్రీ లో జాయిన్ అయింది..
తనకి ఇష్టం లేని చదువు అయిన కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చి , తన ఆశయం గురించీ వాళ్ళ నాన్నకి చెప్పాలి అని వచ్చిన తనకి పెద్ద షాక్ ఇచ్చారు నారాయణ గారు అదే తన పెళ్లి విషయం..
చదువుకుని ఏదో సాధించాలని ఆశ పడిన స్ఫూర్తి ఇలా తన జీవితంలో పెళ్లి అనేది ఫెను తూఫాన్ లా మారి తన ఆశయ సౌధాలని పేకమేడల్లా కుల్చపోతుందని తెలిసి ఆరోజు రాత్రి అంతా కన్నీళ్ళ సుడిగుండంలో చిక్కుకొని ఒక నిర్ణయానికి వచ్చినది అయి గుండెని రాయి చేసుకుని ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని సూర్యుడి కోసం నిరీక్షించే పొద్దు తిరుగుడు పువ్వులా ఎదురు చూస్తుంది..
తెల్లవారడం ఆలస్యం గబ గబ ఫ్రెష్ అయి బయటకు వచ్చి దేవుడికి దణ్ణం పెట్టుకొని కొండంత ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని తనలో నింపుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి..
స్ఫూర్తి :నాన్న మీతో కొంచెం మాట్లాడాలి
నారాయణ గారు: చెప్పు అమ్మా..
స్ఫూర్తి :గుండెలు నిండా ధైర్యం నింపుకుని వణుకుతూనే .. అది నా..న్న నా..కు అప్పుడే.. పెళ్లి ..చేసుకోవడం ఇష్టం లేదు..
నారాయణ గారు: అధి వింటూనే కోపంగా గాంభీర్యం కలిసిన గొంతుతో .. ఏ ..ఎందుకు ఇష్టం లేదు..ఎవరినైనా ప్రేమస్తున్నావా.. చెప్పు అని గట్టిగా అడిగేసరికి ..
స్ఫూర్తి : భయంగా నాన్న అలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను.. నేను సివిల్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత చేసుకుంటాను.. ప్లీజ్ నాన్న ..
నారాయణ గారు: కోపంగా ఇంకా ఆపు ఆడపిల్లకి ఉద్యోగం ఏంటి అది సివిల్స్ అంట సివిల్స్ ఆడపిల్ల ఉద్యోగం సద్యోగం అంటూ ఊర్లు పట్టుకుని తిరిగితే నా పరువు ఏం కావాలి.. అయిన నువ్వు సివిల్స్ రాసే గాని వచ్చేడానికి అది కోర్టులో బంత్రోతు జాబ్ అనుకున్నావా సివిల్స్ మగవాళ్ళే ఎంతోమంది ఎన్నోసార్లు కష్టపడి రాసిన కూడా సాధించలేకపోయారు ఆఫ్ట్రాల్ అడపిల్లవి నువ్వు ఏం సాధిస్తావు
స్ఫూర్తి: కళ్ళ నీళ్లతో వాళ్ళ నాన్న వంక చూస్తూ .. ప్లీజ్ నాన్న అలా అనకండి నేను కష్టపడి కాదు కాదు ఇష్టపడి చదివి కచ్చితంగా సివిల్స్ లో సెలెక్ట్ అవుతా ..నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఒకవేళ నేను సాధించలేకపోతే అప్పుడు మీ ఇష్టం మీరు ఏం చేయమన్నా చేస్తాను...
నారాయణ గారు: చూడు..స్ఫూర్తి నేను చెప్పేది బాగా విను ఇది ఏమి సినిమా కాదు నీకు ఛాన్స్ ఇవ్వడానికి జీవితం.. కాదు కూడదు అంతే నా నాన్న శవాన్ని చూస్తావు ఆ తర్వాత నీ ఇష్టం.. రేపే నీ పెళ్లి చూపులు ఏం చేస్తావు అనేది నీకే వదిలేస్తున్నా అని చెప్పి వెళ్లిపోతారు..
స్ఫూర్తి ఏడూస్తు అక్కడే కులబడిపోతుంది..
