t. s.

Abstract Tragedy Classics

4  

t. s.

Abstract Tragedy Classics

మహనటిమాయదారి మనసు

మహనటిమాయదారి మనసు

1 min
589


మనుషుల " మనసు " కన్నా "మహానటి" ఇంకోటి లేదు.

ఉన్నది లేనట్టు...

లేనిది ఉన్నట్టు...

ఎన్ని రంగులు చూపుతుందో...

ఈ "మహానటి" మాయదారి "మనసు".


ప్రేమించని వారిని ప్రేమించినట్టు...

ప్రేమించినవారిని ప్రేమించలేదని...

ఎంత నాటకీయంగా చూపుతుందో...

ఈ "మహానటి" మాయదారి "మనసు"..


కన్నీటి నదిలా బాధలో ఉన్నప్పుడు, ఆవేశపు పొంగులా

అనంద సాగరంలో మునిగినట్టు.

ఊహల ఊయలలో ఉరకలేస్తుంటే మందలించి మభ్యపెట్టాలని చూస్తుంది.

అల్లరి చేసే సమయాన హద్దులున్నాయంటూ ఆత్రానికి అడ్డుకట్ట వేస్తుంది.

తప్పు చేసి సడి చేయకుండా జో కొడుతుంటే

నేను నీ అంతరాత్మనంటూ...

తిరగబడి నిలదీస్తుంది. నిగ్గు తీసి అడుగుతుంది.

అదే "మహానటి" మాయదారి "మనసు"


నాకు లేదు ఏది పోటి అంటూ...

నవ్వు రానప్పుడు నవ్వగలదు...

ఏడుపు వస్తున్నప్పుడు దాయగలదు...

మనసు పడే నాటకాలకి ఏ కళ లో ఎదురు లేదు.

అబద్దాన్ని నిజంలా...

నిజాన్ని అబద్ధంలా...

అద్దంలా మారి చూపించగల దిట్ట

ఈ "మహానటి" మాయదారి "మనసు".


అవసరమయినప్పుడు...

మంచులా కరిగిపోతుంది...

గాజులా సున్నితంగా ఉంటుంది...

పాషాణపు రాతిశిలై కూర్చుంటుంది...

అదే "మహానటి" మాయదారి "మనసు".


ఓడిపోయిన బ్రతుకు ఇదిలే అంటూ...

గెలిచినా నేనింతే అంటూ...

నాకేమయిందంటూ...

ఐతే ఏంటంటూ...

మరణపు అంచుల్లో ఉండి నవ్వుతూ ఉంటుంది.

అదే "మహానటి" మాయదారి "మనసు".


Rate this content
Log in

Similar telugu story from Abstract