నువ్వు
నువ్వు
1 min
108
నాన్నలా ధైర్యాన్ని పంచే నా తొలి నేస్తం నువ్వు ..
అమ్మలా ఆప్యాయతని పంచే నా చిరు
నేస్తం నువ్వు ..
నా ప్రతి గెలుపు, ఓటమిలో నీకు నేను ఉన్నాను అనే ధైర్యాన్ని అదించి నన్ను ముందుకు నడిపించే నా ప్రియ నేస్తం నువ్వు ..
అమ్మలా లాలించి ..
నాన్నలా పాలించి ..
నా ప్రతి అడుగులో నీకు నేను ఉన్నాను
అని భరోసా ఇచ్చే నా ధైర్యం నువ్వు ..
ప్రతి క్షణం నన్ను కావలి కాసే నా రక్షణ నువ్వు..
అమ్మ ప్రేమ నాన్న అనురాగం కలిపితే నువ్వు ..
ఆ దేవుడు ఇచ్చిన వరం నువ్వు ..
ఆ దేవుడే దిగి వచ్చి వరం కోరుకోమంటే..
అడగాలని ఉంది జన్మ జన్మలకు ..
నా అన్నగా పుట్టాలని నువ్వు..
అలాంటి నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకో గలను ..
ఒక ఈ చెల్లి ప్రేమ తప్ప ..