కృష్ణ వేణి గారు కూడా కూతురి బాధ చూస్తూ ఆవిడ ఏమి చేయలేని తన నిస్సహాయతకి తనని తాను నిందించుకుంటూ కూతుర్ని ఓదారుస్తారు..
అందరి ఆడపిల్లలు లాగే తనకి ఇష్టం లేకపోయినా తండ్రి నిర్ణయంకి తలవంచి పెళ్లి చూపులకి సిద్ధం అవుతుంది..
అలా ఒక ఐదు సంబంధాలు దాకా వచ్చి చూసిన వారు అమ్మాయి బాగుందని చెప్పడం తర్వాత ఇంటికెళ్లి ఈ సంబంధం మాకు వద్దు అనడం మామూలు అయిపొయింది..
ప్రజెంట్
ఇది తనకి ఆరోవ పెళ్లి చూపులు ఈ పెళ్లి చూపులు కూడా ఏదో విధంగా ఆగిపోతే లేదా కాన్సిల్ అయిపోతే బాగుణ్ణు అని స్ఫూర్తి మొక్కని దేవుడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో ..
పెళ్లి చూపులు సమయం రానే వచ్చింది..
పెళ్లి వాళ్ళ రావడంతో నారాయణ గారు వారందరిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు..
కృష్ణ వేణి గారు వచ్చిన వారికి ఫలహారాలు అందించే పనిలో పడి పోతారు..
పెళ్లి కూతురు గదిలో
స్ఫూర్తి ఫ్రెండ్ దేవి తనను రెడీ చేస్తూ ఉంటాది..
దేవి :ఒసేయ్.. స్ఫూర్తి ఇంతకీ పెళ్లి కొడుకు ఫోటో చూసావా అబ్బాయి ఎలా ఉన్నాడు యావరేజ్ నా లేకపోతే సినిమా హీరో లా ఉన్నాడా స్ఫూర్తి వైపు చూస్తూ అడుగుతుంది కొంటెగా..
స్ఫూర్తి :కోపంగా అబ్బా.. దేవి నీ కుళ్ళు జోకులు ఆపు అసలే ఎమ్ జరుగుతుందోనని టెన్షన్ గా ఉంది నాకు..
దేవి :టెన్షన్ ఎందుకు స్ఫూర్తి అబ్బాయి నచ్చితే నచ్చాడు అని చెప్పు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు టెన్షన్ పడడానికి ఏముంది ఇందులో ..
స్ఫూర్తి :కళ్ళ నీళ్ళతో దేవి వైపు చూస్తూ నాకు అంత అదృష్టం కూడా లేదు .. అది కుదరని పని కూడా .. అయినా ఇక్కడ నా ఇష్టాయిష్టాలతో పని లేదు ఎవరికి.. వాళ్లకి నచ్చింది వాళ్ళు చేస్తారు..నేను ఒక అంగట్లో బొమ్మనీ మాత్రమే అని ఏడుస్తుంది..
దేవి :స్ఫూర్తి కన్నీళ్లు తుడిచి.. అసలు ఏమైంది రా..ఎప్పుడు నువ్వు ఇంతలా బాధపడింది లేదు..
స్ఫూర్తి: ఏడుస్తూనే తనకి వాళ్ళ నాన్నకి మధ్య జరిగిన సంభాషణ అంతా దేవి కి చెబుతుంది
దేవి : స్ఫూర్తి మూడ్ మార్చాలని..నువ్వు ముందు ఏడుపు అపవే తల్లి నువ్వు ఏడిచి ఏడిచి నీ మేకప్ మొత్తం పోతే నీకు మేకప్ వేసే ఓపిక నాకు లేదు ఇంకా..ఏడుస్తున్నట్టు చెబుతుంది...
స్ఫూర్తి దేవి మాటలకి నవ్వుతుంది..
పెళ్లి వాళ్ళు అమ్మాయిని తీసుకు రమ్మనడంతో స్ఫూర్తి ని తీసుకొస్తారు..
స్ఫూర్తి నీ తీసుకువచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెడతారు..
