sukrushi t

Others

4.2  

sukrushi t

Others

విలువైన కానుక

విలువైన కానుక

3 mins
103



అలారం మోగిన సౌండ్కి ఉల్లికిపడి నిద్రలోంచి లేచింది నందన ..

లేవడమే పరుగు పరుగున బాత్రూములోకి దూరి హడావిడిగా ఉరుకులు పరుగులతో రెఢీ అవుతుంది ..రెడీ అయి వచ్చి కిందకి వెళ్లడమే సరాసరి కిచెన్లోకి దూరి వాళ్ల అమ్మ లక్ష్మి గారిని తెగ హడావిడి పెట్టేస్తుంది..


అబ్బా..నందు ఎందుకు అంతా కంగారు నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టేస్తునావు అని విసుకుంటారు లక్ష్మిగారు


ఏంటి..! అమ్మా అలా అంటావు నాకేనే కంగారు అక్కడ మీ ఆయన చేసేది ఏంటి మరి‌ బుంగ మూతి పెట్టుకుని అలుగుతుంది నందు ..


నెత్తి మీద మొట్టికాయ వేసి మా ఆయన ఎంటే ఎప్పుడు మా నాన్న అంటావు ఇప్పుడేమో మా ఆయన అంటారు లక్ష్మిగారు..


ఎంటోయ్..నాన్న బంగారు తల్లిని ఏదో అంటున్నావు నేను లేనన్నా అంటు వస్తారు నందన నాన్నగారు నివాస్ గారు..


అవును నువ్వు లేవని నన్ను చిన్నపిల్ల ని అని చూడకుండా మీ ఆవిడ నన్ను ఎన్నేసి మాటలు అంటుందో చూడండి అని నివాస్ గారు చూడకుండా లక్ష్మిగారు వెనక నుంచి వెక్కిరిస్తూ ఫిర్యాదు చేస్తుంది నివాస్ గారికి..


చాలు..చాలు మీ తండ్రి కుతుర్ల నాటకాలు కట్టిపెట్టి అన్ని రెడీ ఉన్నాయో లేదో చూసి అర్జున్ తీసుకురావడానికి వెళ్ళండి అని నందన వంక కోపంగా చూస్తూ అంటారు నివాస్ గారితో ..


సరే లక్ష్మీ ఫ్లైట్ వచ్చే టైమ్ అవుతుంది అర్జున్ తీసుకొస్తాను బై..బంగారం అని ఇద్దరితో చెప్పి ఎయిర్పోర్ట్ కి బయలుదేరి వెళతారు..


నివాస్ గారు లక్ష్మీ గార్ల అబ్బాయి అర్జున్ రెండు సంవత్సరాల క్రితం ఫారిన్‌లో జాబ్ వస్తే వెళ్లి ,ప్రెసెంట్ అక్కడే ఉంటున్నాడు..

రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకి రావడం ఇదే.. అందుకే నందన అన్నయ కోసం తెగ కంగారు పడిపోతుంది


అన్నచెల్లెలు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు ..


అర్జున్ ఫారిన్లో జాబ్ వచ్చినప్పుడు వెళ్లడానికి అస్సలు ఒప్పుకోడు నివాస్ గారే తనని కష్టపడి ఒప్పిస్తారు..


నందన అయితే ఒకటే ఏడుపు చిన్నపిల్లల 

అర్జున్ వెళ్ళతునప్పుడు నందనని ఒదర్చడానికి అర్జున్ ఒప్పించడం కన్న మరింత కష్టం అయింది నివాస్ గారికి..


నందనకి చినప్పటినుంచి ఇష్టమైన పండుగ రక్షా బంధన్ ఎప్పుడు ఆలస్యంగా లేచే తను ఆరోజు ప్రోదునే లేచి ఆ భగవంతుడికి తన అన్న నిత్యం సుఖసంతోషాలతో ఉండాలని పూజ చేసేది..


అర్జున్ ఫారిన్ వెళ్ళినప్పడినుండి తనకి లీవ్ దొరకని కారణంగా ఇండియా రాలేదు..

