ఆనందమయం
ఆనందమయం


మమతల కోవెల అదోక అనాధ శరణాలయం..ఎంతో మంది పిల్లలకి ఆశ్రయం ఇస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకి బాటలు వేసి ఎంతో మంది పిల్లల జీవితాన్ని తీర్చి దిద్దిన దేవాలయం ఈ మమతల కోవెల..
ఫ్రెండ్ నీకు తెలుసా రేపు అన్నయ్య ,ఇంకా అమ్మ నాన్న వస్తున్నారని నన్ను వాళ్ల ఇంటికి తీసుకుని వెళతారని ఆయమ్మా చెప్పింది అక్కడ నాకు అన్నయ్య ఉంటాడు నాతో ఇంచకా రోజు ఆడుకుంటూడట, తనతో పాటే నన్ను స్కూల్ కి తీసుకు వెళతాడట ,నాకు బోలెడు అన్ని బొమ్మలు ఆడుకోడానికి ఇస్తాడట అని సంతోషంగా చెపుతుంది ఏడు సంవత్సరాల వయసున్న పాప ఆశ్రమంలో ఉండే రోజా పూలు మొక్కకి నీళ్ళు పోస్తూ అంటుంది ఆ రోజా పూల మొక్కతో ..
కానీ నాకు చాలా బాధ గా ఉంది నేను వెళ్లిపోతే నీకు రోజు నీళ్ళు ఎవరు పోస్తారు..
నీతో బోలెడన్ని కబుర్లు ఎవరు చెపుతారు అని ఒకసారిగా దుఖం పొంగుకు వచ్చి ఏడుస్తుంటే ..
అక్కడికి వచ్చిన ఆయమ్మ పాప దగ్గరికి సంతోషి ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ ..
మొక్క వైపు చూపిస్తూ అది మరి ఆయమ్మ నేను వెళ్ళిపోయాక రేపటి నుండి నా ఫ్రెండ్‌ని ఎవరు చూస్తారు .రోజు నా ఫ్రెండ్‌తో కబుర్లు చెప్పలేను కదా..! అందుకే నాకు ఏడుపు వస్తుంది అని వెక్కులు పెడుతూ ఏడుస్తుంది..
తన కన్నీళ్లు తుడిచి ఏడవకమ్మా ..! నీ ఫ్రెండ్ తో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కబుర్లు చెప్పచ్చు..తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా..
హ్మ్మ్ ..నిజమేనా నువ్వు చెప్పేది..!
నిజమే తల్లి..
సంతోషి ఆరోజు చాలా సంతోషంగా ఉంది..
ఎందుకంటే తనకి ఒక కుటుంబము ఉంది ఇప్పుడు తనకి అందరిలాగే అమ్మ,నాన్న,
అన్నయ్య అందరూ ఉన్నారు..
శివ , లత ఇంకా వాళ్ల అబ్బాయి ఆనంద్ వస్తారు మమతల కోవెలకి సంతోషిని దత్తత తీసుకోవడానికి..
ఆనంద్ వెళ్ళిన వెంటనే చెల్లి చెల్లి అని తనని వెతుకుతూ ఉంటాడు ..
తన ప్రేమ చూసి చిన్నగా నవ్వి నాన్న ఆనంద్ కొంచెం సేపు ఆగు చెల్లి మన ఇంటికి వచ్చేస్తుంది కదా తన వస్తువులు అన్ని ప్యాక్ చేసుకోవాలి కదా వస్తుంది..
నీరసంగా మొహం పెట్టుకుని సరే ..
ఫార్మాలిటీస్ కంప్లీట్ అవడంతో సంతోషిని తీసుకురమ్మని చెపుతారు ఆయమ్మాతో ఆశ్రమం వార్డెన్..
ఆయమ్మ సంతోషిని తీసుకురావడంతో తనని చూసి మొహం మతాబులా వెలుగుపోతుంది ఆనంద్ ది ..
పరుగెత్తుకుని వెళ్లి చెల్లి అని తనని కౌగిలించుకుంటాడు ఆనందంగా ..
సంతోషి కూడా అన్నయ్య అంటూ తనని ప్రేమగా చూట్టేస్తుంది ..
శివ,లతలు ఇద్దరూ కూడా సంతోషంగా
తనని దగ్గరికి తీసుకుని ప్రేమగా తన
నుదిటిన ముద్దాడుతారు.తర్వాత తనని
తమ కూడా తీసుకుని వెళ్ళిపోతారు..