సుబ్రహ్మణ్యం గారు: పెళ్ళికొడుకు తండ్రి ఈవిడ మా ఆవిడ లక్ష్మి ఇంకా వీడు మా అబ్బాయి పేరు కృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు..
అబ్బాయి చూడ్డానికి సినిమా హీరోల బాగున్నాడని, మంచి ఉద్యోగం, కుటుంబం కూడా చూడడానికి పద్ధతిగా ఉందని పిల్లకి మంచి సంబంధం వచ్చింది అని తెగ మురిసిపోతారు నారాయణ రావు దంపతులు..
వాళ్లు మామూలుగా కొన్ని ప్రశ్నలు అడిగీ ..
సుబ్రహ్మణ్యం గారు :నారాయణ గారు మాకు కట్నకానుకలు కూడా ఏమీ అవసరం లేదండి మీ అమ్మాయి చదువుకుంది మీ అమ్మాయికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అభిప్రాయం ఉంటే ముందే చెప్పండి.. ఎందుకంటే మా ఇంటికి వచ్చే కోడలు ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు..
నారాయణ గారు: అబ్బే అదేం లేదండి.. ఉద్యోగం చేసే ఆలోచన కూడా తనకి లేదు..
సుబ్రహ్మణ్యం గారు :మంచిదండి మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది.. మీరు కూడా ఏది అయింది చెప్తే..
నారాయణ గారు: మాకు కూడా ఎటువంటి అభ్యంతరము లేదండి..
స్ఫూర్తి అందరికీ నచ్చడంతో వాళ్లు వెంటనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంటారు..
స్పూర్తికి షాక్ కోట్టినట్టు అయి ఆశ్చర్యంగా వాళ్ల వంక చూస్తోంది..
అక్కడ స్ఫూర్తికి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా కనీసం తన ఇష్టం అడక్కుండానే సంబంధం ఖాయం చేస్తారు..
స్ఫూర్తి బాధ అరణ్య రోదనే అయ్యింది
స్ఫూర్తి మర బొమ్మలా చెప్పింది చేస్తూ మూగగా రోదిస్తుంది..
నిశ్చితార్థం జరిపించుకుని పెళ్లి ముహూర్తం తోందరలోనే పెట్టించుకుందాం అని చెప్పి వెళ్లి పోతారు పెళ్లి వాళ్ళు..
కట్ చేస్తే..
రెండు రోజుల తర్వాత..
నారాయణ గారు: ఇంటికి వచ్చి లోపలికి వస్తూనే స్ఫూర్తి అని కోపంగా అరుస్తారు..
ఆయన అరిచిన అరుపుకి అందరూ హల్ లోకి వచ్చి చూస్తే అక్కడ నారాయణ గారు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ కోపంగా ఉంటారు..
స్ఫూర్తి :భయం గా నాన్న పిలిచారు గా ..
నారాయణ గారు చెంప చెళ్లుమనిపిస్తారు.
ఆయన కొట్టిన ఫోర్స్ కి స్ఫూర్తి నోటి నుంచి బ్లడ్ వస్తే, అది కూడా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు..
తనని మళ్లీ కొట్టబోతే కృష్ణ వేణి గారు ఆయనకి అడ్డుపడుతూ ఎప్పుడు లేని కోపంగా ఏమైంది అండి దాని చంపేస్తారా ఎంటి.. అని భర్తని నిలదిస్తుంటే..
నారాయణ గారు : అవును దీన్ని చంపేసిన తప్పు లేదు.. దీన్ని వాళ్ళ ఈరోజు నా పరువు పోయింది అని కులబడిపోతారు..
కృష్ణ వేణి గారు :కంగారుగా ఆయని పట్టుకుని అసలు ఏమైంది అండి విషయం ఏంటో క్లియర్ గా చెప్పండి..
నారాయణ గారు: ఏం చెప్పాలి వేణి..నీ కూతురు చేసిన పనికి ఈ రోజు వాళ్ళ ముందు తల దించుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ..
కృష్ణ వేణి గారు: ఏమైందో..ముందు చెప్పండి..
నారాయణ గారు; కోపం గా.. ఈ రోజు బావగారు (సుబ్రమణ్యం గారు) ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా ..ఆయన ఇంటికి వెళ్తే..
