STORYMIRROR

T. s.

Classics Fantasy

3  

T. s.

Classics Fantasy

సితార

సితార

1 min
381


తళుకుల తార ...

వలపుల "సితార"...

నా మనసు దోచిన మందార...


దోర వయసు చిన్నది వేల వర్ణాల మనసు రారాణి

దోబూచులాడేనురా అంటూ పాట వినిపించి వల వేసింది.

ఎవరికి చిక్కననుకునే నేను తన వలపుల పిలపుల గాలానికి చిక్కి విల విల లాడి గిల గిల పడిపోయాను.

తన మాయల గారడీలో జల జల జలపాతంలా నను తడిపేసి...పాటల పేరడీ చేసి...

తన మాటల కోటలతో నా గత గాయాన్ని గాయబ్ చేసింది.

నా గుండెను లాగి లాక్ చేసింది.


ఈ హృదయం నీకే అంకితం ప్రియా అంటూ...

అలుపెరుగక తన తలపు ప్రియమైన ఆకర్షణగా, 

ప్రేమ అక్షయమై మనసులు కలిసిన బంధంలో ఒలలాడింది.

తలపుల తలుపులు తెరిచిన చెలీ

ముసుగు తీసిన నిశిరాత్రి , మెరుపై మెరిసిన నయనేత్రి

తనివితీరా ఆ తమకపు జడిలో తడిసిపోతూ 

నా మదిలో నిత్యం తారలా, "సితారలా"...

నా ఊహలలో ఊయలూగుతూ నిరంతరం ప్రేమ పిపాసినై, విరహిణి అయి మదికి, హృదికి పెద్ద యుద్ధమే చేస్తుంది.

వెన్నెల నేనయితే నాకు సరిజోడిగా తనే తళుకుమనే తారలా తోడుంటానంటుంది..

తనే తళుకుల తార...

వలపుల సితార...

నాకు నచ్చిన మందార...



Rate this content
Log in

Similar telugu story from Classics