t. s.

Classics

4  

t. s.

Classics

భక్తి శ్రధ్ధ

భక్తి శ్రధ్ధ

2 mins
524


ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఆ శ్రీనివాసుడికి ఈరోజు కొంచెం విశ్రాంతి దొరికింది.

అప్పుడు హఠాత్తుగా గుర్తు వచ్చింది రోజు తన దర్శనం కోసం తన చుట్టూ తిరిగే తేనెటీగ రెండు రోజుల నుండి కనిపించట్లేదు అని.

ఎందుకు అని తేనేటీగను పిలిచాడు.

తేనేటీగ ఎంతకి రాకపోవడంతో ఏమైందా అని ఆరా తీసాడు. 

గుళ్ళో ఉన్న శేషశయనుడి మందిరానికి ఉన్న గవాక్షం అవతల గూడు కట్టుకుని ఉంటుంది తేనేటీగ ఒకటి.

అది రోజు దేవుడైన శ్రీనివాసుడి దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో ఆ దేవుడిని పూజించి ఆ దేవుడి ఇచ్చిన తీపి ప్రసాదాలు తిని బ్రతుకుతుంది.

అలాంటి తేనేటీగ రెండు రోజుల నుండి శ్రీనివాసుడికి కనిపించలేదు.

శ్రీనివాసుడు దివ్యదృష్టితో చూశాడు తేనేటీగ పడుకుని లేవలేని పరిస్థితిలో ఉంది.

దానికి తన మహిమతో కొంచం శక్తిని ఇచ్చాడు.

అది చిన్నగా ఎగురుకుంటూ వచ్చి శ్రీనివాసుడికి ఎంతో భక్తితో ప్రణామాలు చేసింది.

శ్రీనివాసుడు అడిగాడు తేనేటీగను ఏమయింది నీకు ఇలా నీరసంగా ఉన్నావు, రెండు రోజుల నుంచి 

నా దర్శనానికి రావట్లేదు అని.

అప్పుడు ఆ తేనేటీగ ప్రభూ మొన్నటి నుండి ఆహరం లేదు అందుకే నీరసంగా ఉంది అని చెప్పింది.

అప్పుడు శ్రీనివాసుడు ఏంటి! రోజు భక్తులు నాకు నైవేద్యంగా ఎన్నో మధుర పదార్థాలు తెస్తున్నారు,

అందులో నుంచి నువ్వు రోజు నీకిష్టమైన ఆహారం తింటూనే ఉంటావు కదా నీకు ఆహరం లేకపోవడం ఏంటి అని అడిగాడు.

అప్పుడు ఆ తేనేటీగ దేవా మీకు తెలుసు కదా మీ అనుమతి లేనిది ఏమి తిననని.

ఎప్పటిలాగే తెల్లవారుజామున మీ దర్శనార్థం వచ్చాను. 

మీ చల్లని చూపు నా మీద పడనేలేదు.

పుజారులు మీకు చేసే అభిషేకంలో మునిగి ఉన్నారు.

ఒక ప్రక్కన ఉన్న నన్ను చూడనేలేదు.

ఆ తర్వాత మీకు చేసే విశేష అలంకరణ సరిగా ఉందో లేదో అని చూసుకుంటున్నారు.

ఆ తర్వాత భక్తులు చేపించే అర్చనలో మునిగిపోయారు.

సరే అప్పుడు అయినా నన్ను చూస్తారేమో అని మీ ముందుకు వద్దామంటే నైవేద్యం ఆరగింపులో ఉన్నారు.

ఆ తర్వాత...

మీ దగ్గరికి వచ్చే "ఆ నలుగురు" భక్తులు వినిపించే విన్నపాలలో పడి నన్ను గమనించలేదు.

మధ్యాహ్నం వేళ వరకు వేచి ఉండి అప్పుడు అయినా నా వంక చూస్తారేమో అనుకుంటే కళ్ళు మూసి ఒక కునుకు తీయడం మొదలు పెట్టారు.

అభిషేకం, అర్చనలతో పాటు, భక్తుల బాధలు విని బాగా అలిసిపోయి ఉన్నారేమో అని ఒక ప్రక్కనే ఉండిపోయాను.

మళ్ళీ సాయంత్రం మీ ముందుకు వద్దామనుకునేలోపు మళ్ళీ అర్చనలు, సహస్రనామ పూజలు అని మీకు తీరిక లేకపోయింది.

ఆ తర్వాత...

రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు సాగిన భజనలతో

భక్తులు పాడే మీ కీర్తనల పారవశ్యంలో తేలియాడుతున్నారు.

నడిఝామున అయినా నా వంక ఓ కంట చూస్తారేమో అనుకుంటే మీ దేవేరి అమ్మవారితో మీరు కబుర్లు చెప్పుకుంటున్నారు.

మీ ఏకాంతానికి భంగం ఎందుకు కలిగించాలని నా గూడుకు వెళ్ళిపోయాను.

ఆరోజంతా ఏమి తినలేదు.

ఆ తర్వాత రోజు కూడా ఇదే జరిగింది.

రెండు రోజుల నుంచి ఆహారం లేక నా పరిస్థితి ఇలా ఉంది అని తేనేటీగ నీరసంగా విన్నవించుకుంది.

అప్పుడు శ్రీనివాసుడు అయ్యో నువ్వు తింటే నేను ఏమి అనే వాడిని కాదు నా అనుమతి కోసం ఎందుకు చూశావు నువ్వు ఇప్పుడు నీ పరిస్థితి చూడు అని బాధపడ్డాడు.

అప్పుడు ఆ తేనేటీగ ప్రభూ నేను ప్రతిరోజు మీ దర్శనం అయ్యాక మీరు నా వంక ఒక చల్లని చూపు చూస్తారు అలా చూసినపుడు నేను అనుకుంటాను స్వామివారి దయ నా మీద ఉంది, వారి అనుమతి లభించింది,

అని ఆహారం తింటాను.

కానీ ఈ రెండు రోజుల నుంచి మీరు నా వైపు చూడలేదు.

అప్పటికి మీరు నన్ను చూడాలని ఎన్నిమారులో ప్రయత్నం చేసాను.

నేను మీకు కనిపించాలని నా రెక్కలతో మీకు గాలి వీచాను,

మీ కాళ్ళ దగ్గర నైవేద్యాల దగ్గర కూర్చున్నాను అయినా మీ చల్లని చూపు నా మీద పడలేదు అని దీనంగా చెప్పింది.

అప్పుడు శ్రీనివాసుడు ఆ తేనేటీగను చూసి జాలిపడి 

ఓ తేనేటీగ ఒక మాట చెపుతున్న విను నీకు ఈరోజు నుంచి నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు ఇక్కడ నాకు నైవేద్యం పెట్టగానే నీవంతు ఆహారం నువ్వు తినడానికి నా అనుమతి అవసరం లేదు.

నా చల్లని చూపు ఎప్పుడు నీ మీద ఉంటుంది అని ఆశీర్వదించాడు.



Rate this content
Log in

Similar telugu story from Classics