నారాయణ గారు: నమస్తే బావగారు బాగున్నారా..
సుబ్రహ్మణ్యం గారు :ఏం బాగులేండి..
నారాయణ గారు: ఇబ్బందిగా.. అదే కబురు పంపారు కదా రమ్మని..
సుబ్రమణ్యం గారు: కోపంగా మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అండి మేము పెళ్లిచూపులు కి వచ్చిన రోజు మీ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తుదా అంటే లేదు అండి చెప్పారు కదా..
నారాయణ రావు గారు :కన్ఫ్యూజన్ గా.. అవునండి చెప్పాను నిజమే కదా నేను చెప్పింది..
సుబ్రహ్మణ్యం గారు: కోపం గా కానీ మీ కూతురు మా వాడిని కలిసి పెళ్లి తర్వాత సివిల్స్ రాసి జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది ..
నారాయణ గారు: మీరేదో పొరపాటు పడుతున్నట్లు ఉన్నారు మా అమ్మయి అలాంటిది కాదు.. తన నా మాట కాదని ఎలాంటి పని చేయదు..
సుబ్రహ్మణ్యం గారు :అంటే ఏంటి మీ ఉద్దేశం నా కొడుకు నేను మీ అమ్మాయి మీద నిందలు వేస్తున్నామా...
నారాయణ గారు: బావగారు అది కాదండి నా ఉద్దేశం..
సుబ్రహ్మణ్యం గారు; చూడండి పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే పద్ధతి కూడా తెలియాలి.. ఇంకా నయం తర్వాత తెలియలేదు మీ అమ్మాయి అసలు క్యారెక్ట
ర్.. ముందు పెళ్లి చేసేస్తా పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చు ఎ లగో కట్నకానుకలు వద్దు అన్నారు.. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న ఇంటి నుంచి కోడలు నాకు రావడం ఇష్టం లేదు.. ఎలాంటి కూతురిని కన్నావయ్య.. మాతోనే డ్రామాలు ఆడతారా ఈ సంబంధం క్యాన్సల్ చేసేస్తున్న ఈ సంబంధం మాకు ఇష్టం లేదు
ఇంక మీరు దయచేసి వెళ్ళచ్చు..
నారాయణ గారు అవమానంగా జరిగినదానికి కుమిలిపోతూ అక్కడి నుండి ఇంటికి పయనమవుతారు..
కృష్ణ వేణి గారు భర్త చెప్పింది విని ఏం చేయాలో తెలియక ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు..
ఆ రోజంతా ఇంట్లో ఒకరికి ఒకరు ఎవరితోనూ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటారు..
స్ఫూర్తి అయితే లోకం మొత్తం సున్యం అయినట్టు అనిపించి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది...
మర్నాడు ఉదయాన్నే కృష్ణవేణి గారు లేచి నారాయణ గారికి టీ ఇచ్చి , స్ఫూర్తి ఎలా ఉందో అని తన రూంలోకి వెళతారు..అక్కడ స్ఫూర్తి నీ అలా చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది..
తన దగ్గరికి వెళ్లి అమ్మ స్ఫూర్తి అని తడుతూ ఉంటే, తల్లి చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చినదై ఆవిడ ని పట్టుకుని బోరున విలపిస్తుంది..
కృష్ణవేణి గారు : తనని ఓదారుస్తూ ఏమైంది తల్లి.. అసలు ఏం జరిగింది..
స్ఫూర్తి :ఏడుస్తూ .. మీరు ఒక్క సారి గా పెళ్లి ముహూర్తాలు అనడంతో భయమేసి నాన్న దగ్గర నుండి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని తనని కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకున్న విషయం అతనికి చెప్పాను.. అతను సరే అండి నాకేం అభ్యంతరం లేదు ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా..అని చెప్పి వెళ్ళిపోయాడు..
తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అది మాత్రమే చెప్పాను అంతకుమించి నాకేం తెలియదమ్మా.. అమ్మ నాన్న కి నామీద కోపం పోదా అని ఆవిడని పట్టుకుని ఏడుస్తుంది..