ఆనంద్ కి అయితే కాళ్ళు నిలవడం లేదు తన చెల్లి ఇప్పుడు తనతో పాటే ఉండబోతుంది అనే దానితో..
సంతోషి తమ సంతోషాలకి కారణం ఎలా అయిందో మూడు నెలలు వెనక్కి వెళతారు శివ,లతలు..
శివ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి..లత హోమ్ మేకర్ వాళ్ళకి ఒక బాబు ఆనంద్ వయసు పది సంవత్సరాలు ,పాప శ్రీనిధి వయసు ఏడు సంవత్సరాలు ..
ఉన్నంతలో పిల్లలకి ఏ లోటు లేకుండా ప్రాణంగా పెంచుకుంటూ వచ్చారు..
వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన తల్లడిల్లిపోయావారు..
ఆనంద్ తన చెల్లి నిధి అంటే చాలా ప్రాణం ఎప్పుడు చెల్లికి తోడుగా ఉండి కవచంలా ఉండేవాడు ..ఎక్కడికి వెళ్లినా అన్నాచెల్లెళ్లు కలిసే వెళ్లి వచ్చేవారు అది స్కూల్ కి అయిన వేరే ఎక్కడికైనా ..
ఒక రోజు స్కూల్ నుండి వచ్చేటప్పుడు నిధి చాక్లెట్స్ కావాలని మారాం చేయడంతో ఆనంద్ చెల్లిని అక్కడే ఉండమని చెప్పి చాక్లెట్స్ తీసుకురావడానికి వెళతాడు తన అన్న ఇంకా రావకపోవడంతో రోడ్డు క్రాస్ చేసిచూసుకోకుండా వెళుతున్న తనని లారీ సడన్ గా వచ్చి ఢీ కొట్టడంతో రక్తపు మడుగులో పడి ఉంటే..
చెల్లి కోసం వచ్చిన ఆనంద్ అది చూసి షాక్ తో స్పృహ తప్పి పడిపోయాడు..నిధి ఆనంద్ ని చూసి అక్కడ వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేసే అంతలోనే నిధి ప్రాణాలు విడుస్తుంది.. వాళ్ల ఇద్దరినీ హాస్పిటల్కి తీసుకువెళతారు..
తర్వాత వల్ల ఐడి కార్డ్ ద్వారా స్కూల్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందిస్తారు..
శివ,లతలకి విషయం తెలిసి పరుగు పరుగున వెళితే అక్కడ విగతజీవిగా పడి ఉన్న తమ బిడ్డని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తారు
ఆనంద్ అయితే ఇంకా షాక్లోనే ఉండి
పోయాడు ..తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఇంటికి చేరుకుంటారు..
ఆనంద్ మాత్రం ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేవాడు..
ఒక పక్క తమ బిడ్డ మరణం,ఇంకోపక్క మరో బిడ్డ ఇలా అయిపోవడం ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేనిది ..
ఆనంద్ ని చైల్డ్ సైక్రియాటిస్ట్కి చూపిస్తే మంచిదని తనని తీసువెళ్తే ..
చూడండి బాబు మెంటల్గా డిస్ట్రబ్ అయ్యాడు తన చెల్లి తన కళ్ళ ముందే చనిపోవడంతో ఒకలాంటి డిప్రెషన్కి గురయ్యాడు .. తనని నలుగురితో ఎక్కువగా ఉండడం,మీరు కూడా తనతో ఎంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే తనలో త్వరగా చేంజ్ రావచ్చు.. అని సైక్రియాటిస్ట్ చెప్పడంతో..
ఆరోజు నుంచి చాలా వరకు తనతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండేవారు..ఎన్ని ప్రయత్నాలు చేసిన బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి..
శివ ఆనంద్ పుట్టినరోజును ఏదైనా అనాధ శరణాలయంలో చేద్దాం అలా చేస్తే అక్కడ ఉన్న పిల్లలతో అయిన వీడు కలుస్తాడు ఏమో అని లతకి చెప్పడంతో తను ఒప్పుకుని ఆ ఏర్పట్టుల్లో ఉన్నారు..
అనుకున్న ప్రకారం ఆనంద్ పుట్టినరోజున ఒక అనాధ శరణాలయంకి వెళతారు అదే మమతల కోవెల..
