sukrushi t

Inspirational


4  

sukrushi t

Inspirational


ఎవరిది తప్పు ?

ఎవరిది తప్పు ?

2 mins 598 2 mins 598


 హేమంత్ అంటూ పెద్దగా గంభీరంగా అరుస్తున్నారు మూర్తి గారు తన కొడుకు మీద ..


ఏమైంది అండి వాడి మీద ఎందుకు అరుస్తున్నారు అంటూ కిచెన్ లో నుండి వస్తూ అడుగుతుంది మూర్తి గారి భార్య రచన ..


ఏమైందా..? నేను ఆ అమ్మాయి సుమ ఇంటికి వెళ్ళద్దు అని చెప్పిన వినకుండా ఆ పిల్లతో ఇంకా ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నాడు

 నీ కొడుకు .. అని అంటారు మూర్తి గారు


హేమంత్ ఏంటిది ..? మేము అంతా అలా నచ్చ చెప్పిన కూడా నువ్వు వినకుండా ఆ అమ్మాయి తో తిరుగుతున్నావా..? అని కోపంగా అడిగింది రచన ..


అమ్మా..? అసలు ఏమైందని సుమ తో ప్రేమ, పెళ్లి వద్దని అంటున్నారు అసలు జరిగిన దానిలో తన తప్పేముంది.. ?ఎవడో చేసిన పనికి దాని ఇలా నిందిచడం భావ్యం కాదు..? అంతే కోపంగా అంటాడు హేమంత్.. 


ఒక చెడిపోయిన అమ్మాయిని మన ఇంటి కోడలిగా చేసుకోవడం మాకు ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేసారు హేమంత్ తల్లితండ్రులు..


చూడండి అమ్మా నాన్న.. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జన్మకి సుమే నా భార్య 

సుమ కాకుండా వేరే ఎవరికి నా మనస్సులో కానీ లైఫ్ లో కానీ స్థానం లేదు మీకు ఇష్టమైతే సుమను పెళ్లి చేసుకోవడం ఇక్కడ ఉంటాను ఇష్టం లేకపోతే ఇంక జన్మలో మీకు నా మొహం చూపించను ఒకటి మాత్రం నిజం సుమతోనే నా జీవితం ఇందులో ఎలాంటి మార్పు లేదు అని కోపంగా చెప్పి అక్కడినుండి విసవిసా వెళ్ళిపోతాడు హేమంత్..


మూర్తిగారు, రచన ఏమి చేయాలో పాలుపోక 

కొడుకు దూరం అవుతాడేమో అనే బాధ ఇష్టం లేని అమ్మాయిని ఇంటి కోడలిగా తనని అంగీకరించలేక సతమవుతూ ఉంటారు..


బయటకి వచ్చిన హేమంత్ అసలు ఎవరిది తప్పు ..? 


ఎవడో మృగంలా తన జీవితాన్ని నాశనం చేస్తే అందులో తన తప్పు ఏమీ ఉంది..?


కూతురు మీద చేసిన అఘాయిత్యానికి తమ పరువు పోతుందనే భయంతో ఆ మానవ మృగం మీద కేస్ కూడా పెట్టని సుమ తల్లితండ్రులదా..?


లేకపోతే పెళ్లి దాకా వచ్చిన మ్యాచ్ ని అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండా ఒక అమాయకురాలు మీద చెడిపోయినది అంటూ తన మీద లోకం వేసే నిందలు నమ్మి పెళ్లి కాన్సిల్ చేసిన నా తల్లితండ్రులదా..? 


లేకపోతే తప్పు ఎవరిదో తెలిసిన ఆడపిల్ల అని 

చులకనగా చూసి కాకుల సూటి పోటి మాటలతో తనని మానసికంగా హింసించే ఈ సమాజన్నిదా..?


అసలు ఎవరిది తప్పు..?


తప్పు చేసినవాడు ఏమో దొరలా తిరుగుతుంటే ఏ తప్పు చేయని తను తప్పు చేసిన దానిలా తల దించుకుని బ్రతకలా..?


ఆ అమ్మాయి శీలం పోతే నేరం చెడిపోయింది , మంచిది కాదు అదే అబ్బాయి ఎంత మంది తో తిరిగినా వాడు మగాడు వాడు ఎంత మంది తో తిరిగినా తప్పు లేదని అనే ఈ ఆడదానికి అడుగడుగునా ఆంక్షలు విధించే ఈ సమాజన్నిదా..? 


తప్పు ఎవరిదైనా చితికి పోయేది అమ్మాయిల జీవితాలు ..అలా సుమకి జరగనివ్వను అనుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్న హేమంత్ ఏదో నిర్ణయానికి వచ్చినట్టు కొండంత ఆత్మ విశ్వాసంతో తన గమ్యాన్ని చేరుకోడానికి సిద్ధం అయ్యాడు..  


అలా తన తల్లితండ్రులకు ఈ సమాజపు వేసే నిందలకు సమాధానంగా సుమని పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు ఆనందంగా


జాతి పిత మహాత్మా గాంధీ "ఆడది అర్థరాత్రి స్వేచ్చగా తిరిగలిగినప్పుడే మన దేశానికి 

నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు " అని ఆయన అన్న మాటలు ఎప్పటికీ నిజం అవుతాయో మరి..


ఇలాంటి సంఘటనల్లో జరిగినప్పుడు వారి మీద సానుభూతి చూపించడమో లేకపోతే వారిని మన మాటలతో బాధ పెట్టడమో కాదు చేయడం వారికి సాటి మనిషిగా మీకు మేము ఉన్నాము అని వారికి భరోసా ఇవ్వగలగడం అదే .. స్త్రీ ధైర్యంగా ముందు అడుగు వేసిన రోజు మనదేశం ఆటోమేటిగ్గా విజయం సాధించినట్టే..  *************************

 

Rate this content
Log in

More telugu story from sukrushi t

Similar telugu story from Inspirational