కృష్ణవేణి గారు: ఏడవకు తల్లి మీ నాన్న కోపం తామరాకు మీద నీటి చుక్క లాంటిది ఎన్నాళ్ళో నిలవదు నువ్వు బాధపడకు చూస్తూ ఉండు రెండు రోజుల్లో నీతో మాట్లాడతారు ..
ఆ రోజు నుంచి నారాయణ గారు జరిగినదానికి స్ఫూర్తి మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదు ..
కృష్ణవేణి గారు ఎంత నచ్చ చెప్పిన ఆయన మొండి పట్టుదలతో స్ఫూర్తిని చీటికిమాటికి ఏదో ఒకటి అంటూ తనని బాధ పెడుతూ ఉంటారు..
అయినా కాని స్ఫూర్తి అవేమి పట్టించుకోకుండా తండ్రి ఏప్పటికైనా తనని క్షమిస్తారని ఆశతో బతుకుతుంది..
అలా రెండు నెలలు గడిచిపోయాయి.. నారాయణ గారు అదే మొండి పట్టుదల ఉంటే , స్ఫూర్తి కూడా అదే ఆశతో ఉంటుంది..
ఈ లోపు సివిల్స్ ప్రిలిమ్స్ కి నోటిఫికేషన్ వెలువడింది.. అది చూసి స్ఫూర్తి కి చాలా ఆనందంగా అనిపిస్తుంది.. వాళ్ళ నాన్న ఒప్పించి ఎలాగైనా సరే సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయానికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం చెబుతుంది..
నారాయణ గారు : నువ్వు ఏం చేసినా నాకు అనవసరం కానీ ఒక్క మాట నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను .. నువ్వు ఎగ్జామ్ రాయడానికి కోచింగ్కి ఎలా డబ్బులు సమకూర్చుకుంటావో నాకు తెలియదు నీ తిప్పలు నువ్వు పడు.. ఇంకెప్పుడు నీకు సంబంధించిన విషయాలు నాకు చెప్పకు అని కోపం గా వెళ్ళిపోతారు..
స్ఫూర్తి చాలా బాధపడుతుది ఆయన మాటలకి..
అయినా కానీ ధైర్యం,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సివిల్స్ రాయాలని ఫిక్స్ అవుతుంది..
అప్పుడే తన డిగ్రీ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న జాబ్ లో జాయిన్ అయి నైట్ టైమ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది..
కోచింగ్ వెళ్లడానికి మనీ సరిపోకపోవడంతో స్వతహాగా బాగా చదివే అమ్మాయి కావడంతో ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది..
యధావిధిగా ఆఫీస్ కి వెళ్ళిన స్ఫూర్తి కి అక్కడ కృష్ణ నీ చూసి ముందు షాక్ అయినా తర్వాత కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్లి మొహం మీద
చిటికె వేస్తుంది..
కృష్ణ :అక్కడ స్ఫూర్తి నీ చూసి ఆశ్చర్యపోయి అరే.. మీరెంటి ఇక్కడ.. చాలా రోజులయింది మిమల్ని చూసి..
స్ఫూర్తి :కోపంగా నేను ఎక్కడ ఉంటే నీకు ఎందుకు అయ్యా..అసలు నాకు వస్తున్నా కోపానికి నిన్ను ఏం చేసినా తప్పు లేదు..
కృష్ణ: ఆశ్చర్యంగా అంత తప్పు నేనేం చేసాను అండి
స్ఫూర్తి: కోపంగా ఎమ్ చేశావా..ఆరోజు నువ్వు నాకు చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి..అని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నని అన్న మాటలు చెప్పి నువ్వు చేసిన పని వల్ల మా నాన్న ముందు దోషిగా నిలబడ్డా ..ఆయన కనీసం నా పేరు తలవడానికి కూడా ఇష్టం పడడం లేదు అంతా నీ వల్లే అని ఏడుస్తుంది..