రక్ష బంధన్ కి చాలా ఏడ్చేది అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయినందుకు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన అన్నయ్య చేతికి రాఖీ కట్టబోతుంది ఆ సంతోషంతోనే ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది నందన..


బయట కారు చప్పుడు అవడంతో అర్జున్ వాళ్ళు వచ్చారని అర్థమై హారతి ఇవ్వడానికి పరుగున హాల్లోకి వెళ్తారు నందన లక్ష్మి గారు..


హారతిచ్చి లోపలికి వచ్చాక అర్జున్ని కౌగలించుకుని చిన్నపిల్లల బోరున ఏడుస్తుంది నందన..


ఏంటి రా ఇది చిన్నపిల్లల ఎడవకు నేను వచ్చేసాను కదా మా బంగరానివి కదూ అని చిన్న పిల్ల ని బుజ్జగించినట్టు బుజ్జగిస్తూ ఉంటాడు అర్జున్ ..


హ్మ్మ్..! అని కళ్ళ నీళ్ళు తుడుచుకుని ఇన్ని రోజులు తను మిస్ అయినవన్ని అర్జున్ కి ఏక బిగిన చెపుతుంది నందన..


రెండు సంవత్సరాల తర్వాత తన చెల్లితో టైమ్ స్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా తను చెప్పేది వింటూ ఉంటాడు అర్జున్..


వాళ్లిద్దరినీ అలా చూసి సంతోషపడతారు నివాస్ లక్ష్మీ గార్లు..


కబుర్లు చాలించి ముందు అసలు పని చూడండి అని అంటూ వస్తారు లక్ష్మీ గారు..


అవును అమ్మా అసలు విషయమే మర్చిపోయాను అని పరుగున వెళ్ళి చేతిలో పళ్లెంతో అక్కడ ప్రత్యక్షమవుతుంది..


అందులో రాఖీ ,కుంకుమ,లడ్డు ఉన్నాయి..

అర్జున్ నుదుటిన కుంకుమ పెట్టీ ,రాఖీ కట్టి తర్వాత తనకి లడ్డు తినిపిస్తుంది..


తనకి లడ్డు తినిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించి నందు నీకేమి గిఫ్ట్ కావాలో నువ్వే అడుగు అంటాడు అర్జున్ ..


నాకేమీ గిఫ్ట్ వద్దు అన్నయ్య నువ్వు ఇక్కడికి రావడమే నాకు మర్చిపోలేని పెద్ధ గిఫ్ట్ నాకు అది చాలు అంటుంది నందన..


సరే నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను నీకు వద్దు అన్నావు కదా అయితే నేను పెరిమినెంట్ గా ఇండియా వచ్చేది అనుకున్న సరే వద్దు అన్నావు కదా నేను తిరిగి వెళ్ళిపోతాను అంటాడు అర్జున్..


ఏంటి..అన్నయ్య నువ్వు ఇండియాకి వచ్చేస్తునవా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నందన ..


ఇప్పుడు దాకా చెప్పేది అదే కదా తన నెత్తి మీద మొట్టికాయ వేస్తూ అంటాడు అర్జున్..


యాహూ.. అన్నయ్య ఇంకా మనతోనే ఉంటాడు అమ్మా నాన్న అని వాళ్లిద్దరినీ తిప్పుతూ అనంధపడుతూ నందన..


నివాస్ లక్ష్మీ గార్లకి కూడా చాలా ఆనందంగా ఉంది ..


అలా నందన రక్ష బంధన్ కి తిరిగి తన అన్న ప్రేమనే పొందింది..


ప్రతి సంవత్సరం కూడా రక్ష బంధన్ ఇంతే సంతోషాలతో జరుపుకుంటారు అర్జున్, నందనలు..

 

ఏ సోదరి అయిన తన సోదరుడి నుండి కోరుకునేది గిఫ్ట్స్, విలువైన కానుకలు, డబ్బులో కాదు కొంచెం ప్రేమ,ఆప్యాయత

అనురాగం మాత్రమే కోరుకుంటుంది అదే వల్ల దృష్టిలో విలువైనవి..


     సమాప్తం





Rate this content
Log in