రుద్ర...వీణ
రుద్ర...వీణ


అవి కాకతీయుల యువరాజుగా ఆడపిల్ల అయిన రుద్రమదేవి ప్రజలకు రుద్రదేవుడుగా పరిచయం అయిన రోజులు.
రుద్రదేవుడు(రుద్రమదేవి) అన్ని యుద్ధ విద్యలలో ఆరి తేరి వీరాది వీరుడిగా పేరు తెచ్చుకుంది.
కాకతీయుల సైన్యం, రుద్రదేవుడు
దేవగిరి రాజు మహదేవుడుతో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న రోజులు.
అలాంటి ఒకరోజున రుద్రమదేవికి ఒక సుమధుర సంగీతం వినబడింది.
అది ఎంటా అని చూస్తూ ఉంటే రాజ అంతఃపురం నుంచి వస్తున్న సంగీతం అని తెలిసింది.
రుద్రదేవుడు చెల్లెలు గణపాంబ వీణ వాయిస్తుంది.
ఆ వీణ నుండి వెలువడిన సంగీత ధ్వనులకి తన్మయత్వం చెంది, అలాగే రాజసభకి వచ్చేసింది.
రాజ గురువు శివదేవయ్య రుద్రదేవుడులో మార్పు గమనించి ఏంటి సంగతి అని అడిగాడు.
వెంటనే రుద్రమదేవి నేను "వీణ" నేర్చుకుంటాను గురుదేవా అని అడిగింది.
శివదేవయ్య ఆశ్చర్యంగా చూసి విషయం తెలుసుకుని, ఒకవైపు కాకతీయుల సైన్యం యుద్ధానికి సిద్ధం అవుతుంటే పౌరుషంతో కత్తి పట్టుకొని రణరంగంలో దూకాల్సిన రుద్రదేవుడు ఆడవారితో కూర్చుని వీణ వాయించాలనుకుంటున్నాడ ఏంటి ఈ వైపరీత్యం.
అని ఆలోచించి,సరే రుద్రదేవా ముందు మనం ఈరోజు సందె వేళ ఒక చోటికి వెళదాం సిద్ధం కండి అని చెప్పాడు.
రుద్రదేవుడుకి ఇంకా ఆ వీణ సంగీతమే వినబడుతుంది.
సంధ్య సమయం చీకట్లు ముసురుకుంటున్న వేళ
రుద్రదేవుడు, శివదేవయ్య కాకతీ
యుల సైన్యం శిబిరాలకి వెళ్ళారు.
సైనికులు సగౌరంగా స్వాగతం పలికి రుద్రదేవుడుకి మర్యాదలు చేశారు.
అక్కడ పొద్దంతా యుద్ధవిద్యలు అభ్యాసం చేసి సైనికులు విశ్రాంతి తీసుకుంటున్నారు.
సైనికులు గుండ్రంగా చుట్టూ కూర్చున్నారు.
మధ్యలో ఒక నలుగురు సైనికులు పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నారు. పాటలు హాస్యంతో కూడి అందరూ నవ్వుతూ ఉన్నారు.
రుద్రదేవుడు, శివదేవయ్య సైనికులతో పాటు ఒక ప్రక్కన కూర్చున్నారు.
రుద్రదేవుడు ఆలోచిస్తున్నాడు గురుదేవులు ఇక్కడికి తనని తీసుకురావడంలో అంతర్యం ఏంటి అని.
ఇంతలో పాట మారిపోయి సైనికులు వీరావేశంతో రణరంగంగా మార్చి వీరుల పాట పాడుతూ రాజ్య కీర్తి, తమ రాజుగారి వీర గాధలు పాటగా పాడుతూ
తాము గెలవాలని రుద్ర తాండవం చేసారు.
అది చూసి రుద్రదేవుడుకి ఆవేశం పెల్లుబికింది.
యుద్ధంలో తాము గెలవాలని పోరుకు సిద్ధం కావడానికి
తాను ఇంకా యుద్ధవిద్యలు అభ్యాసం చేయాలని
పౌరుషం పొడచూపింది.
తర్వాత అక్కడి నుండి రాజమందిరానికి వచ్చేశారు.
శివదేవయ్య రుద్రదేవుడుని అడిగారు "రుద్ర .... వీణ" నేర్చుకుంటావ అని.
తాను ఎంత పొరపాటు చేయబోయిందో అర్థం అయిన రుద్రదేవుడు శివదేవయ్యతో ధన్యవాదాలు గురుదేవా నా కళ్ళు తెరిపించారు.
నా కర్తవ్యాన్ని నాకు తెలిపారు అని నమస్కరించింది రుద్రదేవుడు(రుద్రమదేవి).