కృష్ణ: తనని అలా చూస్తే భాధగా అనిపించి చూడండి మా నాన్నకి విషయం చెపితే ఆయన నా దగ్గర ఒప్పుకుని తర్వాత మీ నాన్న గారి నీ అన్నేసి మాటలు అన్నారని నాకు తెలియదు అండి..నాతో కూడా కేవలం మీరే మ్యాచ్ కాన్సిల్ చేసుకున్నట్టు చెప్పారు..ఐయాం వెరీ సారీ అండి..భాధగా అంటాడు..
స్ఫూర్తి :కళ్ళు తుడుచుకుని ..ఇట్స్ ఓకే మీకు నిజంగానే తెలియదు అని నేను
నమ్ముతున్నాను..
కృష్ణ: హమ్మయ్య నన్ను నమ్మారు కదా అది చాలు అవును మీరెంటి ఇక్కడ..అవును సివిల్స్ కి ప్రిపరే అవ్వడం లేదా నోటిఫికేషన్ ఇచ్చాడు కదా..
స్ఫూర్తి: నేను ఇక్కడ జాబ్ చేస్తు మిగిలిన టైమ్ దానికి ప్రిపేర్ అవుతున్న..
కృష్ణ: అదేంటి అండి జాబ్ అది రెండు కష్టం కదా..
స్ఫూర్తి: వాళ్ళ నాన్నకి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెపుతుంది..
కృష్ణ : బాధపడుతూ..మీకు ఏమి అబ్జెక్షన్ లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో.. నేను ఒకసారి సివిల్స్ రాద్దామని ప్రిపేర్ అయ్య కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ రాయలేదు..
స్ఫూర్తి : ఆనందంగా నిజంగానా ..చాలా థాంక్స్ అండి అంటూ కృష్ణ చేతులు పట్టుకుని ఉపెస్తుంది..
కృష్ణ :ఒకే అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్..
స్ఫూర్తి :ఒకే ఫ్రెండ్..అయితే నీ నంబర్ ఉంటే ఇవ్వు ..నాకు ఏదైనా డౌటు వస్తే నీకు ఫోన్ చేస్తా..
కృష్ణ నంబర్ ఇస్తే ఫీడ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చి అది నా నంబర్ సేవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే, తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు..
స్ఫూర్తి మార్నింగ్ ఆఫీసుకి వెళ్ళి, నైట్ టైమ్ ఏమైనా డౌట్స్ ఉంటే కృష్ణకి కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకుని ప్రిపేర్ అవుతు ఉంది..
కృష్ణ కూడా స్ఫూర్తి ఏ టైమ్ లో కాల్ చేసిన విసుకోకుండా తనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు..అలా కృష్ణ హెల్ప్ తో స్ఫూర్తి సివిల్స్ కి ప్రిపేర్ అవుతు ఉంటుంది..
కృష్ణ ఆల్రెడీ స్ఫూర్తి అంటే ఇష్టం ఉండడంతో ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. స్ఫూర్తి కి కృష్ణ బిహేవియర్ ,తన మంచి మనసు అర్థం అయి తనకి కూడా కృష్ణ అంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది.. ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది..
ఒకరికి ఒకరు ఎగ్జామ్ అవ్వగానే తమ మనసులోని మాట చెప్పిలని డిసైడ్ అయి ఆరోజు కోసం వెయిట్ చేస్తు ఉన్నారు..
నారాయణ గారు కి మాత్రం స్ఫూర్తి తనకి ఇష్టం లేకపోయినా సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండడంతో నానాటికీ తన మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు..
ఇదిలా ఉండగా స్ఫూర్తి ఎగ్జామ్ రోజు రానే వచ్చింది.. తను కన్న కలలు ఈ రోజు నెరవేరబోతున్నందుకు ఒక పక్క ఆనందం,మరో వైపు టెన్షన్తో ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుని సంసిద్ధం అయింది ..
నారాయణ గారికి చెప్పిన ఆయన విననట్టే మొహం పక్కకు తిప్పుకొంటే భాధగా అనిపించిన పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ గారికి చెప్పి తన ఆశయ సాధనకై బయలుదేరుతుంది..
కృష్ణ స్ఫూర్తి మీద ఉన్న నమ్మకంతో తను కచ్చితంగా సివిల్స్ లో సెలెక్ట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు ..