ఆనంద్ చేత పిల్లలందరూ విషెస్ చెప్పుతుంటే కేక్ కట్ చేయించి పిల్లలందరికీ పంచుతారు..అందులో ఒక పాప ఆనంద్ దగ్గరికి వచ్చి ఒక రోజా పువ్వు ఇచ్చి ఈరోజు నీ పుట్టిన రోజ ట కదా హ్యాపీ బర్త్ డే అన్నయ్య అని అంటే అన్నయ అనే పిలుపుకి చలనం వచ్చి ఆనంద్ లైట్గా స్మైల్ ఇస్తాడు..
ఆ పాప ఎవరో కాదు సంతోషి ఆరోజంతా సంతోషి ఆనంద్ దగ్గరే ఉండి తనతో ఆడుకుంటూ,కబుర్లు చెప్పుతూనే ఉంది..
ఆనంద్ మాట్లాడకపోయినా కొంచెం రెస్పాండ్ అయ్యేవాడు .శివ లతలు అది గమనించి చాలా సంతోషంగా అనిపిస్తుంది..
రోజు ఆశ్రమంకి తీసుకువచ్చేవారు ఆనంద్ ని తనలో కొంచెం కొంచెంగా మార్పు వచ్చేది..అన్నిటికన్నా సంతోషి అన్నయ్య అని పిలిచినప్పుడు ఇంకా బాగా రెస్పాండ్ అయేవాడు..
అలా ఆనంద్ కి సంతోషి అంటే చాలా ఇష్టం, అభిమానం, ప్రేమ పెరుగుతూ ఉండేవి..
ఎప్పుడు అన్న అనురాగం,కుటుంబం ప్రేమ ఎరుగని సంతోషి కి వాళ్ల చూపిస్తున్న ప్రేమతో చాలా హ్యాపీగా అనిపించింది..
అప్పుడే ఆనంద్ శివ లతలతో మనం చెల్లిని ఇంటికి తీసుకువచ్చే సుకుంద్దాం అని అప్పుడు చెల్లి మనతోనే ఉంటుంది అనడంతో ఇద్దరు బాగా ఆలోచించి తనని దత్తత తీసుకుంటే ఆనంద్ కూడా సంతోషిస్తాడు అప్పుడు తను శాశ్వతంగా తనతోనే ఉంటుంది తనకి ఒక ఫ్యామిలీ ఇచ్చినట్టు కూడా ఉంటుందని ఆలోచించి వాళ్ల నిర్ణయాన్ని తల్లితండ్రులు
చెప్పాలని అనుకుని ..
సంతోషిని దత్తత తీసుకుంటాము అని చెప్పినప్పుడు అటు శివ తల్లితండ్రులు లత తల్లితండ్రులు ససేమిరా వద్దని ఆ పాపని ఎప్పటికీ తమ మనవరిలిగ ఒప్పుకోమని భేదిరించిన చలించకుండా తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పారు..పెద్దవారు ఇంకా ఏమి చేయలేక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కోపంగా వెళ్లిపోయారు ..
అలా సంతోషి ఈ ఫ్యామిలీలోకి వచ్చింది..
తనని ఇంటికి తీసుకువచ్చినప్పటి నుండి ఆనంద్ ఒక క్షణం కూడా విడిచి పెట్టకుండా
తనతోనే ఉంటున్నాడు..
సంతోషి కూడా అన్నయ అంటూ తన చుట్టూనే తిరుగుతుంది..సంతోషి రాకతో తిరిగి ఆ ఇంటిలో సంతోషాల చిరుజల్లులు వెల్లువిరిసాయి..
తన పేరు లో ఉన్న సంతోషం తన జీవితంలో లేదు..కానీ ఇప్పుడు తనకి అమ్మ, నాన్న ముఖ్యంగా తనని కంటికి రెప్పలా చూసుకునే అన్నయ్య ఉన్నాడు..
ఆనంద్ రాకతో తన జీవితాన్ని ఆనందమయం చేశాడు ఆ పైవాడు ..
అందుకే అంటారు పెద్దలు భగవంతుడు మనకు ఒకదాని దూరం చేస్తే దాన్ని వేరే రూపంలో తిరిగి మన చెంతకే చేరుస్తాడని
అనురాగం,ఆప్యాయత పంచడానికి రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువులే పంచాలని లేదు మంచి మనసు ఉండి వాళ్లపై ప్రేమ,
అనురాగం,ఆప్యాయత ఉంటే చాలు..