ఎగ్జామ్ సెంటర్కి స్ఫూర్తి వద్దన్న తనే దగ్గర ఉండి తీసుకువెళతా డు..
అలా స్ఫూర్తి ఎగ్జామ్ బాగా రాసి బయటకి వచ్చి ఆనందంగా కృష్ణ నీ హగ్ చేసుకుని..కృష్ణ నేను చాలా బాగా రాశాను.. కచ్చితంగా సెలెక్ట్ అవుతా..నేను ఇంత వరకు రావడానికి మెయిన్ రిజన్ నువ్వే.. నా కన్న వాళ్ళే నమ్మలేదు కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే తోడుగా ఉండి నన్ను ఇంతా దూరం తీసుకొచ్చావు.. నీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటుంది ఏడుస్తూ..
కృష్ణ :ఒదారుస్తూ.. ఇందులో నేను చేసింది ఏమి లేదు నీలో సాధించాలన్న పట్టుదల, నీ ధైర్యం , నిన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది..
తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్ఫూర్తి నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి రేపు ఇక్కడ కలుద్దాం అని అడ్రస్ చెప్పి వెళ్ళిపోతాడు..
స్ఫూర్తి వాళ్ళ అమ్మ గారికి విషయం చెప్పితే ఆవిడ చాలా సంతోషిస్తారు..నాన్నకి కూడా చెపుతాను అని కృష్ణవేణి గారు వద్దని చెప్పినా వినకుండా వెళుతుంది..
నారాయణ గారికి: చెప్పితే ..వెటకారంగా ..
నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాసావు..ఇంకా నీ రిజల్ట్స్ ఇంకా రాలే..అప్పుడే సెలెక్ట్ అయిపోయినట్టు సంబరపడిపోతున్నావు..
నాకైతే సెలెక్ట్ అవుతావనే నమ్మకమే లేదు..
ఆయన మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
మరుసటిరోజు ఉదయం కృష్ణ చెప్పిన ప్లేస్ కి వెళితే ఆల్రెడీ తను వెయిట్ చేస్తు ఉంటాడు..
కృష్ణ: హాయ్..ప్లీజ్ బి సీటెడ్
స్ఫూర్తి :హాయ్..
కాఫీ ఆర్డరు ఇస్తే అవి వస్తే వాటిని సిప్ చేస్తూ..
కృష్ణ: డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా..
స్ఫూర్తి :ముందు షాక్ అయినా తర్వాత ఏం చెప్పాలో అర్ధం కాక అయోమయంగా చూస్తే..
కృష్ణ: ఫోర్స్ ఏమి లేదు..నీకు ఇష్టం లేకపోతే చెప్పెయ్..నిన్ను మళ్లీ ఇంకా విసిగించను..నా దురదృష్టం అని సరిపొట్టేకుంటా..
స్ఫూర్తి చిరునవ్వే తన సమాధానం అయ్యింది..
కృష్ణ: హ్యాపీగా అయితే నీకు ఇష్టమేనా..
స్ఫూర్తి: హ్మ్మ్ అని తల ఊపుతుంది..
మరి మన పేరెంట్స్ ఒప్పుకుంటారా...
కృష్ణ: వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది..
కృష్ణ వాళ్ళని ఎలా ఒప్పించాలి తెలియక సతమవుతూ ఉంటాడు..
కొన్ని రోజులకు రిజల్ట్స్ వస్తాయి స్ఫూర్తి అందులో స్టేట్ లోనే టాప్ టెన్ లో ఉంటుంది..
ఆ న్యూస్ అని న్యూస్ ఛానెల్స్ , పేపర్స్ లోనూ వస్తే అది చూసి నారాయణ గారు చాలా ఆశ్చర్యపోయిన తర్వాత తల తిసేసినట్టు అయి కూతురి ప్రతిభని అర్థం చేసుకోలేకపోయాను.. తనని ప్రోత్సాహించాలిసిన నేనే తనని నిరుత్సాహపరుస్తూ వచ్చాను..నేను అన్నా మాటలకి నా చిట్టి తల్లి ఎంత బాధపడింది అని తనలో తానే కుమిలిపోతూ ఉంటారు..
స్ఫూర్తి ఆనందానికి అయితే ఆకాశమే హద్దు..
విషయం తెలిసిన కృష్ణ కి కాళ్ళు చేతులు ఆడడం లేదు..
తన తల్లితండ్రులతో వాళ్ల ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు..ముందు నిరాకరించిన సివిల్స్ సెలెక్ట్ అయినా అమ్మాయి కోడలిగా వస్తుంటే ఎవరూ మాత్రం కోరుకోరు తమకి గౌరవమే కదా ..
మంచిరోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటారు..
నారాయణ గారు బయటకు వెళుతుంటే తెలిసినవాళ్లు అందరూ మీ కూతురు చాలా గొప్పది అండి,బంగారం లాంటి కూతురిని కన్నారు సివిల్స్ లో సెలెక్ట్ అవడం అంతే మామూలు విషయమా .. అని పొగుడుతూ ఉంటే ఆయనకి చాలా గర్వంగా అనిపిస్తుంది..
స్ఫూర్తి దగ్గరికి వెళ్లి తన చేతులు పట్టుకుని నన్ను క్షమించు తల్లీ నిన్ను నీ ప్రతిభని గుర్తించక ,ఆడపిల్లవు అని చులకనగా చూసా కళ్ళ నిండా నీళ్ళతో అంటుంటే ..
స్ఫూర్తి భాధగా: నాన్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఎంటి నాన్న మీరు నన్ను ఎలా చూసినా మీరు అంటే నాకు ఎప్పుడు..గౌరవమే..అలాగే మీ మీద ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదు..
వెనకనుండి నన్ను కూడా క్షమించండి బావగారు అని సుబ్రమణ్యం గారు అంటారు..
నారాయణ గారు ఆయనని చూసి మీరు ఇక్కడ..
సుబ్రమణ్యం గారు: కోడలు ఎక్కడ జాబ్ చేస్తే పరువు తక్కువ అనుకున్న నా మూర్ఖత్వానికి నాకే సిగ్గుగా ఉంది...
నారాయణ గారి చేతులు పట్టుకుని మీ ఇంటి మహాలక్ష్మి నీ మా ఇంటికి కోడలిగా పంపుతారా..
నారాయణ గారు :మా అమ్మాయి కి ఇష్టమైతే నాకు ఇష్టమే..
సుబ్రమణ్యం గారు :మీ అమ్మాయి మా అబ్బాయి ఆల్రెడీ ఒకరు అంటే ఒకరికి ఇష్టమే ..
నారాయణ గారు స్ఫూర్తి వంక చూస్తే సిగ్గుతో తల వంచుకుని ఉంటుంది..
సరే బావగారు తోందరలోనే ముహూర్తం పెట్టించుకుందాం..
ఒక నెలలో అంగరంగ వైభోగంగా వాళ్ళ పెళ్లి చేస్తారు..
కొన్నాళ్లకి స్ఫూర్తి ఐఎఎస్ ఆఫీసర్ అవ్వడం అన్ని చకచక జరిగిపోయాయి...
కృష్ణ కూడా తన భార్యకి తోడునీడగా తన విజయాలకి బాసటగా నిలిచాడు...
స్ఫూర్తి ఐఎఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని నెరవేర్చుకునీ తన వృత్తిని బాధ్యతగా నిర్వటీస్తు మంచి ఐఏఎస్ ఆఫీసర్గా, తన తండ్రి గౌరవాన్ని తిరిగి తెచ్చి ఒక మంచి కూతురిగా,ఒక మంచి భార్య గా,ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది..
ఇలాంటి సంఘటనలు ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి .. ఆడపిల్లలని చులకనగా చూడక వల్ల ఆశయ సాధనకు అండగా ఉండి వల్ల విజయంలో కీలకపాత్ర పోషించాలి ..
ఆడపిల్లల పట్ల వివక్ష పూర్తి స్థాయిలో రూపుమాపి నప్పుడే మన దేశం అసలైన స్వాతంత్రం సాధించినట్టు..
**********************
సమాప్తం..